మోదీ పదవి నుంచి దిగిపోతారా?
- DV RAMANA

- Jul 12, 2025
- 2 min read

మరో రెండు నెలల్లో దేశ రాజకీయాల్లో పెనుమార్పులు జరగనున్నాయా? ప్రస్తుతం కేంద్ర ప్రభు త్వాన్ని నడుపుతున్న ఎన్డీయే ప్రధాన భాగస్వామి బీజేపీలో నాయకత్వ మార్పిడి జరగనుందా?? అన్నిం టికీ మించి హ్యాట్రిక్ విజయాలతో మూడోసారి ప్రధాని పీఠంపై కూర్చున్న నరేంద్ర మోదీ సెప్టెంబర్‌లో ఆ పీఠం నుంచి దిగిపోనున్నారా? అన్న చర్చ జాతీయస్థాయిలో జరుగుతోంది. సంఫ్‌ు పరివార్‌లో పెద్దన్న వంటి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలే కేంద్ర నాయకత్వంలో మార్పుపై విస్తృత చర్చకు ఆస్కారమిచ్చాయి. దీనిపై కాంగ్రెస్, బీజేపీలు సైతం స్పందించి తమ వైఖరిని వెల్లడిరచేలా వ్యాఖ్యలు చేయడం మరింత వేడి పుట్టిస్తోంది. మొత్తం మీద బీజేపీలోనూ, సంఫ్‌ు పరివార్‌లోనూ అధికార మార్పిడి దిశగా ఏదో జరుగుతోందన్న అనుమానా లు బలంగా వినిపిస్తున్నాయి. 75 ఏళ్లు వస్తే భుజంపై కండువా తీసి పక్కన పెట్టాలని, అంటే పదవుల నుంచి తప్పుకొని యువనేతలకు అవకాశం ఇవ్వడమేనని దివంగత సంఫ్‌ు నేత మోరోపంత్ పింగ్లే చేసిన వ్యాఖ్యలను మోహన్ భగవత్ తాజాగా ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. మరోవైపు 74 ఏళ్లు దాటిన నాయకులకు రాజకీయ రిటైర్మెంట్ ఇచ్చే సంప్రదాయం బీజేపీలో ఉంది. పార్టీ నిబంధనావళిలో ఆ అంశం లేకపోయినా.. అదొక అలిఖిత నిబంధనగా అమలవుతోంది. దాని ప్రకారమే గతంలో ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్ జోషి, వెంకయ్యనాయుడు అంటి అగ్రనేతలకు పార్టీ రిటైర్మెంట్ ఇచ్చి ఇళ్లకు పంపించేసింది. ఆ నిబంధన నరేంద్ర మోదీకి కూడా వర్తించాల్సిందేనన్నది మోహన్ భగవత్ సూచనగా భావిస్తున్నారు. ప్రధాని మోదీ మరో రెండు నెలల్లో 75 ఏళ్లు పూర్తి చేసుకుంటారు. సెప్టెంబర్ 17న ఆయన జన్మదినం. అందువల్ల పార్టీ సంప్రదాయం ప్రకారం ఆ నెలలో ఆయన స్వచ్ఛందంగా ప్రధాని పదవి నుంచి దిగిపోయి పార్టీ ఎంపిక చేసే తన వారసుడికి అప్పగిస్తారన్న చర్చ జరుగుతోంది. ఇటీవల శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు కూడా మోదీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు రేపుతున్నాయి. ప్రధాని మోదీ సెప్టెంబర్‌లో రిటైర్ కావాలనుకుంటున్నారని, అందుకే చాలాకాలం తర్వాత ఆయన సడెన్‌గా నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ వారసుడిని త్వరలోనే ఆర్‌ఎస్‌ఎస్ నిర్ణయిస్తుందని కూడా అన్నారు. ఈ వ్యాఖ్య లతో దేశవ్యాప్త చర్చ ఆరంభమైంది. తాజాగా మోహన్ భగవత్ వ్యాఖ్యలతో.. పదవిని వీడమని మోదీకి సంఫ్‌ు పరివార్ హింట్ ఇచ్చినట్లేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్ నిబంధనల ప్రకారం బీజేపీ నేతల్లో 75 ఏళ్లు దాటినవారు ఎవరూ కీలక పదవుల్లో ఉండకూడదు. అదే నిబంధన బీజేపీలో మోదీతో పాటు అదే సమయంలో 75 ఏళ్లు దాటనున్న మోహన్ భగవత్‌కు కూడా వర్తిస్తుందంటు న్నారు. ఈ కారణంతోనే బీజేపీలో అత్యంత సీనియర్ నేత అయిన ఎల్‌కే అద్వానీకి 2014లో ప్రధాన మంత్రి పదవి చేపట్టే అవకాశం దక్కకుండా పోయింది. వయసు పరిమితుల కారణంగా సంఫ్‌ు పరి వార్ అద్వానీని కాదని అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని ఎన్డీయే నుంచి ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దించింది. కాంగ్రెస్ ఈ పరిణామాలపై స్పందించింది. భగవత్ వ్యాఖ్యలు మోదీ నుంచి ఉద్దేశించి చేసినవేనని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ అన్నారు. మోదీతో పాటు భగవత్ కూడా దిగిపోవాల్సి ఉంటుందని.. ఇది ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న నానుడిని గుర్తు చేస్తోందని వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ నేతలు ఈ చర్చను, వాదనలను ఖండిస్తున్నారు. 75 ఏళ్లు నిండిన వారు పదవులు వీడాలని, లేదా పదవులు చేపట్టరాదన్న నిబంధన ఏదీ తమ పార్టీలో లేదని దేవేంద్ర ఫడ్నవిస్ వంటి పలువురు నేతలు చెబుతున్నారు. అందువల్ల నరేంద్ర మోదీ పదవి నుంచి దిగిపోవా ల్సిన అవసరం లేదంటున్నారు. ఆ అలోచన కూడా పార్టీకి లేదన్నారు. గత మూడు సార్వత్రిక ఎన్నికల్లో మోదీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రతిపక్షాలను చిత్తుగా ఓడిరచడంతో మోదీ వెళ్లిపోతేనే తమకు మనుగడ ఉంటుందన్న భావనతో ప్రతిపక్షాలు ఇలాంటి ఊసుపోని వ్యాఖ్యలు చేస్తున్నాయని విమర్శి స్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ నెంబర్ టూగా ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కూడా రిటైర్మెంట్‌పై ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ జీవితం నుంచి రిటైర్ అయిన తర్వాత ప్రకృతి వ్యవసాయం చేస్తానని.. వేదాలు, ఉపనిషత్తుల పఠనంలో నిమగ్నం అవుతానని చెప్పడం గమనిస్తే మొత్తానికి బీజేపీలో ఏదో జరుగుతున్నట్లు కనిపిస్తోంది.










Comments