top of page

మాంసాహార రాష్ట్రాలు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 7 days ago
  • 2 min read
ree

భిన్నత్వం భారత్‌ ప్రత్యేకత. భాషాసంస్కృతుల్లోనే ఇది కనిపిస్తుందనుకుంటే పొరపాటు. ప్రాంతా లు, రాష్ట్రాలను బట్టి భాష, సంప్రదాయాలు మారుతున్నట్లే ఆహార వ్యవహారాలు కూడా చాలా భిన్నంగా.. అంతకుమించి వైవిధ్యంగా ఉంటాయన్నది కొత్తగా చెప్పాల్సిన అవసరంలేదు. శాకాహార మైనా.. మాంసాహారమైనా.. రాష్ట్రంమారితే వెరైటీలు మారిపోతుంటాయి. మనదేశంలో లభించినన్ని భిన్న రుచులు, వెరైటీ శాకాహార, మాంసాహార వంటకాలు ప్రపంచంలో ఇంకెక్కడి లభించవని అనడం అతిశయోక్తి కాకపోవచ్చు. దేశంలో సాధారణంగా శాకాహారులకంటే మాంసాహారుల సంఖ్య గతంలో తక్కువగా ఉండేది. తర్వాత కాలంలో పరిస్థితి మారిపోయింది. మాంసాహారులు బాగా పెరిగిపోయారు. కానీ ఇటీవలి కాలంలో దైవచింతన, ఆరోగ్య సూత్రాల పాటింపుపై యువత ఎక్కువ శ్రద్ధ చూపుతుండటం, వారిని సాత్వికాహారం అంటే శాకాహారం వైపు మొగ్గు చూపేలా చేస్తోందన్న వాదనలు ఉన్నాయి. ఫలితంగా మాంసాహార ప్రియులు తగ్గుముఖం పడుతున్నారని ఒక అభిప్రా యం ఉంది. అయితే అది వాస్తవం కాదని ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం స్పష్టం చేసింది. మాంసాహారం పట్ల మోజు ఏమాత్రం తగ్గలేదని ఆ సర్వే వెల్లడిరచింది. ముఖ్యంగా 15`49 ఏళ్ల వయస్కుల్లో అత్యధికులు మాంసాహారంపైనే మక్కువ చూపిస్తున్నారట. ఫలితంగా దేశంలో మాంసాహారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే కేవలం ఒకటి రెండు శాతం జనాభాను మినహాయిస్తే.. మొత్తం ప్రజలందరూ మాంసాహారులేనని ఈ అధ్యయనంలో తేలింది. అటువంటి పది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉండటమే కాకుండా.. నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం. మాంసాహార రాష్ట్రాల జాబితాలో ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌ అగ్ర స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో ఏకంగా 99.8 శాతం ప్రజలు మాంసాహారులేనని నివేదికలో పేర్కొ న్నారు. పంది, కోడి, చేపలు, గొడ్డు మాంసాన్ని ఎక్కువగా వినియోగిస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో జింక, అడవి పంది, కుక్క మాంసం కూడా తింటారు. ఇక రెండో స్థానంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో 99.3 శాతం మంది మాంసాహారాన్నే ఇష్టపడతారు. అందులోనూ చేపలంటే పడిచచ్చి పోతారు. ఆ రాష్ట్రంలో ప్రజాదరణ పొందిన వంటకాల్లో కోషా మాంసో, మటన్‌ కర్రీ, హిల్సా చేపల కూరలు ఉన్నాయి. అలాగే మాచెర్‌ జోల్‌ అనే కారంగా ఉండే చేపల కూర, చింగ్రి మలై కర్రీ (కొబ్బరి పాలతో రొయ్యల కూర) బెంగాలీ వంటకాల్లో ముఖ్యమైనవి. 99.1 శాతం మాంసాహారు లతో కేరళ మూడోస్థానంలో ఉంది. కొబ్బరి పాలు, మిరపకాయలు, సుగంధ ద్రవ్యాలతో చేసిన చేపలు, చికెన్‌, రొయ్యల వంటకాలకు ఈ రాష్ట్రం ప్రసిద్ధి. అంతేకాకుండా నాదన్‌ కోజి వరుత్తతు (స్పైసీ చికెన్‌ ఫ్రై) అనే కర్రీతో పాటు రొయ్యల కూరని ఇక్కడి ప్రజలు లొట్టలేసుకొని తింటారు. ఆంధ్రప్రదేశ్‌లో 98.25 శాతం మంది మాంసాహారం తింటారు. ఆంధ్రా స్టైల్‌ చికెన్‌, మటన్‌ కర్రీ, అలాగే గోంగూర మటన్‌ ఈ రాష్ట్రంలో ఫేమస్‌ డిష్‌లు. చేపల పులుసు, రొయ్యల ఇగురు వంటి సముద్ర ఆహార వంటకాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రాచుర్యం పొందింది. ఐదో స్థానంలో ఉన్న తమిళ నాడులో 97.65శాతం మంది మాంసాహారులే. చికెన్‌ చెట్టినాడ్‌ ఇక్కడ బాగా ప్రాచుర్యం పొందింది. దీన్ని కారంగా, సుగంధ ద్రవ్యాలతో తయారుచేస్తారు. మటన్‌ బిర్యానీని కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనితో పాటు ఇతర చికెన్‌, చేపల వంటకాలను కూడా ఎక్కువగా తింటారు. 96 శాతం మాంసాహారులతో ఒడిశా రాష్ట్ర ఆరోస్థానంలో నిలుస్తోంది. చేపలు, మటన్‌ వంటకాలకు ఈ రాష్ట్రం ప్రసిద్ధి చెందింది. ఏడో స్థానంలో ఉన్న త్రిపురలో 95 శాతం ప్రజలు మాంసాహారాన్ని ఇష్టపడ తారు. చికెన్‌, చేపల వంటకాలకు ఈ రాష్ట్రం ప్రసిద్ధి. బీచ్‌ల రాష్ట్రమైన గోవా మాంసాహారుల విషయంలో 93.8 శాతంతో ఎనిమిదో స్థానంలో ఉంది. గోవా ఫిష్‌ కర్రీ, చికెన్‌ కేఫ్రియల్‌, పోర్క్‌ సోర్పోటెల్‌, ఫీజోవాడా వంటి వంటకాలను ఇక్కడి ప్రజలు బాగా ఇష్టపడతారు. సముద్ర ఆహార ప్రియులకు గోవా స్వర్గధామం అని చెప్పవచ్చు. మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ 97.3 శాతం ప్రజలు మాంసాహారులే. కోడి, మేక, గొర్రె, చేపలు, గుడ్లు, రొయ్యలతో చేసిన వంటకాలను ఇక్కడివారు ఇష్టపడతారు. స్పైసీ డిష్‌లకు ఈ రాష్ట్రం ప్రసిద్ధి. గిరిజనులు ఎక్కువగా నివసించే జార్ఖండ్‌లో 97 శాతం ప్రజలు మాంసాహారాన్ని ఇష్టపడతారు. ఈ రాష్ట్రంలో చికెన్‌, మటన్‌, చేప లతో చేసిన సంప్రదాయ వంటకాలు బాగా ప్రాచుర్యం పొందాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page