మాలా మారకండి బాబూ..!
- BAGADI NARAYANARAO

- Nov 6, 2025
- 1 min read

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శ్రీకాకుళం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆదేశాలతో ఒకటో పట్టణ పోలీసులు ఐదుగురు వ్యక్తులతో నగరంలోని మిల్లు జంక్షన్ (అరస వల్లి కూడలి) వద్ద గురువారం డీఎస్పీ వివేకానంద పర్యవేక్షణలో ఒకటి, రెండో పట్టణ సర్కిల్ సీఐలు పైడపునాయుడు, ఈశ్వరరావు, ట్రాఫిక్ సీఐ నాగరాజు, వన్‌టౌన్ ఏఐ హరికృష్ణ ఆధ్వర్యంలో రెండు గంటల పాటు ప్లకార్డులను ప్రదర్శించారు. ‘జూదం, బహిరంగ మద్యపానం నిషేధం’, ‘చట్టాన్ని గౌరవించండి, కుటుంబాన్ని రక్షించండి’ అంటూ ప్లకార్డులు పట్టించి ప్రజలకు అవగాహనను పేకాడుతూ పట్టుబడినవారితో కల్పించారు. చట్టాలను గౌరవించి జూదం, మద్య పానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని సందేశం ఇప్పిం చారు. పోలీసు శాఖ ద్వారా ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని డీఎస్పీ వివేకానంద తెలిపారు.










Comments