top of page

‘పాస్‌లకు పిల్లలు పుట్టడం’పై.. దర్యాప్తు ప్రారంభించిన టాస్క్‌ఫోర్స్

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • 7 days ago
  • 1 min read
  • జిరాక్స్, ఫ్లెక్సీ సెంటర్లలో సోదాలు

  • పాస్‌లు కొనుగోలు చేసినవారి నుంచి సమాచార సేకరణ

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

రథసప్తమి రాష్ట్రపండుగ ఉత్సవాన్ని విజయవంతం చేశామని అధికార యంత్రాంగం, రాజకీయ గణం బయటకు ప్రకటిస్తున్నా, లోలోన దీన్ని పూర్తిస్థాయి విజయవంతం చేయలేకపోయామన్న ఆందోళన ఎక్కడో కనిపిస్తోంది. జిల్లా చరిత్రలోనే అతి పెద్ద ఈవెంట్ నిర్వహించినందుకు యంత్రాంగాన్ని అభినందిస్తూ ఎమ్మెల్యే విందు భోజనాలు ఏర్పాటుచేసినా, జిల్లాలో వ్యాపార వర్గాలు కలెక్టర్‌తో సహా అందర్నీ సత్కరిస్తున్నా.. లోలోన మాత్రం అనుకున్న స్థాయిలో ఇది విజయవంతం కాలేదు సరికదా.. ఎక్కడో తేడా కొట్టిందన్న భావన అందరిలోనూ ఉంది. భక్తజన సునామీ ముందు జిల్లా యంత్రాంగం చిన్నదైపోయిందని సరిపెట్టుకున్నా ఈ జనసునామీకి కారణం ఏమిటన్న దానిపై ఇప్ప్పుడు జిల్లా పోలీస్ బాస్ మహేశ్వర్‌రెడ్డి ఆరా తీస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం, రాజకీయ గణం సరిగానే పని చేసింది కానీ, పోలీసులే చేతులెత్తేశారన్న భావన ఒకానొక సందర్భంలో కల్పించారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ ఇప్ప్పుడు అంతమంది జనం వీవీఐపీ పాస్‌లు పట్టుకొని, క్షీరాభిషేకం టిక్కెట్లు పట్టుకొని ఎలా వచ్చారన్న దానిపై సోదాలు ప్రారంభించారు. దీనికి ఆధారంగా ‘సత్యం’ సోమవారం పాస్‌లకు పిల్లలు పుట్టాయని పతాక శీర్షికలో కథనం ప్రచురించడంతో ఆ మేరకు జిల్లా టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో నగరంలో జిరాక్స్ సెంటర్లు, కýర్ జిరాక్స్ కేంద్రాలు, ఫ్లెక్సీ సెంటర్లలో సోదాలు చేయించారు. ఎక్కడైనా కంప్యూటర్ సీపీయూలో డేటా తొలగించారని భావిస్తే, అక్కడున్న సీసీ ఫుటేజ్‌లను కూడా పరిశీలిస్తున్నారు. ఈ మేరకు నగరంలో ఉన్న అన్ని సెంటర్లను గురువారం తనిఖీ చేశారు. వాస్తవానికి డోనర్ పాస్‌లు ఎన్ని? వీవీఐపీ పాస్‌లు ఎన్ని ముద్రించారు? క్షీరాభిషేకానికి ఎన్ని టిక్కెట్లు ఇచ్చారు? ఆన్‌లైన్‌లో రూ.100, రూ.300 టిక్కెట్లు ఎన్ని అమ్మారన్న అంచనా వచ్చేసింది. అది కాకుండా ఎవరి చేతిలో చూసినా వీఐపీ, వీవీఐపీ టిక్కెట్లే కనిపించడంతో కచ్చితంగా పాస్‌లకు పిల్లలు పుట్టాయన్న భావనతోనే పోలీసులు అడుగులు వేస్తున్నారు. రెండు రోజుల క్రితం స్థానిక సమాచార శాఖ ఆధ్వర్యంలో రథసప్తమి ఫీడ్‌బ్యాక్‌ను రికార్డ్ చేయడానికి వెళ్తే, కొందరు పాస్‌లు కొనుగోలు చేశామని చెప్పడం కొసమెరుపు. ఇది కాకుండా ఉదయం నుంచి అర్థరాత్రి వరకు ఎస్పీతో పాటు పోలీస్ ఉన్నతాధికారులందరూ క్యూలైన్ల వద్దే పడిగాపులు కాసినప్ప్పుడు ప్రతీఒక్కరూ వీవీఐపీ పాస్‌తోనో, వీఐపీ పాస్‌తోనో కనిపించడాన్ని ఎస్పీ పునఃసమీక్షించుకోవడంతో ఇప్ప్పుడు టాస్క్‌ఫోర్స్ అన్ని కేంద్రాల మీద సోదాలు నిర్వహిస్తోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page