మూడో ప్రపంచ యుద్ధం దిశగా..!
- DV RAMANA

- Jun 16, 2025
- 2 min read

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. మానవ సమాజం మూడో ప్రపంచ యుద్ధం దిశగా సాగతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించినప్పుడే ఈ ఆందోళనలు వ్యక్తమయ్యాయి. రష్యాకు మద్దతుగా వార్సా దేశాలు, ఉక్రెయిన్‌కు వైపు నాటో కూటమి, ఐరోపా యూనియన్ దేశాలు నిలవడంతో మూడేళ్ల క్రితమే మూడో ప్రపంచ యుద్ధం సంభవించవచ్చేమో నని సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. అయితే అదృష్టవశాత్తు ఆయా దేశాలు ఉక్రెయిన్‌కు ఆర్థిక, ఆయుధ సహాయం అందించడంతోపాటు రష్యాపై ఆర్థిక ఆంక్షలకే పరిమితం కావడంతో నాడు ఆ ముప్పు తప్పిపో యింది. తర్వాత ఇజ్రాయెల్`పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలోనూ మరో ప్రపంచ యుద్ధం భయాలు అలుముకున్నా.. అది ఆ రెండు దేశాలకే పరిమితమైంది. అయితే ఇప్పటికే ఇటు పాలస్తీనా, అటు లెబనాన్, మరోవైపు యెమన్ వంటి అరబ్ దేశాలతో తలపడుతున్న ఇజ్రాయెల్ ఉన్నఫళంగా ఉరుములేని పిడుగు మాదిరిగా ఇరాన్‌పై రాత్రికి రాత్రి సైనికచర్యకు దిగడంతో తీవ్రంగా నష్టపోయిన ఆ దేశం అదే స్థాయిలో ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు చేసింది. అది మొదలు గత ఐదురోజులుగా రెండు దేశాల మధ్య బాలిస్టిక్ క్షపణులు సహా అతి ప్రమాదకరమైన ఆయుధాలతో జరుగుతున్న దాడులు ఇరు దేశాలను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ఈ రెండు దేశాల యుద్ధం వల్ల అంతర్జాతీయంగా అనేక ఇబ్బం దులు తలెత్తుతాయి. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే చమురు ధరలు పెరిగిపోతు న్నాయి. ఇంకా బంగారంతో సహా అనేక సరుకుల ధరలు పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితే తీవ్ర ఆందోళన కలిగిస్తుంటే.. పరస్పరం తలపడుతున్న ఇజ్రాయెల్, ఇరాన్‌లకు మద్దతుగా పలు దేశాలు రంగం లోకి దిగుతున్నాయి. తమ ప్రాధమ్యాలకు అనుగుణంగా ఇజ్రాయెల్ వైపు కొన్ని, ఇరాన్ వైపు మరికొన్ని దేశాలు చేరి మేము సైతం.. అంటూ రణభేరి మోగిస్తున్నాయి. అగ్రరాజ్యమైన అమెరికా తొలి నుంచీ ఇజ్రా యెల్‌కు అండగా నిలుస్తోంది. తమతో అణు నిరాయుధీకరణ ఒప్పందానికి నిరాకరిస్తున్న ఇరాన్‌పై ఇప్ప టికే కారాలు మిరియాలు నూరుతున్న ట్రంప్ సర్కార్.. ఇరాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడి పలువురు సైని కాధికారులను, అణు శాస్త్రవేత్తలను హతమార్చడంతో సంబరపడిపోతోంది. ఇంకా తీవ్రంగా దాడి చేయా ల్సిందని కూడా సాక్షాత్తు ఆమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఇజ్రాయెల్‌లో ఉన్న తమ సైనిక స్థావరాలపై దాడులకు పూనుకుంటే.. పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా ఇరాన్‌ను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ఒక ప్రకటన చేస్తూ ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ముఖ్యంగా అగ్రదేశాలైన అమె రికా, బ్రిటన్, ఫ్రాన్స్ సైనిక స్థావరాలను, వారి యుద్ధనౌకలను లక్ష్యంగా చేసుకుంటామని స్పష్టం చేసింది. అయితే ఇరాన్ బెదిరింపులను బ్రిటన్(యూకే) లెక్కచేయలేదు. ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించడమే కాకుండా వెంటనే రంగంలోకి కూడా దిగింది. తమ మిలటరీ బలగాలను మిడిల్ ఈస్ట్‌కు తరలిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని బ్రిటన్ ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్ స్వయంగా వెల్లడిరచారు. ‘నేను యూకే కు ఏది మంచిదో అదే చేస్తాను. మిడిల్ ఈస్ట్‌కు మిలటరీ బలగాలను తరలిస్తున్నాం. ఏదైనా అత్యవసర పరిస్థితి రావచ్చొని ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని ఆయన వెల్లడిరచారు. మరోవైపు ఫ్రాన్స్ కూడా అప్ర మత్తమైంది. ఇజ్రాయెల్‌కు మద్దతుగా నేరుగా రంగంలోకి దిగకపోయినా.. తమ దేశంలో అమెరికన్లు, ఇజ్రాయెలీలు అధికంగా నివసిస్తున్న ప్రాంతాలపై ఇరాన్ దాడికి పాల్పడే ముప్పును పసిగట్టి ఆ ప్రాంతాల్లో సైనిక భద్రత ఏర్పాటు చేసింది. అగ్రదేశాలు ఇజ్రాయెల్ వైపు నిలిస్తే.. అరబ్ దేశాలు, ఆమెరికా శత్రు దేశాలు ఇరాన్ పక్షం వహిస్తున్నాయి. ఈ క్రమంలో యెమెన్ ఆర్మీ ఇప్పటికే రంగంలోకి దిగింది. ఇరాన్ సమన్వయంతో ఇజ్రాయెల్‌పై రెండు హైపర్ సోనిక్ బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించినట్లు యెమెన్ ఆర్మీ చీఫ్ ప్రకటించారు. అలాగే షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేన్(ఎస్‌సీవో) సభ్యదేశాల్లో భారత్ మినహా, యూరేషియా రీజియన్‌కు చెందిన చైనా, కజకిస్థాన్, కిర్గిజిస్థాన్, రష్యా, తజకిస్థాన్, ఉబ్జెకిస్థాన్, పాకిస్తాన్ దేశాలు కూడా తమ సభ్య దేశమైన ఇరాన్‌కు మద్దతుగా నిలుస్తున్నట్లు ప్రకటించాయి. పాకిస్తాన్, తుర్కియే(టర్కీ) ఇప్పటికే ఇరాన్‌కు మద్దతునిస్తుండగా, మిగతా అరబ్ దేశాలు కూడా ఈ యుద్ధ పరిస్థితుల్లో తమకు అండగా నిల వాలని ఇరాన్ పిలుపునిచ్చింది. ఇలా ప్రపంచ దేశాలు దాదాపుగా చీలిపోయి కొన్ని ఇరాన్, మరికొన్ని ఇజ్రా యెల్ పక్షంలో చేరుతుండటంతో మూడో ప్రపంచయుద్ధం తప్పదేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.










Comments