top of page

బంగ్లాదేశ్‌ను తేలిగ్గా తీసుకోవద్దు!

  • Writer: ADMIN
    ADMIN
  • Sep 19, 2024
  • 1 min read
ree

టీమ్‌ ఇండియా తెల్ల దుస్తుల్లో క్రికెట్‌ ఆడబోతోంది. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023-25లో భాగంగా బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడనుంది. ఇవ్వాల్టి నుంచి చెన్నై చేపాక్‌ స్టేడియంలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. భారత క్రికెట్‌ జట్టు ఈ ఏడాది మార్చిలో చివరిసారి టెస్ట్‌ క్రికెట్‌ ఆడిరది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను 4-1 తేడాతో గెలిచింది. మళ్లీ ఆరు నెలల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‌లో క్రికెట్‌ ఆడబోతోంది. ఈ మధ్య కాలంతో భారత క్రికెట్‌ జట్టు పొట్టి క్రికెట్‌ ఎక్కువగా ఆడిరది. టీ20 వరల్డ్‌ కప్‌తో పాటు శ్రీలంక, జింబాబ్వేలతో సిరీస్‌ ఆడిరది. ఇక బంగ్లాదేశ్‌ జట్టు ఇటీవల చారిత్రాత్మక విజయం సాధించింది. పాకిస్తాన్‌తో పాకిస్తాన్‌లో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో విజయం సాధించింది.

బంగ్లాకు చెందిన నహిద్‌ రాణా సరికొత్త పేస్‌ బౌలింగ్‌ సెన్సేషన్‌గా మారాడు. పాకిస్తాన్‌ సిరీస్‌లో అతడు అద్భుతంగా రాణించాడు. బంగ్లా బ్యాటింగ్‌ లైనప్‌ కూడా బలంగా కనపడతోంది. ముష్ఫకీర్‌ రహీమ్‌, లిటన్‌ దాస్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్‌ నజ్ముల్‌ హుస్సేన్‌ షంతో ఫామ్‌లో లేకపోవడమే ఆందోళనపరుస్తోంది. అయితే తమదైన రోజున బంగ్లాదేశ్‌ జట్టు సంచలనాలు సృష్టించగలదు. భారత జట్టులోకి బుమ్రా తిరిగి వచ్చాడు. ఇది బౌలింగ్‌ లైనప్‌కు అదనపు బలం. కేఎల్‌ రాహుల్‌ను మిడిల్‌ ఆర్డర్‌లో ఆడిరచే అవకాశం ఉంది. భారత్‌ పూర్తి స్థాయి జట్టుతో ఆడనుంది. ప్రస్తుతం వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో టాప్‌ పొజిషన్‌లో ఉంది. బంగ్లాదేశ్‌ సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసి టాప్‌ పొజిషన్‌ను స్ట్రాంగ్‌ చేసుకోవాలని చూస్తోంది. గంభీర్‌ కోచ్‌గా ఇది తొలి టెస్ట్‌ మ్యాచ్‌ 9.30కి ప్రారంభం.

(ూఱఙవ ూ్‌తీవaఎఱఅస్త్ర జీఱశీ జఱఅవఎa, ూఱఙవ ువశ్రీవషaర్‌ ూజూశీత్‌ీం 18)

- భాయ్‌జాన్‌

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page