స్టాఫ్ మీటింగ్‌లో కుప్పకూలిపోయిన అధ్యాపకుడు
- SATYAM DAILY
- 6 days ago
- 1 min read

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
స్థానిక ఆర్ట్స్ కళాశాలలో తెలుగు సీనియర్ అధ్యాపకులుగా పని చేస్తున్న పప్పల వెంకట రమణ విధులు నిర్వహిస్తూ మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా మృతిచెందారు. ప్రిన్సిపాల్ పోలినాయుడు కొత్తగా బాధ్యతలు చేపట్టడంతో తన ఛాంబర్‌లో స్టాఫ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో కూర్చున్న పప్పల వెంకటరమణ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆయన్ను వెంటనే డే అండ్ నైట్ సెంటర్ దగ్గరున్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు. వెంకటరమణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈయన స్వస్థలం కింతలి, కనిమెట్ట దగ్గర ధర్మపురం. ఈయన పీఎన్ కాలనీలో నివాసముంటున్నారు. నాలుగేళ్లుగా ఆర్ట్స్ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పని చేస్తున్నారు. ఈయన మృతిపట్ల ప్రిన్సిపాల్ పోలినాయుడు, ఇతర అధ్యాపకులు సంతాపం తెలియజేశారు.










Comments