వలస వచ్చి స్థానికులనే వెక్కిరిస్తే ఎలా?
- DV RAMANA

- Sep 5, 2025
- 2 min read

కడుపు చేత్తో పట్టుకుని దేశం కాని దేశానికి వలస వచ్చామన్న ఇంగితాన్ని సైతం కోల్పోతున్నారు. ఆశ్రయం ఇస్తున్న దేశాలపైనే వివక్షాపూరిత వ్యాఖ్యలు చేయడం, స్థానికులపైనే లైంగిక దాడులకు తెగబడటం వంటి దుష్కృత్యాలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ చేస్తున్నది పాకిస్తాన్, మరికొన్ని దేశాలకు చెందిన ముస్లిం వలసవాదులు కావడంతో ఆయా దేశాలు ముస్లిం వ్యతిరేక ఆందోళనలతో హోరెత్తు తున్నాయి. వలసవాదుల కండకావరం మొత్తం ముస్లిం జాతీయులపై వ్యతిరేకత పెంచుతోంది. డెన్మార్క్‌కు వలస వచ్చిన పాకిస్తానీయుడు స్థానిక పౌరుడితో గొడవ పెట్టుకోవడమే కాకుండా.. మరి కొన్నేళ్లలో మీ దేశంలోనూ మా జనాభాయే అధికంగా ఉంటుందని, అప్పుడు మీరు మైనారిటీలుగా మారి మా కాళ్లు పట్టుకోవాల్సి వస్తుందన్నట్లు అహంకార, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడు. ‘నాకు ఐదుగురు పిల్లలు.. అందరూ డెన్మార్క్‌లోనే ఉన్నారు. కానీ నీతోపాటు డెన్మార్క్‌వాసులందరికీ ఒకరి ద్దరు పిల్లలే.. అందువల్ల వచ్చే పదేళ్లలో డెన్మార్క్‌లో మీ జనాభా తగ్గి మైనార్టీలుగా మారుతారని.. పాకిస్తానీలమైన మేం సంఖ్యాధిక్యతతో ఆధిపత్యంలోకి వస్తాం’ అని అంటూ ఆ పాకిస్తానీయుడు డ్యానిష్ పౌరుడితో వాగ్వాదానికి దిగాడు. ఒక్క డెన్మార్క్‌లోనే కాదు.. దాదాపు యూరప్ దేశాల న్నింట్లోకి వలస వెళ్తున్న పాకిస్తానీలు అధిక సంతానంతో తమ జనాభాధిక్యాన్ని పెంచుకునే పనిలో పడ్డారని ఆయా దేశాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. వలస వచ్చిన తమకు ఆశ్రయం కల్పించిన స్థానికులనే బెదిరిస్తున్న పాకిస్తానీల అహంకారపూరిత ధోరణిని ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ తన ట్వీట్‌లో ప్రస్తావించడం సంచలనమైంది. అదే హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు బ్రిటన్‌లో అసభ్యంగా ప్రవర్తించిన ఒక వలసవాద ముస్లిం జాతీయుడిపై లోలి అనే స్థానిక బాలిక దాడి చేయగా, అక్కడి పోలీసులు తిరిగి ఆమెపైనే కేసు పెట్టడం బ్రిటన్‌లో పెద్ద ఎత్తున నిరసనలకు తావి చ్చింది. యూకే ఫస్ట్ అన్న నినాదంతో ఉద్యమిస్తున్న అక్కడి ప్రజలు ముస్లిం వలసదారులను దేశం నుంచి తరిమేయాలని డిమాండ్ చేస్తున్నారు. యూరప్ దేశాలన్నింటిలోనూ ఇదే తరహా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి అక్రమంగా వలస వచ్చినవారు సామాజిక, ఆర్థిక, భద్రతా సమస్యలకు కారణమవుతున్నారని పశ్చిమ మీడియాతో పాటు అక్కడి పౌర సమాజాలు ఆరోపిస్తు న్నాయి. అక్రమ వలసదారుల పెరుగుదల నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల హోటల్ యజమా నులతో ఏడేళ్లకు కాంట్రాక్టు ఒప్పందాలు కుదుర్చుకుంటూ వలసదారులకు వసతి సౌకర్యాలు కల్పిం చేందుకు భారీగా నిధులు ఖర్చు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ చర్యలు సమస్యను తగ్గించ కుండా మరింత ప్రోత్సహించే విధంగా ఉన్నాయన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఒకవైపు సరిహద్దు నియంత్రణలో విఫలం.. మరోవైపు మానవతావాద అజెండా.. ఈ రెండిరటి వల్లే వలస సంక్షోభం పెరుగుతున్నదని నిపుణులు చెబుతున్నారు. యూరప్‌లోని అనేక నగరాల్లో వలసదారులు దుందుడుకుగా వ్యవహరిస్తూ స్థానికులతో ఘర్షణలకు పాల్పడుతున్నారు. మహిళలపై వేధింపులు, లైంగిక దాడులు, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారన్న ఆరోపణలు పెరుగుతు న్నాయి. దీనివల్ల స్థానిక ప్రజల్లో అభద్రత పెరిగి సామాజిక విభజనకు ఆస్కారమిస్తోంది. ‘మల్టీ కల్చరలిజం’ పేరుతో వచ్చిన విధానం వాస్తవానికి సమాజంలో ఉద్రిక్తతలను పెంచిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వలసల సమస్య ప్రస్తుతం యూరప్‌లో పార్టీల రాజకీయ అజెండాగా మారిపో యింది. వలసదారులను మానవహక్కుల కోణంలో చూడాలని లిబరల్, వామపక్ష పార్టీలు కోరు తుంటే.. సరిహద్దు భద్రత, జాతీయ ప్రయోజనాల పరిరక్షణే ముఖ్యమని అధికార పార్టీలు వాదిస్తు న్నాయి. ఈ విభేదాలు వలస సంక్షోభ పరిష్కారంపై నీలినీడలు ప్రసరింపజేస్తున్నాయి. వలసదారు లను ఇలాగే కొనసాగిస్తే స్థానికుల ఉద్యోగావకాశాలు, వనరులు మరింత ఒత్తిడికి గురవుతాయని, నేరాలు, భద్రతా సమస్యలు బాగా పెరిగిపోతాయన్న ఆందోళన ఆయా దేశాల ప్రజల్లో వ్యక్తమవు తోంది. చొరబాట్లను సమర్థవంతంగా అరికట్టడమే వలసల సమస్యకు పరిష్కార మార్గమని నిపుణు లు పేర్కొంటున్నారు. అక్రమ వలసలపై నిషేధాత్మక విధానాలు, త్వరితగతిన వారిని స్వదేశాలకు తిరిగి పంపే విధానాలు కచ్చితంగా అమలు చేయాలి. వలసదారుల సమస్య మానవీయ అంశమే అయినప్పటికీ.. స్థానికుల భద్రత, జాతీయ ప్రయోజనాలు కూడా అంతే ముఖ్యమని గ్రహించాలి.










Comments