top of page

విశాఖ ఉక్కుతో సర్కారు ఆటలు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jun 27, 2025
  • 2 min read

దేశంలోనే అతిపెద్ద స్టీల్‌ ప్లాంట్లలో ఒకటైన విశాఖ ఉక్కు కర్మాగారంతో కేంద్ర ప్రభుత్వం ప్రయో గాలు చేస్తోందో లేక ఆటలాడుకుంటోందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఫలితంగా గత నాలుగేళ్లు గా ఈ పరిశ్రమ భవిష్యత్తు డోలాయమాన స్థితిలో ఊగిసలాడుతోంది. నష్టాలు వస్తున్నాయన్న సాకు తో 2021లో కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని పెట్టుబడుల నియంత్రణ బోర్డు విశాఖ ఉక్కులో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వంద శాతం పెట్టుబడిని విక్రయించాలన్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు దానికి ఆమోదముద్ర కూడా వేసింది. దాంతో పెట్టుబడి ఉపసంహరణ పేరుతో ప్రైవేట్‌పరం చేసే యత్నాలకు తెరలేచింది. అప్పటినుంచీ ఈ వివాదం నలుగుతూనే ఉంది. స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న వేలాది ఉద్యోగులు, కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక సంఘాలు విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని ప్రారంభించి ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి. పలుమార్లు యూని యన్ల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలను తీసుకుని ఢల్లీి వెళ్లి కేంద్ర ఆర్థిక, ఉక్కు శాఖల మంత్రు లకు వినతిపత్రాలు సమర్పించినా, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ జేడీ లక్ష్మీనారాయణ రాష్ట్ర హైకోర్టులో కేసు వేసినా కేంద్రం తన తీరును మార్చుకోలేదు. అయితే గత ఏడాది సార్వత్రిక ఎన్నికల ముందు మారిన రాజకీయ సమీకరణాలు.. ఆ ఎన్నికల్లో అటు రాష్ట్రంలోనూ ఇటు కేంద్రంలోనూ ఎన్డీయే ప్రభుత్వాలే కొలువుదీరిన నేపథ్యంలో విశాఖ ఉక్కుకు సంబంధించి పెట్టుబడుల ఉపసంహ రణ, ప్రైవేటీకరణ అనే మాటలు వినిపించడం ఆగిపోయింది. దాని స్థానంలో స్టీల్‌ప్లాంట్‌ ఆర్థిక పునరుజ్జీవం పేరుతో కొత్త ప్రయోగాలు మొదలయ్యాయి. సమస్యకు మూలం ఏమిటన్నది అందరికీ తెలుసు. దాన్ని పరిష్కరిస్తే అన్నీ సమసిపోయి విశాఖ ఉక్కు మళ్లీ తలెత్తుకోగలుగుతుంది. కానీ ఎవరూ దాని ఊసెత్తడం లేదు. సొంత గనులు లేకుండానే భారీ విస్తరణ చేపట్టిన ఫలితమే స్టీల్‌ ప్లాంట్‌ ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభం. దీనివల్ల ఎక్కువ రేటుకు ముడిసరుకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. దానికోసం చేసిన అప్పులు, వాటికి వడ్డీల కలిపి సుమారు రూ.40వేల కోట్లకు ఎగబాకాయి. సొంత గనులు కేటాయించి, కష్టాల నుంచి గట్టెక్కించాల్సిన కేంద్రం ఆ పని చేయ కుండా రాజకీయ కోణంలోనే ఆలోచిస్తూ ఆర్థిక పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించింది. డైరెక్ట్‌ ఈక్విటీ కింద రూ.10,300 కోట్లు, షేర్‌ క్యాపిటల్‌గా రూ.1,140 కోట్లు కేటాయించింది. మరోవైపు విద్యుత్‌, వాటర్‌, ట్యాక్సుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు వేల కోట్ల మేరకు వెసులుబాటు కల్పిం చింది. దాంతో ఊపిరి పీల్చుకున్న విశాఖ ఉక్కు అధికారులు ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. 73 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన ఈ ప్లాంట్‌లో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ లదే కీలక భూమిక. గోదావరి, కృష్ణ, అన్నపూర్ణ పేరుతో అటువంటి మూడు బ్లాస్ట్‌ ఫర్నెస్‌(ముడి ఇనుము కరిగించే కొలిమి)లు ఇక్కడ ఉన్నాయి. వీటిలో తొలి రెండు నిర్వహణ పనుల కారణంగా నిలిచిపోగా, రా మెటీరియల్‌ కొరత, ఆర్ధిక నష్టాల వల్ల మూడో ఫర్నెస్‌ కూడా కొన్నాళ్లుగా మూలన పడిరది. ఆర్థిక పునరుద్ధరణ చర్యల పుణ్యాన మూడో బ్లాస్ట్‌ ఫర్నెస్‌ పునరుద్ధరణ యత్నాలు ఫలిం చాయి. ఆ మేరకు ఈ నెల 27న అన్నపూర్ణ కొలిమిని పున:ప్రారంభించారు. ఇకనుంచి దశలవారీగా మూతపడిన అన్ని విభాగాలను పని చేయించాలని ప్లాంట్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అదే జరిగితే స్టీల్‌ప్లాంట్‌ను మాతృసంస్థ అయిన స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌)లో విలీనం చేసేం దుకు అవకాశాలు మెరుగుపడతాయి. ఆ లక్ష్యంతోనే అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మానవ వనరుల్లో భారీ కోత పెట్టిన యాజమాన్యం ఇప్పుడు కీలక విభాగాలను ప్రైవేటీకరి స్తోంది. అత్యంత కీలకమైన ఆర్‌ఎంహెచ్‌ఎస్‌, సింటర్‌ ప్లాంట్లను కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. తీర ప్రాంతంలో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ప్లాంట్లలో ప్రముఖమైనదైన ఈ ప్లాంట్‌లో కీలక విభాగాలన్నీ యాజమాన్యం పరిధిలోనే ఉండటం అనివార్యం. కానీ విభాగాల వారీగా వాటి నిర్వహణ బాధ్యతలను కాంట్రాక్ట్‌ సంస్ధలకు అప్పగించడం వల్ల సమన్వయం లోపిం చడమే కాకుండా భద్రతపరంగా ప్రమాదకరమని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుత సంక్షోభానికి మూలమైన రా మెటీరియల్‌ కొరత తీర్చేలా ప్లాంట్‌కు సొంత గనులు కేటాయిం చడం కాకుండా విభాగాల ప్రైవేటీకరణ వంటి అనాలోచిత నిర్ణయాలు మరింత ప్రమాదకరమని ఈ రంగం నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page