top of page

స్వాములకే బుర్ర పని చేయడంలేదు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Oct 24, 2024
  • 2 min read

సనాతన ధార్మిక నేతృత్వం.. విచిత్రంగా ధ్వనించి, నిర్వచనం కష్టమైన పదం. సనాతన ధర్మానికి ఒకరు నేతృత్వం వహించేది ఏమిటి? అసలు హిందూ ధర్మానికి ఈ పీఠాలు ప్రాతినిధ్యం వహిస్తాయా? నిజంగా హిందూ మతవ్యాప్తికి ఈ పీఠాధిపతులు చేస్తున్న కృషి ఏమిటి? పాదపూజలు, సంభావనలు తప్ప ఇంకేం పట్టింది? చేస్తున్నారనే అనుకుందాం సరే.. బీజేపీ మాత్రమే ఎందుకు పట్టించుకోవాలి? ఇదే ప్రశ్న సోకాల్డ్‌ సెక్యులర్‌ పార్టీలకు ఎందుకు వేయవద్దు? ఈ ప్రశ్నలు ఎందుకు తలెత్తుతున్నా యంటే.. అత్యంత వివాదాస్పద స్వామి ఒకాయన జమ్ములో మాట్లాడుతూ ‘ధర్మాచార్యులను బీజేపీ పట్టించుకోవట్లేదు’ అని విమర్శించాడు. గోమాతను రాజ్యమాతగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ, 36 రాజధాని కేంద్రాల్లో గోధ్వజ్‌ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం దేశమంతా తిరుగుతున్నాడు ఆయన. సనాతన ధర్మ నేతృత్వం అనగా ఏమిటో ముందుగా ఆయన నిర్వచించాలి. అది బీజేపీ బాధ్యతే ఎందుకు అవుతుందో కూడా చెప్పాలి.. కానీ చెప్పడు. వివాదాలు, శుష్క ఆరోపణలతో ఆయన హిందూ మతా నికి నష్టం చేకూర్చడమే తప్ప తనతో వీసమెత్తు ఫాయిదా లేదు. ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్మఠ్‌ శంకరా చార్యుడు ఆయన. చాలామంది శంకరాచార్యులు ఉన్నారు మనకు. అందులో ఈయన కూడా ఒకరు. అసలు ఆ మఠాధిపతి స్వరూపానంద అస్తమయం తర్వాత ఈయన పగ్గాలు చేపట్టడమే ఓ వివాదం. సుప్రీంకోర్టులో విచారణ కూడా జరిగింది. ఓ స్వామి మాట్లాడితే ఒక్క పొల్లు మాట రాకూడదు. ప్రతి పదానికి విలువ ఉండాలి. ఈయన దానికి పూర్తిగా భిన్నం. అయోధ్యకు పిలవలేదు అంటాడు తనను.. కానీ అయోధ్య నిర్మాణం పూర్తి గాకముందే ప్రాణప్రతిష్ఠ కూడదు అంటాడు. మళ్లీ తనే అది పూర్తిగా బీజేపీ కార్యక్రమంలా సాగింది అంటాడు. ధర్మాచార్యులను బీజేపీ పట్టించుకోవడం లేదంటాడు. అందుకే అయోధ్యకు వెళ్లలేదు అంటాడు. అప్పుడే ఉద్దవ్‌ ఠాక్రేను మోసగించారు అంటాడు. (పరోక్షంగా బీజేపీ మీద విమర్శ) రాహుల్‌ గాంధీ భేష్‌ అంటాడు ఓసారి. మళ్లీ తనే హిందువులను మేల్కొల్పడంలో మోడీ మంచి కృష్టి చేస్తున్నాడంటాడు. ఆర్టికల్‌ 370 ఎత్తివేత, పౌరసత్వ సవరణ చట్టాల్ని స్వాగతించామనీ అంటాడు. మొన్నామధ్య కేదారనాథ్‌ ఆలయానికి చెందిన 228 కిలోల బంగారం మాయమైందనీ, ఢల్లీిలో ఆ సొమ్ముతోనే కేదారనాథ్‌ నమూనా గుడిని కడుతున్నారనీ ఆరో పించాడు. ఆలయ బాధ్యులు స్ట్రాంగ్‌ కౌంటర్స్‌ ఇవ్వడంతో నోరుమూసుకున్నాడు. గొడ్డుమాంస భక్షణ ను వ్యతిరేకిస్తాడు. అందుకే గోధ్వజ్‌ ప్రతిష్ఠకు వెళ్తే రెండుమూడు ఈశాన్య రాష్ట్రాలు ఆయన ప్రవేశాన్ని అడ్డుకున్నాయి. అనవసర వివాదాలకు, తగాదాలకు అవకాశం ఇవ్వకూడదని..! మొదటి నుంచీ ఇంతే. నోరిప్పితే చాలు ఏదో పంచాయితీ. మాట మీద నిలకడ ఉండదు. ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలి యదు పలుసార్లు. ఈయన సనాతన ధార్మిక నేత అట. ధర్మాచార్యుడట. బీజేపీ పట్టించుకోవాలట. అంటే ఏం చేయాలి? అసలు ఈయన పీఠాధిపత్యమే సరికాదని సుప్రీంలోనే విచారణ సాగింది కొన్నాళ్లు. శివానంద యోగవిద్యాపీఠం స్వామి గోవిందానంద సరస్వతి ఈయన్ని ఉద్దేశించి ‘దొంగ బాబా’ అని తేల్చిపడేశాడు. దీనిపై అవిముక్తేశ్వరానంద ఢల్లీి హైకోర్టులో పరువు నష్టం దావా వేస్తే.. సాధువులు ఇలాంటివి పట్టించుకోవడం ఏమిటి, స్వాములు తమ పనులతోనే గౌరవం పొందుతారు తెలుసా అని హైకోర్టు హితవచనాలు పలికింది. ఒకడికి వంటలు చేయడంలో నైపుణ్యం ఉంటుందా? మరొకరికి విమానాలు నడపడంలో నైపుణ్యం ఉంటుందా? మరొకడికి చెత్త ఊడవడంలో నైపుణ్యం ఉంటుందా? ఆయా నైపుణ్యతలను బట్టి కులాలు ఏర్పడ్డాయా? అందుచేత కుల వ్యవస్థ ఉండాలా? అంటే ఈ నైపుణ్యతలన్నీ ఆయా మనుషులు పుట్టి పెరిగి యుక్త వయసు వచ్చాక వాళ్లు దేనికి సరిపోతారో పరీక్ష జరిపి ఆ తర్వాత వాళ్లను వాళ్ల నైపుణ్యతల ఆధారంగా కులాలుగా విభజిస్తారా? శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్‌ స్వామి సెలవిచ్చిన మాటలు పైన చెప్పినవి. ఒళ్లంతా ఎంత వెటకారం ఉంటే అలా వెటకరిస్తారు? దళిత బహుజనాదులుగా గల శూద్రవర్గాలన్నీ బ్రహ్మ నోటి నుంచి భుజాల నుంచి కడుపు నుంచి పుట్టిన వర్గాలకు మిగిలిన కాళ్ల దగ్గర నుంచి పుట్టినటు వంటి జట్టు అంతా సేవలు చేస్తూ కూర్చోవాలి అన్నమాట. ఇదే స్వామివారు ఆమధ్య సెలవిచ్చారు. మళ్లీ సన్నటి గొంతుతో వెటకారం జోడిరచి చేసే హేళన ఒకటి అదనం. మనిషి ఎన్ని సంకెళ్లనైనా చేదిస్తాడు గానీ పుట్టుకతో వచ్చిన అంటరాని కులమనే సంకెళ్లను ఛేదించలేడని పెరియార్‌ చెప్పిన మాట ఈ జీయర్లకు ఎలా అర్థమవుతుంది? మనిషి పుడుతూనే ఒకడు వేద పఠనానికి, మరొకడు పెంట ఊడవడానికి అర్హతలు కూర్చుకుని పుట్టారా? ఇదెక్కడి దుర్మార్గపు వాదన జీయర్‌ గారు? అసలు స్వామీజీలు ఏం బోధించాలి? ఏం చేస్తున్నారు?

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page