top of page

బంగ్లాకు భారత్‌ ‘మాస్టర్‌ స్ట్రోక్‌’

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Dec 27, 2025
  • 4 min read
  • తారీక్‌ రెహమాన్‌ రాకతో యూనస్‌కు చెక్‌

  • బయటపడుతున్న తాత్కాలిక అధ్యక్షుడి అసలు రంగు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
బంగ్లాదేశ్‌లో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఆ దేశ భవిష్యత్తునే కాకుండా, దక్షిణాసియా భౌగోళిక రాజకీయాలను మలుపు తిప్పేలా ఉన్నాయి. ముఖ్యంగా 17 ఏళ్ల సుదీర్ఘ అజ్ఞాతం తర్వాత మాజీ అధ్యక్షురాలు ఖలీదా జియా కుమారుడు, ‘డార్క్‌ ప్రిన్స్‌’గా పిలవబడే తారీక్‌ రెహమాన్‌ ఢాకాలో అడుగుపెట్టడం వెనుక భారత్‌ వ్యూహాత్మక మద్దతు ఉందనే వార్తలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.
యూనస్‌ అసలు రంగు బయటపడిరదా?

ఢాకాలోని మోగ్‌ బజార్‌లో బుధవారం జరిగిన బాంబు దాడి కేవలం ఉగ్రవాద చర్య మాత్రమే కాదు, దాని వెనుక లోతైన రాజకీయ కుట్ర దాగి ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఫిబ్రవరి 12, 2026న ఎన్నికలు నిర్వహిస్తానని ప్రకటించిన మహ్మద్‌ యూనస్‌, ఇప్పుడు ‘శాంతి భద్రతలు లేవు’ అనే సాకుతో ఆ ఎన్నికలను వాయిదా వేయాలని చూస్తున్నారు. ఉస్మాన్‌ హాదీ హత్యను భారత్‌పైకి నెట్టి, హిందూ-ముస్లిం గొడవలు సృష్టించాలని యూనస్‌ ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ ఉస్మాన్‌ హాదీ సోదరుడు ఉమర్‌ షరీఫ్‌ స్వయంగా మీడియా ముందుకు వచ్చి, తన సోదరుడిని చంపించింది యూనస్‌ ప్రభుత్వమేనని ఆరోపించడంతో ఈ కుట్ర బట్టబయలైంది. దీంతో విద్యార్థుల ఆగ్రహం ఇప్పుడు యూనస్‌ వైపు మళ్లింది.

అమెరికా, పాకిస్తాన్‌ ప్లాన్లకు చెక్‌!

బంగ్లాదేశ్‌ను తన చెప్పుచేతుల్లో ఉంచుకోవాలని చూస్తున్న అమెరికా డీప్‌ స్టేట్‌కు, పాకిస్తాన్‌ మద్దతు ఉన్న జమాతే ఇస్లామీకి భారత్‌ ఇప్పుడు గట్టి సవాల్‌ విసిరింది. బంగాళాఖాతంలో అమెరికా తన నావికాదళ స్థావరాన్ని ఏర్పాటు చేయాలని చూస్తోంది. గతంలో షేక్‌ హసీనా దీనిని వ్యతిరేకించగా, యూనస్‌ మాత్రం అమెరికాకు సహకరిస్తున్నారు. ఇది భారత్‌ రక్షణకు ముప్పు. 17 ఏళ్లుగా లండన్‌లో ఉన్న తారీక్‌ రెహమాన్‌తో భారత్‌ బ్యాక్‌-ఛానల్‌ చర్చలు జరిపింది. ఆయన రాకతో బీఎన్‌పీ (బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ) కేడర్‌లో కొత్త ఉత్సాహం వచ్చింది.

మారనున్న సమీకరణాలు

తారీక్‌ రెహమాన్‌ తన ప్రసంగాల్లో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ‘బంగ్లాదేశ్‌.. ఢల్లీి లేదా రావల్పిండి చేతుల్లో ఉండదు, ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంటుంది’ అని చెబుతూనే, మత ఛాందసవాద పార్టీలను (జమాతే ఇస్లామీ) వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు. ఇది భారత్‌ ఆశించిన సమతుల్యతకు దగ్గరగా ఉంది.

ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షుడు మహ్మద్‌ యూనస్‌ ఆడుతున్న ‘అరాచక రాజకీయాలకు’ కాలం చెల్లిందనిపిస్తోంది. భారత్‌ చాలా నిశ్శబ్దంగా, అత్యంత ప్రభావవంతంగా ఆడిన ఈ ‘గేమ్‌’ వల్ల బంగ్లాదేశ్‌లో పాకిస్తాన్‌ ప్రాబల్యం తగ్గడమే కాకుండా, అమెరికా డీప్‌ స్టేట్‌ వ్యూహాలకు కూడా అడ్డుకట్ట పడిరది. ఫిబ్రవరి 2026లో జరగబోయే ఎన్నికలు దక్షిణాసియాలో భారత్‌ ఆధిపత్యాన్ని మరోసారి చాటి చెప్పనున్నాయి.

బంగ్లాదేశ్‌లో లా అండ్‌ ఆర్డర్‌ సరిగ్గా లేదు, ఎన్నికలను నిర్వహించలేము అని చెప్పి, ఎన్నికలను క్యాన్సల్‌ చేయడానికి యూనస్‌ ఇలాంటి నాటకాలు ఆడుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. పొలిటికల్‌ టైమింగ్‌ చూసుకుంటే.. గురువారం ఖలీదా జియా పెద్ద కొడుకు రెహమాన్‌ తారీక్‌ 17 ఏళ్ల తర్వాత అజ్ఞాతం నుంచి, లండన్‌ నుంచి ధాకా చేరుకున్నాడు. దీన్ని ‘రిటర్న్‌ ఆఫ్‌ డార్క్‌ ప్రిన్స్‌’ అంటున్నారు. ఇతను ఖలీదా జియాలాగా మంచోడు కాదు, చాలా అంటే చాలా మెంటలోడు. మొహమ్మద్‌ యూనస్‌ రాజీనామా చేయకపోతే ఊరికే ఉండదు అన్నట్లు ఎన్నో సార్లు వార్నింగ్‌ ఇచ్చిన వ్యక్తి రెహమాన్‌.

ఇతనికి భారత్‌ ఆశీర్వాదం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. ఇతని రాకతో పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ బ్యాక్‌ చేసిన జమాతే ఇస్లామీ డిపాజిట్లు కోల్పోతారు. ఎన్నికల్లో జమాతే ఓడిపోవడం ఖాయం అంటున్నారు. ముదురు నాయకుడు మొహమ్మద్‌ యూనస్‌, జమాతే ఇస్లామీ పార్టీకు ఇది చాలా పెద్ద బ్యాడ్‌ న్యూస్‌. తారీక్‌ రెహ్మాన్‌ను భయపెట్టడానికి, కేయోస్‌ను క్రియేట్‌ చేయడానికి యూనస్‌, జమాతే ఉగ్రవాదులు ఇలాంటి బాంబ్‌ బ్లాస్ట్‌ చేసి ఉంటారు అనే అనుమానాలు వస్తున్నాయి.

తారీక్‌ రెహ్మాన్‌ మొత్తం బంగ్లాదేశ్‌ పొలిటికల్‌ డైనమిక్స్‌ను చేంజ్‌ చేయనున్నాడు. అసలేం జరిగింది అనేది డీటెయిల్‌గా చెప్తా.

ఇంక్లాబ్‌ మోంచోక్‌ లీడర్‌, ఇటీవల ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్‌లో కలుపుతూ కొత్త మ్యాప్‌ను సృష్టించినవాడు, షేక్‌ హసీనాను గద్దె దించడంలో జెన్‌`జి చేపట్టిన ఉద్యమానికి నాయకత్వం వహించిన ఐదుగురిలో ఒకడు అయిన ఉస్మాన్‌ హాదీని డిసెంబర్‌ 12వ తేదీన ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. ఇతని మరణానికి కొద్ది రోజుల ముందు నుంచి బీఎన్‌పీ పార్టీ క్యాడర్‌, లండన్‌లో ఉన్న రెహ్మాన్‌ తారీక్‌, బీఎన్‌పీ ముఖ్య లీడర్స్‌, ఖలీదా జియా.. వీళ్లందరూ ఎన్నికలు నిర్వహించు, ఎప్పుడు ఎన్నికల తేదీని ప్రకటిస్తావు అని మొహమ్మద్‌ యూనస్‌పై వత్తిడి పెట్టారు. ఈ వత్తిడికి తలవొగ్గి యూనస్‌ 2026 ఫిబ్రవరి 12న ఎన్నికలు నిర్వహిస్తాను, రాజీనామా చేసి వెళ్లిపోతాను అని హామీ ఇచ్చాడు. కానీ యూనస్‌కు ఎన్నికలు నిర్వహించే ఉద్దేశమే లేదు. అందరినీ సంతోషపెట్టడానికి యూనస్‌ డిసెంబర్‌ 11న ఎన్నికలను ప్రకటించాడు. నెక్ట్స్‌ రోజే డిసెంబర్‌ 12న ఇంక్లాబ్‌ మోంచోక్‌ లీడర్‌ అయిన ఉస్మాన్‌ హాదీని చంపేసి, హై ప్రొఫైల్‌ పొలిటికల్‌ హత్య చేయించి, ఇండియాపై నింద వేసి, స్టూడెంట్స్‌ ద్వారా ప్రొటెస్ట్‌ చేయించి, హై కమిషన్స్‌పై దాడి చేయించి, హిందువులపై దాడి చేయించి, దీపు చంద్రదాస్‌ వంటి అమాయకుల్ని చంపేసి, హిందూ-ముస్లిం గొడవలు సృష్టించి.. ఇప్పుడు ‘ఎన్నికలు నిర్వహించలేము, లా అండ్‌ ఆర్డర్‌ ఇష్యూస్‌ ఉన్నాయని’ చెప్పి ఎన్నికలను పోస్ట్‌పోన్‌ చేయాలని కుట్ర చేశారు.

బంగ్లా ఎన్నికలకు ఇంకొక 50 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ స్టూడెంట్‌ ప్రొటెస్ట్‌ వల్ల ఎన్నికలు పోస్ట్‌ పోన్‌ చేస్తున్నాను అని యూనస్‌ నెక్ట్స్‌ వీక్‌ ప్రకటించాలి అనుకున్నాడు. కానీ సర్‌ప్రైజింగ్‌గా రెహ్మాన్‌ తారీక్‌ ఎంట్రీ ఇచ్చాడు. అదే సమయంలో ఉస్మాన్‌ హాదీ సోదరుడు ఉమర్‌ షరీఫ్‌ హాదీ మీడియా ముందు ‘షహీ శోపత్‌’ అనే కార్యక్రమంలో స్టూడెంట్స్‌ ముందే తన అన్నను యూనస్సే చంపించాడని చెప్పాడు. ఈయన స్పీచ్‌ తర్వాత అప్పటివరకు ఇండియాపై బ్లేమ్‌ వేసిన చేతులు యూనస్‌ వైపు తిరిగాయి. బ్లాక్‌ షీప్‌ యూనస్సే అనేది స్టూడెంట్స్‌కు తెలిసిపోయింది.

బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) దగ్గరకు వద్దాం. షేక్‌ హసీనా వెళ్లిపోయిన వెంటనే ఒకవేళ ఎన్నికలను యూనస్‌ నిర్వహించి ఉంటే ఖలీదా జియా బంపర్‌ మెజారిటీతో గెలిచి ఉండేది. కానీ రాజ్యాంగంలో మార్పులు, లా అండ్‌ ఆర్డర్‌ అని నాటకాలు ఆడి ఎన్నికలను డిలే చేశారు. ఆగస్టు 2024 నుండి ఇప్పటివరకు బాంగ్లాదేశ్‌కు ప్రధానే లేడు. మార్చి 2025లో మెళ్లగా నహిద్‌ ఇస్లాం ద్వారా ‘నేషనల్‌ సిటిజన్‌ పార్టీ’ అనే కొత్త పార్టీని స్థాపించాడు. గతంలో 1% ఓట్‌ షేర్‌ ఉన్న జమాతే ఇస్లామీపై బ్యాన్‌ ఎత్తివేసి ఆ పార్టీని బలోపేతం చేశాడు. రకైన్‌ కారిడార్స్‌లో అమెరికన్‌ ఆర్మీని ఆహ్వానించాడు. మొహమ్మద్‌ యూనస్‌ అమెరికా డెమోక్రటిక్‌ పార్టీకి, హిల్లరీ క్లింటన్‌కు స్నేహితుడు. డొనాల్డ్‌ ట్రంప్‌ గెలిచిన తర్వాత యూనస్‌ పని అయిపోయిందనుకున్నారు చాలామంది. కానీ, అమెరికాలో రాజకీయ నాయకులకు అతీతంగా డీప్‌ స్టేట్‌ పని చేస్తుంది. ట్రంప్‌ యూనస్‌ను ఏమీ చేయలేదు సరికదా.. బంగ్లాదేశ్‌ ఆర్మీకి అమెరికన్‌ ఆర్మీ ట్రైనింగ్‌ ఇస్తోంది. రకైన్‌ కారిడార్‌లో రోహింగ్యా రెఫ్యూజీలకు సాయం పేరుతో అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ‘టైగర్‌ లైట్నింగ్‌ 2025’ పేరుతో జాయింట్‌ మిలిటరీ డ్రిల్స్‌ జరుగుతున్నాయి.

యూనస్‌ ఎన్నికలను డిలే చేయడానికి ముఖ్య కారణం అమెరికాకు ఇండియన్‌ ఓషన్‌లో యాక్సెస్‌ కావాలి. చైనా వ్యాపారం మలక్కా స్ట్రైట్‌ గుండా జరుగుతుంది. దీనికి ఆల్టర్నేట్‌గా చైనా-మియన్మార్‌ ఎకానమిక్‌ కారిడార్‌ (సీఎంఈసీ) అనే రూట్‌ను చైనా తయారు చేసుకుంటోంది. అక్కడ డీప్‌ సీ పోర్ట్‌ కట్టుకుంటోంది. దీన్ని అడ్డుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. గతంలో షేక్‌ హసీనాను నావెల్‌ బేస్‌ అడిగితే ఆమె ఇవ్వలేదు, అందుకే ఆమెను గెంటేసి ఒక పప్పెట్‌ ప్రభుత్వాన్ని కూర్చోబెట్టి అమెరికా తన పనులు చేసుకుంటోంది. ఒకవేళ ఎన్నికలు జరిగి బీఎన్‌పీ గెలిస్తే వాళ్లు అమెరికన్‌ బేస్‌కు ఒప్పుకోరు. అందుకే జమాతే ఇస్లామీని గెలిపించాలని యూనస్‌ ప్లాన్‌.

ఇండియా ఎందుకు మధ్యలో వస్తుంది అంటే, బంగాళాఖాతంలో అమెరికన్‌ ఆర్మీ బేసెస్‌ ఉండడం మనకు కూడా త్రెట్‌. మన నార్త్‌ ఈస్ట్‌ రాష్ట్రాలకు దగ్గరగా అమెరికా ప్రెసెన్స్‌ మనకు ఇష్టం లేదు. అందుకే భారత్‌ బ్యాక్‌ ఛానల్‌లో రెహమాన్‌ తారీక్‌తో మాట్లాడిరది. 17 ఇయర్స్‌ తర్వాత రెహమాన్‌ రాకతో బీఎన్‌పీ క్యాడర్‌లో ఉత్సాహం పెరిగింది.

ఇండియా ఆడిన గేమ్‌ నెక్ట్స్‌ లెవెల్‌లో ఉంది. మనం జస్ట్‌ రెహ్మాన్‌ తారీక్‌లో ఫైర్‌ను ఇగ్నైట్‌ చేశాం. గేమ్‌ 180 డిగ్రీలు టర్న్‌ అవుతుంది. యూనస్‌ రాజీనామా చేసి వెళ్లిపోతాడు. బీఎన్‌పీ డెఫినెట్‌గా అమెరికన్‌ మిలిటరీ బేసెస్‌ను విరోధిస్తుంది. 2026 ఫిబ్రవరి 12 వరకు బంగ్లాదేశ్‌లో ప్రతి ఒక్క సీన్‌ ప్రీ-క్లైమాక్స్‌ లెవెల్‌లో ఉంటుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page