ముందు వీళ్లను ఊడ్చేయాలి!
- BAGADI NARAYANARAO

- Sep 25, 2025
- 1 min read

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
పై ఫొటోలు చెబుతున్న వాస్తవం ఒక్కటే. ఈ శాఖ పరిధిలో లంచాలు తీసుకోవడం మీద ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యం మీద కాదు సరికదా.. కనీసం వారి సొంత ఆరోగ్యాల మీద కూడా పెట్టని వీరందర్నీ చెత్తకంటే ముందు ఊడ్చిపడేయాలని. జిల్లాలో మలేరియా రాకుండా మందులిస్తామని చెబుతున్న మాయగాళ్లున్న చోటిది. దోమలకు పుట్టినిల్లులా కనిపిస్తున్న ఈ ప్రాంతం అక్షరాలా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం. అంటే.. ఇక్కడ ఆమె మాత్రమే ఉంటారనుకోవద్దు. ఆరోగ్యానికి సంబంధించిన అనేక విభాగాల పెద్ద తలకాయలకు ఇదే ప్రధాన కార్యాలయం. చివరకు సీతంపేటలో ఉండాల్సిన విభాగం కూడా తమ సౌలభ్యం కోసం ఇక్కడే పెట్టుకున్న అధికారులు తామే ఒక స్క్రాప్ అయినప్పుడు, తమ చుట్టూ చెత్త ఉండటం పెద్ద వింత కాదనుకున్నారో ఏమో?! తమ కార్యాలయ ఆవరణ మొత్తం చెత్త, చెదారం, వ్యర్థాలతో నింపేశారు. చివరకు సింగుపురం వద్ద ఉన్న డంపింగ్‌యార్డు వద్దకు వెళ్లినా ఇంత చెండాలంగా ఉండదేమో! ఏ ఫైలొచ్చింది, ఎంత ముట్టింది? అనే లెక్కలు తప్ప తామంతా ఒక అపరిశుభ్ర వాతావరణం మధ్య ఉన్నామన్న సోయే లేకుండాపోయింది. దరిద్రమేమిటంటే.. ఇందులో అధిక శాతం మంది వైద్యులు. హైజీనిటీ కోసం చదువుకొని వచ్చిన పట్టభద్రులు. వీరికే పట్టడంలేదంటే ఇంకేమనుకోవాలి? ఇంతకు మించి ఏం చెప్పినా కంఠ శోష, లేదా చేతులు నొప్పే.స్వచ్ఛ ఆంధ్ర అంటూ నెలకోసారి తాము పనిచేసే చోట శుభ్రం చేసుకోవాలని ప్రభుత్వం ఓ పిలుపునిస్తే, వీరంతా వేరేచోటకు వెళ్లి ఫొటోలకు ఫోజిస్తున్నారు తప్ప, తామే ఒక చెత్తకుప్ప మీద కూర్చున్నామన్న విషయం మర్చిపోతున్నారు.










Comments