top of page

లాక్‌డౌన్ కాదు.. అంతకు మించి!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • 3 days ago
  • 3 min read

గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇండియాలో 2020 కోవిడ్ లాంటి లాక్‌డౌన్ మళ్లీ రానుంది. ఇంటి నుంచి ఎవరు బయటికి రాలేరన్నట్లు ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ నిజాలు కాదు. ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఎక్కడ అఫీషియల్‌గా లాక్‌డౌన్ ప్రకటించలేదు. అయితే ఇరాన్ యుద్ధం ఆగలేదు. అంటే.. లాక్ డౌన్ కంటే దారుణమైన పరిస్థితులు రానున్నాయి.

పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ ఎలాగైతే కోవిడ్ సమయంలో అన్ని పార్టీలు ఒక్కటై పనిచేశాయో రానున్న రోజుల్లో కూడా అలాగే పని చేయాలి.. అని మోడీ పార్లమెంట్‌లో పిలుపునిచ్చారు. ఈ స్టేట్మెంట్ తర్వాత ప్రజలు పానిక్ అయిపోయారు. పెట్రోల్ బంకుల చుట్టూ బార్లు తీరారు. ఎల్‌పీజీ సిలిండర్ల కోసం క్యూ కట్టారు. ఇంటర్నెట్‌లో లాక్‌డౌన్ అనేది ట్రెండ్ అయింది. చాలామంది గూగుల్‌లో లాక్‌డౌన్ అని సెర్చ్ చేశారు. ప్రజలు పానిక్ అవ్వడానికి మరో కారనం.. 2020 మార్చి 24న మోడీ కోవిడ్ లాక్‌డౌన్‌ను ప్రకటించారు. ఈ మార్చి 24న కూడా మళ్లీ ఇంకొక లాక్‌డౌన్‌ను ప్రకటిస్తారేమో అని ప్రజలు భయపడ్డారు. అయితే లాక్‌డౌన్ అనేది ఉండదు. దానికంటే భయంకరమైన పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ఇప్పుడు అప్పుడే ఆగేలా లేదు. యుద్ధ విరమణకు అటు అమెరికా, ఇటు ఇరాన్‌లు పెట్టిన కండిషన్లు ఒకరికొకరు ఒప్ప్పుకునేలా లేవు. కాబట్టి ఈ యుద్ధం ఇంకొంత కాలం కొనసాగేలా ఉంది. దీన్ని గ్రహించే మోడీ అందరూ రెడీగా ఉండాలని పిలుపునిచ్చారు. బ్యారెల్ ముడిచమురు ధర 150 డాలర్స్‌కు చేరుకుంటే గ్లోబల్ లెవెల్‌లో రెసిషన్ రానుంది. ఇలా 2008లో ఒకసారి జరిగింది. ఇరాన్ యుద్ధం వల్ల ఒక్క మార్చి నెలలో దాదాపు 3 బిలియన్ డాలర్ల డబ్బులను ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎత్తేశారు. ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు. రష్యా`ఉక్రెయిన్ యుద్ధం మూడు నెలల్లో ఆగిపోతుంది అనుకున్నాం.. కానీ నాలుగేళ్లు పట్టింది. చివరకు ఇజ్రాయిల్`హమాస్ మధ్య యుద్ధం కూడా వన్ ఇయర్ పట్టింది. ఇరాన్ ఇప్పుడప్పుడే కాంప్రమైజ్ అయ్యేలా లేదు కాబట్టి ఈ యుద్ధం కూడా డెఫినెట్‌గా దీర్ఘకాలం కొనసాగుతుందనే అనుమానాలు అంచనాలు ఉన్నాయి. ఒకవేళ ఇలా కొనసాగితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టే అన్నిటికీ రెడీ అయి ఉండండి అని మోడీ పిలుపునిచ్చారు. మార్చి ఫస్ట్ వీక్ నుంచి స్ట్రైట్ ఆఫ్ హర్మూస్‌ను ఇరాన్ క్లోజ్ చేసుకొని కూర్చుంది. ఇండియా హర్మూస్ దారి గుండా 20% క్రూడ్ ఆయిల్‌ను 40% ఎలఎన్జీను 60% ఎల్పీజీను ఇంపోర్ట్ చేసుకుంటుంది. హార్మోస్ బ్లాక్ అయిందని చెప్పి మనం రష్యా లేదా ఇతర దేశాల దగ్గర ఆయిల్ అండ్ గ్యాస్‌ను ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అయితే మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంది సప్లై తక్కువగా ఉంది కాబట్టి క్రూడ్ ఆయిల్‌ను ఒక బ్యారల్ 120 లేదా 110 డాలర్లకు రష్యా మనకు అమ్ముతోంది. అంటే రష్యా డిస్కౌంట్స్ ఇవ్వడం లేదు. ఇంతకుముందు మనం రష్యా నుంచి కేవలం 55 డాలర్స్‌కే బ్యారల్ ఆయిల్‌ను కొనేవాళ్లం కానీ ఇప్పుడు రష్యా డిస్కౌంట్స్ ఇవ్వడం లేదు. మనం డైలీ 55 లక్షల బ్యారెల్స్‌ను ఇంపోర్ట్ చేసుకుంటాం. బ్యారల్ ధర 110 డాలర్లకు పెరగడం వల్ల మనకు ప్రతిరోజు రూ.2వేల కోట్లు నష్టం. హర్మూజ్ నుంచి మనం వ్యవసాయానికి కావాల్సిన ఫెర్టిలైజర్స్‌ను కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. హర్మూస్ బ్లాక్ అవ్వడం కారణంగా అగ్రికల్చర్ కాస్ట్ పెరుగుతుందంటే ఫుడ్ ప్రైసెస్ కూడా అమాంతం పెరగనున్నాయి. గ్యాస్ సిలెండర్లు ఆగిపోవడం వల్ల హోటల్, లార్జ్ రెస్టారెంట్, రిసార్ట్, బిజినెస్‌లన్నీ దెబ్బతింటున్నాయి. మనం డైలీ 55 లక్షల బ్యారెల్స్ ఖర్చు పెడితే ఒక బ్యారల్ కు 40 డాలర్స్ అదనంగా పెట్టి కొనాలి. కాబట్టి భారత ప్రభుత్వం నెలకు మూడు లేదా నాలుగు రోజులు మాత్రమే స్కూల్స్ అండ్ కాలేజ్‌ను ఓపెన్ చేయాలనే నిబంధనలు పెట్టొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ పాటించాలనే కండిషన్స్ పెట్టొచ్చు. స్ట్రీట్ మార్కెట్స్‌ను తొందరగా క్లోజ్ చేయాలి, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్‌ను వారానికి రెండు మూడు రోజులు మాత్రమే తెరవాలనే కండిషన్స్ పెట్టొచ్చు. ఆయిల్ అండ్ గ్యాస్‌ను మనం తక్కువగా ఖర్చు పెడితే ప్రభుత్వం తక్కువ డబ్బు ఖర్చు పెట్టి కొంటుంది అన్నమాట. ఎందుకంటే మన దగ్గర తక్కువ డాలర్లే రిజర్వ్‌లో ఉన్నాయి. ఈ రిజల్ట్స్ అన్నిటిని ఖర్చు పెడితే మన కరెన్సీ వాల్యూ తగ్గిపోతుంది కాబట్టే మన ప్రభుత్వం తక్కువగా ఆయిల్ అండ్ గ్యాస్‌ను ఖర్చు చేయండి అనే కండిషన్స్ పెట్టినా పెట్టగలదు. 45 రోజుల వరకు మన దగ్గర ఆయిల్, గ్యాస్ నిల్వలు ఉన్నాయి. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఆ స్టోరేజ్ అనేవి ఎమర్జెన్సీ కోసం మనం పెట్టుకున్నవి. దాన్ని ఇప్పుడు వాడడానికి లేదు కాబట్టి ఆల్రెడీ మనం సంక్షోభంలో ఉన్నాం. సౌదీ, ఖతార్, కువైట్ నుంచి ఇండియా మధ్య దూరం కేవలం 4వేల కిలోమీటర్లు మాత్రమే. ఇండియా నుంచి రష్యా మధ్య దూరం 8వేల కిలోమీటర్లు. యుఎసఏ`కెనడా మధ్య దూరం 13వేల కిలోమీటర్లు. బ్రెజిల్ మధ్య దూరం 8వేల కిలోమీటర్లు. డిస్టెన్స్ పెరిగే కొద్ది ట్రాన్‌పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. అందుకే అక్కడ ఆయిల్ దొరుకుతున్నా తెచ్చుకోలేం.

ఇండియాలో ఫిబ్రవరిలో ఎల్పీజి సిలిండర్ ధర రూ.855 ఉండేది. కానీ కేవలం నెలలో రూ.915కు పెరిగింది. కమర్షియల్ సిలిండర్ ధర రూ.115 పెరిగింది. హర్మోస్ దగ్గర ఇండియాకు చెందిన 28 ఆయిల్, గ్యాస్ ట్యాంకర్స్ ఇరుక్కున్నాయి. 3 లక్షల టన్నుల లోడ్ ఉన్న ఐదు ఎల్పీజీ ట్యాంకర్స్ ఇరుక్కున్నాయి. వచ్చే 15 లేదా 30 రోజుల్లో సమస్యలు రానున్నాయి. ఒమాన్ నుంచి 46% యూరియాను మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. హార్మోస్‌లో ఇరుక్కున్న కార్గోస్ అండ్ షిప్స్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్‌ను కూడా తీసుకొస్తున్నాయి అవన్నీ ఆగిపోయాయి కాబట్టి ఈ ఫర్టిలైజర్స్ లేవు. అంటే గోధుమలు, రైస్, కాయగూరలు పండించడం కష్టం. వీటిని యుఎసఏ, నైజీరియా నుంచి దిగుమతి చేసుకోవాలి. అంటే ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్సూరెన్స్ కాస్ట్ పెరిగిపోతుంది. యుఎసఏ ప్రజలు రోజుకు 200 లక్షల బ్యారల్స్ ఆఫ్ ఆయిల్‌ను వినియోగిస్తారు. వాళ్ల ప్రజలకు ఫస్ట్ వాళ్లు సప్లై చేస్తారు. ఆ తర్వాతే ఇండియాకు ఎక్స్‌పోర్ట్ చేస్తారు. గ్లోబల్ లెవెల్ సప్లై తగ్గిపోయిందనుకోండి.. డొమెస్టిక్ లెవెల్‌లోనే ఆయిల్‌ను ఉంచుకుంటారు. కెనడా, యూఎసఏ, యూరప్, నైజీరియా ఆయిల్, గ్యాస్‌ను ఎక్స్‌పోర్ట్ చేయడాన్ని ఇష్టపడదు. అంటే ఎక్స్‌పోర్ట్ బ్యాన్ విధిస్తారన్నమాట. ఇరాన్ యుద్ధం కారణంగా ఇన్సూరెన్స్ కంపెనీ సమాంతరంగా ఇన్సూరెన్స్ ఛార్జెస్ పెంచేసాయి. దీనివల్ల ప్రభుత్వం రంగంలో దిగి దాదాపు వెయ్యి కోట్ల ఫండింగ్ ఇచ్చి షిప్స్‌కు భరోసా ఇస్తోంది. నౌకలకు వార్ రిస్క్ ఇన్సూరెన్స్ సపోర్ట్ వెయ్యి కోట్లు ప్రభుత్వం ఇస్తోంది. దీన్నే నేషనల్ వైడ్ లాక్‌డౌన్ అనేకంటే.. ఎనర్జీ క్రైసిస్ లేదా ఎనర్జీ లాక్‌డౌన్ అని చెప్పవచ్చు. స్వయంగా సాఫ్ట్‌వేర్, ఫార్మా కంపెనీలే నష్టాల్లోకి వెళ్లిపోతున్నాయని అమెరికాలో బ్లాక్‌రాక్ సంస్థ సీఈవో ప్రకటించారంటే.. పరిస్థితి లాక్‌డౌన్ కాదు.. అంతకు మించి అన్నట్టు కనిపిస్తుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page