top of page

పసిడి.. మిడిసిపడి

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • Oct 8, 2025
  • 2 min read
  • జెట్‌ వేగంతో దూసుకుపోతున్న ధర

  • ఆజ్యం పోస్తున్న ట్రంప్‌ నిర్ణయాలు

  • గత ఏడాది కాలంలోనే రూ.43వేలు పెరుగుదల

  • వందేళ్లలో దాదాపు 6300 రెట్లు ఎగబాకిన పసిడి

(సత్యంన్యూస్‌,శ్రీకాకుళం)

బంగారం.. ఇదంటేనే భారతీయులు పడిచచ్చిపోతారు. ఎంత పేద కుటుంబంలోనైనా కనీసం తులమెత్తు బంగారమైనా ఉండకపోదంటే అతిశయోక్తి కాదు. పండుగలు, శుభకార్యాలు.. ఇలా ఒకటేమిటి.. ప్రతి సందర్భంలోనూ బంగారాన్ని బయటకు తీసి ప్రదర్శిస్తుంటారు. మహిళలతోపాటు పురుషులు కూడా స్వర్ణాభరణాలు ధరించడానికి ఆసక్తి చూపడం, ఇంట్లో ఎంత బంగారం ఉంటే అంత సంపన్నులన్న హోదా పెరగడం వంటి కారణాలు మన దేశంలో బంగారంపై మోజు పెంచుకుతున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగానూ బంగారం పలు రకాలుగా వినియోగపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో విదేశీమారకంగా ఉపయోగపడుతోంది. మరోవైపు కరెన్సీ ఒడుదిడుకుల్లోనూ తమ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచుకునేందుకు ప్రపంచ దేశాలు బంగారాన్ని అనువైన సాధనంగా ఉపయోగించుకుంటున్నాయి. దానికోసం వీలైనప్పుడల్లా టన్నుల కొద్దీ బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటుంటాయి. దాంతో బంగారం విలువ ఎప్పటికప్పుడు పెరిగిపోతోంది. అయితే గతంలో ఎన్నడూ లేనంతగా గత ఏడాది కాలంలో పసిడి ధర పరుగులు తీస్తోంది. కాదు కాదు.. రాకెట్‌ కంటే వేగంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతుందనడం సమంజసం. ఏడాది కాలంలోనే బంగారం ధర దాదాపు 50 శాతానికి పైగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనికి కారణం అంతర్జాతీయ ఉద్రిక్తతలు, బులియన్‌ మార్కెట్‌ ఒడుదిడుకులేనని మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రష్యా`ఉక్రెయిన్‌ యుద్దం, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయాలు పసిడి ధరలను పరుగులు పెట్టిస్తున్నాయి. తన మాట వినని దేశాలపై ట్రంప్‌ టారిఫ్‌ పేరుతో అదనపు సుంకాలు విధించడం అంతర్జాతీయ వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దీనికి వ్యతిరేకంగా ఆయా దేశాలు ప్రత్యామ్నాయ ఎగుమతి మార్గాలను ఎంచుకుంటున్నాయి. ఫలితంగా ప్రపంచ వాణిజ్యంలో కీలకపాత్ర వహిస్తున్న అమెరికన్‌ డాలర్‌ విలువ తగ్గిపోతుండటం పరోక్షంగా బంగారం ధర పెరుగుదలకు కారణమవుతోందంటున్నారు. అయితే గతంలో ఎప్పుడూ ఇంత వేగంగా ధరలు పెరగలేదని వ్యాపారులు, ఇళ్లలో వృద్ధులు వ్యాఖ్యానిస్తున్నారు. పెరుగుదల ఆలాగే కొనసాగితే.. సామాన్యులు ఇక బంగారాన్ని మర్చిపోవలసిందేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో గత వందేళ్లలో బంగారం ధరల పెరుగుదల క్రమం చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఔరా.. ఇంత తేడానా అని ఆశ్చర్యపోక తప్పదు.

ప్రతి ఐదేళ్లకు పెరుగుదల ఇలా..

1925 రూ.18

1930 రూ.18

1935 రూ.30

1940 రూ.36

1945 రూ.62

1950 రూ.99

1955 రూ.79

1960 రూ.111

1965 రూ.71

1970 రూ.184

1975 రూ.540

1980 రూ.1330

1985 రూ.2,310

1990 రూ.3,200

1995 రూ.4,658

2000 రూ.4,395

2001 రూ.4,410

2002 రూ.5,030

2003 రూ.5,747

2004 రూ.6,474

2005 రూ.7,680

2006 రూ.8,120

2007 రూ.9,500

2008 రూ.12,500

2009 రూ.14,500

2010 రూ.18,500

2015 రూ.26,845

2020 రూ.48,480

2021 రూ.50,000

2022 రూ.53,000

2023 రూ.60,000

2024 రూ.80,000

2025 రూ.1,23,460

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page