మీతో ఉన్న మహిళలు ఎవరో.. మీరు చెబుతారా.. నన్ను చెప్పమంటారా?
- BAGADI NARAYANARAO
- 2 days ago
- 1 min read
ప్రశ్నించే వారిని బెదిరించడం కూనకు అలవాటే
వైకాపా సమన్వయకర్త చింతాడ రవికుమార్

(సత్యంన్యూస్, ఆమదాలవలస)
పొందూరు కేజీవీబీవీ ప్రిన్సిపాల్‌ను మానసికంగా, శారీరకంగా వేధించినట్టు వచ్చిన ఆరోపణలపై స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ తనకు తాను సచ్చీలుడినని చెప్పుకుంటున్నారని, అదే నిజమైతే ఒంటిమిట్టలో సతీసమేతంగా స్వామివారిని దర్శించుకున్నట్టు ఒక పత్రికలో వచ్చిన వార్తపై ఏం సమాధానం చెబుతారని వైకాపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి చింతాడ రవికుమార్ ప్రశ్నించారు. కేవలం ఆ మహిళ ఐడెంటిటీని బయటపెట్టకూడదని, ఆమెకు కూడా ఒక కుటుంబం ఉంటుంది కాబట్టి ఆమె ముఖాన్ని బ్లర్ చేస్తున్నట్టు పేర్కొంటున్నట్టు మీడియాకు ఆ క్లిప్పింగ్‌ను బుధవారం సాయంత్రం రిలీజ్ చేశారు. అలాగే ఓ ఒంటరి మహిళ భుజంపై చెయ్యి వేస్తూ ఫొటోకు దిగారని, ఆమెతో ఎక్కడికి వెళ్లారో కూన రవికుమార్ చెబుతారా, లేదా తనను చెప్పమంటారా అని రవి సవాల్ విసిరారు. తనపై అనేక ఆరోపణలు చేసిన కూన రవికుమార్ ఇప్పుడు పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్‌పై కూడా ఆధారాలు లేని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సౌమ్య చేసిన ఆరోపణలకు ఆధారాలు కావాలని అడుగుతున్నారని, ఆయన కార్యాలయంలో జరిగిన తతంగానికి ఆధారాలు ఆయనే ఇవ్వాలని చింతాడ రవి ఎదురుప్రశ్న వేశారు. సీసీ టీవీ ఫుటేజ్‌లు కూన రవి ఇస్తే అన్నీ బయటపడతాయన్నారు. పరాయి మహిళలతో దేవాలయాల్లో దర్శనాలకు వెళ్తున్న కూన రవి ప్రివిలైజ్ కమిటీ ముందు అందర్నీ నిలబెడతాననడం ఎవరికి ప్రివిలైజో చెప్పాలని కోరారు. సౌమ్య విషయంలో అడ్డంగా బుక్కై టీడీపీ అధిష్టానంతో చీవాట్లు తిన్న కూన ఫ్రస్టేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారని, కూన తనను తాను దేవుళ్లతో పోల్చుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కుల పరిధిని ఎమ్మెల్యే కూన దాటి వ్యవహరిస్తున్నారని తప్పుబట్టారు. ఎమ్మెల్యే రవి అక్రమాలపై ప్రశ్నించిన వారిని బెదిరించడం, సోషల్ మీడియాలో ట్రోల్ చేయించడం అలవాటేనని చింతాడ ఆరోపించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్‌కుమార్, జిల్లా కార్యదర్శి పొన్నాడ చిన్నారావు, మున్సిపల్ అధ్యక్షుడు పొడుగు శ్రీనివాసరావు, సరుబుజ్జలి అధ్యక్షుడు బెవర మల్లేశ్వరరావు, బూర్జ అధ్యక్షుడు ఖండాపు గోవిందరావు, పొందూరు అధ్యక్షుడు కొంచాడ రమణమూర్తి, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు గురుగుబెల్లి శ్రీనివాసరావు, మాజీ కౌన్సిలర్ దుంపల శ్యామలరావు, పార్టీ నాయకులు బొడ్డేపల్లి రాజు, కూన రామకృష్ణ, మామిడి రమేష్, నున్నగాపుల చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.
Comments