పోలీసుల అదుపులో రైస్ పుల్లింగ్ ముఠా
- BAGADI NARAYANARAO
- May 30
- 1 min read
10 మంది అరెస్టు.. రూ.5లక్షలు స్వాధీనం
అదనపు ఎస్పీ కెవీ రమణ

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
సరుబుజ్జిలి పోలీస్‌స్టేషన్ పరిధిలో రైస్‌పుల్లింగ్ ముఠాను గురువారం అదుపులోకి తీసుకున్నట్టు అదనపు ఎస్పీ కేవీ రమణ వెల్లడిరచారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడిరచి మీడియా ముందుకు నిందితులను తీసుకువచ్చారు. రైస్ పుల్లింగ్ అక్షయ పాత్ర పేరుతో వెన్నెలవలస గ్రామం నుంచి రిజర్వాయర్‌కు వెళ్లే మార్గంలో పాడుబడిన బంగ్లా వద్ద క్రయవిక్రయాలు జరుపుతున్నట్టు వచ్చిన సమాచారం మేరకు సరుబుజ్జిలి ఎస్‌ఐ హైమావతి సిబ్బందితో కలిసి 10 మంది అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడిరచారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. అరెస్టయిన వారిలో రణస్థలం మండలం కొచ్చెర్ల గ్రామానికి చెందిన పూని భద్రయ్య, పూని రాజు, నరసన్నపేట మండలం కిళ్లాంకు చెందిన నక్కిన రఘునాధరావు, ఎల్.ఎన్.పేట మండలం బొర్రంపేటకు చెందిన కుప్పిలి భాస్కరరావు, విశాఖపట్నం మధురవాడకు చెందిన పచ్చితల రవిశంకర్, రుద్రరాజు వెంకట రంగరాజు, పెద గంట్యాడ సీతానగరానికి చెందిన రౌతు కనకరాజు, తిరుపతి జిల్లా చిన్నగొట్టికల్లు మండలం చట్టేవారిపాలెంకు చెందిన గట్టిక్కల మురళీకృష్ణ, హైదరాబాద్‌లోని బహుదూర్పురా సమీపంలోని రామనర్స్‌పూర్‌కు చెందిన గరికి శ్రీను, కాకినాడ జిల్లా అగ్రహారం పిఠాపురానికి చెందిన కొండశ్రీ వెంకటనాగ సత్యనారాయణ ఉన్నట్లు వివరించారు. విశాఖపట్నానికి చెందిన రవిశంకర్, అతని స్నేహితులు రుద్రరాజు వెంకట రంగరాజు, కనకరాజు, రఘునాధరావు, మురళీ కృష్ణ, గరిక శ్రీను, కొండ వెంకట నాగ సత్యనారాయణ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ నష్టపోయారని, సులువుగా డబ్బులు సంపాదించాలనే యావతో రైస్‌పుల్లింగ్‌లో అనుభవమున్న రవి శంకర్ మధ్యవర్తిత్వంతో పూని భద్రయ్య వద్ద పురాతన వస్తువు రైస్ పుల్లింగ్ అక్షయ పాత్రను రూ.25 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్టు తెలిసింది. అందులో రూ.5లక్షలు అడ్వాన్స్ ఇస్తుండగా, అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. నిందితులను పట్టుకొని కేసు ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన ఆమదాలవలస సీఐ పి.సత్యనారాయణ, సర్కిల్ ఇన్‌స్పెక్టర్, ఆమదాలవలస, సరుబుజ్జిలి ఎస్.హైమవతి, సిబ్బంది జనార్ధనరావు, తిరుపతిరావు, గణపతిరావు, సత్యనారాయణ, లక్ష్మణరావు, నర్సింగరావు, సంతోష్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివేకానంద, సీఐలు పైడపునాయుడు, అవతారం, పి.సత్యనారాయణ, ఎఐ సందీప్, రమణ, కృష్ణ, కానిస్టేబుల్ గణేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments