top of page

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పాప్‌కార్న్‌ ఎంటర్‌టైనర్‌

  • Guest Writer
  • 3 days ago
  • 3 min read

‘అనార్కలి’ వైన్‌ కంపెనీ నడిపే రామ సత్యనారాయణ (రవితేజ) పెద్ద ముదురు. ‘‘తెల్లోడు చేసిన మందు మనం తాగడం ఏంటి.. మన తెలుగోళ్లు చేసిన ‘అనార్కలి’ వైన్‌ రుచి తెల్లోళ్లకు చూపించాలి’’ అని కంకణం కట్టుకుని స్పెయిన్‌ ఫ్లైట్‌ ఎక్కుతాడు. సీన్‌ కట్‌ చేస్తే.. బిజినెస్‌ డీల్‌ కోసం వెళ్ళిన మనోడు, ఆ కంపెనీ ఎమ్‌డీ మానస (ఆషికా రంగనాథ్‌) గ్లామర్‌కు క్లీన్‌ బౌల్డ్‌ అయిపోతాడు. దాంతో తను ఫలానా అని చెప్పకుండా ఇండైరెక్ట్‌ గా ఆమెకి దగ్గరై తన అనార్కలి వైన్‌ టేస్ట్‌ ని పరిచయం చేస్తాడు. దాన్ని ప్రమోట్‌ చేయాలని చెబుతాడు. అయితే అనార్కలి బ్రాండ్‌ తనదే, తనే ఓనర్‌ అనే విషయాన్ని దాస్తాడు. ఈ క్రమంలో రామ సత్యనారాయణతో మానస కనెక్ట్‌ అవుతుంది. బిజినెస్‌ మీటింగ్‌లు కాస్తా డేటింగ్‌లుగా మారిపోతాయి. ఇద్దరూ ‘కమిట్‌ అయిపోతారు. ట్విస్ట్‌ ఏంటంటే మనోడు అప్పటికే పెళ్ళైనోడు! ఇంట్లో బాలామణి (డిరపుల్‌ హయాతీ) వంటి భార్య ఉండగా, ఆ నిజాన్ని దాచేసి స్పెయిన్‌లో రొమాన్స్‌ పండిరచి.. గుట్టుచప్పుడు కాకుండా మళ్ళీ హైదరాబాద్‌ ల్యాండ్‌ అయిపోయాడన్నమాట. అంతా సేఫ్‌ అనుకుని మళ్ళీ పెళ్లాంతో పచ్చని సంసారం చేసుకుంటున్న రామ్‌కు సడన్‌గా గుండె ఆగినంత పని అవుతుంది. ఎందుకంటే.. ఆ స్పెయిన్‌ బ్యూటీ మానస సడన్‌గా హైదరాబాద్‌లో ల్యాండ్‌ అవుతుంది! అప్పుడు మొదలవుతుంది మనోడికి అసలైన సినిమా! వైన్‌ ఫెస్టివల్‌లో మానస ఎదురుపడగానే మన రామ్‌ కి అసలైన ‘దబిడి దిబిడి’ మొదలవుతుంది. భార్య బాలామణికి తన లీలలు తెలిస్తే ఇంట్లో యుద్ధమే!ఇక స్పెయిన్‌ నుంచి వచ్చిన ప్రియరాలికి తెలిస్తే..అందులోనూ తనే కంపెనీ ఓనర్‌ అనే విషయం దాచిన విషయం తెలిస్తే ఊరుకుంటుందా? మానస వచ్చి తన వైన్‌ కంపెనీ ఓనర్‌ను కలవాలని పట్టుబడుతుంది. దాంతో దొరికిపోతామని భయపడిన రామ్‌, అసలు నిజం చెబుతాడా? మానస ఎందుకు బాలామణిని కలవాలని డిసైడ్‌ అయింది? చివరికి ఈ త్రిముఖ ప్రేమాయణం ఏ తీరానికి చేరింది అనేది వెండితెరపై చూడాల్సిందే!

ఎనాలసిస్‌

ఇంట్లో ఇల్లాలు..వంటిట్లో ప్రియురాలు, అల్లరి మొగుడు వంటి కథలను కార్తీక దీపం సినిమాల రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. ఇవి ఒకప్పుడు ఎవర్‌ గ్రీన్‌ ఫార్ములా. అయితే ఇప్పుడు ఉన్న ఒక పెళ్లాం లేదా గర్ల్‌ ప్రెండ్‌ తోనే వేగలేకపోతున్నాం అని ఆలోచనలో పడుతున్న జనరేషన్‌ నడుస్తోంది. ఇలాంటి పరిస్దితుల్లో ఇలాంటి కథలు వాటంతట అవే తగ్గిపోయాయి. ఇద్దరి ఆడవాళ్లను ఒక మగాడు మేనేజ్‌ చేయటం అనేది సినిమాల్లోనే చూసే ఫాంటసీ గా మారిపోయింది. ఇప్పుడు ఒకే అమ్మాయి..ఇద్దరు కుర్రాళ్లను మేనేజ్‌ చేసే కథలకు గిరాకీ ఏర్పడిరది. ఇలాంటి సిట్యువేషన్‌ లో ఈ కాన్సెప్ట్‌ ని రవితేజ వంటి మాస్‌ హీరో చెయ్యటం..ఎంతవరకూ వర్కవుట్‌ అవుతుంది అనే ఆలోచన కొంచెం ఆలోచనలో పడేసేదే.

అయితే దర్శకుడుగా కిషోర్‌ తిరుమల ధైర్యం చేసాడు. రవితేజ సై అన్నాడు. సరే ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అని మనం కూడా నమ్మించుకుంటూ సినిమా చూసాం. కథగా కొత్తగా ఏమీ ఉండదని మొదలైన పది నిముషాలకే అర్దమైపోయింది కాబట్టి, ఏ సమస్యా లేదు. ఇంక మిగతా సమయం అంతా ఆ పాత దనాన్ని కొత్తదనం అనిపించటానికి దర్శక,రచయిత ఏ మార్గం అనుసరించాడు. రవితేజ తన కామెడీ టైమింగ్‌ తో అల్లరి మొగడు నాటి మోహన్‌ బాబు గుర్తు చేస్తూ ఎలా చెలరేగిపోయాడో గమనిస్తూ జోక్‌ వచ్చినప్పుడు నవ్వటం, మిగతా సమయంలో సైలెంట్‌ గా గమనించటమే మనం చేయగలిగింది.

నిజానికి కిశోర్‌ తిరుమల రైటర్‌ గా కెరీర్‌ మొదలు నాటి నుంచి మంచి మార్కులు వేయించుకుంటూ వస్తున్నారు. ఆయన నుండి సాధారణంగా ఆశించే విషయం ఏంటంటే -- సింపుల్‌ సెటప్‌, రిలేషన్‌షిప్‌ డ్రామా, క్యారెక్టర్‌-డ్రివన్‌ కామెడీ. ఈసారి కూడా ఆయన మనని ఏ మాత్రం నిరాశపరచకుండా... అదే ఫార్ములాను కనీసం రిఫ్రెష్‌ కూడా చేయకుండా వాడేసారు. మొదటి నలభై నిముషాలు అయితే కథ ఎక్కడికీ కదలదు. పాత్రలు వచ్చి వెళ్తాయి కానీ డ్రామాటిక్‌ ప్రెజర్‌ క్రియేట్‌ కాదు. ఎందుకంటే కాంప్లిక్ట్స్‌ ఎస్టాబ్లిష్‌ అవ్వటానికి బోలెడు టైమ్‌ తీసుకుంటుంది కాబట్టి.

మనకి కథ పరంగా మనకు అవసరమైన ఇన్ఫర్మేషన్‌ ఇస్తూ సీన్స్‌ సాగుతాయి కానీ, కథ డ్రామాలోకి ప్రవేశించదు. దాంతో ఎమోషనల్‌ గా ఇన్వాల్వ్‌ అవ్వటం కష్టం అవుతుంది. కామెడీ సినిమాకు అది అనవసరం ధర్శకుడు భావించి ఉండచ్చు. సినిమాలో అసలు డ్రైవింగ్‌ ఫోర్స్‌ అవ్వాల్సిన అంశం రవి తేజ క్యారెక్టర్‌కి అవసరమైన ‘భయం/టెన్షన్ణ అనేది సెకండాఫ్‌ లో గానీ ప్రవేశించదు. దాంతో కథలో అర్జెన్సీ లేకుండా ఛల్తాహై అన్నట్లు సీన్స్‌ వస్తూంటాయి, కొన్ని జోక్స్‌ వేస్తూ నవ్విస్తూంటాయి. ఆ నవ్వులు కంటిన్యూ గాగ్స్‌ లాగ ఉండవు. సెకండాఫ్‌ మొత్తం భార్యతో, అటు లవర్‌తో హీరో నలిగిపోవడం చుట్టూనే సాగుతుంది. ఈ క్రమంలో వచ్చే సీన్స్‌ పగలబడి నవ్వించేలా ఉండాలి. అలాకాకుండా ఒక సీన్‌లో నవ్వు...తర్వాతి సీన్‌లో ఫ్లాట్‌...అయ్యింది. ఎక్కువ సోషల్‌ మీడియా పంచ్‌ లు, జోక్స్‌. దాంతో రిథమ్‌ బ్రేక్‌ అవుతుంది. అది ఫెరఫెక్ట్‌ గా ఉంటే కామెడీ పరంగా సినిమా నెక్ట్స్‌ లెవిల్‌ కు వెళ్లేది. ఇక క్లైమాక్స్‌ రొటీన్‌ గానే అనిపించింది.

టెక్నికల్‌ హైలైట్స్‌: సినిమాను సేవ్‌ చేసిన ఆ నలుగురు!

మ్యూజిక్‌ (భీమ్స్‌): సినిమాకు అసలైన ఊపిరి పాటలు, అలాగే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సీన్లను బాగా ఎలివేట్‌ చేసింది. సినిమాటోగ్రఫీ (ప్రసాద్‌ మూరెళ్ల): విజువల్స్‌ చాలా కలర్‌ఫుల్‌గా, ఫ్రెష్‌గా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్‌ గ్రాండ్‌గా కనిపిస్తుంది. ఎడిటింగ్‌ (శ్రీకర్‌ ప్రసాద్‌): అనవసరమైన సాగతీత లేకుండా సినిమాను షార్ట్‌ అండ్‌ స్వీట్‌గా కట్‌ చేశారు. బోర్‌ కొట్టనివ్వలేదు మాగ్జిమం. డైరెక్షన్‌ (కిషోర్‌ తిరుమల): ఎమోషన్స్‌ కంటే ఈసారి కామెడీకే ఓటేశారు. స్టోరీ వీక్‌ అయినా.. కామెడీతో మేనేజ్‌ చేశారు. చాలా వరకూ సక్సెస్‌ అయ్యాడు.

నటీనటుల్లో ..

చాన్నాళ్ల తర్వాత రవితేజ తన మార్క్‌ కామెడీతో చెలరేగిపోయాడు. ఫ్యాన్స్‌కు ఇది ఫుల్‌ రిఫ్రెష్‌మెంట్‌. ముఖ్యంగా సినిమాలో ‘కిరసనాయిల్ణ ట్రాక్‌, సెకండాఫ్‌లో వచ్చే ‘జనరేటర్ణ సీన్‌ థియేటర్లో నవ్వుల పూయించాయి. అలాగే రవితేజ - సునీల్‌ కాంబినేషన్‌ అదిరిపోయింది. గెటప్‌ శీను, వెన్నెల కిషోర్‌, సత్య పంచులు బాగా పేలాయి. హీరోయిన్స్‌ విషయానికి వస్తే... ఆషికా రంగనాథ్‌ చాలా గ్లామర్‌గా కనిపిస్తే.. డిరపుల్‌ హయాతీ సింపుల్‌ అండ్‌ హోమ్లీ లుక్‌లో ఆకట్టుకుంది.

ఫైనల్‌ థాట్‌:

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఒక బ్యాడ్‌ ఫిల్మ్‌ కాదు..అలాగని రిపీట్‌ గా చూసి ఎంజాయ్‌ చేసే అదిరిపోయే సినిమానూ కాదు. కొన్ని చోట్ల కిశోర్‌ తిరుమల పెన్‌ మెరుస్తుంది, కొన్ని కామెడీ బ్లాక్స్‌ నవ్విస్తాయి, రవి తేజ కెరీర్‌ కు ఇది చిన్న రిలీఫ్‌ ఇస్తుంది. కానీ కథ,కథనం రొటీన్‌ గా ఉండటం, ఫ్లాట్‌ ఎమోషనల్‌ గా పే ఆఫ్‌ లేకపోవటం వల్ల ఇది రవితేజకు నిజమైన కంబ్యాక్‌గా మారలేకపోయింది. పండుగ సీజన్‌లో ఒకసారి చూసి నవ్వుకునే పాప్‌కార్న్‌ ఎంటర్‌టైనర్‌ మాత్రమే.

-సూర్య ప్రకాష్‌ జోశ్యుల

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page