top of page

రీల్స్ వేరు.. రియాలిటీ వేరు

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 2 days ago
  • 4 min read
  • అందరూ కోరుకున్న కమిషనర్ ఇప్ప్పుడు ఫిర్యాదుల కేంద్రం

  • అనుమానాల పాలనతో ఆగిపోయిన ఫైళ్లు

  • ప్రజలూ, బిల్డర్లు, అధికార పార్టీ నేతలకూ ఒకటే వేదన

  • ఆత్మస్తుతి - పరనిందలో మునిగిపోయిన కూర్మారావు

  • నిజాయితీ జోరు.. నగరపాలన జీరో

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

ప్రతీదానికి ఒక కూలింగ్ పీరియడ్ ఉంటుంది. రాజకీయాల్లో అయితే వ్యంగ్యంగా హనీమÖన్ పీరియడ్ అని పిలుచుకుంటాం. ఆ పరిధి దాటిపోయిన తర్వాత ఫలితాలు ఆశిస్తాం. అలా జరగనప్ప్పుడు వ్యవస్థ ఎంత పెద్దవారినైనా పక్కన పెట్టేస్తుంది. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొద్ది రోజుల పాటే సన్మానాలు, సత్కారాలు, సభలు, ఊరేగింపులకు ప్రజలు సమయమిస్తారు. ఆ తర్వాత పాలన గాడిలో పెట్టడం కోసం ప్రయత్నించకపోతే ఆ రాజకీయ నాయకుడ్ని పక్కన పెట్టేస్తారు. అధికారులకైనా, మంత్రులకైనా ప్రజాస్వామ్యంలో ఇదే వర్తిస్తుంది.

శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్‌కు కమిషనర్‌గా కూర్మారావు రాకను అన్ని వర్గాలూ స్వాగతించాయి. డయేరియా ఎఫెక్ట్‌తో ఆయన సస్పెండ్ అయినప్ప్పుడు ఆయనకు పెద్ద ఎత్తున మద్దతు తెలిపాయి. మళ్లీ ఇక్కడకు రావాలని తీవ్రంగా ఆకాంక్షించాయి. అందరి అభిలాష మేరకు ఆయన శ్రీకాకుళం కమిషనర్‌గానే మళ్లీ చేరారు. అయితే డయేరియా ఎఫెక్ట్ నాటికి ఆయన కమిషనర్‌గా పని చేసి 12 రోజులే కావచ్చు. కానీ ఇప్ప్పుడు నెలలు గడుస్తున్నా పాలనపై ఆయన పట్టు సాధించలేదు సరికదా.. లేనిపోని నిబంధనలు తెర మీదకు తెచ్చి పాలనను మరింత కఠినతరం చేసేయడంతో ఆయన వచ్చినప్ప్పుడు పుష్పగుచ్ఛాలు ఇచ్చి వెల్‌కమ్ చెప్పినవారే ఇప్ప్పుడు మీ చాదస్తం ఇక చాలించండి మహాప్రభో అని వేడుకుంటున్నారు. స్వయంగా ఆయన ఆత్మస్తుతి ` పరనింద సిద్ధాంతాన్ని అవలంభిస్తుండటంతో ఎవరికి చెప్ప్పుకోవాలో తెలియక సాక్ష్యాత్తూ ఆయన రాకకు కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ముందే మొర పెట్టుకున్నారు. సహజంగానే ఈ పరిణామాన్ని ఎమ్మెల్యే శంకర్ ప్రోత్సహించారన్న టాక్ కూడా ఉంది. దీన్ని కొట్టిపారేయలేం. ఎందుకంటే.. ఆయన ఎమ్మెల్యే మాటను కూడా ఖాతరు చేయడంలేదు. కేవలం తాను మాత్రమే నిజాయితీపరుడినని, అందరూ అవినీతిపరులేనన్న కోణంలో అనుమానంగా చూడటం వల్ల కార్పొరేషన్ పరిధిలో హనుమంతు కూర్మారావు మార్క్ పనులు కనిపించడంలేదు. డ్వామాను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన కూర్మారావు నుంచి ఇటువంటి ఫలితాలను శ్రీకాకుళం ప్రజలు ఆశించడంలేదు. కార్పొరేషన్‌లో పాలకవర్గం లేకపోవడం వల్ల కమిషనర్ తీసుకునే నిర్ణయాలు అధికార పార్టీకి బలం చేకూర్చాలి. అలా కాకుండా అధికార పార్టీ నాయకులకే కూర్చోడానికి సీటివ్వని పరిస్థితి కమిషనర్ ఛాంబర్‌లో ఉంటే కచ్చితంగా రాష్ట్ర మంత్రికి ఫిర్యాదు చేస్తారు. ఆయన విన్నారా? లేదా? అన్నది సెకండరీ. కానీ తెలుగుదేశం నేతలు మాత్రం కమిషనర్ మీద ఫిర్యాదు చేయడానికే కొద్ది రోజుల క్రితం మంత్రి అచ్చెన్నాయుడును కలిశారు. తమ బాధలు చెప్ప్పుకుందామని చూశారు. కాకపోతే అదే రోజు దువ్వాడ శ్రీనును కొత్తూరు పోలీసులు స్టేషన్‌లో విచారిస్తుండటం, బయట దివ్వెల మాధురి ధర్నా చేయడం, ఎలక్ట్రానిక్ మీడియాలో లైవ్‌గా వస్తుండటాన్ని ఆసక్తిగా గమనిస్తున్న అచ్చెన్నాయుడు తనకన్నీ తెలుసని ఫొటో తీయించుకుని పంపించేశారు. కానీ ఇది కేవలం కమిషనర్‌కు వ్యతిరేకంగానో, లేదంటే ఎమ్మెల్యే శంకర్‌కు అనుకూలంగానో జరుగుతున్న పరిణామం కాదు. ఇప్పటి వరకు కమిషనర్ కూర్మారావు కార్పొరేషన్ మీద తన ముద్ర వేయకపోవడమే అసలు సమస్య.

ఇటీవల కూర్మారావు రీల్స్ సోషల్‌మీడియాలో తెగ కనిపిస్తున్నాయి. పార పట్టుకొని కాలువలు తీయడం, చీపురు పట్టుకొని వీధులు తుడవడం, ఇంటి పైకప్ప్పు కారిపోతుందంటే టాప్ యాంగిల్‌లో డ్రోన్ పెట్టి అవ్వకు రూ.5వేలు ఆర్థిక సహకారం అందిస్తున్న షాట్‌లతో పాటు ఏదో ఒక సోషల్‌మీడియా యాక్టివిటీలో ఆయన బిజీగా ఉన్నారు. నిత్యం ఇంజినీరింగ్, హెల్తాఫీసర్లతో కలిపి రోజుకు ఐదు డివిజన్లలో పర్యటిస్తానన్న కమిషనర్ మాటలు ఇప్ప్పుడేమయ్యాయి. సరెండర్.. సస్పెండ్ వంటి అంశాల కోసం మరోసారి మాట్లాడుకుంటే.. అచ్చెన్నాయుడును కలిసి బాధలు చెప్ప్పుకుందామన్నవారిలో అరసవల్లికి చెందిన ఉంగటి వెంకటరమణ వంటివారు ఫొటో ఫోజు కోసం వెళితే, కమిషనర్ బాధితులు మాత్రంగా నిజంగానే గోడు వెల్లబోసుకుందామనుకున్నారు. మొత్తం సబ్జెక్టంతా విడమరిస్తే పేజీలు చాలవు కాబట్టి క్లుప్తంగా నాలుగు విషయాలు చర్చించుకుందాం. పాత్రునివలస మెయిన్ విలేజ్‌లో మÖడుచోట్ల ఇటీవల వీధి కుళాయిలకు రిపేర్ వచ్చింది. దీని మీద కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. దీంతో రూ.2,500 ఖర్చుతో సామాన్లు కొని, లేబర్‌ను ఎంగేజ్ చేసుకొని కేవలం కనక్షన్ కలపడం కోసం వాటర్ వర్క్స్ వారిని తెచ్చి మాజీ సర్పంచ్ పంచిరెడ్డి అప్పలనాయుడు చేయించుకున్నారు. నగరంలో వీధి దీపాలు వెలగడంలేదని, కుళాయిలు మరమ్మతులకు గురవుతున్నాయని నేరుగా ఫిర్యాదులు చేసినా నోట్ చేసుకోవడం మినహా సమస్యలు పరిష్కారం కావడంలేదు. ఇదే పాత్రునివలసలో రూ.32 లక్షýతో కేంద్రమంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్‌లు శంకుస్థాపన చేసిన రోడ్డు ఈ ఏడాది జనవరిలో పూర్తి చేశారు. దీనికి సంబంధించి ఇంతవరకు సంబంధిత కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించడానికి కమిషనర్ శ్రద్ధ చూపడంలేదు. అదే పంచాయతీ పరిధిలో నాలుగు ప్రధాన పనులకు టెండర్లు వేయాల్సివున్నా ఆ ప్రక్రియను ఇంతవరకు ప్రారంభించలేదు. నిధులున్నా పనులు చేపట్టడానికి కమిషనర్ చొరవ చూపడంలేదు. ప్రతీది తాను చూసి చేస్తాననడం, తానొక్కడినే నిజాయితీపరుడినని భావించడం వల్ల జరుగుతున్న నష్టమిది. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ మీద కమిషనర్‌కు అవగాహన లేకపోవడం వల్ల అన్నిటికీ తానే బాధ్యత వహించాల్సి ఉంటుందన్న భయంతో ముందుకు రావడంలేదు. ఈ`ఆఫీస్‌లో ఒక ఫైల్ వచ్చిన తర్వాత దాన్ని కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించి అయితే అవునని, కాదంటే కాదని రాస్తే సరిపోతుంది. కానీ ఆయన అదే ఈ`ఆఫీస్ ఫైల్‌లో జిల్లా, రాష్ట్ర పనుల వల్ల తాను బిజీగా ఉంటానని, అందువల్ల అన్నీ చూడటం కుదరదు కాబట్టి ఆ బిల్లుకు ఎటువంటి తప్పిదం ఉన్నా తనకు సంబంధం లేదని రాస్తున్నారు. బహుశా రాష్ట్ర చరిత్రలో ఈ`ఆఫీస్ ఫైల్‌లో ఇలా తప్పించుకునే కమిషనర్ మరి ఉండకపోవచ్చు. పని చేసిన తర్వాత అనుమానిస్తే ఫర్వాలేదు కానీ, అనుమానంతో పని చేయకూడదు. అయితే ఈ రెండోదే కమిషనర్ ఎంచుకున్నట్టు కనిపిస్తుంది. మున్సిపాలిటీకి సంబంధించిన జేసీబీ రిపేర్ అయితే ఆమధ్య దాన్ని వరుణ్ మోటార్స్‌లో సర్వీసుకు పంపారు. సంబంధిత ఆథరైజ్డ్ షోరూమ్ ఇచ్చిన బిల్లును ఇక్కడ హెల్త్ అధికారులు మానిప్లేట్ చేసుంటారన్న అనుమానంతో ఇంతవరకు పాస్ చేయలేదు. ఆమధ్య సీడీఎంఏ డైరెక్టర్ ఒకరు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో శ్రీకాకుళంలో ఉన్న 190 ప్రాపర్టీలకు ఫొటోలు తీసి, బౌండరీస్ ఫిక్స్ చేసి, అప్‌లోడ్ చేయాల్సివుండగా, కేవలం ఒకేఒక్క ప్రాపర్టీని అప్‌లోడ్ చేయడంతో ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే డిజిటల్ డోర్ నెంబరింగ్ 50 శాతం మాత్రమే పూర్తిచేయడాన్ని ఆమె తప్ప్పుపట్టారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఎక్కడా కమిషనర్ నిజాయితీని శంకించలేం. కానీ ఆయన ఎవర్నీ నమ్మకపోవడమే శ్రీకాకుళంలో పనులు పురోగతి సాధించడంలేదు. అచ్చెన్నాయుడును తెలుగుదేశం నాయకులు కలిసిన కొద్ది సేపటికే నగరంలో అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్న బిల్డర్స్ కూడా కలిశారు. ప్రతీది కమిషనర్ తన కంటితో చూస్తేగాని నమ్మనని ప్రకటించడం ద్వారా కోట్లాది రూపాయలు నష్టపోతున్నామని, మార్ట్‌గేజ్‌లో ఉన్న ప్లాట్‌ను రిలీజ్ చేయడానికి రిజిస్ట్రార్ ఆఫీస్‌కు ఓ గుమస్తా వస్తే సరిపోతుందని, అలా కాకుండా కమిషనరే రావాలని కోరుకోవడం వల్ల తాము రోడ్డున పడిపోతున్నామని మంత్రికి చెప్ప్పుకొచ్చారు. ఒక అపార్ట్‌మెంట్‌లో 10 ప్లాట్‌లు కడితే అందులో మున్సిపాలిటీకి మార్ట్ గేజ్ (తనఖా) కింద 2 ప్లాట్లు ఇవ్వాలి. నిబంధనలన్నీ పాటించారని తేలిన తర్వాత రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఈ మార్ట్‌గేజ్‌ను మున్సిపాలిటీ విడిపించాలి. ఇలా అన్నీ సవ్యంగా ఉన్నా మార్ట్‌గేజ్ రిలీజ్ చేయకపోవడం వల్ల ఒక్కో అపార్ట్‌మెంట్‌లో కోటి రూపాయలు బిల్డర్ సొమ్ము డెడ్ అయిపోతుంది. అలాగే వీఎల్‌టీ, ఎలఆరఎస్, బీపీఎస్ కూడా ముందుకు కదలడంలేదు. నిబంధనలన్నీ పాటించి కార్పొరేషన్ పరిధిలో అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నవారు కమిషనర్ చాదస్తానికి బలైపోతున్నామని మంత్రికి వివరించారు. సుడా కార్యాలయానికి కిలోమీటరు దూరంలో ఉన్న తోటాడ పంచాయతీలో తప్ప్పుడు సర్వేనెంబర్లతో ఎటువంటి ప్లాన్లూ లేకుండా భారీ అపార్ట్‌మెంట్లు నిర్మిస్తుండటంతో ప్రజలు అటువైపే మొగ్గుచూపుతున్నారు. నిబంధనలు అనుసరించి నగర పరిధిలో నిర్మిస్తున్న బిల్డర్లు మాత్రం కుదేలైపోతున్నారు. మున్సిపల్ చట్టాన్ని పూర్తిగా చదివి అవగాహన చేసుకున్న తర్వాత మాత్రమే తాను ఫీల్డ్‌కు వచ్చి సంతకాలు చేస్తానని చెప్పడం వల్ల పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఎందుకంటే శ్రీకాకుళంలో నిర్మాణ పనులు జరిగేది మార్చి నుంచి జూన్ వరకు మాత్రమే. ఇలా నగరంలో వీధి లైట్లు వెలగడంలేదన్న దగ్గర్నుంచి కోట్లు విలువ చేసే భవనాలు నిర్మించే బిల్డర్ల వరకు ప్రతిఒక్కరిదీ ఒక్కో వ్యధ. వీరంతా ఒకప్ప్పుడు కూర్మారావు ఇక్కడ కమిషనర్‌గా ఉండాలని కోరుకున్నవారే. వీరిలో ఏ ఒక్కరు కూడా ఆయన నిజాయితీని శంకించడంలేదు. పబ్లిక్‌తో అటాచ్‌మెంట్ ఉండే మున్సిపాలిటీలో కమిషనరే అన్నింటికీ బాధ్యుడన్న భావన ముందుగా కూర్మారావు వదిలేయాలి. వీఎల్‌టీ ఫైల్ మీద సంతకం పెట్టినంత మాత్రాన డిస్ప్యూట్ ల్యాండ్‌కు కమిషనర్ ఆథరైజేషన్ ఇచ్చినట్టు కాదు. అలాగే మార్ట్‌గేజ్‌లో ఉన్న ప్లాట్‌ను విడిపించడానికి డిజిటల్ సైన్ పెట్టినంత మాత్రాన ఇల్లు ఆక్యుపేషన్‌లో లేకుండా ఇచ్చినట్టు కాదు. భవిష్యత్తులో తనను బాధ్యుడ్ని చేస్తారని, ఈ`ఆఫీస్‌లో బిల్లుకు, తనకు సంబంధం లేదని రాయడం సరికాదు. మున్సిపల్ శాఖలో పాలన డ్వామాలా సాఫీగా ఉండదని ఈపాటికే కూర్మారావుకు అర్థమైవుండాలి. ఎందుకంటే.. తాను సరెండర్ చేసిన డీఈ శర్మ మళ్లీ అటు తిరిగి ఇటు తిరిగి నెల రోజుల్లో ఇక్కడికే రావడం కమిషనర్‌కు అర్థమైవుండాలి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page