యువతను కబళిస్తున్న అతివాదం
- DV RAMANA

- Sep 8, 2025
- 2 min read

అంతర్యుద్ధాలు, ఉగ్రవాద ధోరణులు వ్యవస్థలను విచ్ఛిన్నం చేయడమే కాకుండా.. ఇతర విపత్కర పరిణామాలు సృష్టిస్తున్నాయి. చివరికి పురుషుల జనాభాను గణనీయంగా తగ్గించేస్తూ ఆ దేశాల్లో యువతులకు పెళ్లి అనే కలను కలగానే మిగిల్చేస్తున్నాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణగా సిరియాను చెప్పుకోవచ్చు. దశాబ్దానికిపైగా అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న ఈ చిన్న అరబ్ దేశంలో పురుషు లకు కొరత ఏర్పడిరది. ఫలితంగా 70 శాతానికిపైగా ఈ దేశానికి చెందిన యువతులు పెళ్లి చేసుకో వడానికి భాగస్వాములు లభించక అవివాహితులుగానే మిగిలిపోతున్నారు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే.. పురుషుల కోసం మహిళలు కొట్లాటలకు దిగుతున్నారు. ఒక పురుషుడిని నలుగురు యువతులు పెళ్లి చేసుకుంటున్న ఉదంతాలు కూడా చాలా ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్నాయంటే అతిశయోక్తి కాదు. మీడియా నివేదికలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. సిరియన్ మహిళ లు భాగస్వాములను వెతుక్కుంటూ వెళ్లి మరీ తమను పెళ్లి చేసుకోమని వేడుకుంటున్నారని ఈ నివేదికలు పేర్కొంటున్నాయి. ఇక ఆడపిల్లలున్న కుటుంబాలవారైతే తమ కూతుళ్లను పెళ్లి చేసుకుంటే అత్యంత ఖరీదైన బహుమతులు ఇస్తామని యువకులపై ఆశల వల విసురుతున్నారు. ఈ దుస్థితికి కారణం సిరియాలో ఏళ్లతరబడి సాగుతున్న అంతర్యుద్ధమే. ఇందులో పాల్గొని పెద్దసంఖ్యలో యువ కులు మరణిస్తే.. దాదాపు అదేస్థాయిలో యువజనం ఇక్కడ జీవించలేక దేశం విడిచి వెళ్లిపోయారు. మరెంతో మంది జైళ్లలో మగ్గుతున్నారు. దీనివల్ల మహిళల పరిస్థితి దయనీయంగా మారుతోంది. అంతర్యుద్ధంలో పాల్గొని మరణించినవారి భార్యలు వితంతులుగా మారుతుంటే.. యువకుల మర ణాలు, వలసలు, అరెస్టుల వల్ల యువతులు వివాహాలకు నోచుకోకుండా ఒంటరిగా మిగిలిపోతు న్నారు. ఫలితంగా దేశంలో అవివాహితలు, వితంతువుల సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగిపోయింది. 1990ల కాలంలో జన్మించిన యువత అంతా అంతర్యుద్ధంలో అంతమైపోయిందని చాలా మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. సిరియాలో 60 ఏళ్లుగా అవిచ్ఛిన్నంగా సాగిన అసద్ కుటుంబ పాలన ఇటీవలే తిరుగుబాటు కారణంగా అంతమైపోవడంతో అంతర్యుద్ధం సమసిపోయిన ట్లేనని.. త్వరలోనే దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనవచ్చని అంటున్నారు. అయితే దీని కారణంగా అసాధారణంగా పెరిగిపోయిన యువతీ, యువకుల జనాభా వ్యత్యాసం తగ్గడానికి మాత్రం చాలాకాలం పట్టవచ్చని అక్కడి మీడియా విశ్లేషించింది. సిరియా పరిస్థితి ఇలా ఉంటే.. మన పొరుగు దేశం, దాయాది అయిన బంగ్లాదేశ్‌లో పరిస్థితి మరోలా ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. బంగ్లాదేశ్ యువతులు మన దేశానికి, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర యువకులను పెళ్లి చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారట! గత ఐదేళ్లలో 410 మంది బంగ్లా యువతులు భారతీయ యువకులకు పెళ్లి చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. అదే సమయం లో 11 మంది బంగ్లాదేశీ పురుషులు మాత్రమే భారతీయ మహిళలను వివాహమాడేందుకు దర ఖాస్తు చేసుకోవడం గమనార్హం. బంగ్లాదేశ్ ఒకప్పుడు భారతదేశంలో అంతర్భాగమే. దేశ విభజన సమయంలో పాకిస్తాన్‌లో చేరినా.. అనంతర భారత సహకారంతో పాకిస్తాన్‌తో జరిగిన విముక్తి పోరాటం ద్వారా 1971లో బంగ్లాదేశ్ పేరుతో స్వతంత్ర దేశంగా అవతరించింది. అందువల్ల మన దేశ సంస్కృతి సంప్రదాయాలతో పాటు సరిహద్దులకు అనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంతో ఇప్పటికీ సంబంధ బాంధవ్యాలను బంగ్లా ప్రజలు కొనసాగిస్తుంటారు. ఆ కోణంలో చూస్తే భార తీయ సంబంధాలను కోరుకునే బంగ్లాదేశీయుల సంఖ్య పెరగడంలో ఆశ్చర్యం లేకపోయినా ఈ విషయంలో యువకుల కంటే భారతీయ సంబంధాలు కోరుకుంటున్న యువతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటానికి కారణాలేమిటన్న చర్చ జరుగుతోంది. భారతీయ పౌరసత్వం పొందడం ద్వారా ఇక్కడ స్థిరపడటానికన్న ఒక వాదన వినిపిస్తున్నా ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్‌లో కూడా ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతుండటం, బలవంతంగానో, స్వచ్ఛందంగానో యువకులు వాటిలో చేరి కేసులో ఇరుక్కోవడం, జైళ్లకు వెళ్లడం, కొందరు మరణించడం వల్ల భవిష్యత్తును కోల్పోతు న్నారు. అటువంటి వారిని జీవిత భాగస్వాములుగా చేసుకుని తమ భవిష్యత్తును కోల్పోయేందుకు ఇష్టపడకే బంగ్లాదేశీ యువతులు ఇష్టపడటంలేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.










Comments