top of page

స్నేహం ముసుగులో ద్రోహం

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Jan 27
  • 3 min read

రిపబ్లిక్‌డే.. భారత జాతికి గర్వకారణంగా నిలిచేరోజు. స్వాతంత్య్రానంతరం రెండున్నరేళ్ల తర్వాత సొంత అధ్యక్షుడిని నియమించుకుని, సొంత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చి.. సర్వసత్తాక గణతంత్ర దేశంగా అవతరించిన సుదినం. అందుకే ఏటా ఈ జాతీయ పండుగను సగర్వంగా జరుపుకొంటున్నాం. ఆక్రమంలోనే సోమవారం దేశమంతా 77వ గణతంత్ర దినోత్సవానికి ఘనంగా నిర్వహించుకుంది. కానీ ఇదే రోజు చుట్టూ విషాదాలు ముసురుకుని, చేదు అనుభవాలు మిగిల్చిన చరిత్ర కూడా ఉంది. ఈ తరంలో చాలామందికి తెలియని ఆ వివరాలు తెలుసుకుందాం.

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)


  • 1958లో చీఫ్‌గెస్ట్‌గా చైనా మిలటరీ అగ్రనేత

  • మన లోటుపాట్లు పసిగట్టి కుట్రకు తెర

  • దాని ఫలితమే 1962లో భారత సరిహద్దుల దురాక్రమణ


గణతంత్ర దినోత్సవ వేడుకలు కేవలం జాతీయ పండుగ మాత్రమే కాదు.. భారతదేశ విదేశాంగ విధానానికి, అంతర్జాతీయ దౌత్యానికి ప్రతిబింబం. మన సైనిక పాటవాన్ని, మన దేశప్రగతిని సగర్వంగా ప్రపంచం ముందు ప్రదర్శించే సమున్నత వేడుక. వాటన్నింటిని ఒక విదేశీ అతిథి ముఖ్యఅతిధిగా రప్పించి సగౌరవంగా కన్నుల పండువ చేయడం మన సంప్రదాయం. కానీ ఆ సంప్రదాయమే ఒకసారి మనకు చేటు చేసింది. స్నేహం ముసుగులో వచ్చి మన సైనిక సత్తాను కనులారా వీక్షించిన మన పొరుగుదేశం.. దానికి అనుగుణంగా వ్యూహాలు రచించి మనపైనే యుద్ధానికి తెగబడింది. 1958 జనవరి 26న జరిగిన గణతంత్ర వేడుకలు ఈ కుట్రకు పరోక్షంగా సహకరించాయని చరిత్ర నిపుణులు చెబుతుంటారు. గణతంత్ర దినోత్సవాల చరిత్రలో ఇదో పెద్ద చేదు అనుభవం. అప్పట్లో నెహ్రూ నేతత్వంలోని భారత ప్రభుత్వం పొరుగు దేశాలతో శాంతి, స్నేహాలను పెంపొందించుకునే లక్ష్యంతో చైనాతో సంబంధాల మెరుగుకు హిందీ`చీనీ భాjáYT భాjáYT అన్న నినాదం తీసుకొచ్చి ఆచరించింది. దానికి కొనసాగింపుగా ఆ ఏడాది రిపబ్లిక్ డే ఉత్సవాలకు విదేశీ అతిధులను ఆహ్వానించే సంప్రదాయం ప్రకారం చైనా అత్యున్నత సైనిక నేతను రప్పించింది. రాజ్‌పథ్(ప్రస్తుతం కర్తవ్యపథ్)లో రిపబ్లిక్‌డే రోజు నిర్వహించే పతాకావిష్కరణ, సైనిక విన్యాసాలు, శకటాల ప్రదర్శనను వీక్షించే అవకాశం కల్పించింది. ఆ మేరకు చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎలఏ) అగ్రనేత, మార్షల్ యే జియాన్యింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆనాడు భారత్-చైనా సంబంధాలు సుదఢంగా ఉన్నాయని ప్రపంచానికి చాటి చెప్పడమే ఆయన పర్యటన లక్ష్యం. కానీ ఆయన వచ్చిన పని కాకుండా గుంభనంగా మరో పని చేశారు. ఫీల్డ్ మార్షల్‌తో సమాన హదా కలిగిన సదరు మిలటరీ అధికారి పరేడ్ ద్వారా ప్రత్యక్షంగా భారతదేశ సైనిక సామర్థ్యాన్ని పరిశీలించి పూర్తిస్థాయిలో అంచనా వేయడంతోపాటు బలహీనతలను ఆకళింపు చేసుకున్నారు. పర్యటన ముగించుకుని స్వదేశానికి వెళ్లిన తర్వాత భారత్‌పై కుట్రకు తెరతీశారు. వెన్నుపోటు తంత్రం రచించారు. ఫలితంగా.. ఆయన ఇక్కడి నుంచి వెళ్లిన నాలుగేళ్లకే 1962లో చైనా భారత్‌పై యద్ధానికి దిగింది. తద్వారా భారత్ అనుసరించిన సుహద్భావ వైఖరిని ఆమోదిస్తున్నామన్న ముసుగులో మోసపూరిత చర్యలు చేపట్టింది. దానికి ఉదాహరణలు పంచశీల ఒప్పందం, టిబెట్ ఉదంతాలే. 1954లో పరస్పర గౌరవం, శాంతియుత సహజీవనం అనే సూత్రాలతో పంచశీల ఒప్పందం పేరుతో భారత్‌ను నమ్మించిన చైనా అదే సమయంలో అక్సాయ్ చిన్ ప్రాంతంలో రహస్యంగా రోడ్ల నిర్మాణం చేపట్టింది. 1950లో టిబెట్‌పై చైనా నియంత్రణను గుర్తించడం ద్వారా భారత్ తన సద్భావన చాటుకుంది. కానీ 1959లో టిబెట్ ఆధ్యాత్మిక నేత దలైలామాకు భారత్ ఆశ్రయం ఇవ్వడంతో చైనా తన అసలు అజెండాను, దురుద్దేశంగా బహిరంగంగా ప్రదర్శించడం మొదలుపెట్టింది. సరిహద్దు వివాదం. మెక్‌మోహన్ రేఖను చైనా ఎప్పుడూ అధికారికంగా గుర్తించకపోగా 1962లో భారత్‌పై యుద్ధభేరి మోగించి కొన్ని సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించింది.


అణుపితామహుడిని కూల్చేశారు!

విమాన ప్రమాదంలో డాక్టర్ హమీబాబా దుర్మరణం

1966లో గణతంత్రానికి రెండు రోజుల ముందు ఘటన

దీని వెనుక సీఐఏ కుట్ర ఉందన్న అనుమానాలు


అది 1966వ సంవత్సరం.. దేశమంతా రిపబ్లిక్‌డే ఉత్సవాలకు సన్నాహాలు చేసుకుంటున్న సమయం. ఆ ఉత్సవానికి రెండు రోజుల ముందు అంటే జనవరి 24న ఉదయం.. యూరప్‌లోని తన లక్ష్యం వైపు దూసుకుపోతున్న ఎయిర్ ఇండియాకు చెందిన ‘కాంచనజంగా’ విమానం ల్యాండింగ్‌కు కొన్ని నిమిషాల ముందు ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. విమానం కూలిపోవడమే ఒక పెద్ద ప్రమాదం. దానికితోడు అందులో ప్రయాణిస్తున్న భారత అణుపితామహుడిని ఆ దుర్ఘటనలో కోల్పోవడం మరింత తీరని విషాదం. భారత అణుశక్తి రంగం భవిష్యత్తు కోసం ఎన్నో కలలుగన్న.. వాటిని సాకారం చేసేందుకు కంకణం కట్టుకున్న ప్రముఖ అణు శాస్త్రవేత్త, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ హోమీ జహంగీర్ బాబా ఆ దుర్ఘటనలో అశువులు బాశారు. ఈ దుర్ఘటన భారత విజ్ఞానశాస్త్ర చరిత్రలో ఒక తీరని విషాదంగా, వీడని రహస్యంగా మిగిలిపోయింది. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు జెనీవాకు వెళ్తుండగా ీVAమీ బాబా ప్రయాణిస్తున్న విమానం జెనీవాకు సమీపంలోనే ల్యాండ్ కావడానికి కొద్ది నిమిషాల ముందు ఆల్ప్స్ పర్వత శ్రేణిలోని ‘మాంట్ బ్లాంక’ శిఖరాన్ని ఢీకొట్టి ఆ పర్వతాల్లో కూలిపోయింది. భూమికి 4,677 మీటర్ల ఎత్తులో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ీVAమీ బాబాతోపాటు 106 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది కలిపి మొత్తం 117 మంది దుర్మరణం చెందారు.

రెండు వారాల్లో ఇద్దరు మహనీయులు

హమీ బాబా మరణాన్ని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ‘దేశానికి జరిగిన ఘోర విపత్తు’గా అభివర్ణించారు. విచారకరమైన విషయం ఏమిటంటే బాబా మరణానికి రెండు వారాల ముందే అప్పటి ప్రధాని లాల్‌బహదూర్‌శాస్త్రి కూడా సోవియట్ రష్యాలోని తాష్కెంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. రోజుల వ్యవధిలోనే ఇద్దరు గొప్ప వ్యక్తులను కోల్పోవడం భారత్‌ను చాన్నాళ్లు కోలుకోనివ్వలేదు. అణుశక్తి కేవలం విద్యుత్ ఉత్పత్తికే కాకుండా దేశ భద్రతకు, స్వయం సమృద్ధికి అవసరమని బాబా బలంగా నమ్మేవారు. 1965లో ఆయన మాట్లాడుతూ ‘ప్రభుత్వం అనుమతిస్తే భారత్ 18 నెలల్లోనే అణుబాంబు తయారు చేసి చూపిస్తుంది’ అని ప్రకటించారు. దురదృష్టవశాత్తూ ఆ ప్రకటన చేసిన మూడు నెలలకే ఆయన ఆశలు, ఆకాంక్షలు కుప్పకూలిపోయాయి. ఫ్రెంచ్ దర్యాప్తు సంస్థలు ఈ ప్రమాదాన్ని పైలట్ పొరపాటుగా తేల్చేశాయి. అయితే విమాన శకలాలు మైళ్ల దూరం వరకు చెల్లాచెదురుగా పడి ఉండటం అనేక అనుమానాలకు తావిచ్చింది. కుట్ర కోణం ఉండవచ్చన్న సంకేతాలు ఇచ్చింది. 2008లో వెలువడిన కన్వర్సేషన్స్ విత్ ది క్రో అనే పుస్తకం ఇటువంటి అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ ీVAమీ బాబా ప్రయాణిస్తున్న విమానంలో బాంబు పెట్టిందని, భారత్ అణుశక్తి దేశంగా ఎదగకుండా అడ్డుకోవడానికే ఈ కుట్ర పన్నారని మాజీ సీఐఏ అధికారి రాబర్ట్ క్రౌలీ వ్యాఖ్యలను ఈ పుస్తకంలో రచయిత ఉటంకించడంతో అవే అభిప్రాయాలు బలపడ్డాయి. ీVAమీ బాబా మరణం కుట్ర అయితే అది రిపబ్లిక్‌డేకు రెండు రోజుల ముందు జరగడం యాదచ్ఛికం కావచ్చు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page