సిరాజ్ మూలాలపై శ్రీకాకుళంలో ఆరా?
- NVS PRASAD
- May 24
- 1 min read
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

దేశంలో పలుచోట్ల బాంబులు పేల్చడం ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని ప్లాన్ చేసి నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ)కు దొరికిపోయిన విజయనగరానికి చెందిన సిరాజ్ కేసులో ఎన్‌ఐఏ రెండు రోజుల క్రితం శ్రీకాకుళంలో రహస్యంగా విచారణ జరిపినట్టు తెలుస్తుంది. ఎన్‌ఐఏ కాబట్టి దీనిని నిర్ధారించే ఆధారాలు లేకపోయినా, శ్రీకాకుళంలో సిరాజ్ బంధువులు ఎవరు, రాకపోకలు జరిగేవా, బ్యాంకు ఖాతాలు ఏవైనా ఉన్నాయా? అన్న కోణంలో ఎంక్వైరీ చేసినట్లు చెప్పుకుంటున్నారు. సిరాజ్ పోలీసులకు చిక్కినప్పుడు దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు ప్యాన్ చేశారనే భావించారు. అందులో భాగంగానే హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తితో పరిచయాలు వంటి వాటిపై ఆరా తీశారు. కానీ విచారణలో సిరాజ్ తన సొంతూరులోనే పేలుళ్లకు కుట్ర పన్నాడని తేలిందని కొన్ని పత్రికల్లో కథనాలొచ్చాయి. అంటే ఉగ్రవాద మూలాలు మారుమూల జిల్లాలకు కూడా చేరుతున్నాయని భావించిన ఎన్‌ఐఏ విజయనగరంలో కుట్రకు పాల్పడినవాడు శ్రీకాకుళంలో ధ్వంసరచనకు ఎందుకు పూనుకొనివుండడని భావించే ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తుంది. సిరాజ్ మేనమామది షటిల్ సర్వీస్. శ్రీకాకుళంలో కొద్ది రోజులు, విజయనగరంలో కొద్ది రోజులు, విశాఖపట్నంలో తన కుటుంబ సభ్యుల ఆస్తిపాస్తులు చూసుకోడానికి కొద్ది రోజులు తిరుగుతుంటాడని, అలా శ్రీకాకుళంలో ఎవరి అకౌంటులోనైనా సిరాజ్ డబ్బులు వేసున్నాడా? అన్న కోణంలో బ్యాంకు అకౌంట్లను సోదా చేయడానికి ఎన్‌ఐఏ అడుగులు వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
Comments