top of page

సిద్ధరామయ్య పదవికి ‘ముడా’ ముప్పు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Aug 19, 2024
  • 2 min read

పదవిలో ఉండగా అవినీతి కేసుల్లో ఇరుక్కుని అరెస్టయిన ముఖ్యమంత్రులు దేశంలో చాలామందే ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామాయ్య కూడా చేరిపోతారా? కొద్దిరోజులుగా చోటుచేసు కుంటున్న పరిణామాలను చూస్తే అందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. సిద్ధరామయ్యపై విచా రణకు కర్ణాటక గవర్నర్‌ ధ్యావర్‌చంద్‌ గెహ్లోట్‌ అనుమతి ఇవ్వడంతో ఈ రకమైన ప్రచారం ఊపందుకుంది. గవర్నర్‌ చర్యపై సీఎం సిద్ధరామయ్యతో పాటు కాంగ్రెస్‌ తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. కేంద్రంలోని మోదీ సర్కారు ఆదేశాల మేరకే గవర్నర్‌ ఈ అనుచిత నిర్ణయం తీసుకున్నారని, దీన్ని ఉన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేస్తానని సిద్ధరామయ్య ప్రకటించారు. ఈ పరిణామాలతో కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్‌ అధ్య క్షుడు మల్లికార్జున ఖర్గే ఉన్న ఫళంగా బెంగళూరుకు చేరుకుని కాంగ్రెస్‌ రాష్ట్ర నేతలతో మంతనాలు జరపగా, మరోవైపు కర్ణాటక కేబినెట్‌ అత్యవసరంగా సమావేశమై తాజా పరిణామాలు, వాటిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై చర్చించింది. కన్నడనాట తాజా రాజకీయ వివాదానికి కేంద్ర బిందువుగా మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ(ముడా) మారింది. మైసూర్‌ ప్రాంతంలో కెసరే అనే గ్రామంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి పార్వతికి మూడెకరాల భూమి ఉండేది. అభివృద్ధి పనుల కోసం ముడా ఆ భూమిని అప్పుడెప్పుడో తీసుకుంది. దానికి పరిహారంగా 2021లో విజయనగర ప్రాంతంలో 38,288 చదరపు అడుగుల విస్తీర్ణం కలి గిన ప్లాట్లను సిద్ధరామయ్య సతీమణికి కేటాయించింది. ఇదే వివాదంగా మారింది. కెసరే ప్రాంతంతో పోలిస్తే విజయనగర ప్రాంతంలో భూములు, స్థలాల ధరలు చాలా ఎక్కువ. అటువంటి ఖరీదైన ప్రాంతంలో సీఎం సతీమణికి పరిహారం పేరుతో స్థలాలు కేటాయించడంలో అక్రమాలు జరిగాయని బీజేపీ ఆరోపిస్తోంది. దాదాపు నెలరోజులుగా రాష్ట్ర రాజకీయాలను ఈ వివాదం కుదిపివేస్తోంది. ఈ కుంభకోణంలో సీఎం పాత్రపై విచారణ జరిపేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సామాజిక కార్యకర్త అయిన న్యాయవాది టీజే అబ్రహం గవర్నర్‌కు పిటిషన్‌ అందజేయగా, ఆయన ఆమోదం తెలిపారు. గవర్నర్‌ నిర్ణయంతో సీఎం సిద్ధరామయ్యతో పాటు కాంగ్రెస్‌ కూడా అవాక్కయ్యింది. దాంతో ఎదురుదాడి ప్రారంభించింది. ఇదంతా బీజేపీ కుట్ర అని ఆరోపిం చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై అధికారాన్ని కోల్పోయిన బీజేపీ ఎలాగైనా మళ్లీ ప్రభుత్వాన్ని హస్త గతం చేసుకోవాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై గవర్నర్‌ ద్వారా కుట్రలకు పాల్పడుతోందని ఆరోపి స్తోంది. వాస్తవానికి తన భార్యకు భూ కేటాయింపు బీజేపీ హయాంలోనే జరిగిందని సిద్ధరామయ్య చెబుతు న్నారు. తన భార్య పార్వతికి చెందిన భూమిని ముడా తీసుకుందని, దానికి ప్రత్యామ్నాయంగా మరో చోట భూమి కేటాయించాలని కోరుతూ 2014లో తాను సీఎంగా ఉన్నప్పుడే తన సతీమణి దరఖాస్తు చేసుకోగా, తాను అధికారంలో ఉన్నప్పుడు ఆ పని చేయలేనని చెప్పానని ఆయన అంటున్నారు. తిరిగి 2021లో ఆమె ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా అప్పటి బీజేపీ ప్రభుత్వమే విజయనగర ప్రాంతంలో భూమి కేటాయించిందని సిద్ధరామయ్య వాదిస్తున్నారు. గవర్నర్‌ చర్య అప్రజాస్వామికమని రాష్ట్ర మంత్రివర్గం అభిప్రాయపడిరది. సీఎం పై విచారణకు ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. రాజకీయ యుద్ధంగా మారిన ఈ వివాదంలో సీఎంపై విచారణ ప్రారంభమైతే, ఆయన్ను అరెస్టు చేసే అవకాశం కూడా ఉందని కాంగ్రెస్‌ ఆందో ళన వ్యక్తం చేస్తోంది. అదే జరిగితే పదవిలో ఉండగా అరెస్టయిన ఐదో సీఎం ఆయనే అవుతారు. కర్ణాటకలో రెండో సీఎం అవుతారు. 2011లో బీజేపీకి చెందిన యడ్యూరప్ప ఇదే కర్ణాటక ముఖ్యమంత్రి పదవిలో ఉండ గానే అరెస్టయ్యారు. అప్పట్లో బెంగళూరు ఇండస్ట్రియల్‌ ప్రాంతంలో భూకేటాయింపుల విషయంలో ఆరోపణ లు, ఫిర్యాదులు రావడంతో లోకాయుక్త విచారణ జరిపి ప్రాథమికంగా నిర్థారించింది. దాంతో సీఎం యడ్యూ రప్పపై పూర్తిస్థాయి విచారణకు అప్పటి గవర్నర్‌ హన్స్‌రాజ్‌ భరద్వాజ్‌ అనుమతించారు. అదే ఏడాది అక్టోబర్‌ లో లోకాయుక్త అరెస్టు వారెంట్‌ జారీ చేయడంతో సీఎం యడ్యూరప్పను పోలీసులు అరెస్టు చేసి 23 రోజులు జైల్లో పెట్టారు. కాగా బీహార్‌లో సంచలనం సృష్టించిన పశువుల దాణా కుంభకోణంలో 1997లో అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదం పాట్నా హైకోర్టుకు చేరగా సీబీఐ విచారణకు ఆదేశించింది. సీబీఐ దర్యాప్తు నివేదిక ఆధారంగా రాష్ట్ర గవర్నర్‌ ఏఆర్‌ కిద్వాయ్‌ లాలూపై కేసు నమోదు, విచారణకు అనుమతిచ్చారు. విచారణలో ఆరోపణలు నిర్థారణ కావడంలో లాలూను పోలీసులు అరెస్టు చేశారు. బొగ్గు గనుల కేటాయింపుల్లో రూ.400 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణ లతో నమోదైన కేసులో 2009లో అప్పటి జార్ఖండ్‌ ముఖ్యమంత్రి మధుకోడాను సీబీఐ అరెస్టు చేసింది. 2012 వరకు విచారణ ఖైదీగా జైల్లో ఉన్న ఆయనకు 2017లో శిక్ష పడిరది. ఇక మద్యం కుంభకోణంలో ప్రమేయం ఉందన్న ఆరోపణపై ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ ఏడాది మార్చిలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆరెస్టు చేసింది. ఈ కేసు విచారణ కొనసాగుతుండగా కేజ్రీవాల్‌ జైల్లోనే ఉన్నారు. ఇదే కేసులో ఢల్లీి ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాను 2022 అక్టోబర్‌లో ఈడీ, సీబీఐలో అరెస్టు చేశాయి. అప్పటి నుంచి సుదీర్ఘ కాలం జైల్లోనే ఉన్న ఆయన ఈమధ్యే సుప్రీంకోర్టు ఉత్తర్వులతో విడుదలయ్యారు. ఢల్లీి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వినయ్‌కుమార్‌ సక్సేనా ఆదేశాల మేరకే మద్యం కుంభకోణం విచారణ ప్రారంభమైంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page