విజయనగరంలో ఉగ్రమూలం.. శ్రీకాకుళంతో బంధుత్వం
- NVS PRASAD

- May 19
- 3 min read

పక్క జిల్లాలో పేలుళ్లకు ట్రయల్స్
జిల్లాలో ఇటువంటివారిపై మొదలైన సెర్చ్ ఆపరేషన్
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
దేశంలో మరోమారు బాంబు పేలుళ్లకు పూనుకోవాలనుకున్న ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసిన కేసులో మూలాలు విజయనగరంలో ఉంటే.. ఇందులో సూత్రధారి సిరాజ్ ఉర్ రెహ్మాన్(29)కు బంధుత్వం శ్రీకాకుళంతో ఉంది. అంతమాత్రాన ఉగ్రవాదులతో సంబంధం వీరికీ ఉన్నట్టు కాదుగానీ, శ్రీకాకుళంలో ఓ మాజీ కౌన్సిలర్, ముస్లిం మైనార్టీ నాయకుడు తోడల్లుడికి మేనల్లుడని భోగట్టా. దీంతో నగరంలో ఒక్కసారిగా కలకలం రేగింది. దేశంలో పలు ప్రదేశాల్లో బాంబులు పెట్టి అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నించినవారిలో విజయనగరానికి చెందిన యువకుడు ఉన్నాడని ప్రధాన మీడియా ద్వారా తెలుసుకున్న స్థానికులు విస్తుపోయారు. ఉగ్రమూలాలు మనకు ఆనుకొని ఉన్న జిల్లా వరకు వచ్చాయని తెలిసి నిర్ఘాంతపోతున్నారు. మరీ ముఖ్యంగా నిందితుడు రెహ్మాన్ తండ్రి, అన్న పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తుండటం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. నగరంలో కూడా ఇటీవల ముక్కూమొహం తెలియని కొత్త వ్యక్తులు కనిపిస్తున్నారు. దీనిపై ఎప్పటికప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంతవరకు రోహింగ్యాలు జిల్లాలో వివిధ పనుల్లో కుదురుకున్నారని ఇంటెలిజెన్సీ భావిస్తూవచ్చింది. కానీ ఏకంగా ఉగ్రభూతమే పక్కజిల్లాలో ఉందంటే, కచ్చితంగా జిల్లాలో కూడా కొందరు యువకులను ఈమేరకు ఉచ్చులో పడేసివుంటారన్న కోణంలో పరిశోధన సాగుతోంది. ఇటీవల పెద్దమసీదులో నాలుగు గంధపు చెట్లు మాయమవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వాస్తవానికి సాధారణ గంధపు చెట్లు అక్రమ నరికివేతకు సంబంధించి పోలీసులు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ కంటే ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఫారెస్ట్ కంటే పోలీసులే ఎక్కువసార్లు మసీదులో విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా అసలు మొదట్నుంచి నగరంలో ఉన్న మసీదులకు వస్తున్నవారెవరూ అడపా దడపా ఏదో పూట నమాజుకు వచ్చి ఎవర్ని కలిసి వెళ్తున్నారనే దానిపై ఎస్పీ నేతృత్వంలోని స్పెషల్ బ్రాంచ్ ఆరా తీసింది. ఇంకా ఒక సమగ్రమైన నివేదికను రూపొందిస్తున్న సమయంలోనే పక్క జిల్లాలో ఉగ్రభూతం కనిపించడం సంచలనం రేకెత్తిస్తుంది. జీహాద్ భావజాలంతో విజయనగరం నిందితుడు సిరాజ్ ఉర్ రెహ్మాన్ అక్కడ కూడా ఎవరితోనూ కలిసేవాడు కాదని చెబుతున్నారు. ఇక్కడ కూడా నగరంలో ఉన్న ముస్లింల కంటే ఖురాన్ మీద, ఖుదా మీద, అరబ్బీ మీద ఎక్కువ పట్టున్నవారికి రెడ్‌కార్పెట్ పరుస్తున్నారు. సహజంగా ఇలాంటి భావజాలం ఉన్నవారిని అంచనా వేయడం ఏ మతంలోనైనా కష్టం. శ్రీకాకుళంలో కూడా నలుగురితో కలవకుండా పక్కమతాన్ని పూర్తిగా భరించలేని నైజంతో గడుపుతున్నవారి సంఖ్య తక్కువేమీ కాదు. ఇప్పుడు విజయనగరం వరకు ఉగ్రమూలాలు రావడం వల్ల శ్రీకాకుళంపై కూడా కన్నేయాల్సిన అవసరం ఏర్పడిరది. విజయనగరంలో ఉగ్రమూలాల కేసు విచారణలో పోలీసులు జోరు పెంచారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న సిరాజ్, సమీర్ కస్టడీ కోసం కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇద్దరినీ కస్టడీకి ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నిందితులకు నిధులు ఎవరు సమకూర్చారన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రధాన సూత్రధారుల గుర్తింపు కోసం దర్యాప్తు ప్రారంభించారు.
బాంబు పేలుళ్లకు విజయనగరంలో రిహార్సల్స్!
ఇద్దరికీ సౌదీ అరేబియా నుంచి ఐసిస్ మాడ్యుల్ ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. గతంలో రంపచోడవరం అటవీ ప్రాంతంలో వీరు బాంబు పనితీరుపై రిహార్సల్స్ చేసినట్లు గుర్తించారు. గత 6 నెలల్లో సిరాజ్ 3 సార్లు సౌదీ వెళ్లినట్లు పోలీసులకు వివరాలు అందాయి. అందిన సమాచారాలపై నిర్ధారణకు సిరాజ్, సమీర్‌ను పోలీసులు కస్టడీకి కోరనున్నారు.
‘అహిం’ పేరిట కార్యకలాపాలు.. ఇన్‌స్టాలో సంప్రదింపులు
సిరాజ్ ఉర్ రెహ్మాన్‌తో పాటు సికింద్రాబాద్ బోయిగూడకు చెందిన సయ్యద్ సమీర్ (28)ను పోలీసులు అరెస్ట్ చేశారు. సిరాజ్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉండగా.. సమీర్ లిఫ్ట్ ఆపరేటింగ్ సంస్థలో పని చేస్తున్నాడు. ప్రాథమిక ఆధారాలను బట్టి వీరిద్దరు అల్ హింద్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (అహిం) పేరిట సంస్థను ఏర్పాటుచేసి కార్యకలాపాలు సాగించారు. ఆ సంస్థకు సిరాజ్ నంబర్‌వన్‌గా, సమీర్ నంబర్‌టూగా వ్యవహరించారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సౌదీ అరేబియా నుంచి గుర్తుతెలియని ఉగ్రవాద సంస్థ హ్యాండ్లర్ ఉగ్రకుట్రల కోసం వీరికి మార్గనిర్దేశం చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ హ్యాండ్లర్ ప్రధానంగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వీరితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం లభించింది. ఇలా ఆ యువకులు దేశంలో పక్కా ప్రణాళిక ప్రకారం పేలుళ్లకు పథకరచన చేసి ఉగ్ర కార్యకలాపాల విస్తరణకు పన్నాగం పన్నారు. అందుకోసం పొటాషియం క్లోరేట్, సల్ఫర్ తదితర పేలుడు రసాయనాలను ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేశారు. పేలుడు పదార్థాల తయారీపైనా ఆన్‌లైన్‌లోనే అవగాహన పెంచుకున్నారు. ఈ నెల 21 లేదా 22 తేదీల్లో విజయనగరం పరిసరాల్లో బాంబుపేలుళ్లకు రిహార్సల్స్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇంతలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా వీరి కుట్రను భగ్నం చేశారు. నిందితులు మరికొందరు యువకులు, మైనర్లతోనూ తరచూ సమావేశాలు నిర్వహించారు.
గ్రూప్-2 సన్నద్ధత పేరిట హైదరాబాద్‌కు..
గ్రూప్-2 పరీక్షలకు సన్నద్ధం కావాలనే కారణంతో సిరాజ్ విజయనగరం నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చాడు. ఆ సమయంలోనే అతడు, సమీర్ పలుమార్లు కలిసి చర్చించుకున్నారు. అనంతరం సిరాజ్ గ్రూప్-2 పరీక్ష రాసేందుకు విజయనగరం వెళ్లిపోయాడు. పేలుళ్ల రిహార్సల్స్ కోసం విజయనగరంలోని తన చిరునామాకే ఆన్‌లైన్‌లో పేలుడు రసాయనాలను తెప్పించుకున్నాడు. వీరి కార్యకలాపాలపై ఉప్పు అందడంతో నిఘా ఉంచిన తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు.. ఏపీ పోలీసులను అప్రమత్తం చేశాయి. దీంతో శనివారం విజయనగరంలో పోలీసులు సిరాజ్ ఇంటిపై దాడి చేసి పేలుడు రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇంటెలిజెన్స్ అధికారులు సికింద్రాబాద్‌లో సమీర్‌ను అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ వారంట్‌పై విజయనగరం తీసుకెళ్లారు.
హ్యాండ్లర్ వీరిని ‘మ్యాజిక్‌లాంతర్’ ద్వారా ఎంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. సోషల్ మీడియాలో ఉగ్రవాద అనుకూల పోస్టు పెట్టి, దానికి సానుకూలంగా స్పందించే (లైక్‌మైండెడ్) వారిని ఎంచుకోవడమే ఈ ప్రక్రియ ముఖ్యఉద్దేశం. అలాంటి వారిలో నుంచే వీరిద్దరినీ ఎంచుకున్నట్లు తేలింది. వీరు తమ గ్రూపులో మరో 28 మందిని చేర్చుకున్నట్లు గుర్తించారు. అగ్గిపుల్లల్లోని మందును వినియోగించి బాంబు తయారు విధానంపై హ్యాండ్లర్ వీరికి ఫైళ్లు పంపినట్లు తేలింది. దీనికి అనుగుణంగానే యువకులు బాంబును తయారు చేసినట్లు తేలింది. ఆ బాంబును సిరాజ్ ఈ నెల 12న విజయనగరంలో ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు తెలుస్తోంది. మరోసారి ప్రయోగించేందుకు సిద్ధమైన తరుణంలోనే వారిద్దరూ పోలీసులకు చిక్కారు.










situs toto
ఈ జాతి నే నమ్మ లేక పోతున్నాం. ఎవడు ఎలా ఉంటాడో, ఎప్పుడు ఏం చేస్తాడో తెలీట్లేదు. అందుకు ఇలాంటి కుక్కలని పోలీసువారు తమదైన స్టైల్లో ఇరగదీసి, జీవితం లో దేనికీ పనికిరాకుండా చేస్తే ప్రజలు సంతోషిస్తారు. జై శ్రీరామ్.....