సామ్రాజ్యవాదానికి ‘కర్మ సిద్ధాంతం’ ఇచ్చిన తీర్పు!
- NVS PRASAD

- 8 hours ago
- 2 min read


ఒకప్ప్పుడు ప్రపంచంలోని 30 శాతానికి పైగా భూభాగాన్ని తన గుప్పిట్లో ఉంచుకుని, ‘సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం’గా వెలిగిన బ్రిటన్ నేడు రాజకీయ, ఆర్థిక, సామాజిక సంక్షోభాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. పదేళ్ల కాలంలోనే ఏకంగా ఆరుగురు ప్రధాన మంత్రులు (డేవిడ్ కెమెరాన్ నుంచి బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి సునాక్, తాజాగా కేర్ స్టార్మర్ వరకు) గద్దె దిగడం ఆ దేశ రాజ్యాంగ వైఫల్యానికి నిదర్శనం కాదు, దశాబ్దాలుగా ఆ దేశం అనుసరిస్తున్న తప్ప్పుడు విధానాల పర్యవసానం. ప్రపంచవ్యాప్తంగా నాడు బ్రిటీషర్లు నాటిన విభజన బీజాలు నేడు వారి సొంత గడ్డపైనే ‘కర్మ సిద్ధాంతం’ రూపంలో తిరిగి వస్తున్నాయా అనే అనుమానం కలగక మానదు.
చారిత్రక పాపాలు - అంతర్జాతీయ సంక్షోభాలు
భారత్-పాకిస్తాన్ విభజన రేఖను కత్తితో కోసినట్లు అనాలోచితంగా గీసి కాశ్మీర్ సమస్యకు కారణమవ్వడం, పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య తప్పుడు వాగ్దానాలతో నేటి యుద్ధానికి పునాది వేయడం, చైనా-తైవాన్, నేపాల్-భారత్ సరిహద్దు వివాదాల వెనుక బ్రిటీష్ పాలకుల కుటిల నీతి స్పష్టంగా కనిపిస్తుంది. నాడు ప్రపంచ దేశాల సార్వభౌమత్వాన్ని దెబ్బతీసి ఆయుధ వ్యాపారంతో లబ్ధి పొందిన బ్రిటన్, నేడు అంతర్గత కలహాలతో అల్లాడిపోతోంది. శక్తివంతమైన పాము సైతం చలిచీమల చేతిలో చంపబడుతుందనే సామెత చందంగా, నాడు పరాయి దేశాలను ఆక్రమించిన బ్రిటన్‌ను, నేడు ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ (అక్రమ వలసలు) ఊపిరాడకుండా చేస్తున్నాయి.
ఆర్థిక పతనం - ‘జీరో గ్రోత్’ ట్రాప్
బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ (4.2 ట్రిలియన్ డాలర్లు) ప్రస్తుతం తీవ్ర అప్పుల ఊబిలో ఉంది. ఇందులో దాదాపు 95% (4.02 ట్రిలియన్ డాలర్లు) అప్పులే కావడం గమనార్హం. వార్షికంగా 52 బిలియన్ డాలర్ల వ్యాపార లోటు (ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువ) ఉండటంతో పాటు జీడిపి వృద్ధి రేటు కేవలం 0.8% కి పడిపోయింది. భారత్ (7%), చైనా (4%) వృద్ధి రేట్లతో దూసుకుపోతుంటే, యూకే మాత్రం ప్రగతి లేని ‘జీరో గ్రోత్ ట్రాప్ ’లో చిక్కుకుంది.
వోకిజం, నెట్-జీరో భ్రమల విధ్వంసం
యూకే పతనానికి దేశీయంగా పెరిగిపోయిన ‘లెఫ్ట్ లిబరల్’ ఆలోచనలు, తీవ్రమైన ‘ఓకిజం’, ఆచరణ సాధ్యం కాని ‘నెట్ జీరో’ పర్యావరణ విధానాలే ప్రధాన కారణాలు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్‌కు పురిటిగడ్డ అయిన దేశంలో 2050 నాటికి బొగ్గు, పెట్రోల్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలనే నిబంధన తెచ్చి ఉన్న కాస్త మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని నాశనం చేసుకున్నారు. చైనా వంటి దేశాలు తక్కువ ధరకే వస్తువులను మార్కెట్లోకి తెస్తుంటే, యూకే గ్రీన్ ప్రొడక్ట్స్ పేరుతో ఉత్పత్తి వ్యయాన్ని పెంచి అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడలేక చేతులెత్తేసింది. సొంతంగా నార్త్ సీ షెల్‌లో అపారమైన ఆయిల్, గ్యాస్ నిల్వలు ఉన్నప్పటికీ, పర్యావరణ భ్రమల కారణంగా వాటిని వెలికితీయకుండా రష్యా, కతార్‌లపై ఆధారపడి సంక్షోభాన్ని కొనితెచ్చుకుంది.
డెమోగ్రాఫిక్ మార్పులు - షరియా సవాలు
తక్కువ జీతాలకే కార్మికులు దొరుకుతారనే స్వార్థంతో సిరియా, టర్కీ, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుండి వచ్చిన అక్రమ వలసదారులకు, క్రిమినల్ హిస్టరీ ఉన్న మూలకాలకు యూకే ఆశ్రయం కల్పించింది. ఫలితంగా నేడు లండన్, బర్మింగ్‌హామ్, బ్రాడ్‌ఫోర్డ్ వంటి ప్రధాన నగరాల్లో ముస్లిం జనాభా 30 నుంచి 40 శాతానికి చేరింది. స్థానిక చట్టాలను, రాజ్యాంగాన్ని బైపాస్ చేస్తూ సమాంతరంగా ‘షరియా కోర్టులు’ నడుపుతుండటం బ్రిటన్ సార్వభౌమత్వానికే పెద్ద ముప్పుగా మారింది. స్థానిక శ్వేతజాతీయులు జనాభా నియంత్రణ పాటించగా, వలసదారులు తమ జనాభాను పెంచుకుంటూ డెమోగ్రాఫిక్ మార్పులు తెచ్చారు. 2050 నాటికి బ్రిటన్‌లో స్థానికులు మైనారిటీలుగా మారే ప్రమాదం పొంచి ఉంది.
భారతీయుల శ్రమ - యూకేకు ఊపిరి
ఇలాంటి సంక్షోభ సమయాల్లోనూ యూకే ఆర్థిక వ్యవస్థను కొంతైనా నిలబెడుతున్నది అక్కడ స్థిరపడిన భారతీయ ఇంజనీర్లు, డాక్టర్లు, సాఫ్ట్‌వేర్, ఫైనాన్స్ నిపుణులే. లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌గా వెళ్లిన భారతీయులు ఏటా సుమారు 300 నుంచి 400 బిలియన్ డాలర్ల సర్వీస్ ఎక్స్‌పోర్ట్స్ అందిస్తూ, అత్యధికంగా 40% వరకు పన్నులు చెల్లిస్తూ ఆ దేశాన్ని కాపాడుతున్నారు. అయినప్పటికీ అక్కడ భారతీయులపై అక్కడక్కడా వర్ణవివక్ష చూపడం విచారకరం.
బ్రిటన్ సంక్షోభం నేటి ప్రపంచానికి ఒక పెద్ద గుణపాఠం. దేశ రక్షణను, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని విస్మరించి, అక్రమ వలసలను ప్రోత్సహిస్తూ, అతివాద లిబరల్ హక్కుల పేరుతో సామాజిక సమతుల్యతను దెబ్బతీస్తే ఎలాంటి వినాశనం సంభవిస్తుందో యూకే పరిస్థితి అద్దం పడుతోంది. ఎవరైనా భారతీయులు ఉద్యోగ, వ్యాపారాల కోసం యూకే వెళ్లాలనుకుంటే.. నమ్మకమైన కంపెనీ ఆఫర్లు, వీసాలు ఉంటేనే వెళ్లాలి తప్ప, లక్షల రూపాయలు వృధా చేసుకొని సంక్షోభంలో ఉన్న దేశానికి వెళ్లడం శ్రేయస్కరం కాదు.






Comments