top of page

సిక్సు కొట్టాడు.. రూ.5 లక్షల ఫైన్‌ కట్టాడు..!

  • Guest Writer
  • May 24
  • 2 min read

ree

ఐపీఎల్‌ అంటేనే మనీ మెషిన్‌. ఇటు బీసీసీఐకి, అటు ప్లేయర్లకు కాసుల పంట. ప్రతీ ఏడాది కోట్లాది రూపాయల సాలరీలు అందుకోవడమే కాకుండా, గేమ్‌లో రాణిస్తే వివిధ రూపాల్లో డబ్బులు వచ్చి పడతాయి. అత్యధిక సిక్సులు కొట్టినందుకు కూడా ప్రైజ్‌ మనీ గెలుచుకుంటారు. కానీ ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లేయర్‌ అభిషేక్‌ శర్మ శుక్రవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో కొట్టిన సిక్సుకు రూ.5 లక్షలు జరిమానా కట్టాల్సి వచ్చింది.

లక్నోలోని ఏక్నా స్టేడియంలో హైదరాబాద్‌, బెంగళూరు మధ్య జరిగిన ఐపీఎల్‌ లీగ్‌ మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మ ఒక భారీ సిక్స్‌ కొట్టాడు. అది కాస్తా.. బౌండరీ వెలుపల డిస్‌ప్లే కోసం పెట్టిన టాటా కర్వ్‌ వి కారుకు తాకింది. కార్‌ విండ్‌ షీల్డ్‌ను ఆ బంతి డ్యామేజ్‌ చేసింది. దీంతో అభిషేక్‌ శర్మ రూ.5 లక్షలు కట్టాల్సి వచ్చింది.

ఎందుకీ ఫైన్‌?

బ్యాటర్లు కావాలని కారును డ్యామేజ్‌ చేయడానికి సిక్సులు కొట్టరు కదా! బౌలర్లు వేసే బంతులను బట్టి దాన్ని ఎటువైపు కొట్టాలో అప్పటికప్పుడు డిసైడ్‌ అవుతారు. టాటా వాళ్ల ప్రచారం కోసం కార్లను మైదానంలో పెట్టి, దాన్ని డ్యామేజ్‌ చేస్తే ఫైన్‌ అంటే ఎలా అని చాలా మంది మండిపడుతున్నారు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్‌. ఐపీఎల్‌ స్టార్ట్‌ కాకముందే బీసీసీఐ, టాటా మోటార్స్‌కి మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఏ ప్లేయర్‌ అయినా కారును డ్యామేజ్‌ చేసేలా సిక్సులు లేదా బౌండరీలు కొడితే.. ప్రతీ డ్యామేజీకి రూ.5లక్షలు ఫైన్‌ కట్టాలని, ఆ డబ్బులను గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్‌ అభివృద్ధి కోసం, పేద క్రికెటర్ల కిట్‌ బ్యాగుల కొనుగోలుకు ఉపయోగించాలని నిర్ణయించారు. అంటే ఇప్పుడు అభిషేక్‌ శర్మ నుంచి వసూలుచేసే మొత్తంతో కిట్‌ బ్యాగులు కొని పంచుతారన్నమాట.

పేద క్రికెటర్లకు కిట్‌ బ్యాగులు పంచడం వరకు బానే ఉంది. కానీ ప్లేయర్ల నుంచి వసూలు చేయడం దేనికి? బీసీసీఐ వేల కోట్ల లాభాల్లో ఉన్న క్రికెట్‌ బోర్డు. టాటా మోటార్స్‌ ఎంత బడా సంస్థనో చెప్పనక్కరలేదు. వీళ్లిద్దరూ కలిసి కిట్‌ బ్యాగులు పంచాలనుకుంటే.. సొంత డబ్బులు వాడుకోవాలి కానీ.. క్రికెటర్ల నుంచి ఎందుకు గుంజడం? సరే అభిషేక్‌ శర్మకు అయితే సాలరీ రూపంలో భారీగానే వస్తాయి కాబట్టి రూ.5 లక్షలు కడతాడు. ఎవరైనా ఒక అన్‌ క్యాప్డ్‌ ప్లేయర్‌.. కేవలం రూ20 లక్షల సాలరీతో ఆడుతున్నాడనుకోండి.. అతను నాలుగు సిక్సులు బాది కారును డ్యామేజ్‌ చేస్తే.. అతనికి వచ్చేది సున్నా.. అసలు ఆ కారుకు కొత్త విండ్‌ షీల్డ్‌ వేసినా అంత ఖర్చు కాదు. బీసీసీఐ, టాటా మోటార్స్‌ కలిసి చేసే స్వచ్ఛంద సేవకు డబ్బులు ప్లేయర్లు ఇవ్వాలన్నమాట. బాగుంది మాష్టారూ మీ ఐడియా.

భాయ్‌జాన్‌

Comentários


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page