top of page

మొండోడివి సుమా..! శంకర్ భుజం తట్టిన లోకేష్ `

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • Mar 28
  • 1 min read

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

“మొత్తానికి మొండోడివి. నీ పనయ్యేవరకు ఎవ్వర్నీ వదలడంలేదు. ఎన్నికల ముందు ఎన్ని హామీలిచ్చావో తెలియదుగాని అన్నా.. మొత్తానికి అన్నీ సాధించు కుంటున్నావు..” అంటూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అమరావతిని రాజధానిగా చేసే చట్టం కోసం అసెంబ్లీ శని వారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా లోకేష్‌ను శంకర్ కలిసినప్ప్పుడు ఈ ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. శ్రీకాకుళంలో స్టేడియం పనుల కోసం పెండింగ్ నిధులు మంజూరు చేయడం పట్ల లోకేష్‌కు ధన్యవాదాలు చెప్పడానికి శంకర్ వెళ్లారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గంలో జరిగిన వివిధ పనులకు సంబంధించి గత ప్రభుత్వంలో పెండింగ్ ఉండిపోయిన కోట్లాది రూపాయల బిల్లులు మంజూరు చేయించుకున్న విషయాన్ని ప్రస్తావించి లోకేష్ శంకర్‌ను అభినందించారు. ప్రతీరోజు ఏదో ఒక అభివద్ధి పని మొదలు కావడం, మరోవైపు పూర్తయిన వాటికి ప్రారంభోత్సవాలు చేయడంతో బిజీగా ఉన్నా వంటూ కితాబిచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన రెండు ప్రధానమైన సమస్యలు ఉన్నాయని, వాటికి నిధులు మంజూరైతే కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠ పెరుగుతుందని లోకేష్‌కు శంకర్ వివరించారు. ఎలా ఉన్నా ఏదో ఒక రూపంలో నిధులు తీసుకుపోతావ్.. ఆ భయమేమీ అక్కర్లేదంటూ చలోక్తి విసిరారట.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page