top of page

బదిలీలకు బ్రేకులు. రెండు జిల్లాల్లో స్తంభించిన వైద్య వ్యవస్థ!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 2 hours ago
  • 2 min read
  • జీవీఎంసీ కమిషనర్ వైఖరితో గాల్లో వేలాడుతున్న అధికారుల బదిలీలు

  • మంత్రి ఆదేశాలనూ బేఖాతరు చేస్తున్న వైనం..

  • విసిగిపోయి సెలవుపై వెళ్లిన మన్యం డీఎంహెచ్‌వో

  • సరుబుజ్జిలి, ఎల్ ఎన్ పేట పీఎస్‌లలో మూడు నెలలుగా లేని ఎస్సైలు..

  • దందాలకు అడ్డాగా మండలాలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ అధికారి పోస్టు ఖాళీ అయి రెండు నెలలు దాటిపోయింది. ఇంతవరకు ఆ స్థానంలో కొత్త అధికారి రాకపోవడంతో పూర్తి అదనపు బాధ్యతలు ఎవరికీ ఇవ్వకపోవడంతో జిల్లాలో అతి పెద్ద వ్యవస్థ కుంటుతూ నడుస్తోంది. పక్క జిల్లా పార్వతీపురం మన్యంలో కూడా వైద్య ఆరోగ్యశాఖాధికారి పోస్టు భర్తీ కాకపోవడంతో మన్యం జిల్లా రొప్ప్పుతోంది. అదే సమయంలో జిల్లాలో రెండు పోలీస్‌స్టేషన్లకు ఎసఐలు లేకపోవడంతో ఫిర్యాదు తీసుకునే నాధుడు కూడా కరువయ్యాడు. శ్రీకాకుళంలో డీఎంహెచ్‌వోగా పని చేస్తున్న అనితకు ఇక్కడి నుంచి బదిలీ అయినప్ప్పుడు వైజాగ్ జీవీఎంసీలో మెడికల్ ఆఫీసర్‌గా పని చేస్తున్న డాక్టర్ నరేష్‌కు ఇక్కడ డీఎంహెచ్‌వోగా బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు. అదే సమయంలో నరేష్ స్థానంగా విశాఖ జీవీఎంసీకి పార్వతీపురం మన్యం జిల్లా డీఎంహెచ్‌వోను బదిలీ చేశారు. అయితే జీవీఎంసీ కమిషనర్ నరేష్‌ను అక్కడి నుంచి రిలీవ్ చేయడానికి పార్వతీపురం నుంచి వచ్చే డీఎంహెచ్‌వోను చేర్చుకోడానికి నిరాకరించడంతో ఒకేసారి ఈ రెండు జిల్లాల్లోనూ డీఎంహెచ్‌వో సీట్లు ఖాళీగా ఉన్నాయి. స్వయంగా రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడు ఏరికోరి తెచ్చుకున్న నరేష్‌ను రిలీవ్ చేయడానికి ఎవరు చెప్పినా వినడంలేదని భోగట్టా. మొదట్లో సింహాచలం గిరిప్రదక్షిణ పూర్తయిపోయిన తర్వాత నరేష్‌ను రిలీవ్ చేస్తానని చెప్పిన జీవీఎంసీ కమిషనర్ ఆ తర్వాత తన విదేశీ పర్యటన పూర్తయిన తర్వాత రిలీవ్ చేస్తానని చెప్ప్పుకొట్టారట. ఈలోగా జీవీఎంసీలో మెడికల్ ఆఫీసర్‌గా చేరడానికి పార్వతీపురం నుంచి వచ్చిన డీఎంహెచ్‌వోను కమిషనర్ చేర్చుకోలేదు. ఆయన రెండుమÖడు సార్లు జీవీఎంసీ కమిషనర్‌ను కన్వీన్స్ చేసే ప్రయత్నం చేసినా ఫలితం దక్కకపోవడంతో ఏకంగా మెడికల్ లీవ్ పెట్టేసి వెళ్లిపోయారు. అటు పార్వతీపురం మన్యంకు చెందకుండా, ఇటు జీవీఎంసీలో చేరకుండా ఆయన గాలిలో ఉండిపోయారు. జిల్లాకు రావాల్సిన నరేష్‌ను కూడా రిలీవ్ చేయకపోవడంతో ఇక్కడ డీఎంహెచ్‌వో పోస్టు కూడా ఖాళీగా ఉండిపోయింది. ఇదిలా ఉండగా, జిల్లాలో ఆమదాలవలస నియోజకవర్గంలోని సరుబుజ్జిలి, ఎల్ ఎన్ పేట పోలీస్‌స్టేషన్లకు ఎస్ ఐలు లేక మÖడు నెలలవుతోంది. ఇక్కడ కూడా కొత్త ఎస్ ఐలు విధుల్లో చేరలేదు. సరుబుజ్జిలి మండలంలో ఏదైనా సమస్య వస్తే బూర్జ ఎసఐ అక్కడి స్టేషన్ వదిలి ఇక్కడికి రావాల్సి వస్తోంది. ఈ మండలంలో ఇసుక, బియ్యం దందాలు ఎక్కువగా జరుగుతున్నా ఎస్ ఐలు లేకపోవడం వల్ల చిన్నచిన్న ఫిర్యాదులు తీసుకోడానికి కూడా ఎవరూ ఆసక్తి చూపడంలేదు. ఎల్ ఎన్ పేట, సరుబుజ్జిలి రెండూ జిల్లాలో కీలకమైన పోలీస్‌స్టేషన్లే. ఇక్కడ ఎస్ ఐలు బదిలీ కావడానికి ఎన్ని కారణాలున్నాయో, కొత్తవారు విధుల్లో చేరకపోవడానికి కూడా అన్నే కారణాలున్నాయి. శ్రీకాకుళం డీఎంహెచ్‌వోగా డాక్టర్ నరేష్‌కుమార్‌ను జీవీఎంసీ నుంచి రిలీవ్ చేయకపోవడం వల్ల రెండు జిల్లాల్లో డీఎంహెచ్‌వో పోస్టు ఖాళీగా మిగిలిపోయింది. రష్యా పర్యటన నుంచి వచ్చిన తర్వాత కూడా జీవీఎంసీ కమిషనర్ రిలీవ్ చేయకపోగా భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం తర్వాత రిలీవ్ చేస్తానని మాటిచ్చి కమిషనర్ గార్గ్ మాట నిలుపుకోలేదు. దీంతో మన్యం జిల్లా డీఎంహెచ్‌వో భాస్కరరావు దీర్ఘకాలిక సెలవు, ఇక్కడికి డీఎంహెచ్‌వో నరేష్ కుమార్ రాకపోవడం చూస్తుంటే ప్రభుత్వ శాఖల్లో ఏం జరుగుతోందో అర్థం కావడంలేదు. వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ వంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడానికి మరో ఐఏఎస్ అధికారి ముందుకు రాకపోతే ఎవరికి చెప్ప్పుకోవాలి? స్వయంగా జిల్లా మంత్రి ఇక్కడి డీఎంహెచ్‌వో లేకపోవడం వల్ల పనులు ఆగిపోయాయని చెప్పినా పట్టించుకోపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలి? అందుకే విసిగిపోయి మన్యం డీఎంహెచ్‌వో భాస్కరరావు జీవీఎంసీలో పోస్టింగ్ ఇచ్చేవరకు విధుల్లో చేరనని సెలవు పెట్టేశారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page