యుద్ధం ఆగినట్లేనా?
- DV RAMANA

- Jun 24, 2025
- 2 min read

ప్రపంచ పెద్దన్నగా చెప్పుకొంటున్న డోనాల్డ్ ట్రంప్ మరోసారి తన ఆధిపత్య ధోరణి ప్రదర్శిం చారు. ఇరాన్`ఇజ్రాయెల్ మధ్య గత పన్నెండు రోజులుగా భీకరంగా సాగుతున్న యుద్ధం ముగిసి నట్లు ఆ దేశాల ప్రమేయం లేకుండా.. తనకు తానుగానే ప్రకటించేసి ప్రపంచాన్నే విస్మయపరిచారు. ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫాం అయిన ‘ట్రూత్’లో మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఒక పోస్ట్ పెట్టారు. ఇంతకుముందు భారత్`పాక్ విషయంలోనూ ట్రంప్ ఇదే వైఖరి అవలంభించిన విషయం గమ నార్హం. పహల్గాం ఉగ్ర ఊచకోత నేపథ్యంలో పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడటం.. అది మింగుడుపడని పాకిస్థాన్ భారత్‌లోని సరిహద్దు ప్రాంతా లపై దాడులకు యత్నించగా.. భారత్ ప్రతిదాడులు చేయడంతో పాక్‌కు చెందిన తొమ్మిది వాయుసేన స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధంలో పాల్గొంటున్న భారత్, పాక్‌ల కంటే ముందే యుద్ధం ఆగిపోయిందని, రెండు దేశాలతో తానే మాట్లాడి కాల్పుల విరమణకు ఒప్పించనని ప్రకటించుకున్నారు. ఆ తర్వాతే రెండు దేశాలు డీజీసీఏల స్థాయిలో చర్చలు జరిపి కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. ఈ ఒప్పందం తన ఘనతేనని ఇన్నాళ్లూ ప్రచారం చేసుకున్న ట్రంప్ ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం విషయంలోనూ అదే పంథా అనుస రించారు. సోమవారం సాయంత్రం (భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున) రెండు దేశాల మధ్య సంపూర్ణ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అయితే ఈ విషయాన్ని ఇరాన్, ఇజ్రాయెల్ మొదట ధ్రువీకరించలేదు. అమెరికా మద్దతుదారు అయిన ఇజ్రాయెల్ సంగతి పక్కనపెడితే ఇరాన్ మొదట ట్రంప్ ప్రకటనను ఖండిరచింది. అటువంటి ఒప్పందమేదీ కుదరలేదని స్పష్టం చేసిన ఇరాన్ తర్వాత కొద్దిసేపటికే కాల్పుల విరుమణ ఒప్పందం కుదిరినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి నుంచి ఆరు గంటల తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పాటి స్తాయి. 12 గంటల పాటు ఇది అమల్లో ఉంటుంది. ఆ సమయంలో యుద్ధం ముగిసినట్టుగా పరిగ ణిస్తాం’ అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. కాల్పుల విరమణ వచ్చే 24 గంటల్లో విడతల వారీగా అమలులోకి వస్తుందన్నారు. ఇజ్రాయెల్ సైన్యం గానీ, ప్రధాని కార్యాలయం గానీ దీనిపై ఇంకా స్పందించలేదు. ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా తమ దేశంలోని మూడు భూగర్భ అణు కేంద్రా లపై బంకర్‌బస్టర్ బాంబులతో దాడులకు పాల్పడి ధ్వంసం చేయడంపై ఇరాన్ రగిలిపోయింది. దానికి ఇంతకు ఇంతా ప్రతీకారం తీర్చుకుంటామని, దానికి సిద్ధంగా ఉండాలని అమెరికాను తీవ్రంగా హెచ్చ రించింది. చెప్పినట్లుగానే పశ్చిమాసియాలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై గురిపెట్టింది. మొదట సిరియా, తర్వాత ఖతార్‌లోని అమెరికన్ స్థావరాలపై క్షిపణులతో దాడి చేసి నష్టపరిచింది. తమ దేశంలోని అల ఉదెయిద్ ఎయిర్ బేస్‌పై ఇరాన్ 19 క్షిపణులు ప్రయోగించిందని ఖతార్ జనరల్ షాయెక్ అల్ హజ్రీ వెల్లడిరచారు. అయితే ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల్లో ఒకటి మినహా మిగతావి లక్ష్యాన్ని ఛేదించలదేని ట్రంప్ ప్రకటించారు. ఏమైనా ఇరాన్ తనను కూడా టార్గెట్ చేయడంతో అణు కేంద్రాలను ధ్వంసం చేయడంతోనే ఆగిన అమెరికా ఇక నేరుగా యుద్ధంలోకి కూడా దిగుతుందని ఆందోళన వ్యక్తమైంది. మరోవైపు ప్రపంచ ఇంధన రవాణాలో 20 శాతం వాటా కలిగిన అతి కీలక మైన హర్మూజ్ జలసంధిని మూసివేయాలన్న నిర్ణయానికి ఇరాన్ పార్లమెంటు ఆమోదముద్ర వేయ డం, మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్‌లకు మద్దతుగా పలు దేశాలు ఒక్కొక్కటిగా రంగంలోకి దిగుతా యన్న సంకేతాలు వెలువడుతున్న తరుణంలో మూడో ప్రపంచయుద్ధం తప్పదన్న ఆందోళన, ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంటుందని, ధరలు ఆకాశాన్నంటుతాయని భయపడుతున్న తరుణం లో కాల్పుల విరుమణకు రెండు దేశాలు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం, దాన్ని ఆలస్యంగానైనా ఇరాన్ ధ్రువీకరించడంతో దాదాపు ప్రపంచమంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. ప్రపంచ యుద్ధానికి దారితీస్తున్న ఇరాన్`ఇజ్రాయెల్ ఘర్షణలు ఏదోవిధంగా ఆగితే చాలునన్న భావన అన్ని దేశాల్లోనూ నెలకొంది. అయితే ట్రంప్ పోస్టు ప్రకారం కాల్పుల విరమణకు పాటించాల్సిన మార్గదర్శకాలపై ఇరుదేశాల మధ్య చర్చలు జరగాల్సి ఉంది. ఆ చర్చల్లో ఆమోదయోగ్య మైన అంగీకారం కుదిరితేనే కాల్పుల విరమణ కొనసాగుతుంది. లేకుంటే దాడులు తప్పవన్నమాటే.










Comments