top of page

సొంతవారికే నమ్మకద్రోహం..!

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • 1 hour ago
  • 4 min read
  • ఆయన అమ్ములపొదిలో ఫేక్ ఫిర్యాదుల ఫ్యాక్టరీ

  • తనకు రిలీవ్ తప్పదని అనకాపల్లి ఏపీసీకి పొగబెట్టారన్న ఆరోపణలు

  • మళ్లీ సమగ్రశిక్షకు రావడానికి సకల యత్నాలు

  • రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్సీనంటూ ప్రచారం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

ప్రస్తుతం ఏ ఎమ్మెల్సీ తన చెప్ప్పుచేతల్లో ఉన్నారని, తాను చెప్పినట్టే నడుచుకుంటారంటూ ప్రచారం చేసుకొని పాఠాలు చెప్పకుండా పబ్బం గడుపుకుంటున్నారో, అదే లెక్చరర్ రాబోయే ఎన్నికల నాటికి తానే ఎమ్మెల్సీనని మరోవైపు ప్రకటించుకుంటున్నారట. జిల్లా విద్యాశాఖకు సంబంధించి అటు స్కూల్ ఎడ్యుకేషన్, ఇటు హయ్యర్ ఎడ్యుకేషన్, మరోవైపు టెక్నికల్ ఎడ్యుకేషన్.. ఇలా దేన్నయినా ఎమ్మెల్సీ ద్వారా పైరవీలు చేయించి తనను కాదన్నవారిని శంకరగిరి మాన్యాలు పట్టించిన ఆర్ట్స్ కాలేజీ లెక్చరర్ తెర వెనుక మాత్రం వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని, ప్రస్తుతం ఎమ్మెల్సీగా గెలిచిన వ్యక్తి తన మద్దతుదారుల ఓట్లతోనే గెలిచారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో తానే ఎమ్మెల్సీనవుతానంటూ ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తుంది. సహజంగా శ్రీకాకుళానికి మాత్రమే పరిమితమైన ఈయన ఎమ్మెల్సీగా పోటీ చేయడం హాస్యాస్పదమని కొట్టిపారేయడానికి లేదు. నిరంతరం ప్రస్తుత ఎమ్మెల్సీకి అంటిపెట్టుకొని తిరుగుతూ ఆయన అనుపావులు, ఆయన ఓటుబ్యాంకును ఈయన నిశితంగా గమనిస్తున్నట్లు ఆయన మనుషులే గర్వంగా చెప్ప్పుకుంటున్నారట. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికకు మూడేళ్ల వరకు సమయం ఉండటంతో ఈలోగా అన్నీ చక్కబెట్టుకుంటున్నట్లు తెలుస్తుంది. సహజంగా ఈయన స్వభావం తెలిసినవారు కచ్చితంగా ఈ పని చేసేతీరుతాడన్న నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే.. నమ్మినవారి మీదే ఫిర్యాదులు చేయడం, వారిని నట్టేట ముంచడం ఈయనకు అలవాటు. సమగ్రశిక్ష నుంచి బయటకు పంపేసినా ఇంకా ఆ సీటు మీద మనోడికి మోజు తీరనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే.. ఇది జిల్లాస్థాయి అధికారి హÃదా. ఆయన ప్రస్తుతం చేస్తున్నది కేవలం ఒక కాలేజీలో లెక్చరర్. పరిస్థితులు అనుకూలించకపోవడంతో తక్కువ కాలంలోనే ఏపీసీ పోస్టు నుంచి ఆయన్ను వెనక్కు పంపారు. కానీ మళ్లీ ఆ సీటులోకి రావడానికి ఆయన చేయని ప్రయత్నాలు లేవని అర్థమవుతుంది. అందులో భాగంగానే గత వైకాపా ప్రభుత్వానికి ముందు నుంచి ఉన్న ఏపీసీలు ఏర్పాటుచేసిన కాంట్రాక్టర్లు ఇప్ప్పుడు ఉన్న ఏపీసీకి లంచాలిస్తున్నారంటూ పితూరీలు పెట్టడం మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఒకే ఫిర్యాదును కాపీ.. పేస్ట్ చేసి వేర్వేరు పేర్ల మీద వేర్వేరు అధికారులకు, జిల్లా పత్రికా కార్యాలయాలకు పోస్ట్ చేస్తున్నారు. ఎప్ప్పుడైతే తమ పేర్లు వాడుకొని ఫేక్ ఫిర్యాదులు చేస్తున్నారంటూ ఎచ్చెర్ల స్టేషన్‌కు ఫిర్యాదు అందిందో, స్టైల్ మార్చడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తుంది. ఏపీసీ కుర్చీ నుంచి ఇప్ప్పుడున్న అధికారికి పొగబెడితే మళ్లీ ఆ సీటులో ఈయన సెటిల్ అవడానికి ప్రయత్నిస్తున్నారట. కాలేజీలో నిత్యం సామాజికవర్గానికి చెందినవారంతా ఒకే తాటిపై ఉండాలని, తనకన్నా జూనియర్లను తన ఫిర్యాదుల గ్యారేజ్‌లో చేర్పించి వారి ద్వారా పాపాలు చేయించి, పబ్బం గడుపుకొంటున్న ఈ లెక్చరర్ వాస్తవానికి అదే సామాజికవర్గానికి చెందిన అధికారులను కూడా తన తప్ప్పుడు ఫిర్యాదులతో బలి తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. అనకాపల్లి జిల్లా సమగ్రశిక్ష ఏపీసీగా పని చేసిన అధికారి ఆమధ్య తగరపువలస డిగ్రీ కాలేజీకి లెక్చరర్‌గా వెనక్కు పంపిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇందుకు కారణం ఏమంటే.. ఆయన వైకాపా హయాంలో శ్రీకాకుళం ఏపీసీగా పని చేయడమేనట. అటువంటప్ప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే ఆయన్ను అనకాపల్లికి ఎందుకు బదిలీ చేశారో, ఆ తర్వాత ఆయన వైకాపాలో పని చేశాడని ఎందుకు గుర్తొచ్చిందో తెలియాýంటే మనోడు పెట్టిన తెరవెనుక ఫిర్యాదులను బయటపెట్టాలి. తాను గెలిపించానని చెప్ప్పుకుంటున్న ఎమ్మెల్సీ ద్వారానే అనకాపల్లి ఏపీసీని వెనక్కు పంపగలిగారని తెలుస్తుంది. తాను శ్రీకాకుళం సమగ్రశిక్ష ఏపీసీగా లేనప్ప్పుడు తన తోటివారెవరూ అటువంటి హÃదాలో ఉండకూడదని భావించడమే ఇందుకు ప్రధాన కారణం.

వాస్తవానికి శ్రీకాకుళం సమగ్రశిక్ష ఏపీసీగా పని చేసిన సమయంలో పూర్తిగా ఫెయిలైన ఏకైక అధికారి ఈయనే. కలెక్టర్ సమావేశం నిర్వహిస్తే.. ఒక్కరోజు కూడా సమాధానం సరిగా చెప్పలేక నిరంతరం తిట్లు కాసిన ఏకైక ఏపీసీ కూడా ఈయనే. అలా అని పోనీ సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ నిర్వహించిన వర్చువల్ మీటింగ్‌లో కూడా ఏమైనా పొడిచారా.. అంటే అదీ లేదు. ఆయన కూడా ఈయన పని చేసినన్నాళ్లూ తిడుతునే ఉన్నారు. ఒక్కరోజు కూడా తాను పని చేసిన వ్యవస్థ మీద గ్రిప్ సంపాదించుకోవాలని ఈయన ప్రయత్నించలేదు. తన పాత వాసనలు వదలలేక ఒకవైపు ఫిర్యాదులు తయారుచేయడం, మరోవైపు వివిధ గైడ్‌లు తీసుకువచ్చి దాన్ని కాపీ.. పేస్ట్ చేయించి కొత్త పుస్తకాన్ని తన పేరిట ముద్రించుకునే పనిలోనే ఉన్నారు కానీ, సమగ్రశిక్ష స్పిరిట్‌ను కొనసాగించలేకపోయారు. అందుకే ఏడాది గడవకముందే ఆయన్ను వెనక్కు పంపేశారు. ఆయన ఏపీసీగా పని చేసినప్ప్పుడు కేజీబీవీ పాఠశాలల్లో జరిగిన అనేక సంఘటనలు స్వయంగా ఆయన్ను ఇక్కడకు తెచ్చి కూర్చోబెట్టిన ప్రజాప్రతినిధులకే మచ్చ తీసుకొచ్చాయి. అప్ప్పుడైనా కనీసం డ్యామేజ్ కంట్రోల్ కోసం ప్రయత్నించలేదు. ఎమ్మెల్యేలకు తప్ప్పుడు సమాచారమిచ్చి, ఇదంతా రాజకీయ కుట్రలో భాగమని పక్కదారి పట్టించారే తప్ప ఒక డిపార్ట్‌మెంట్ హెడ్‌గా ఆయన చేయాల్సిన పని చేయలేదు. సర్వశిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీకాకుళానికి చెందిన వ్యక్తి. ఇక్కడ ఈ ప్రాజెక్ట్‌కు ఏం కావాýన్నా జిల్లా ఇంట్రస్ట్ మేరకు ఆయన నో చెప్పిన సందర్భం లేదు. కానీ మనోడికి జిల్లాలో ప్రాజెక్ట్‌ను ఎలా నడపాలో తెలియకపోవడం వల్ల కనీసం ఆయన టైమ్‌లో చీపురుకట్ట కూడా తెచ్చుకోలేకపోయారు. కేవలం ఎమ్మెల్సీని అడ్డు పెట్టుకొని పైరవీలు చేసుకోవడం, తద్వారా సొమ్ములు సంపాదించుకోవడం తప్ప, ఆయన దేనిమీదా దష్టి పెట్టిన దాఖలాలు లేవు. తాను చెప్పినట్టల్లా ఫిర్యాదుల మీద సంతకాలు చేసే శ్రీనుకు కూరగాయలు సరఫరా చేసే టెండర్లు ఇవ్వడం, పొన్నాడ అక్రమ ఇసుక తవ్వకాల కోసం రాజకీయ నాయకులతో మాట్లాడిపెట్టడం తప్ప, సమగ్రశిక్షను ఆయనెప్ప్పుడూ పట్టించుకోలేదు. ఆర్‌టీఐలు పెట్టించడం, ఆ సమాచారమిస్తే అందుకోకపోవడం, ఫిర్యాదులు చేయడం, విచారణకు పిలిస్తే పలక్కపోవడం వంటివాటికి ఈయన సిద్ధహస్తుడు. అటువంటివారితోనే ఫిర్యాదులు చేయించి నెట్టుకొస్తున్నారు. కోర్టుధిక్కారం కింద ఆయన్ను సస్పెండ్ చేయాలని ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులిచ్చినా దాన్ని ఇంప్లిమెంట్ చేయని ప్రిన్సిపాల్‌ను ఇక్కడ ఇన్‌ఛార్జిగా పెట్టుకొని కాలం గడిపేస్తున్నారు. లెక్చరర్లకు సుదీర్ఘ కాలం నుంచి బదిలీలు లేకపోవడం వెనుక ఈయన హస్తం కూడా ఉందనే ప్రచారం ఉంది. ఇదెంత వరకు వాస్తవమో తెలియదు కాని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లెక్చరర్ల బదిలీ కోసం రంగం సిద్ధమైంది. కాకపోతే రెండేళ్లయినా అది జరగలేదు. అదే జరిగితే శ్రీకాకుళం హెడ్‌క్వార్టర్ నుంచి ఈయన వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈయన లాంగ్ స్టాండింగ్. ఒకసారి ఆఫీస్ బేరర్ కోటాలో బదిలీ తప్పించుకున్నారు. ఈసారి బదిలీలయితే కచ్చితంగా హెడ్‌క్వార్టర్‌ను విడిచిపెట్టాల్సి ఉంటుంది. అందుకే ఎమ్మెల్సీ ద్వారా ఆ ఊసెత్తకుండా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అలాగే బదిలీలంటూ జరిగితే ఆర్ట్స్ కళాశాలకు ఆమదాలవలస కళాశాల ప్రిన్సిపాల్ గాని, భీమిలీలో పని చేస్తున్న సురేఖ గాని, అందరికంటే సీనియరైన రజనీ గాని ప్రిన్సిపాల్‌గా వస్తారు. వీరిలో ఎవరొచ్చినా ఇక్కడ ఈయన శిష్యులకు గండమే. ఇన్నాళ్లు వీరు వండి వార్చిన ఫేక్ కంప్లైంట్లు, నకిలీ ఆర్‌టీఐలు ప్రిన్సిపాల్స్‌ను గుప్పెట్లో పెట్టుకొని దిగమింగేసిన నిధుల గుట్టు బయటపడుతుంది. అందుకే బదిలీలు జరగడంలేదన్నవారూ లేకపోలేదు. ట్రాన్స్‌ఫర్లయినా ఎలా ఇక్కడ కొనసాగాలో మనోడికి బాగా తెలుసు. ఎందుకంటే బదిలీల మీద బ్యాన్ ఉన్నప్ప్పుడే ఆయన భార్యను బదిలీపై తాను అనుకున్నచోటకి తెచ్చుకోగలిగారు. తాజాగా సమగ్రశిక్షలో ఏడుగురు ఏఈలను ఎస్‌పీడీ బదిలీ చేశారు. ఇప్ప్పుడు వారిని మళ్లీ శ్రీకాకుళంలోనే కొనసాగించే విధంగా ఎమ్మెల్సీకి చెప్పి విద్యాశాఖ మంత్రి లోకేష్‌ను కలుస్తానంటూ ఓ కొత్త నాటకానికి తెర తీసినట్లు తెలుస్తుంది. ఇది కేవలం ఆబ్లిగేషనా, లేదూ అంటే దీని వెనుక క్విడ్ ప్రో కో ఏమైనా ఉందా? అనేది ఇంకా తేలలేదు. ఆమదాలవలస ఎమ్మెల్యే, ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ కూన రవికుమార్‌కు బాగా కావాల్సిన ఓ వ్యక్తిని బుట్టలో వేసుకోవడం ద్వారా జిల్లాలో ఎమ్మెల్యే క్లియరెన్స్ చూపిస్తూ ఎమ్మెల్సీ ద్వారా పనులు చక్కబెడుతున్న మనోడిని కాదంటే మసి చేయడానికి ఈ గ్యారేజ్ నిరంతరం ఫిర్యాదులు తయారుచేస్తూనే ఉంటుంది. పాఠాలు చెప్పే పని లేదు కాబట్టి గోబెల్స్ మాదిరిగా ఏదో ఒక గాలికబురును వండివార్చే పనిలో ఉంటున్నారు. ఇవన్నీ ఎమ్మెల్సీ కావడానికి బహుశా అదనపు క్వాలిఫికేషన్లేమో ఆయనకే తెలియాలి. 2029 తర్వాత తానే ఎమ్మెల్సీనంటూ అప్ప్పుడే ఈయన బెదిరించడం మొదలుపెట్టాడని తెలుస్తుంది. అసలే ఫిర్యాదులు చేయడంలో ధిట్ట అయిన ఈ లెక్చరర్ ఎమ్మెల్సీ అయితే తమను బతకనిస్తాడా? అన్న సందేహాలు చాలామందికి ఉన్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page