వైవిధ్య ఒప్పందాలతో సంక్షోభాలకు చెక్!
- DV RAMANA

- 6 days ago
- 3 min read

యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న కల్లోల పరిస్థితుల్లో అక్కడి నుంచి సరఫరా కావాల్సిన క్రూడ్, గ్యాస్‌కు అంతరాయాలు వాటిల్లుతున్నాయి. ఫలితంగా ప్రపంచ దేశాలతోపాటు భారత్‌లోనూ పెట్రోల్, గ్యాస్ సంక్షోభం నెలకొంది. పెట్రోల్ కంటే గ్యాస్ కొరత ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ సంక్షోభ సమయంలో భారత ప్రభుత్వం ముందుచూపుతో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు అక్కరకు వస్తున్నాయి. భారత్ తన ఇంధన, గ్యాస్ అవసరాలకు అధికశాతం గల్ప్ దేశాలపైనే ఇన్నాళ్లుగా ఆధారపడుతోంది. ఈ ప్రాంతంలో తరచూ చెలరేగుతున్న యుద్ధాలు, ఘర్షణలు, ఉద్రిక్తతలు ఆయిల్, గ్యాస్ సరఫరాలపై ప్రభావం చూపుతూ కొరత సష్టించడంతోపాటు ధరల భారం మోపుతున్నాయి. దీన్ని దష్టిలో ఉంచుకుని గల్ఫ్‌పై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకుని.. ఇతర మార్గాలను గత కొన్నేళ్లుగా ప్రభుత్వం అన్వేషిస్తున్నది. ప్రస్తుత కష్టకాలంలో అవి ఉపయోగపడుతున్నాయి. అలా కలిసివస్తున్న దేశాల్లో ఆర్జెంటీనా ముందుంది. భారత్‌కు ఎల్పీజీ సరఫరాను ఈ ఏడాది ఆ దేశం భారీగా పెంచింది. జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో అర్జెంటీనా నుంచి మన దేశానికి 50 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ అందింది. 2025లో సరఫరా చేసిన 22 వేల టన్నులతో పోలిస్తే ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే సరఫరా రెట్టింపు దాటడం గమనార్హం. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే బాహియా బ్లాంకా పోర్టు నుంచి 39 వేల టన్నులు రాగా ఈ నెల ఐదో తేదీన మరో 11 వేల టన్నుల కార్గో భారత్‌కు బయలుదేరింది. భారత ఎల్పీజీ మార్కెట్‌లో తన వాటా పెంచుకోవడానికి అర్జెంటీనా ప్రయత్నిస్తున్నది. దానికోసం తమ దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఈ ఏడాది పెంచుకునే సన్నాహాల్లో ఉంది. దక్షిణ అమెరికా ఖండంలో కీలకమైన అర్జెంటీనా భారత్‌కు ఒక ముఖ్యమైన ఆర్థిక భాగస్వామిగా మారుతోంది. 2025 జనవరి-నవంబర్ మధ్య ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 6.34 బిలియన్ డాలర్లకు చేరుకుంది (36.77 శాతం వృద్ధి). తద్వారా అర్జెంటీనాకు భారత్ ఐదో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మారింది. గ్యాస్‌తోపాటు ఎడిబుల్ ఆయిల్స్ (సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్), తోలు వస్తువులు, తృణధాన్యాలు, పప్పు దినుసుల కోసం భారత్ అర్జెంటీనాపై ఆధారపడుతోంది. ఎక్కడో సుదూరంగా ఉన్న ఆర్జెంటీనాతోపాటు మనకు సమీపంలోనే ఉన్న ఒక బుల్లి దేశం కూడా కష్టకాలంలో మనకు తోడుగా నిలుస్తోంది. ఆగ్నేయ ఆసియాలో చిన్న దేశమైన బ్రూనై దేశం చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో ముందు వరుసలో ఉంటుంది. ఈ దేశం నుంచి ఇండియా ప్రతి సంవత్సరం సుమారు ఒక బిలియన్ డాలర్ల విలువైన క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నది. రోజుకు కనీసం 25 వేల బ్యారెళ్ల ముడి చమురు మన దేశానికి సరఫరా అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. బంగాళాఖాతం ద్వారా ఆగ్నేయ దేశాల నుంచి మన దేశానికి క్రూడ్ ఆయిల్ అలాగే లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ తెచ్చుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం మలేషియా సమీపంలో ఉన్నటువంటి బ్రూనై దేశం గురించి తెలుసుకుందాం. ఆగ్నేయ ఆసియాకు చెందినటువంటి బ్రూనై దేశం ఎక్కువగా చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో టాప్ స్థానంలో ఉంది అని చెప్పవచ్చు. భారతదేశం నుంచి ప్రతి సంవత్సరం సుమారు ఒక బిలియన్ డాలర్లు విలువైనటువంటి క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. రోజుకు కనీసం 25 వేల బ్యారెల్స్ ముడి చెమురు భారతదేశం బ్రూనై నుంచి దిగుమతి చేసుకుంటుందని గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి బ్రూనై వెలికి తీసే క్రూడ్ ఆయిల్ చాలా నాణ్యమైనది, విలువైనదిగా ఆయిల్‌రంగ నిపుణులు చెబుతుంటారు. మిగతా దేశాల క్రూడ్‌తో పోలిస్తే బ్రూనై క్రూడ్‌లో సల్ఫర్ తక్కువ మోతాదులోనే ఉంటుంది. అందువల్ల దీన్ని శుద్ధి చేయడం కూడా చాలా సులభమని నిపుణులు చెబుతున్నారు. ఇది పర్యావరణానికి కూడా అంత హానికరమైనది కాదు. బ్రూనై నుంచి వచ్చే ముడి చమురు నుంచి ఉత్తత్తి చేసే పెట్రోల్, డీజిల్ కూడా మంచి నాణ్యతతో ఉంటాయని అంటున్నారు. అలాగే ఈ దేశం నుంచి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(ఎల్పీజీ)ను కూడా భారత్ పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నది. ఇవన్నీ గత కొద్దికాలంలోనే భారత్ కుదుర్చుకున్న ఒప్పందాల ఫలితాలే. ప్రధాని నరేంద్ర మోదీ 2024 సెప్టెంబర్‌లో బ్రూనైలో పర్యటించారు. ఆ సందర్భంగా ఇరుదేశాల మధ్య చమురు, గ్యాస్ రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకునే కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇందులో కీలకమైన ఒక దీర్ఘకాలిక సరఫరా ఒప్పందం కూడా ఉంది. ప్రపంచ మార్కెట్లో ధరలు పెరిగినప్పటికీ బ్రూనైతో మనం కుదుర్చుకున్న దీర్ఘకాలిక చమురు సరఫరా ఒప్పందం వల్ల పాత ధరకే చమురు, గ్యాస్ దిగుమతి అవుతాయి. దీనివల్ల మనదేశంపై అదనపు ఆర్థికభారం నుంచి తప్పించుకోగలుగుతుంది. అంతేకాకుండా బ్రూనైలోని చమురు క్షేత్రాల్లో భారత ప్రభుత్వ సంస్థ అయిన ఓఎన్జీసీ విదేశ్ సహా పలు సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. అలాగే బ్రూనై నుంచి మన దేశానికి బంగాళాఖాతం మీదుగా నేరుగా తూర్పు తీరంలోని కాకినాడ, విశాఖపట్నం, పారాదీప్ వంటి పోర్టులకు చమురు, ఎల్పీజీ రిఫైనరీలకు పైప్‌లైన్‌ల ద్వారా ముడిసరుకు సరఫరా చేసే సదుపాయం కూడా ఉంది. గల్ఫ్ దేశాల్లో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం కారణం అక్కడి నుంచి గ్యాస్ సరఫరా కాని పరిస్థితుల్లో బ్రూనై, అర్జెంటీనా దేశాలతో మనదేశానికి ఉన్న ఒప్పందాలు చాలా ఆదుకుంటున్నాయని , లేనిపక్షంలో ఇప్పటికే దేశంలో ఆయిల్, గ్యాస్ సంక్షోభం తీవ్రమై అన్ని వ్యవస్థలు స్తంభించిపోయేవని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ అనుభవాల నేపథ్యంలో భవిష్యత్తులో సంక్షోభాల బారిన పడకుండా ఇలాంటి ముందుజాగ్రత్తలు చర్యలు మరిన్ని తీసుకోవాలని భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా గ్యాస్, క్రూడ్ ఆయిల్ నిక్షేపాలు కలిగిన దేశాల నుంచి దిగుమతులు పెంచేందుకు భారతదేశం ప్రణాళికలు రచిస్తుండటంతో కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నది. ప్రస్తుతం ఆగ్నేయాసియా దేశాల్లో ఉన్న ఆయిల్ క్షేత్రాల నుంచి కూడా దిగుమతి చేసుకునేందుకు భారత్ సిద్ధంగా ఉంది.






Comments