సమగ్రశిక్ష ఏపీసీగా వేణుగోపాల్
- SATYAM DAILY
- 4d
- 1 min read

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
శ్రీకాకుళం సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్‌గా డిప్యూటీ కలెక్టర్ పి.వేణుగోపాల్‌ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ సమగ్రశిక్షలో ఏపీసీగా పని చేస్తున్న పి.వేణుగోపాల్‌ను శ్రీకాకుళం బదిలీ చేశారు. ఈయనది డిప్యూటీ కలెక్టర్ హోదా. శ్రీకాకుళంలో గతంలో ఆర్డీవో కార్యాలయంలో పని చేశారు కూడా. ఇప్పటి వరకు ఇక్కడ ఏపీసీగా ఉన్న శశిభూషణ్‌కు ఎక్కడా ఏపీసీగా పోస్టింగ్ ఇవ్వలేదు. రాష్ట్రవ్యాప్తంగా 8 మందికి బదిలీలు జరిగితే, అందులో శశిభూషణ్‌కు స్థానం దక్కలేదు. దీంతో ఈయన మళ్లీ లెక్చరర్‌గా విధులు నిర్వహించడానికి వెనక్కు వెళ్లాల్సిందే. ఉప్పాడ అరుణకు అనకాపల్లి, కె.శివసూర్యప్రసాద్‌కు పల్నాడు, దాసరి అనీల్‌కుమార్‌కు ప్రకాశం, డాక్టర్ అనురాధకు అన్నమయ్య జిల్లా, డాక్టర్ ఎన్.బి.నూకరాజుకు కర్నూలు, నిత్యానందరాజుకు నంద్యాల జిల్లా ఏపీసీలుగా పోస్టింగ్‌లు ఇస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది.










Comments