top of page

పల్టీ రాజకీయం ఇక సాగదు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Nov 18
  • 2 min read
ree

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీహార్‌ రాజకీయాల్లో అనూహ్య మార్పులు తీసుకొచ్చే సూచనలు కనిపి స్తున్నాయి. ఆయారాం.. గయారాం.. రాజకీయాలకు బీహార్‌ పెట్టింది పేరు. అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోయే ఫిరాయింపు రాజకీయాలనే ఆయారాం..గయారాం రాజకీయం అంటారు. అయితే ఏ సాధారణ నాయకుడో, ఎమ్మెల్యేనో ఇలాంటి ఫిరాయింపులకు పాల్పడితే పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. దేశమంతటా.. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఈ కుసంస్కృతి పాతుకుపో యింది. అయితే బీహార్‌లో అంతకుమించి అన్నట్లు సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి నాయకుడే అధికా రాన్ని కాపాడుకునేందుకు పార్టీలు, కూటములను మార్చేస్తుండటాన్ని చూస్తున్నాం. అయితే తాజా ఎన్నికల ఫలితాలతో ఆ రాజకీయానికి చెక్‌ పడవచ్చునన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీహార్‌లో గత ఇరవయ్యేళ్లుగా జనతాదళ్‌(యునైటెడ్‌)`జేడీయూ అధినేత నితీష్‌కుమార్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతు న్నారు. వాస్తవానికి, రాజ్యాంగం ప్రకారం చూస్తే అసెంబ్లీలో మెజారిటీ ఉన్న పార్టీకి చెందిన శాసన సభాపక్ష(లెజిస్లేచర్‌ పార్టీ) నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటారు. కానీ నితీష్‌కుమార్‌ పార్టీ అయిన జేడీయూ ఏనాడూ మెజారిటీ స్థానాలు సాధించలేదు. అయినా నితీష్‌ సీఎం పదవి చేజిక్కించుకోగలగ డానికి కారణం.. ఆయన అనుసరించిన సంకీర్ణ రాజకీయాలే. రాష్ట్ర రాజకీయాలు కూడా అందుకు ఆయనకు సహకరించాయనే చెప్పాలి. బీహార్‌లో గట్టి పట్టున్న కాంగ్రెస్‌ పూర్తిగా బలహీనపడటం, ప్రధాన ప్రతిపక్షాలుగా వ్యవహరించిన జనతా, జనతాదళ్‌ వంటి పార్టీలు చీలికలు పేలికలై ఆర్జేడీ, జేడీయూ వంటి పార్టీలుగా రూపాంతరం చెందడం, బీజేపీ బలపడటం వంటి పరిణామాలు రాజకీయ అధిక్యతలను సమూలంగా మార్చేశాయి. ఆర్జేడీ, జేడీయూ, బీజేపీలు ప్రభావం చూపే పార్టీలుగా ఉన్న ప్పటికీ సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్ని సీట్లు సాధించే స్థాయికి ఎదగలేకపోతున్నాయి. ఇదే రాష్ట్రంలో సంకీర్ణ రాజకీయాలకు తెరలేపింది. ఆ విధంగా అక్కడ రెండు ప్రధాన కూటముల చుట్టూ బీహార్‌ రాజకీయం నడుస్తోంది. జాతీయస్థాయిలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమే రాష్ట్రంలో కీలకంగా ఉంది. ఈ కూటమికే రాష్ట్రం వరకు నితీష్‌కుమార్‌ ప్రస్తుతం నాయకత్వం వహిస్తూ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆ పదవి తన చేజారిపోకుండా రెండు కూటముల్లోని ప్రధాన పార్టీలతో బంతాట ఆడుకుంటున్నారు. సోషలిస్టు నేతగా, అవినీతి మచ్చ లేని నేతగా రాష్ట్రంలో నితీష్‌కు ఛరిష్మా ఉండటం వల్ల ఎన్డీయేలో బీజేపీ ప్రధాన భాగస్వామి అయినప్పటికీ నితీష్‌నే ముఖ్యమంత్రిగా తెర ముందు పెడుతూ వచ్చింది. ఇదే అవకాశంగా నితీష్‌ కూడా ఎన్డీయే జాతీయ నాయకత్వంతో తరచూ బేరసారాలు, బెదిరింపులకు పాల్పడుతూ తన మాట నెగ్గించుకుంటూ వచ్చారు. అలా కుదరని సందర్భాల్లో ఎన్డీయేను వీడి ఆర్జేడీ, కాంగ్రెస్‌ల నేతృత్వంలోని మహాఘట బంధన్‌ పంచన చేరడమే కాకుండా ముఖ్యమంత్రి పీఠం కూడా దక్కించుకున్న చరిత్ర ఆయనది. ఆయన ఇలా చేయడానికి, నితీష్‌ ఒత్తిళ్లకు ప్రధాన కూటముల్లోని పెద్ద పార్టీలు లొంగిపోవడానికి ప్రధాన కారణం.. నితీష్‌కుమార్‌ పార్టీ మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని స్థితిలో ఉండట మేనంటున్నారు. కానీ ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చంటున్నారు. ఇన్నాళ్లూ చేసినట్లు ఇతర పార్టీ లను బెదిరించే అవకాశం నితీష్‌కు ఉండదు. ఒకవేళ నితీష్‌ ఆ ప్రయత్నం చేసినా ఇతర పార్టీలు ఖాతరు చేయాల్సిన అవసరం లేని పరిస్థితి ఏర్పడిరది. దీనికి కారణం.. ఈసారి బీహార్‌ ప్రజలు ఇచ్చిన విలక్షణమైన తీర్పే. రాష్ట్ర అసెంబ్లీలో 243 సీట్లు ఉంటే.. అధికారం చేపట్టడానికి 122 సీట్ల సింపుల్‌ మెజారిటీ అవసరం. తాజా ఎన్నికల్లో ఎన్డీయే కూటమి పార్టీలన్నీ కలిపి 202 సీట్లు చేజిక్కించుకు న్నాయి. పార్టీలవారీగా చూస్తే బీజేపీ 89, జేడీయూ 85, లోక్‌జనశక్తి(ఆర్‌) 19, హెచ్‌ఏఎం 5, ఆర్‌ఎల్‌ఎం 4 సీట్లలో విజయం సాధించాయి. కొత్త అసెంబ్లీలో బీజేపీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవత రించడం పెద్ద విశేషం. జేడీయూ కూడా సీట్లు పెంచుకున్నా బీజేపీ వెనుకే ఉండిపోయింది. కాగా ఇంతవరకు ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్కు సాధనలో నితీష్‌ పార్టీ జేడీయూ సంఖ్యాబలం కీలకంగా ఉండేది. అది లేకుండా మెజారిటీ మార్కులు అందుకునే అవకాశం ఉండేది కాదు. అందువల్ల నితీష్‌కుమార్‌ ఒత్తిళ్లకు లొంగి ఉండాల్సి వచ్చేది. ఈసారి కూడా ఆ పార్టీ లేకపోతే ఎన్డీయే కూడా మెజారిటీ మార్కును అందుకోలేని పరిస్థితే ఉంది. కానీ ఆ మార్కుకు చాలా చేరువగా వచ్చేసింది. జేడీయూను మినహాయించి ఎన్డీయే సంఖ్యా బలం 117. అంటే మెజారిటీ మార్కుకు కేవ లం ఐదు సీట్లే తక్కువ. ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవడం సమకాలీన రాజకీయాల్లో పెద్ద కష్టం కాదు. అంటే నితీష్‌ లేకపోయినా, ఆయన పార్టీ మద్దతు లేకపోయినా రాష్ట్రంలో ఎన్డీయే ప్రభు త్వాన్ని మరోసారి ఏర్పాటు చేసేందుకు బీజేపీకి మార్గాలు ఉన్నట్లే. అలాగే తొలిసారి బీహార్‌ ముఖ్య మంత్రి పదవి చేజిక్కించుకునే అవకాశం కూడా ఉంది. ఒకదశలో బీజేపీ నాయకత్వం అదే ఆలోచన చేసింది. నితీష్‌ను తప్పించి తమ పార్టీ నేతను సీఎం పదవిలో కూర్చోబెట్టాలని యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి కానీ మనసు మార్చుకుని కమలదళం కాస్త హుందాగా, పెద్ద మనసుతో వ్యవహరించిందనే చెప్పాలి. సీనియర్‌ నేత, సిటింగ్‌ ముఖ్యమంత్రి అయిన నితీష్‌కుమార్‌నే రాష్ట్రాధినేతగా కొనసాగించా లని నిర్ణయించింది. దాంతో పదోసారి ముఖ్యమంత్రిగా నితీష్‌కుమార్‌ ప్రమాణ స్వీకారం చేసేందుకు మార్గం సుగమమైంది. కానీ పల్టీ రాజకీయాలకు ఇకముందు అవకాశం ఉండకపోవచ్చు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page