పోలవరం`బనకచర్ల విఫల విన్యాసమేనా!
- DV RAMANA

- Jul 10, 2025
- 2 min read

పాలకులు ఏదో చేస్తున్నామని చెప్పకోవడానికి, సొంత ప్రచారానికి రకరకాల విన్యాసాలు చేయ డం, అలవిమాలిన హామీలు ఇవ్వడం తెలిసిందే. ఈ క్రమంలో నేలవిడిచి సాము చేసిన, చేస్తున్న సంద ర్భాలు చాలానే ఉన్నాయి. అటువంటి విన్యాసాన్నే ప్రస్తుత చంద్రబాబు సర్కారు చేస్తోంది. అ విన్యాసం పేరే పోలవరం`బనకచర్ల లింక్ ప్రాజెక్టు. చాలాకాలంగా ప్రతిపాదనల్లో ఉన్న నదుల అనుసంధానం, గోదావరి జలాల తరలింపు ద్వారా కరువు పీడిత రాయలసీమకు మేలు చేయడం, వృథాగా సముద్రం లో కలిసిపోతున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడం అన్న త్రిముఖ లక్ష్యాలతో ఈ ప్రాజె క్టును చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేసుకుంటోంది. గత వైకాపా ప్రభుత్వం సంక్షే మం తప్ప అభివృద్ధిని పట్టించుకోలేదని ఎన్డీయే కూటమి పార్టీలు విమర్శిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పుకోవడా నికేనన్నట్లు చాలా హడావుడిగా పోలవరం`బనకచర్ల ప్రాజెక్టును సీఎం చంద్రబాబు తెరపైకి తెచ్చారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు, పర్యావరణ, న్యాయపరమైన ఇబ్బందులు, అంతర్ రాష్ట్ర నదీజల వివాదాలు వంటి పలు అవరోధాలు ఏర్పడతాయన్న విషయాన్ని ఆలోచించకుండానే, పూర్తి స్థాయి అధ్యయనం చేయకుండానే ఈ ప్రాజెక్టు ప్రతిపాదలను ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సమర్పిం చింది. కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణం సాధ్యంకాదని, ఇందులో అనేక చిక్కుముడులు ఉండటం వల్ల ఇది మరో కాళే శ్వరం ప్రాజెక్టుగా వృథాగా మిగిలిపోయే ప్రమాదం ఉందని నీటిపారుదల రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా వేల కోట్ల వ్యయంతో గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజె క్టును నిర్మించింది. ఎటువంటి అనుమతులు లభించకుండానే హడావుడిగా నిర్మించిన ఈ ప్రాజెక్టు అడుగ డుగునా నిర్మాణ లోపాలు, ఇతరత్రా కారణాలతో దాదాపు నిరుపయోగంగా మారింది. ఇప్పుడు చంద్ర బాబు ప్రతిపాదిత పోలవరం`బనకచర్ల ప్రాజెక్టు కథ కూడా అలాగే అవుతోందేమోనన్న ఆందోళన, అను మానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలకు తగినట్లే తెలంగాణ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవు తున్నాయి. ఏపీ పునర్విభజన చట్టానికి, గోదావరి నదీజలాల ఒప్పందానికి ఇది పూర్తి విరుద్ధంగా ఉందని.. కేంద్ర జలసంఘం నుంచి గానీ గోదావరి జల వివాదాల ట్రిబ్యూనల్ నుంచి గానీ అనుమతి తీసుకోలే దని, ఎగువ రాష్ట్రాల అంగీకారం లేకుండా నిర్మిస్తున్నారన్నవి తెలంగాణ అభ్యంతరాలు. కానీ ఈ అభ్యం తరాలను ఏపీ ప్రభుత్వవర్గాలు కొట్టిపారేస్తున్నాయి. నికర జలాలపై దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కే పూర్తి హక్కులు ఉంటాయని అంటూ ఏటా గోదావరి నుంచి వర్షాకాలంలో సుమారు రెండువేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయని, అందులో కేవలం వంద టీఎంసీలనే పోలవరం`బనకచర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు తరలిస్తామని ఆంధ్ర సర్కారు వాదిస్తోంది. కానీ మిగులు జలాలకు సంబంధించి తాజా లెక్కలు, నివేదికలు లేకుండా ప్రాజెక్టు అనుమతి ఇవ్వడం కుదరదని ఇటీవలే కేంద్ర జలవనరుల సంఘం తిరస్కరించింది. కాగా ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, దట్టమైన నల్లమల అడవి గుండా 19.5 కి.మీ. నిడివిన భారీ పైపు లైన్లు వేయాల్సి ఉంటుంది. 18వేల ఎకరాల్లో అడవులు కొట్టేయాల్సి ఉంటుంది. దీనివల్ల తీవ్రమైన పర్యావ రణ సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఈ ప్రాజెక్టు నిర్వహణకు 3377 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుంది. ఇప్పటికే విద్యుత్ కొరత ఎదుర్కొంటున్న రాష్ట్రంలో అంత విద్యుత్ సమకూర్చడం సాధ్యమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే దీన్ని దృష్టిలో ఉంచుకునే ఈ ప్రాజెక్టుపై మూడు ప్రాంతాల్లో విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రాజెక్టులో భాగమైన బొల్లాపల్లి రిజర్వాయర్ తక్కువ లోతు ఉంటుంది కనుక అక్కడ ప్రతిపాదించినట్లు విద్యుత్ ప్లాంట్ నిర్మించిన విద్యుత్ ఉత్పత్తి చేయడం సాధ్యం కాదని విద్యుత్‌రంగ నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఇదో పెద్ద సమస్యగా మారనుంది. రూ.81,900 కోట్లుగా అంచనా వేసిన ఈ ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర గ్రాంటుపై ప్రధానంగా ఆధారపడటం మరో ప్రధాన సమస్య. అదికాకుండా రూ.41వేల కోట్లను అప్పుల ద్వారా, రూ.16,380 కోట్లు ప్రైవేటు పెట్టుబడులుగా సేకరించాలని నిర్ణయించారు. ఇది అంత సులభసాధ్యం కాదు. అందువల్ల చంద్రబాబు ప్రిస్టేజికి పోకుండా రాష్ట్రంలో ఉన్న పెండిరగు ప్రాజెక్టులపై మనసు పెట్టి పూర్తిచేస్తే అదే పదివేలు.










Comments