మధ్యాహ్నం రోడ్డేస్తే.. తెల్లారికి తవ్వేశారు!
- NVS PRASAD
- May 16
- 1 min read
వైకాపా నాయకులపై ఫీల్డ్ అసిస్టెంట్, సెక్రటరీ ఫిర్యాదు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

శ్రీకాకుళం రూరల్ మండలం బైరి బస్‌షెల్టర్ నుంచి లక్ష్మణరావు అనే రైతు పొలం వరకు సుమారు 700 మీటర్ల పొడవు, 6 అడుగుల వెడల్పుతో వేస్తున్న ఎన్‌ఆర్‌ఈజీఎస్ రోడ్డును తవ్వుకుపోయారు. పొలంలో రైతుల పంటను తరలించడానికి, ఎరువులు దించడానికి అనుకూలంగా ఉంటుందని ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా రూ.13 లక్షలు ఖర్చుపెట్టి 700 మీటర్ల రోడ్డును నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా భూమిని చదును చేసి నల్ల మట్టితో రోడ్డును కొంతమేర గురువారం ఉదయం నుంచి నిర్మించారు. కట్ చేస్తే.. శుక్రవారం ఉదయం కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు వద్దకు పనులకు వెళ్లేసరికి రోడ్డు మీద ముందుగా వేసిన గ్రావెల్ తప్ప మట్టి కనిపించకపోవడంతో అంతా అవాక్కయ్యారు. రాత్రి 11 గంటల తర్వాత అదే గ్రామానికి చెందిన బైరి గోవిందరావు, బైరి వెంకటేష్‌లు మొత్తం మట్టిని చిన్నసైజు జేసీబీతో తవ్వేసి తమ చెరువులో కలిపేసుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈమేరకు పంచాయతీ సెక్రటరీ, ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

تعليقات