top of page

వ్యవస్థల నిశ్శబ్ధం.. ప్రజాస్వామ్య సంక్షోభం

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • 9 hours ago
  • 2 min read

శాశ్వత అధికారం కోసం బిజెపి వేసిన బృహత్ ప్రణాళికలో సమాజంలో అన్ని వ్యవస్థలకూ నష్టం వాటిల్లుతోంది. అందులో ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నా మాట్లాడలేని భయం. అది వారికి మరణశాసనమని తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయత. ‘ఏ దేశంలో అయితే, బడుల పైకప్పులు పెచ్చులూడుతూ, గుడులు బంగారం వలె మెరుస్తూ ఉంటాయో, ఆ దేశం తనకు తానే స్వయంగా వినాశనానికి దారులు వేసుకుంటుంది’.. గ్రీక్ వేదాంతి సోక్రటీస్ మాట ఇది. ఇప్ప్పుడిది మన దేశానికి అచ్చుగుద్దినట్లు సరిపోయే మాట ఇది. ఇరాన్ సముద్ర జలాలలో భారతీయ నావికుల మీద అమెరికన్ బాంబుల దాడి.. 22 లక్షల మంది జీవితాలను చిద్రం చేసిన నీట్ పరీక్ష రద్దు.. 18 లక్షల మంది విద్యార్థులను కలత పెట్టిన సిబిఎసఇ పరీక్ష గోల్‌మాల్.. విద్యార్థుల ఆత్మహత్యలు, తల్లిదండ్రుల కడుపు మంట.. 4వేల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు 17 లక్షల మంది యువకుల ప్రయాణంలో, ప్రయాసలో తొక్కిసలాటలు, చావులు.. డాలర్‌తో మారకం విలువ 96 రూపాయ లకు పతనం.. సమస్య ఏదైనా సరే, సమాధానం చెప్పే యంత్రాంగం లేదిక్కడ. నియంతల అకృ త్యాల కంటే, మేధావుల మౌనం వల్లనే ఎక్కువ నష్టం జరుగుతుందని చరిత్ర చెప్తున్నది. ప్రాంతీయ పార్టీలను ఒక పథకం ప్రకారం సర్వనాశనం చేసుకుంటూ పోవడం. శివసేన, తృణమూల్ కాంగ్రెస్, అకాలీదళ్, ఎన్‌సిపి, అస్సాం గణ పరిషత్... అన్ని నదులు కాషాయ సాగరంలో సంగమి స్తున్నాయి. శరద్ పవార్, లల్లు ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, మాయావతి వంటి నేతలందరూ పిపీలికాలుగా మారిపోతున్నారు. ప్రాంతీయ పార్టీలు రాత్రికి రాత్రి ముక్క చెక్కలుగా చీలిపోయి, లోక్‌సభ సభ్యులు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ బిజెపితో కలిసిపో తున్నారు. ఈ ప్రక్రియ లక్ష్యం - పార్లమెంటులో తిరుగులేని, మూడింట రెండు వంతుల మెజారిటీ, తద్వారా నియోజకవర్గాల పెంపు బిల్లు ఆమోదం, రేపటి ఎన్నికలలో ఏ పార్టీ కూడా పోటీ చేయలేని పరిస్థితి కల్పించడం, దక్షిణాదిలో బిజెపి ఎంత బలహీన పడినా ఢిల్లీ సర్కారు ఏర్పాటులో దాని ప్రభావం లేకుండా జాగ్రత్త పడడం. ప్రజాస్వామ్యంలో రాజకీయ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, గెలుపు కోసం సామ దాన భేద దండోపాయాలు సహజం. కానీ ఇప్పుడు జరుగుతున్నది - ప్రత్య ర్థులను ఓడించడం కాదు, సమూలంగా సర్వనాశనం చేయడం. ప్రజాస్వామ్యమనే మహా వటవృక్షా నికి వేరు పురుగు ఆశించిందనే నిజం ప్రజలకు తెలియకుండా చేయడానికి ప్రసార సాధనాలు, పత్రికలు సహకరిస్తూనే ఉంటాయి. ప్రస్తుతానికి బొద్దింకలు కేవలం పరీక్షా పత్రాల లీక్ మీద, విద్యామంత్రి రాజీనామా మీద మాత్రమే దృష్టి సారిస్తున్నారు. స్వయం నియంత్రణ పాటిస్తున్నారు. రాజకీయ ప్రసంగాలు చేయడం లేదు. ఎన్నికలలో పోటీ చేసే ఉద్దేశం లేనే లేదని స్పష్టంగా ప్రకటించారు. విచిత్రం ఏమిటంటే, బొద్దింకల సమూహం ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, నాగ్ పూర్, అమృత్‌సర్, జైపూర్ వంటి ఎన్నో నగరాలలో నిరసన ప్రదర్శనలు చేస్తుంటే, ఒక్క వార్త కూడా ప్రసారం చేయని టీవీ ఛానెళ్లు, మేము ఎన్నికలలో పోటీ చేయము అని వారు చేసిన ప్రకటనకు మాత్రం ఎక్కడలేని ప్రచారం ఇస్తున్నారు. ఇందిరాగాంధీ ఎమెర్జెన్సీ విధించినప్ప్పుడు దేశంలో పత్రికలు మాత్రమే ఉండేవి. ఎలక్ట్రానిక్ మీడియా, యÖట్యూబ్ ఛానళ్లంటే తెలియదు. కానీ ఇప్ప్పుడలా కాదు. ఫేస్‌బుక్, ఇన్‌స్టా వంటి అనేక సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చేశాయి. వీటిని నిషేధించడం అంత సులువు కాదు. అందుకే యÖట్యూబ్‌లో ప్రశ్నించే గొంతు లపై దేశద్రోహం కేసులు పెడుతున్నారు. ప్రధాన స్రవంతి మీడియా అసలు వారు జర్నలిస్టులు కాదంటున్నారు. కేంద్రం ఎన్ని అకౌంట్ల మీద ఉక్కుపాదం మోపితే, అంతమంది సబ్‌స్క్రైబర్లు పెరుగుతున్నారు. ఓవరాల్‌గా బీజేపీ ప్రభుత్వం మీద నెగెటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. అయితే దాన్ని బయటపడకుండా జాగ్రత్తపడుతున్నారు. ఆప్ ఎంపీగా ఉన్న రాఘవ్ చద్దా బీజేపీ తీర్థం పుచ్చుకోగానే ఆయన సోషల్ మీడియా అకౌంట్ నుంచి లక్షలాది మంది అన్‌ఫాలో కావడం ఒక సంకేతం మాత్రమే. ఎలక్షన్ కమిషన్, ఈడీ, సిబిఐ, న్యాయస్థానాల వంటి వ్యవస్థలన్నీ ప్రజల నుంచి ఎన్ని విమర్శలు వస్తున్నా, పట్టించుకోకుండా కేంద్రం సేవలో తరిస్తున్నాయి. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కారంలో సుప్రీం కోర్ట్ ఎంత బేలగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 329ని చూపించి, తన నిస్సహాయత వ్యక్తం చేసిందో కళ్లారా చూశాము. రేపు 2029 ఎన్నికలలో బిజెపి గెలుపు కోసం ఎలక్షన్ కమిషన్ ఎందరి నామినేషన్లకు ఈ గతి పట్టించబోతుందో ఊహించుకోవచ్చు. ఎందుకంటే.. నామినేషన్లను అనుమతించేది, తిరస్కరించేది కూడా ఎన్నికల అధికారే. అందులో ఒకసారి అధికారి తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులు ప్రశ్నించలేవు. కానీ ఎన్నో సందర్భాల్లో ఈ దేశంలో న్యాయమÖర్తులు మనఃసాక్షితో తీర్పులిచ్చిన సందర్భాలు మనకు తెలుసు. ప్రతిపక్షాలు ఆ సమస్యను ఒక సవాలుగా స్వీకరించి, ప్రతిఘటించే సమర్థతతో లేవు. వారి శక్తులన్నీ ఉడిగి పోయాయి. అతి త్వరలో భారత దేశంలో మహా భయంకరమైన ఆర్థిక ఉత్పాతం రాబోతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెట్రోల్ వాడవద్దని మోడీ చేసిన హెచ్చరిక ఈ ప్రమాదానికి ఒక సంకేతం. మరొక పక్క ప్రజాస్వామ్యం పీక నులిమే ప్రయత్నాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. రేపు నియోజక వర్గాల పెంపు బిల్లు ఆమోదం దానికి ఒక నిలువుటద్దం. ఈ ఉత్పాతాలను, ప్రమాదాలను సహిస్తూ, భరిస్తూ, మౌనంగా ఉండి పోవడం తప్ప ప్రజలకు వేరే గత్యంతరం లేదా?


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page