మీరా జాస్మిన్ సెకెండ్ ఇన్నింగ్స్!
- Guest Writer
- 15 hours ago
- 3 min read

కేరళ కుట్టి మీరాజాస్మిన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అసవరం లేని పేరు. తెలుగులో నటించింది కొన్ని సినిమాలే? వాటితోనే తనదైన ముద్ర వేసింది. అమ్మడు అందం, అభినయంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. అమ్మాయి బాగుంది, గుడుంబా శంకర్, భద్ర, రారాజు, మహారధి, గోరింటాకు లాంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించింది. తెలుగు సినిమాలతో పాటు పేర్లలల్ గా కన్నడ, తమిళ, మలయాళ భాషలో కూడా సినిమాలు చేసింది. అమ్మడు ఎక్కువగా మాతృ భాషకు ప్రాధన్యత ఇచ్చి పనిచేసింది. తెలుగులో చివరిగా స్వాగ్ అనే చిత్రంలో నటించింది.
వాస్తవానికి 2013 తర్వాత కేవలం రెండు తెలుగు సినిమాల్లోనే నటించింది. అవి ఆశించిన ఫలితాలు సాధించలేదు. అటుపై 2014లో ధాంపత్య జీవితంలో కి అడుగు పెట్టింది. దీంతో తెలుగు సినిమాలకు పర్తిగా దూరమైంది. అప్పటి నుంచి ఇతర భాషల్లోనే బిజీగా కొనసాగింది. ప్రస్తుతం మాలీవుడ్, శాండిల్ వుడ్ లో ఎక్కువ సినిమాలు చేస్తోంది. అయితే తాజాగా మీరాజాస్మిన్ మళ్లీ టాలీవుడ్ లో కంబ్యాక్ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది. వేర్వేరు భాషల్లో సెకెండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తోన్న నేపథ్యంలో తెలుగులో మళ్లీ ఎందుకు పని చేయకూడదు అన్న ఆలోచన నుంచి అమ్మడు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
గతంలో ఉన్న పాత పరిచయాలతో టాలీవుడ్ మేనేజర్లకు టచ్ లో కి వెళ్తోందని తెలిసింది. మీరాజాస్మిన్ వయసు 44 ఏళ్లు. కీలక పాత్రలటకు..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి అవకాశాలు వస్తాయి. అంతకంటే ముందే సీనియర్ హీరోలకు పర్పెక్ట్ ఛాయిస్ గానూ చెప్పొచ్చు. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్లకు మ్యాచ్ అవుతుంది. ఆ నలుగురు హీరోలకు హీరోయిన్ల సమస్య ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మేకర్స్ సీనియర్లకు జోడీగా ఎంపిక చేయోచ్చు. వీరితో మీరాజాస్మిన్ నటించింది లేదు. తర్వాత తరం స్టార్లతోనే సినిమాలు చేసింది. ఈనేపథ్యంలో సీనియర్ల సరసన ప్రెష్ అప్పిరియన్స్ ఇస్తోంది.
ప్రస్తుతం మాలీవుడ్, కన్నడలో కూడా సీనియర్ హీరోల చిత్రాల్లోనే నటిస్తోంది. మోహన్ లాల్ హీరోగా నటిస్తోన్న 366 చిత్రంలో ఈ భామే హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఆమె నైసీ అనే పాత్రలో మోహన్ లాల్ కు భార్య గా నటిస్తోంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటించడం మరో ఇంట్రెస్టింగ్ విషయం. లాల్ నటించిన గత సినిమాల్లోనూ మీరాజాస్మిన్ నటించింది. అయితే అవి పూర్తి స్థాయి పాత్రలు కాదు. మీరాజాస్మిన్ నటిగా ఎదిగే క్రమంలో వచ్చిన అవకాశాలు అవన్నీ. తాజా అవకాశం పట్ల అమ్మడు ఎంతో సంతోషంగా ఉంది.
- తుపాకి.కామ్ సౌజన్యంతో...
రామ్ చరణ్-సుకుమార్... రెండో కథ

రామ్ చరణ్-సుకుమార్ కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ ఎంత పెద్ద విజయాన్ని అందుకొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమర్షియల్ హిట్ అనేది పక్కన పెడితే-రామ్‌చరణ్‌లోని నటుడ్ని పూర్తి స్థాయిలో ఆవిష్కరించిన సినిమా ఇది. ‘రంగస్థలం’ కంటే ‘ఆర్.ఆర్.ఆర’ పెద్ద హిట్ అయినా.. ఇప్పటికీ ‘రంగస్థలం’ అంటేనే చరణ్ ఫ్యాన్స్‌కి ఇష్టం. అందుకే చరణ్-సుకుమార్ కాంబో మళ్లీ రిపీట్ అయితే చూడాలన్నది అభిమానుల ఆశ.
ఇప్పుడు ఈ కాంబో రిపీట్ అవుతోంది. పెద్ది అవ్వగానే.. చరణ్` సుక్కుల సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. అయితే ఇప్పటి వరకూ సుకుమర్ చరణ్‌కు కథేం చెప్పలేదన్న గుసగుసలు కాస్త గట్టిగా వినిపిస్తున్నాయి. సుకుమార్ కథ ఎప్పుడు చెబుతాడు? సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది? అనే బెంగ ఫ్యాన్స్ లో ఉంది. నిజానికి సుకుమార్ చరణ్‌కు కథ చెప్పేశాడు. ఆ కథ చరణ్‌కీ నచ్చింది. కాకపోతే ఇక్కడే ట్విస్టు. చరణ్‌కి చెప్పిన కథ పక్కన పెట్టి, సుకుమార్ మరో కథని సైతం రెడీ చేస్తున్నాడట. మొదట చెప్పిన కథ కంటే, ఈ కథ ఇంకా బాగా కుదిరిందని టాక్. కాకపోతే.. చరణ్‌కి ఈ రెండో కథ వినిపించలేదు. ‘పెద్ది’ పనులన్నీ అయిపోయిన తరవాత రెండో కథేమిటన్నది చరణ్‌కి తెలుస్తుంది. ఈలోగా పూర్తి స్థాయిలో ఆ కథని రెడీ చేసే పనిలో ఉన్నాడు సుకుమార్.
‘రంగస్థలం’ సినిమా సమయంలోనూ అంతే. మొదట రామ్ చరణ్‌కి వేరే కథ వినిపించాడు సుకుమార్. ఆ తరవాత జరిగిన ప్రోసెస్ లో ‘రంగస్థలం’ కథ పుట్టింది. అది చరణ్‌కి బాగా నచ్చింది. ఈసారీ.. అదే జరగబోతోంది. కాకపోతే ఈ రెండు కథల్లో ఏది చేయాలి అనేది పూర్తిగా చరణ్ ఇష్టం.
టైటిల్ కే రెండు కోట్లు

‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ఈమధ్యే సెట్స్ పైకి వెళ్లింది. టీమ్ అంతా సేమ్ టూ సేమ్. ఒకట్రెండు చిన్న చిన్న మార్పులు తప్ప. అయితే.. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ చేయాల్సింది. కానీ.. నిర్మాత సృజన్ చేతికి వెళ్లింది. వాస్తవానికి ఓ సినిమా హిట్టయినప్పుడు సీక్వెల్ కి సంబంధించిన హక్కుల్నీ నిర్మాణ సంస్థ చేతుల్లోనే ఉంటాయి. కానీ.. ఈ సీక్వెల్ మాత్రం కొత్త బ్యానర్‌కి వెళ్లింది. అందుకు గానూ.. సీక్వెల్ రాయల్టీ కింద దాదాపు రూ.2 కోట్లు ఇవ్వాల్సివచ్చిందని ఇన్ సైడ్ వర్గాల టాక్. టైటిల్ కే ఇంత ఖర్చు పెట్టిన సినిమా ఈమధ్య కాలంలో ఇదేనేమో.
నిజానికి ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాని సురేష్ బాబు, సృజన్ సంయుక్తంగా నిర్మించాల్సింది. కానీ బడ్జెట్ లెక్కల దగ్గర అసలైన పేచీ వచ్చింది. ఈ సినిమా కోసం సృజన్ వేసిన బడ్జెట్ రూ.35 కోట్లు. అంతలో ఈ సినిమా తీస్తే వర్కవుట్ అవ్వదన్నది సురేష్ బాబు భయం. విశ్వక్‌సేన్ కే రూ.5 కోట్ల పారితోషికం ఇవ్వాల్సివచ్చింది. తరుణ్ భాస్కర్‌కి సైతం మంచి రెమ్యునరేషనే ఇవ్వాలి. ఓ దశలో వీరిద్దరినీ పక్కన పెట్టి పూర్తిగా కొత్తవాళ్లతో సీక్వెల్ చేయాలన్న ఆలోచన కూడా వచ్చింది. కానీ అది సాధ్యం కాదని అర్థమైంది. అందుకే ఈ సినిమా నిర్మాణంలో ఆయన వెనుకడుగు వేశారు. సురేష్ బాబు దగ్గర్నుంచి సీక్వెల్ రైట్స్ తీసుకోవడానికి నిర్మాత సృజన్ రూ.2 కోట్లు వెచ్చించారు. అసలు ‘ఈ నగరానికి ఏమైంది 2’ అని కాకుండా వేరే టైటిల్ పెట్టుకొని ఈ సినిమా చేసుంటే.. ఆ రెండు కోట్లు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే.. ‘ఈ.న.ఏ’ సినిమాకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ టైటిల్ వాడుకొంటే ఓటీటీ రైట్స్ రూపంలోనూ మంచి డబ్బులు వస్తాయి. అందుకే.. సీక్వెల్ రూపేణ డబ్బులు ఇవ్వాల్సివచ్చింది.
- తెలుగు 360.కామ్ సౌజన్యంతో...










Comments