వెంటిలేటర్ మీద గుండ.. పరామర్శించిన ధర్మాన
- SATYAM DAILY
- Jan 12
- 1 min read
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణ స్థానిక బగ్గు సరోజిని ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్ మీద ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం వాష్‌రూమ్‌లో కాలు జారడం వల్ల ఆయన తల వెనుకభాగంలో గాయమైంది. అదే ప్రాంతంలో గతంలో ఆయనకు విశాఖలో సర్జరీ జరగడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. వెంటనే బగ్గు సరోజినీ దేవి ఆసుపత్రికి చేర్చి చికిత్స అందించారు. క్రిటికల్‌గా ఉందంటూ వెంటిలేటర్‌ను అమర్చారు. ఈ విషయం తెలుసుకున్న గుండ అభిమానులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి తరలివస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే, గుండ సతీమణి లక్ష్మీదేవికి ధైర్యం చెబుతున్నారు. మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు సోమవారం ఆసుపత్రికి వెళ్లి అప్పలసూర్యనారాయణను చూసొచ్చారు. గుండ తనయులిద్దరూ కాలిఫోర్నియా నుంచి సోమవారం రాత్రికి లేదా మంగళవారం శ్రీకాకుళం చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. గత ఏడాది అప్పలసూర్యనారాయణకు సర్జరీ జరిగిన తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. ఆయన ఆలనా పాలనా లక్ష్మీదేవే స్వయంగా చూసుకుంటూవచ్చారు. జనవరి 1వ తేదీన అభిమానులకు కనిపించిన ఆయన ఇంతలోనే ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉండటంతో అనేకమంది విచారం వ్యక్తం చేస్తున్నారు.











Comments