top of page

విమానాలకు జీపీఎస్‌ స్పూఫింగ్‌ ముప్పు

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jul 7, 2025
  • 2 min read

ఆధునిక యుగంలో అన్నిరంగాల పనితీరు మారుతున్నట్లే యుద్ధాల రీతీ మారుతోంది. అదేవిధం గా ఉగ్రవాద కార్యకలాపాలు, శత్రువులపై నేరుగా కాకుండా పరోక్షంగా కక్ష సాధించే లేక పగ తీర్చుకునే కార్యకలాపాలు సైతం ఆధునిక సాంకేతికను సంతరించుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో రష్యా`ఉక్రెయిన్‌, భారత్‌`పాకిస్తాన్‌, ఇజ్రాయెల్‌`ఇరాన్‌ మధ్య జరిగిన యుద్ధాలు సంప్రదాయ పద్ధతి లో కాకుండా ఆధునిక సాంకేతికతతో కూడిన డ్రోన్లు వంటి నవీన ఆయుధాలు కీలకపాత్ర పోషిం చాయి. ఆ సంగతి పక్కన పెడితే ఉగ్రవాదులు కూడా ఆధునిక సాంకేతికను దుర్వినియోగం చేస్తూ ఆయా దేశాలను చికాకుపెడుతున్నారు. తరచూ జరుగుతున్న విమాన ప్రమాదాలు, అత్యవసర ల్యాండిరగుల వెనుక ఉగ్రవాదుల దుష్ట పన్నాగాలు ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనికి అతిపెద్ద ఉదాహరణ గత నెల 12న జరిగిన ఘోర విమాన దుర్ఘటన. ఢల్లీి నుంచి అహ్మదా బాద్‌ మీదుగా లండన్‌ వెళ్తున ఈ ఎయిర్‌ ఇండియా విమానం అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో టేక్‌ఆఫ్‌ తీసుకున్న ఐదు నిమిషాల్లోనే సమీపంలోని నివాస ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఫలితంగా విమానంలో ఉన్న క్రూ, ప్రయాణికులతో పాటు సమీపంలోని వసతిగృహంలో ఉన్న మెడికోలతో సహా సుమారు 260 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రపంచంలోని అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఒకటి గా నిలిచిన ఈ దుర్ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. విమానానికి చెందిన రెండు ఇంజిన్లు ఫెయిల్‌ అవ్వడమో.. విద్యుత్‌ సరఫరా నిలిచపోవడమే ప్రమాదానికి కారణమని భావించినా, దీని వెనుక ఉగ్రవాదుల కుట్ర ఉందన్న భావన తాజా దర్యాప్తు ద్వారా కలుగుతోంది. విమానానికి చెందిన గ్లోబల్‌ పొజీషనింగ్‌ సిస్టమ్‌ (జీపీఎస్‌) వ్యవస్థను హైజాక్‌ చేసి విమానాన్ని దుండగులు కూల్చివేశారన్న అను మానాలు బలపడుతున్నాయి. గతంలో ఉగ్రవాదులు విమానాలకు విమానాలనే భౌతికంగా హైజాక్‌ చేసి ప్రభుత్వాలను బ్లాక్‌మెయిల్‌ చేసి తమ డిమాండ్లు సాధించుకునేవారు. కానీ ఇప్పుడు విమానాన్ని నడిపించే అతి కీలకమైన జీపీఎస్‌ను ట్రాక్‌ చేసి దాన్ని స్ఫూఫ్‌ చేయడం (సిగ్నల్స్‌ను తారుమారు చేయడం) దారా ప్రమాదాలకు గురయ్యేలా చేస్తున్నారని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్న మాట. ఇటువంటి ఘటనలు పెరగడం కూడా వారి వాదనలను బలపరుస్తోంది. ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 2023`2024 మధ్య జీపీఎస్‌లో అక్రమ చొరబాట్ల(ఇంటర్‌ఫియరెన్స్‌) రేటు 175శాతంగా ఉంది. ఇదే సమయంలో జీపీఎస్‌ స్పూఫింగ్‌ ఘటనలు 500 శాతం పెరిగాయి. ఇక 2023 నవంబర్‌ నుంచి 2025 ఫిబ్రవరి వరకు మన దేశ సరిహద్దుల్లోనే 465 జీపీఎస్‌ స్పూఫింగ్‌ ఘటనలు చోటుచేసుకున్నాయి. అమృత్‌సర్‌, జమ్మూ ప్రాంతాల్లోనే ఇవి అధికంగా జరగడం గమనార్హం. గత నెలలో ఢల్లీి నుంచి జమ్మూకు బయలుదేరిన విమానం కొద్దిసేపటికే తిరిగివచ్చింది. జీపీఎస్‌ సంకేతాల్లో ఏదో తారుమారు జరుగుతున్నట్లు అనుమానం రావడంతో పైలట్లు ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని వెనక్కి మళ్లించారు. అలాగే భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్‌) చెందిన సి`130జే విమానం ఏప్రిల్‌లో మయన్మార్‌ గగనతలంపై ప్రయాణిస్తుండగా జీపీఎస్‌ స్పూఫింగ్‌ జరిగింది. దాంతో అప్రమత్తమైన పైలట్‌ దాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. జీపీఎస్‌ సిగ్నల్‌ వ్యవస్థలోకి విద్రోహులు చొరబడుతున్న ఘటనలు, స్పూఫింగ్‌ లేదా జామింగ్‌ అనేవి పెనువిపత్తుగా మారుతున్నాయి. స్ఫూపింగ్‌ వల్ల విమానాన్ని నడిపే పైలట్‌కు జీపీఎస్‌ తప్పుడు మార్గం, తప్పుడు గమ్యస్థానం చూపిస్తాయి. దాంతో నిర్దేశిత మార్గం నుంచి దారి మళ్లి విమానం మరో మార్గంలోకి వెళుతుంది. దీనివల్ల గగనతలంలో విమానాలు పరస్పరం ఢీకొనే ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎత్తయిన భవనాలు, కొండలను ఢీకొట్టొచ్చు. అలాగే ర్యాష్‌గా రన్‌వే పైకి దూసుకెళ్లడం ద్వారా ప్రమాదాలకు కారణం కావచ్చు. కల్లోలిత ప్రాంతాల్లో జీపీఎస్‌ స్పూఫింగ్‌ సమస్య అధికంగా ఉంది. 2024లో శాటిలైట్‌ సిగ్నల్‌ జామింగ్‌ లేదా స్పూఫింగ్‌ ఘటనలు 4.3 లక్షలు నమోదయ్యాయి. 2023లో ఈ సంఖ్య 2.6 లక్షలు. అంటే ఏడాదిలోనే 62 శాతం పెరి గాయి. ఈజిప్టు, లెబనాన్‌, నల్ల సముద్రం, రష్యా`ఎస్తోనియా, రష్యా`లాత్వియా, రష్యా`బైలారస్‌ సరి హద్దుల్లో స్పూఫింగ్‌ బెడద ఎక్కువగా ఉందని ఎయిర్‌లైన్స్‌ సంస్థలు చెబుతున్నాయి. ఇలాంటి ఘటనలపై అలర్ట్‌ చేసేందుకే అమెరికాలో ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఒక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page