మంత్రి అచ్చెన్న ఆర్తి.. అన్న క్యాంటీన్ భవనాలు పూర్తి
- Guest Writer
- Oct 15
- 1 min read
ఆయన పట్టుదలతోనే నియోజకవర్గానికి రెండు మంజూరు
స్వల్పకాలంలోనే వాటికి సొంత భవనాలు
హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు

(సత్యంన్యూస్, టెక్కలి)
అధికారంలో ఉన్నా.. లేకపోయినా ప్రజా సంక్షేమానికే కట్టుబడి ఉండటంలో కింజరాపు కుటుంబానికి మించిది లేదు. రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆ విషయాన్ని మరోసారి నిరూపించారు. అధికారంలో లేనప్పుడు కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి పిలుపు మేరకు తన సొంత ఖర్చులతో అన్న క్యాంటీన్‌ను నిర్వహించి పేదల ఆకలి తీర్చిన ఆయన ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కంటే మిన్నగా ఏకంగా రెండు అన్న క్యాంటీన్లు మంజూరు చేయించుకుని, వాటికి సొంత భవనాలు కూడా సమకూర్చడం ద్వారా టెక్కలి నియోజకవర్గ ప్రజల పట్ల తన నిబద్ధతతను చాటుకున్నారు. వైకాపాకు ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో పేదల కు రూ.5కే అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించేలా అన్న క్యాంటీన్లు ప్రారంభించింది. అయితే 2019 ఎన్నికల అనంతరం అధికారం చేపట్టిన వైకాపా సర్కారు తెలుగుదేశంపై కక్షతో పేదల నోటి కాడి కూడును లాగేసింది. అన్న క్యాంటీన్లను మూసేసింది. వైకాపా ప్రభుత్వం మూసేయించిన అన్న క్యాంటీన్లను పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు ఆ బాధ్యత తీసుకోవాలన్న ఆయన సూచన మేరకు టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళిలో అచ్చెన్నాయుడు ముందుకొచ్చారు. సొంత వనరులతో కొన్ని నెలలపాటు పేదల ఆకలి తీర్చారు. 2024 ఎన్నికల్లో గెలిచి మళ్లీ తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావడంతో అన్న క్యాంటీన్లకు మళ్లీ వెలుగొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతలో సుమారు 200 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించింది. పెద్ద నగరాలు, పట్టణాల్లో ఒకటికి మించి క్యాంటీన్ల పెడుతూ స్థూలంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున అన్నక్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అయితే మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్యమంత్రి వద్ద పట్టుబట్టి మరీ తన నియోజకవర్గానికి రెండు క్యాంటీన్లు మంజూరు చేయించుకున్నారు. వాటిని టెక్కలి, కోటబొమ్మాళిల్లో టెంపరరీ భవనాల్లో ఇన్నాళ్లూ నిర్వహిస్తూ వచ్చారు. ఈ తరుణంలో మళ్లీ అచ్చెన్నాయుడు చొరవ తీసుకుని అన్న క్యాంటీన్లకు సొంత భవనాల ఏర్పాటుకు కృషి చేసి విజయం సాధించారు. ఆయన పట్టుదల కారణంగా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగా.. నిర్మాణాలు చకచకా సాగి ఇప్పుడు భవనాలు ప్రారంభానికి సిద్ధమాయ్యయి. దీపావళి కానుకగా వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. అచ్చెన్న చిత్తశుద్ధిని, ప్రజల కోసం ఆయన చేస్తున్న కృషికి నియోజకవర్గ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
- రమణ, వ్యవసాయ మంత్రి పీఆర్వో










Comments