top of page

‘మద్య’మహాభారతంలో దక్షిణాదే టాప్‌

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Nov 25
  • 2 min read

ree

కుర్ర వయసులో కోరికలే గుర్రాలవుతాయని అంటారు. దానికి తగినట్లే యుక్తవయస్కులు జీవితాన్ని కులాసాగా గడపాలని తపిస్తుంటారు. జల్సా చేస్తుంటారు. ఆ క్రమంలోనే డ్రిరక్‌ చేస్తుంటారు. మొదట్లో దానికి సోషల్‌ డ్రిరకర్‌నని, సరదా కోసం, కంపెనీ కోసమేనని చెప్పినా తర్వాత దానికి అలవాటు పడి వ్యసనంగా మార్చుకోవడం తెలిసిందే. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదట! జనరేషన్‌ జెడ్‌ అంటే జెన్‌-జెడ్‌గా వ్యవహృతమవుతున్న నేటి ప్రాథమ్యాల్లో మద్యానికి చోటు ఉండటం లేదట!! మద్యం సేవించే చట్టబద్ధ వయసున్న ప్రతి ముగ్గురు యువకుల్లో ఒకరు ఇప్పటివరకు ఆల్కహాల్‌ ముట్టుకోలేదని తేలింది. అయితే భారత్‌లో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. యూరోమానిటర్‌ అనే సంస్థ నిర్వహించిన ‘వరల్డ్‌ మార్కెట్‌ ఫర్‌ ఆల్కహాలిక్‌ డ్రిరక్స్‌`2025’ సర్వే ఫలితాల్లో ఈ ఆసక్తికర విశేషలు వెల్లడయ్యాయి. యువత మద్యానికి దూరంగా ఉంటూ కొత్త ట్రెండ్‌ సృష్టిస్తున్నట్లు తేలడమే ఈ సర్వే ప్రధాన విశేషం. 2020లో వారంలో కనీసం ఒకసారైనా మద్యం తాగే యువత 23 శాతం ఉండగా 2025 నాటికి అది 17 శాతానికి పడిపోయింది. ఈ మార్పునకు కారణాలను కూడా నివేదికలో పేర్కొన్నారు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారిన పడకూడదనే ఉద్దేశంతో యువత ఆల్కహాల్‌కు దూరంగా ఉంటోంది. మద్యపానానికి చేసే వ్యయాన్ని అనవసర ఖర్చుగా ఈతరం భావిస్తున్నట్లు వెల్లడైంది. మద్యపానం వల్ల నిద్రలేమి సమస్య ఎదురవుతుందన్న ఉద్దేశంతో 25 శాతం యువత దీనికి దూరంగా ఉంటున్నారు. మద్యం అలవాటు ఉన్న వారిలో 53 శాతం మంది ఆ అలవాటును తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. 2020లో ఇది 44 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. యువతలో ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పొందుతున్న ‘జీబ్రా స్ట్రైపింగ్‌’ విధానం కూడా మద్య పాన నియంత్రణకు తోడ్పడుతోంది. స్నేహితులతో కలిసినప్పుడు ఒకసారి ఆల్కహాలిక్‌ డ్రిరక్‌, మరోసారి నాన్‌ ఆల్కహాలిక్‌ డ్రిరక్‌ తీసుకోవడామే జీబ్రా స్ట్రైపింగ్‌ అంటారు. దీనివల్ల మద్యపానాన్ని సగానికి సగం తగ్గించుకోగలుగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నాన్‌-ఆల్కహాలిక్‌ డ్రిరక్స్‌ మార్కెట్‌ వేగంగా వృద్ధి చెందుతుండటం కూడా మద్యం వ్యసనం తగ్గుతోందని చెప్పడానికి నిదర్శనం. అయితే భారత్‌లో పూర్తి భిన్నమైన పరిస్థితి ఉంది. ప్రపంచ ధోరణికి భిన్నంగా మనదేశంలో మద్యపానం విపరీతంగా పెరుగుతోంది. 2024-2029 మధ్య ఆల్కహాలిక్‌ డ్రిరక్స్‌ వినియోగం 357 మిలియన్‌ లీటర్లు పెరుగుతుందని అంచనా. బ్రెజిల్‌, మెక్సికో, దక్షిణాఫ్రికా దేశాలతో పోల్చితే మనది ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి రేటు. ఐఎంఎఫ్‌ఎల్‌ (ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌) అంటే విస్కీ, రమ్‌, వోడ్కా, జిన్‌, బ్రాందీ ఉత్పత్తుల్లో దక్షిణాది రాష్ట్రాలు టాప్‌లో ఉన్నాయి. అత్యధికంగా కర్ణాటకలో ఐఎంఎఫ్‌ఎల్‌ విక్రయాలు జరుగుతున్నాయి. రెండో స్థానంలో తమిళనాడు ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 40.17 కోట్ల ఐఎంఎఫ్‌ఎల్‌ కేసులు అమ్ముడయ్యాయి. ఒక్క కర్ణాటకలోనే 6.88 కోట్ల కేసులు(17 శాతం) అమ్ముడయ్యాయి. తమిళనాడు 6.47 కోట్ల కేసులు, తెలంగాణలో 3.1 కోట్ల కేసులు, ఏపీలో 3.05 కోట్ల కేసుల ఐఎంఎఫ్‌ఎల్‌ మద్యం అమ్ముడైనట్లు సీఐఏబీసీ వెల్లడిరచింది. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా మద్యం వ్యాపారాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని పరోక్షంగా మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఆ కారణంగా జాతీయస్థాయిలో మద్యం పరిశ్రమపై దక్షిణ భారతం ఆధిపత్యం చెలాయిస్తోంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న అమ్మకాల్లో సగానికిపైగా వాటాను కలిగి ఉంది. అధిక ఆదాయం, పట్టణ జీవనశైలి వంటి అంశాలు దక్షిణాదిలో అధిక మద్య వినియోగానికి కారణాలుగా సర్వే విశ్లేషించింది. ఈ పరిణామాలు ప్రజారోగ్య అవగాహనతో ఆర్థిక లాభాలను సమతుల్యం చేయడాన్ని పెద్ద సవాలుగా మార్చేశాయి. దక్షిణాదిలో భాగంగా ఉన్న తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణలో శుభకార్యమైన, అశుభకార్యమైనా.. విజయమైనా, అపజయమైనా.. మందు, ముక్క కచ్చితంగా ఉండాల్సిందే. ఇటీవల మద్యం షాపులు నడిపేందుకు అవసరమైన లైసెన్సుల కోసం చేసుకున్న దరఖాస్తులతోనే తెలంగాణ ప్రభుత్వానికి రూ.మూడు వేల కోట్ల వరకు ఆదాయం వచ్చింది. దీన్నిబట్టే ఆ రాష్ట్రంలో మద్యం వ్యాపారం ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అయినా తెలంగాణ మద్యం వినియోగంలో మూడో స్థానంలో ఉందంటే.. ఇక మొదటిరెండు స్థానాల్లో ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ప్రజలు ఏ స్థాయిలో తాగేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆల్కహాలిక్‌ బేవరేజ్‌ కంపెనీస్‌ (సీఐఏబీసీ) వెల్లడిరచిన వివరాలు ప్రకారం.. దక్షిణాది కంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఐఎంఎఫ్‌ఎల్‌ మద్యం విక్రయాలు చాలా తక్కువ. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో గత ఆర్థిక సంవత్సరంలో కేవలం 2.50 కోట్ల కేసుల మద్యం విక్రయాలు మాత్రమే జరిగాయని రికార్డులు చెబుతున్నాయి. మద్యం వినియోగంలో యూపీ దేశంలో ఆరో స్థానంలో నిలవగా రాజస్థాన్‌, డిల్లీ, హరియాణా రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో 58 శాతం మద్యం విక్రయాలు జరిగితే ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలు కలిపి కేవలం 42 శాతం విక్రయాలు జరిగాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధికంగా మహిళలు మద్యం సేవిస్తున్నట్లు సర్వే వెల్లడిరచింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో అత్యధికంగా 24.2 శాతం మహిళలు మద్యం సేవిస్తున్నారు. తర్వాత సిక్కింలో 16, అసోంలో 7 శాతం మహిళలు మద్యం సేవిస్తున్నారట. తెలంగాణలో 6.7 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తారని తేలింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page