top of page

పసిడి విషయంలో.. దుబాయ్ దూరపు కొండే!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Feb 10
  • 3 min read

బంగారం అంటే భారతీయులకు ఎంత పిచ్చో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తక్కువ ధరకు దొరుకు తుందంటే చాలు ఎక్కడి నుంచైనా కొని తెచ్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఆ క్రమంలో భారతీయ బంగారం ప్రియులకు దుబాయ్ ఒక డెస్టినేషన్. ఉపాధి కోసమో, టూరిస్టులుగానో అక్కడికి వెళ్లేవారు తిరుగు ప్రయాణంలో తమతో పాటు ఎంతోకొంత బంగారం తెచ్చుకోవడం కొత్తకాదు. దీనికి కారణం భారత్ కంటే దుబాయ్‌లో బంగారం తక్కువగా ధరకు లభించడమే. అలా అని పెట్రోల్ బావులు ఉన్నట్లు దుబాయ్‌లో బంగారం గనులు లేవు. మరెందుకు ధర తక్కువంటే.. మనదేశంలో కంటే అక్కడ సుంకాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల రెండు దేశాల్లో బంగారం రేట్ల మధ్య కాస్త ఎక్కువ తేడా కనిపిస్తుంది. కాగా ఇటీవలి కాలంలో మనదేశంలో బంగారం రేట్లు పరుగులు తీస్తుండటం, ఇదే సమ యంలో దుబాయ్ నుంచి బంగారం తీసురావడానికి సంబంధించి బ్యాగేజ్ (ఇమ్మిగ్రేషన్) రూల్స్‌ను అక్కడి ప్రభుత్వం ఈ నెలలోనే సవరించింది. వాటి ప్రకారం పురుషులు 20 గ్రాములు (రూ.50 వేల విలువ), మహిళలు, పిల్లలు 40 గ్రాములు(రూ.లక్ష విలువ) వరకు తమతోపాటు ఇతర దేశాలకు తీసు కెళ్లవచ్చు. ఈ పరిమితి దాటితే మూడు నుంచి పది శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ఈ సడ లింపులను చూసి దుబాయ్ నుంచి మనదేశానికి తిరిగి వచ్చే చాలామంది ప్రయాణికులు అక్కడి నుంచి బంగారం తీసుకొచ్చిదేశంలో అమ్ముకోవడం ద్వారా లాభం సంపాదించవచ్చని ఆలోచించడం సహజం. అయితే అది అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. మనదేశంతో పోలిస్తే దుబాయ్‌లో బంగా రంపై పన్నులు తక్కువగా ఉంటాయి. అలాగే ఆభరణాల తయారీ ఛార్జీలు కూడా అక్కడ తక్కువే. సవరించిన బ్యాగేజ్ రూల్స్`2026 ప్రకారం.. ఏడాది కంటే ఎక్కువ కాలం దుబాయ్‌లో నివసించి తిరిగి వచ్చే మహిళా ప్రయాణికులు తమతో పాటు 40 గ్రాముల వరకు సుంకం లేని బంగారు ఆభర ణాలు తీసుకురావచ్చు. ఇక్కడ గమనించాల్సిందేంటే.. ఆభరణాలపై మాత్రమే సుంకం మినహాయింపు ఉంటుందని మర్చిపోవద్దు. ఆభరణాలు కాకుండా బంగారు నాణేలు, బిస్కెట్స్ వంటివి తీసుకువస్తే మాత్రం మొదటి గ్రాము నుంచే కస్టమ్స్ సుంకం చెల్లించాల్సి ఉంటుంది. అక్కడ బంగారం చౌకగా ఉండటానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది అక్కడ బంగారంపై జీఎస్టీ లేదు.. కానీ మన దేశంలో మూడు శాతం జీఎస్టీ తప్పనిసరి. మన దేశంలో ఆభరణాల తయారీ ఛార్జీలు సగటున 12శాతం ఉండగా దుబాయ్‌లో ఎనిమిది శాతం మాత్రమే. వీటి సంగతి ఎలా ఉన్నా.. దుబాయ్ నుంచి కావలసినంత బంగారం లేదా ఆభరణాలు తీసుకురావడం అంత తేలిక కాదు. పరిమితికి మించి తీసు కురావాలంటే తప్పనిసరిగా కస్టమ్స్ సుంకాలు చెల్లించకతప్పదు. అది కూడా దుబాయ్‌లో టూరిస్ట్‌గా లేదా ఏదైనా పని మీద పర్యటనకు వెళ్లి బంగారం కొనాలంటే మాత్రం పన్ను తప్పనిసరి. కొనుగోలు చేసే బంగారం పరిమాణం ఆధారంగా పన్ను మొత్తం మారుతుంది. అలాగే కొనుగోలు చేసిన ప్రతి బంగారు ఆభరణానికి సంబంధించి చెల్లుబాటు అయ్యే బిల్లును తప్పనిసరిగా జతచేసి భారత్‌లో విమా నం దిగిన వెంటనే కస్టమ్స్ వద్ద చూపించాల్సి ఉంటుంది. ఇక ఏడాది కంటే ఎక్కువ కాలం నుంచి అక్కడ నివసిస్తున్న భారతీయ ప్రయాణికులు నిర్దేశిత పరిమిత మోతాదు బంగారు ఆభరణాలను మాత్రమే సుంకం లేకుండా (డ్యూటీ ఫ్రీ) తీసుకురావచ్చు. డ్యూటీ ఫ్రీ ఆభరణాలను పరిమితికి మించి తీసుకెళ్లే ప్రయాణికులు టైర్డ్ డ్యూటీ స్ట్రక్చర్ పాటించాల్సి ఉంటుంది. ఇది దాదాపు మూడు శాతం నుంచి గరిష్టంగా పది శాతం వరకు ఉంటుంది. బంగారు కడ్డీలు, బార్‌లు లేదా నాణేలకు అర్హత కలి గిన ప్రయాణీకులు అంటే ఆరు నెలల నుంచి అక్కడ ఉంటున్నవారు రాయితీతో కూడిన ఆరు శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకంటే తక్కువ కాలం ఉండివెళ్లే పర్యాటకులు 36 నుంచి 38.5 శాతం వరకు అధిక సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. మన దేశంలో బంగారం అమ్మకం సమయంలో మూ శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ఏఈడీ టు ఐఎనఆర్ మార్పిడి ఖర్చులు కలుపుకుని ఇది ఉంటుంది. కొనుగోలుదారులు కరెన్సీ మార్పిడి ఖర్చులు కూడా భరించాల్సి ఉంటుంది. తర్వాత విక్రయిస్తే, హోల్డింగ్ వ్యవధిని బట్టి మూలధన లాభాల (క్యాపిటల్ గెయిన్స్) పన్ను వర్తించవచ్చని నిపుణులు చెబు తున్నారు. దీనిపై ఎలాంటి జరిమానాలు లేకుండా ఉండాలంటే సరైన రసీదులు, డాక్యుమెంట్లు తప్పని సరి. ఇకపోతే బంగారం ధరల్లో అస్థిరత, కరెన్సీ కదలికలు మార్జిన్లను తగ్గించేవిగా ఉంటాయని నిపు ణులు అంటున్నారు. చట్టపరమైన, అన్ని రకాల అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. ఏ చిన్న పొర పాటు దొర్లినా కూడా అది భారీ నష్టానికి దారితీస్తుంది. భారీ జరిమానాతో పాటు బంగారాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దుబాయ్‌లో రూ.20 లక్షల విలువైన బంగారాన్ని కొనుగోలు చేసి భారతదేశంలో అమ్మడం వాణిజ్యపరంగా లాభదాయకమేనా? అంటే.. వ్యాపారులకు కాకుండా వ్యక్తులకు ఇది లాభదాయకం కాదని చెబుతున్నారు. ఎందుకంటే.. దుబాjáYT ఆభరణాలను లేదా బంగారాన్ని భారత్‌లో అమ్మేటప్పుడు జ్యూయలర్లు బిల్లు, ప్యూరిటీ సర్టిఫికెట్ అడగ వచ్చు. కొన్ని సందర్భాల్లో విదేశీ బంగారాన్ని మార్కెట్ ధర కంటే తక్కువకే కొనుగోలు చేసే పరిస్థితి కూడా ఉంటుంది. కస్టమ్స్ సుంకం, జీఎస్టీ, కరెన్సీ మార్పిడి ఖర్చులు కలుపుకుని మార్జిన్లు తక్కువగా ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. బంగారం ధర పెరుగుదలపై లాభాలు ఆధారపడి ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దుబాయ్‌లో బంగారం కొనుగోలుచేసి భారత్‌లో అమ్మితే రిస్క్ లేకుండా భారీ లాభం వస్తుందనే భావన వాస్తవ విరుద్ధం. డ్యూటీలు, పన్నులు, ధరల ఊగిసలాట అన్నీ కలిపితే లాభం చాలా పరిమితంగా ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ కోణంలో చూస్తే గోల్డ్ ఈటీఎఫ్‌లు, సావరిన్ గోల్డ్‌బాండ్స్ వంటి పెట్టుబడిమార్గాలే సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page