top of page


అవినీతి లైఫ్ స్కిల్‌గా మారిపోయిందా?
పాపాలు చేసి హుండీలో డబ్బులేస్తే సరిపోతుందనే భావన ఆచారాలు, పూజలు ప్రదర్శనకే పరిమితం కాకూడదు ధర్మసంస్థాపకుడు రాముడి దగ్గరే ధర్మం తప్పితే ఎవరికి చెప్ప్పుకోవాలి? ఇది ప్రభుత్వ శాఖలో జరిగిన అవినీతి కాదు.. కాంట్రాక్టర్ చేసిన మోసం కాదు.. గుర్తుపట్టలేని కార్పొరేట్ సంస్థ చేసిన అక్రమం కాదు.. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన శ్రీరాముడి ఆలయానికే చెందిన నిధులు మింగేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దశాబ్దాల పాటు అయోధ్యలో రామమందిరం కోసం పోరాటం సాగింది. ఆ ఉద్యమం దేశ రాజకీయాలను ప్రభా

NVS PRASAD
Jul 163 min read


రాజే సేవకుడయ్యాడు.. జగన్నాథుడు అలక వీడాడు!
1972 పూరీ రథయాత్రలో చోటుచేసుకున్న విశేష ఘట్టం రథంలోకి ఎక్కేందుకు నిరాకరించిన దేవదేవుడు అర్చకులు ఎంత ప్రయత్నించినా కనిపించని ఫలితం చివరికి 19 ఏళ్ల యువకుడి ప్రార్థనలను మన్నించిన వైనం అతడే పూరీ మహారాజు గజపతి దివ్యసింహ దేవ్ లక్షలాది భక్తులు, అప్పటి ఒడిశా సీఎం దీనికి ప్రత్యక్ష సాక్షులు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రపంచ ప్రసిద్ధమైన జగన్నాథస్వామి రథయాత్ర మీహాత్సవం చార్ధామ్ క్షేత్రాల్లో ఒకటైన ఒడిశాలోని పూరీ నగరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేశవిదేశాల నుంచి లక్

DV RAMANA
Jul 163 min read


ఎన్డీయే చూరుకు ఈ20 మంటలు!
ఇథనాల్ మంటలు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్నాయా? ఈ20 పెట్రోల్ వద్దు మొర్రో అంటున్నా వినిపించుకోకుండా కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం ఇథనాల్ ప్రయోగాలతోనే ముందుకుకెళ్తున్న ఎన్డీయే ప్రభుత్వంపై ఆ కూటమి మద్దతుదారులే అసంతృప్తితో రగిలిపోతున్నారా?? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నది సీ`ఓటర్ అనే సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే నివేదిక. ప్రస్తుతం దేశంలో విక్రయిస్తున్న ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోలుపై ప్రజలు వ్యక్తం చేస్తున్న రకరకాల అభిప్రాయాలు, విశ్లేషణలు.. ఈ20 వల్

DV RAMANA
Jul 162 min read


ఈగల మందుతో విషప్రయోగం?
కేజీబీవీలో కలకలం పాల దొంగతనాన్ని నిలదీసినందుకే కక్ష పీఈటీ, వాచ్మెన్లకు టీలో కలిపి ఇచ్చిన తోటమాలి (సత్యంన్యూస్, ఎచ్చెర్ల) పొన్నాడ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో మంగళవారం ఘోర కలకలం రేగింది. పాఠశాలలో పనిచేస్తున్న పీఈటీ సన్యాసమ్మ, వాచ్మెన్ ఉషాలపై తోటమాలి విషప్రయోగానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈగలను నివారించడానికి వాడే రసాయన ద్రవాన్ని (లిక్విడ్) టీలో కలిపి ఇవ్వడం వల్లే ఇద్దరు ఉద్యోగులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంద

BAGADI NARAYANARAO
Jul 152 min read


కరోనా యోధుడు.. గిరిజనుల ఆప్తుడు
సీతంపేటలో భార్యాభర్త జుగల్బందీ నెలకు 100కు పైగా నార్మల్ డెలివరీలతో రికార్డు నిన్నటి కార్యాలయ బాధితుడు నేడు అదే శాఖకు బాస్ శ్రీకాకుళం డీఎంహెచ్‌వోగా గురువారం బాధ్యతలు స్వీకరిస్తున్న నరేష్ (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) జిల్లా వైద్య ఆరోగ్యశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయడం ఎవరి తరం కాకపోయినా కనీసం కొంతశాతమైనా సంస్కరిస్తారన్న ఆశాభావం కొత్త డీఎంహెచ్‌వో పట్ల వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఆయన ప్రాథమిక దశ అంతా శ్రీకాకుళంలోనే నడిచింది. పీహెచ్సీ వైద్యాధికారిగా డీఎంహెచ్‌వో కార్య

DV RAMANA
Jul 152 min read


ముద్రగడ పిలుపే ప్రభంజనం
(సత్యంన్యూస్, అమరావతి) ఉద్యమకారుడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ముద్రగడ పద్మనాభం. ఆయన జీవితంలో అనేక పార్టీలను వదిలేసుండొచ్చు. కానీ, కాపు ఉద్యమాన్ని మాత్రం ఆయన ఏనాడూ పక్కన పెట్టలేదు. ‘నా పిలుపే ప్రభంజనం’ అనే ఒక నినాదపు పద సమాసానికి సజీవ రూపం ఆయనదే. ప్రత్తిపాడు ప్రాంతంలో తిరుగులేని నాయకత్వ పటిమ కనపరచి ఆ నియోజక వర్గానికి రెండు పర్యాయాలు శాసన సభ్యుడిగా సేవలందించిన ముద్రగడ వీరరాఘవరావు పెద్ద కుమారుడిగా ఆయన 1978లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జనతా పార్టీ టికెట్ మీద పోటీ చేసి అప్
SATYAM DAILY
Jul 154 min read


ఫలించిన మూడేళ్ల పోరాటం
స్వీట్స్ కార్ఖానా మూసివేత ‘సత్యం’ కథనంతో కదిలిన అధికారులు (సత్యంన్యూస్, పొందూరు) పొందూరు మండల పరిషత్ కార్యాలయం ప్రహరీకి ఎదురుగా, జనావాసాల మధ్య అక్రమంగా కొనసాగుతున్న స్వీట్స్ తయారీ కేంద్రాన్ని శాశ్వతంగా మూసివేయాలన్న స్థానికుల మూడేళ్ల పోరాటం ఎట్టకేలకు ఫలించింది. పర్యావరణ కాలుష్యం, ప్రజారోగ్యానికి ముప్పు, నివాస ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా స్వీట్ తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారంటూ స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడంతో చివరకు హైకోర్టును ఆశ్రయించ

BAGADI NARAYANARAO
Jul 151 min read


రూ. 16 కోట్ల సినిమా.. రూ. 2,000 కోట్ల కలెక్షన్లు
బాక్సాఫీస్ హిస్టరీని బద్దలు కొట్టిన ‘డియర్ యూ’ నో స్టార్స్.. నో ఫైట్స్.. నో విలన్ అయినా వసూళ్ల సునామీ గుండెను పిండేసే ‘వలస’ కథ థియేటర్లలో కన్నీళ్లు పెట్టిస్తున్న సెంటిమెంట్ సినిమా కోసం ప్రభుత్వంతోనే ఫైట్ సింగపూర్‌లో ప్రేక్షకుల తిరుగుబాటు కలెక్షన్ల వెనుక ‘చైనా’ పొలిటికల్ స్కెచ్ ఉందా? స్టార్ హీరోలు లేరు... భారీ యాక్షన్ సీన్లు లేవు... కళ్లు చెదిరే గ్రాఫిక్స్ లేవు... ఆఖరికి సినిమాలో విలనే లేడు! అయినా సరే, థియేటర్ల వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తూ, ప్రపంచ సినిమా ఇండస్ట్రీని సైతం నోరె
Guest Writer
Jul 152 min read


పథకాల్లో కోత.. ప్రభుత్వాలకు వాత!
జనాకర్షక పథకాలు ఎన్నికల్లో ఓట్లు కుమ్మరించవచ్చేమోగానీ.. ఆ తర్వాత వాటిని క్రమం తప్పకుండా అమలు చేయడం ప్రభుత్వాలకు కత్తిమీద సామే అవుతుంది. వాటికి అవసరమైన వందలు, వేల కోట్ల నిధులు సర్దుబాటు చేయలేక లబ్ధిదారుల జాబితాల్లో కోతలు విధించాల్సిన అగత్యం ఏర్పడుతుంది. ఇది ప్రజల్లో మరింత అసంతృప్తికి, ఆగ్రహానికి కారణమై ప్రభుత్వాలను కూల్చే స్థాయికి పెరిగినా ఆశ్చర్యపోనవసరంలేదని అనేక గత ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. అయినా పార్టీలు, ప్రభుత్వాలు వాటి నుంచి గుణపాఠం నేర్చుకోవడంలేదు. దాని ఫలితాన్నే ఇప

DV RAMANA
Jul 152 min read


ఊపందుకోని వరిసాగు
ఆకాశంవైపు ఆశగా రైతన్నల ఎదురుచూపు జిల్లాలో 39.7 శాతం లోటు వర్షపాతం సరిపడ విత్తనాలు, ఎరువులు ఉన్నాయంటున్న అధికారులు నిండుకున్న చెరువులు-ఎండిపోతున్న నారుమడులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలోని అధిక శాతం రైతులు ఖరీఫ్ సీజన్‌పై ఆధారపడి జీవనం సాగిస్తారు. ప్రతి ఏడాది నైరుతి రుతుపవనాల రాకతో ఖరీఫ్ పనులు ఊపందుకుంటాయి. కానీ 2026 ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో రైతాంగం ఆందోళనలో ఉంది. నారుమళ్లు సిద్ధం చేసిన రైతులు వరినారును కాపాడుకోవడానికి తాపత్రయపడు

BAGADI NARAYANARAO
Jul 143 min read


ఆ ఎయిర్‌పోర్టు మా తాతల ఆస్తి!
రూ.3500 కోట్ల పరిహారం ఇవ్వాల్సిందే సుప్రీంకోర్టులో సాధారణ రైతు న్యాయ పోరాటం న్యాయ వివాదంలో రాయ్‌పూర్ విమానాశ్రయం 1942లో ఎయిర్ ఫీల్డ్ కోసం తీసుకున్న బ్రిటిష్ సర్కారు అప్పటినుంచీ ఆ 30 ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలోనే రైతు కుటుంబానికి పైసా అయినా ఇవ్వలేదని వాదన (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) భూ వివాదాలు, ఆస్తుల తగాదాలు సర్వసాధారణం. ఒకే కుటుంబానికి చెందినవారు వారసత్వ ఆస్తుల కోసం గొడవలు పడటం నిత్యం సమాజంలో చూస్తూనే ఉంటాం. అలాగే ప్రైవేట్ వ్యక్తుల మధ్య కూడా వివాదాలు రేగుతూనే

DV RAMANA
Jul 143 min read


సంప్రదాయ క్రికెట్‌కు ఐపీఎల్ సమాధి!
క్రికెట్లో కాకలు తీరిన యోధుడిగా గుర్తింపు పొందాలంటే టెస్ట్ మ్యాచుల్లో రాణించాల్సిందేనని గతంలో చెప్పేవారు. కానీ కాలచక్రం వేగం పుంజుకున్న క్రమంలో దాంతోపాటే క్రికెట్ మ్యాచ్‌ల స్వరూపం మారిపోయింది. గతంలో ఉన్న ఆరు రోజుల టెస్ట్ మ్యాచ్ కాస్త ఐదు రోజులకు తగ్గిపోయింది. కాలక్రమంలో అదీ ఆకర్షణ కోల్పోయి దాని స్థానాన్ని వన్డే క్రికెట్ ఆక్రమించింది. కొన్నేళ్లకు దాని క్రేజ్‌ను పొట్టి క్రికెట్ కబళించింది. ఒకరోజంతా క్రీడాకారులు ఆడటం, దాన్ని పనులన్నీ మానుకుని ప్రేక్షకులు చూడటం ఉత్త వేస్ట్ అని భ

DV RAMANA
Jul 143 min read


శ్రీకాకుళంనగరంలో కలకలం
మత్స్యశాఖ కార్యాలయ ఆవరణలో గుర్తు తెలియని మృతదేహం దుర్వాసన రావడంతో వెలుగుచూసిన ఘటన కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం.. రంగంలోకి క్లూస్ టీం వారం రోజుల క్రితమే జరిగి ఉండొచ్చని పోలీసుల అంచనా (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం నగరంలో సోమవారం ఒక కలకలం రేపే సంఘటన వెలుగుచూసింది. స్థానిక మత్స్యశాఖ కార్యాలయ ఆవరణలో ఉన్న ఒక పాడుబడిన భవనంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కార్యాలయ ఆవరణ పరిసర ప్రాంతాల నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో,
SATYAM DAILY
Jul 131 min read


కొత్త ఓటర్లకూ ఈజీ కాదు ‘సర్ ’!
ఫారం-6లో చేర్చిన డిక్లరేషన్ కాలమ్‌తో తంటా ఓటు దరఖాస్తుదారులు తమ కుటుంబీకుల పాత వివరాలు చెప్పాలిందే వాటిని పూరించకపోతే దరఖాస్తు ముందుకు కదలదు ఆ వివరాలు సమర్పించడమూ తేలిక కాదు గెజిట్ లేకుండా నిబంధనల సవరణ ఏమిటన్న విమర్శలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్) కార్యక్రమం రాష్ట్రంలో ముమ్మరంగా సాగుతున్నది. అనేక అనుమానాలు, గందరగోళాల మధ్య సాగుతున్న ఈ కార్యక్రమంలో మరో కొత్త గందరగోళానికి తావిచ్చేలా ఎన్నికల సంఘం సరికొత్త నిర్ణయం తీసుకుంది. దీని ప్

DV RAMANA
Jul 133 min read


తొందరపాటు, లేటు.. రెండూ అనర్థదాయకమే!
భారతీయ సమాజం ఆధునిక భావాలను, పోకడలను ఎంత ప్రోత్సహిస్తుందో.. సనాతన సంప్రదాయాలను అంతేస్థాయిలో గౌరవిస్తుంది. రెండింటి సమ్మేళనమే భారతదేశం అని చెప్పవచ్చు. అయితే ప్రపంచంపై జనాభా హెచ్చుతగ్గులు చూపే ప్రభావాలపై విస్తృత చర్చ జరుగుతున్న ఈ సమయంలో భారతీయ సమాజం పరస్పర విరుద్ధమైన రెండు ప్రభావాల మధ్య నలిగిపోతున్నది. వాటిలో మొదటిది బాల్యవివాహ సంప్రదాయం కాగా.. రెండోది ఆధునిక యువత వివాహాలను వాయిదా వేసుకుంటుండటం. ఈ రెండూ కూడా సమాజానికి చెడు చేసేవే కావడం విచారకరం. తెలిసీ తెలియని వయసులోనే పిల్లల

DV RAMANA
Jul 132 min read


నిన్నటి విజయం.. నేటి ఆందోళన!
ఎన్డీఏ ఆధిపత్యం.. ప్రతిపక్షం అస్తవ్యస్తం సమీకరణాలు మార్చే దిశగా డీఎంకే? రాజకీయాల్లో ఏ క్షణంలోనైనా ఏమైనా జరగొచ్చు అనడానికి తాజా పరిణామాలే నిదర్శనం. ఏప్రిల్ 17న ముగిసిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఒక అరుదైన విజయాన్ని సాధించింది. మహిళా రిజర్వేషన్ల అమలును నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)తో ముడిపెట్టే రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపక్షాలన్నీ ఏకమై అడ్డుకోగలిగాయి. లోక్‌సభలో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు వచ్చినప్పటికీ, రాజ్యాంగ సవరణకు అవసరమైన

NVS PRASAD
Jul 112 min read


పాముల ఫారాలు.. స్నేక్ విలేజ్‌లు!
చైనాలో దశాబ్దాలుగా వర్థిల్లుతున్న సర్పాల పెంపకం పాము చర్మం, విషానికి అంతర్జాతీయంగా డిమాండ్ వాటి ద్వారా రూ.కోట్లలో వ్యాపార లావాదేవీలు చైనీయుల ఆహారంలోనూ దానిది ప్రత్యేక స్థానం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మనం పామును దేవతగా, దేవుడిగా పూజిస్తాం. కానీ అదే పాము మన సమీపంలోకి వస్తే చాలు.. హడలి చస్తాం.. ఆమడదూరం పారిపోతాం. వీలేతే దాన్ని చంపేస్తాం.. లేదా స్నేక్ క్యాచర్స్‌ను పిలిపించి పట్టిస్తాం. వారు కూడా పట్టుకున్న పాములను అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టేస్తారు. ఇక పాములు ఆ

DV RAMANA
Jul 112 min read


కలుషిత నిర్వాకం.. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం
మెనూ సూపర్.. మెటీరియల్ వేస్ట్ గార కేజీబీవీలో బయటపడ్డ అసలు రంగు నలుగురు సస్పెండ్.. ఇద్దరు వెండర్లు బ్లాక్‌లిస్ట్ ఇంకా పాత వాసనలు వదిలించుకోని కేజీబీవీ ఎస్వోలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) “ఉదయం రాగిజావ.. బ్రేక్‌ఫాస్ట్ పూలీ, బంగాళాదుంప కూర.. మధ్యాహ్నం అన్నం, పప్ప్పు, చారు, గుడ్డు, వంకాయ`బంగాళాదుంప`శనగపప్ప్పు కూర, సాయంత్రం స్నాక్స్ కింద బెల్లం పాయసం.. రాత్రి అన్నం, చారు, వెజిటబుల్ కర్రీ..” ఇదీ ఒక కేజీబీవీలో మన జిల్లాలో అమలుచేసే మెనూ. ఇది సోమవారం నుంచి ఆదివారం వరకు కూరల్లో
Prasad Satyam
Jul 113 min read


రివెంజ్ యాక్షన్ డ్రామా
చాలామంది దర్శకులకు మహాభారతంలోని పాత్రలు, సంఘటనలు, ఘట్టాల ఆధారంగా సినిమాలు చేయాలనే తపన ఉంటుంది. మహాభారతం ఆధారంగా వచ్చిన చాలా సినిమాలు, పాత్రలు క్లాసిక్స్‌గా నిలిచాయి. మణిరత్నం దళపతి మొదలుకొని రాజమౌళి బాహుబలి వరకు ఎన్నో చిత్రాల్లో మహాభారతం ఛాయలు కనిపిస్తాయి. ఒక్క సినిమా తీసిన అనుభవం గల దర్శకుడు మురళీకిశోర్ అబ్బూరి, అక్కినేని అఖిల్ కథానాయకుడిగా లెనిన్ సినిమాను మహాభారతంలోని ఘట్టాల ఆధారంగానే తెరకెక్కించాడు. ట్రైలర్లోనే ఆ మొత్తం పాత్రలు, ఒక ప్రాంతాన్ని చూపించిన తీరు మహాభారతాన్ని గ
Guest Writer
Jul 113 min read


ఇలా అయితే భవిష్యత్తే బ్లాకౌట్!
అభివృద్ధి అంటే కొత్త సౌకర్యాలు, సొబగులు, ఆకర్షణలు కల్పించేదిగా ఉండాలే తప్ప ఉన్న సౌకర్యాలను ఊడగొట్టేదిగా.. కొత్త కష్టాలు సృష్టించేదిగా ఉండకూడదు. కానీ ఈ పాటి వివేచన ప్రభుత్వాలకు, దాని ప్రణాళికలను అమలు చేసే అధికారులకు ఎందుకు ఉండటంలేదో అర్థం కావడంలేదు. వీరి అనాలోచిత నిర్ణయాలు, చర్యలకు నగర జీవనం బలైపోతున్నది. వర్షాకాలం వస్తే చాలు.. ఏ వర్షం, ఎప్పుడు తమను ముంచేస్తుందోనని మెట్రో నగరాలు బెంగటిల్లిపోతున్నాయి. ఈ భయాలకు ఇటీవల భారీవర్షాల తో తల్లడిల్లిన పలు నగరాల దుస్థితే నిదర్శనం. రుతుపవ

DV RAMANA
Jul 113 min read
bottom of page


