రాజకీయ గురువును కోల్పోయా!
- SATYAM DAILY
- Jan 13
- 1 min read
మాజీ మంత్రి మృతికి ఎమ్మెల్యే నివాళి

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)విలువలతో కూడిన రాజకీయాన్ని నేర్పిన తన రాజకీయ గురువు గుండ అప్పలసూర్యనారాయణను కోల్పోవడం తీరని లోటని ఎమ్మెల్యే గొండు శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అరసవల్లిలోని నివాసంలో సూర్యనారాయణ పార్థివ దేహానికి ఆయన పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సూర్యనారాయణ, ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించేవారని, ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు, జిల్లాకు పెద్ద నష్టమని పేర్కొన్నారు. అనంతరం శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను, లక్ష్మీదేవిని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అప్పలసూర్యనారాయణ అంతిమయాత్రలో పాల్గొన్నారు.










Comments