top of page


అమెరికా, ఇరాన్.. ఓ పాకిస్తాన్!
పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలు రగులుకుంటే వాటితో చలిమంటలు కాచుకోవాలని చూసిన పాకిస్తాన్ ప్రయత్నాలు ఫలించకపోగా కోట్ల రూపాయల చేతి చమురు వదిలింది. ఉగ్రవాద దేశంగా ఇప్పటికే ముద్రపడిన పాకిస్తాన్ యుద్ధం చేస్తున్న ఇరాన్`అమెరికా మధ్య శాంతి చర్చలకు ఇస్లామాబాద్‌ను వేదికగా ఇచ్చి, ఇరుపక్షాలకు మధ్యవర్తిగా వ్యవహరించడం ద్వారా తనపై ఉన్న ఉగ్ర ముద్ర కనిపించకుండా శాంతిదూత ముసుగు తొడుక్కోవాలని చూసింది. కానీ ఆ చర్చలు ప్రాథమిక స్థాయిలోనే విఫలం కావడంతో పాక్ ఇరకాటంలో పడింది. యుద్ధాన్ని నివారించి మధ్యప్రాచ

DV RAMANA
Apr 153 min read


పెనం మీద నుంచి పొయ్యిలోకి ప్రపంచం
కాల్పుల విరమణ ప్రకటించి ఇరాన్, అమెరికాలు చర్చలకు సిద్ధం కావడంతో ‘హమ్మయ్యా.. యుద్ధం సమసిపోవచ్చు’ అని ఆశపడిన ప్రపంచ దేశాల ఆశలు అడియాశలు కావడమే కాకుండా వాటి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయ్యింది. సీజ్ఫైర్, చర్చలకు ముందు వరకు ఇరాన్ మాత్రమే హర్మూజ్ జలసంధిలో తనను వ్యతిరేకించి దేశాల నౌకలను అడ్డుకునేది. టోల్ పన్ను చెల్లించిన రవాణా నౌకలను విడిచిపెట్టేది. దాంతో కొద్దోగొప్పో పెట్రో ఉత్పత్తులు, ఇతర వాణిజ్య నౌకలు జలసంధిని దాటి గమ్యస్థానాలకు చేరుకోగలిగేది. కానీ చర్చలు విఫలమైన త

DV RAMANA
Apr 142 min read


ఇరాన్‌దే వ్యూహాత్మక విజయం!
యుద్ధంలో గెలవడమంటే ఎదుటివారిని చంపడం కాదని అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది. అది ముమ్మాటికీ వాస్తవం. కానీ ఆ విషయం ఇరాన్‌కు తెలిసినంతగా అమెరికా, ఇజ్రాయెల్ పాలకులకు తెలియదని ప్రస్తుత యుద్ధపరిణామాలు చూస్తే అర్థమవుతుంది. అగ్నికి వాయువు తోడైనట్లు ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్‌ను రెండుమూడు రోజుల్లోనే మడతెట్టేస్తామన్న అతివిశ్వాసాన్ని ప్రదర్శించాయి. కానీ ఇరాన్ అలా అనుకోలేదు. అగ్రరాజ్యంతో నేరుగా తలపడుతున్న విషయాన్ని, దాడుల తీవ్రతతో వాటిల్లుతున్న అపారనష్టాన్ని జాగ్రత్తగా అంచనా వేస్తూనే స

DV RAMANA
Apr 132 min read


పాక్-ఇజ్రాయెల్ మధ్య మతం గోడలు!
ఒకవైపు చర్చలకు మధ్యవర్తిత్వం పేరుతో తన దేశాన్ని ఇరాన్, అమెరికా చర్చలకు వేదికనిచ్చిన పాకిస్తాన్ మరోవైపు ఇప్పటికే దుందుడుకుగా వ్యవహరిస్తున్న ఇజ్రాయెల్‌ను మరింతగా రెచ్చగొడుతున్నది. తద్వారా తన ప్రాబల్యాన్ని దెబ్బతీసే చర్చలు కొనసాగకూడదన్న లక్ష్యంగా ఇజ్రాయెల్ పావులు కదుపుతున్నదని ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో పాక్ పాలకపెద్దల వాచాలత్వం దానికి మరింత కలిసివస్తున్నది. ఫలితంగా ఇజ్రాయెల్-పాకిస్తాన్ల మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొంది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ నరమేధం సృష్టిస్తున్నదని తీవ్రంగా వ

DV RAMANA
Apr 113 min read


అణు విద్యుత్ దిశగా ఘనమైన ముందడుగు!
ప్రపంచమంతా యుద్ధం చుట్టూ తిరుగుతున్నది. పెట్రో సంక్షోభంలో చిక్కుకుని ఇంకే దేనిపైనా దష్టి సారించలేకపోతున్నది. అందుకే భారత్ సాధించిన ఓ అద్భుత విజయాన్ని ఎవరూ ఇంకా గుర్తించలేనట్లు కనిపిస్తున్నది. దశాబ్దాల క్రితం భారత అణు పితామహుడు డాక్టర్ ీVAమీ జహంగీర్ బాబా కన్న కలలను భారత్ సాకారం చేసింది. అణు విద్యుత్ రంగంలో అరుదైన విజయాన్ని నమోదు చేసింది. తమిళనాడు కల్పక్కంలోని అణువిద్యుత్ కేంద్రంలో ఉన్న ప్రొటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీని సాధించడం ద్వారా ఈ రంగంలోని ప్రపంచస్థాయి

DV RAMANA
Apr 103 min read


నయా రాయ్‌పూర్ అలా.. అమరావతి ఎలా?
విభజనకు గురై రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విషయంలో పుష్కరకాలం గడిచినా భిన్నాభిప్రాయాలు, రాజకీయ విభేదాలు సమసిపోవడంలేదు. రాజధానిగా అమరావతిని గత టీడీపీ, ప్రస్తుత ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రతిపాదించి అంతర్జాతీయ నగరంగా నిర్మిస్తామంటున్నది. అందుకోసం లక్ష ఎకరాలు, వాటిలో కనీస వసతుల కల్పనకే రూ.2 లక్షల కోట్లు అవసరమని సీఎం చంద్రబాబు సహా పాలకపక్షీయులు చెబుతున్నారు. పైగా 2028 నాటికే అమరావతిని అందుబాటులోకి తెచ్చేస్తామంటున్నారు. కానీ ప్రతిపక్ష వైకాపా మాత్రం తీవ్

DV RAMANA
Apr 82 min read


ట్రంప్ మెడపై 25వ సవరణ కత్తి?
యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, విధిస్తున్న డెడ్లైన్లు, షరుతులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర గందరగోళం సష్టిస్తూ చర్చనీయాంశంగా మారుతున్నాయి. తనమాట వినకుంటే ఇరాన్‌ను రాతియుగంలోకి నెట్టేస్తానని ఒకవైపు తీవ్రస్థాయిలో హెచ్చరికస్తూ గడువులు పెడుతున్నారు. మరోవైపు చర్చలు, దానికి షరతులు, కాలులు విరమణ ప్రతిపాదన అంటూ పావులు కదుపుతున్నారు. తాత్కాలిక కాల్పుల విరమణ తమకు అక్కర్లేదని, ఇలా చీటికీమాటికీ యుద్ధాలకు దిగే పరిస్థితి శాశ్వతంగా తొలగిపోవాలని ఇరాన్

DV RAMANA
Apr 72 min read


ఇరాన్, రష్యాలే నమ్మదగ్గ మిత్రులు!
యుద్ధం ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతున్నది. ఒక వారంలోపే ముగిసిపోతుందనుకున్నది కాస్త ఇప్పుడు ఆరోవారంలోకి ప్రవేశించింది. అయినా ఏమాత్రం తీవ్రత తగ్గకపోగా మరింత జోరందుకునే సూచనలే అధికంగా కనిపిస్తున్నాయి. యుద్ధానికి అంకురార్పణ చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన చర్యలు, విచక్షణారహిత, అహంకారపూరిత వ్యాఖ్యలు, తిట్ల పురాణాలతో పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నారు. మరోవైపు పరిస్థితి తన చేయి దాటిపోతుండటం, స్వదేశంలోనే తనపై వ్యతిరేకత, నిరసన జ్వాలలు మిన్నంటుతున్న పరిస్థితుల్లో చర్చల ప్రతిపాదన చ

DV RAMANA
Apr 63 min read


నిన్న మూడు రాజధానులు.. నేడు మూడు ప్రాంతాలు!
‘ల్యాండ్ పూలింగ్ పేరిట వేలాది ఎకరాలు సేకరించి కొత్తగా మౌలిక వసతులు కల్పించడం భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.. దీనికితోడు అవినీతికి ఆస్కారం ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేసి ఖర్చు పెట్టడం రాష్ట్ర ఆర్ధికానికి పెనుభారం. దీనికంటే.. మచిలీపట్నం`విజయవాడ మధ్య 70 కిలోమీటర్లు.. అలాగే విజయవాడ`గుంటూరు మధ్య 40 కిలోమీటర్లు కలిపి మొత్తం 110 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారికి ఇరువైపులా క్యాపిటల్ కారిడార్ గ్రోత్ పేరిట అభివృద్ధి చేస్తే భారీగా ఖర్చు, సమయం కలిసివస్తాయి. అందుకే మచిలీపట్నం ను

DV RAMANA
Apr 43 min read


రాజధాని దారిలో ఎవరికి వారే!
రాజధాని లేని మన రాష్ట్రంలో పుష్కర కాలంగా అదే అంశం తరచూ రాజకీయరంగు పులుముకుని చర్చోపచర్చలకు, వివాదాలకు కారణమవుతున్నది. కొద్దిరోజులుగా ఇదే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈసారి రాష్ట్రానికే పరిమితం కాకుండా పార్లమెంటుకు పాకింది. తద్వారా దేశమంతా చర్చకు ఆస్కారమిచ్చింది. ఇప్పటికే ఆలస్యమైన రాజధాని అంశంలో రాజకీయాలకు అతీతంగా ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణంలో మన రాష్ట్ర పాలక, ప్రతిపక్షాలు ఇప్పటికీ రాజకీయ భేషజాలను వీడటం లేదు. భిన్నవైఖరులను పట్టుకుని వేలాడటం మానలేదు. అమరావతే

DV RAMANA
Apr 32 min read


ఐటీ భవిత ‘కిల్ ’ అవుతోంది!
దినదినగండం.. నూరేళ్ల ఆయుష్షు అన్న నానుడి ఎప్పటినుంచో ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగుల దుస్థితి.. ఈ నానుడి వందశాతం నిజమని చెప్పకనే చెబుతోంది. ఒకప్పుడు వైట్ కాలర్ జాబ్‌గా గుర్తింపు పొందిన సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం కంటే మిన్నగా భావించేవారు. హో దాకు, దర్జాకు, విలాసాలకు దాన్ని పర్యాయపదంగా పరిగణించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా దిగజారింది. ఒకరోజు హ్యాపీగా గడిస్తే చాలు.. హమ్మయ్యా ఈ రోజు గట్టెక్కింది.. అని ఊపిరి పీల్చుకోవాల్సిన పరిస్థితి. ప్రపంచ

DV RAMANA
Apr 23 min read


పెద్దన్న దన్నుతోనే చిట్టెలుక చిందులు!
ప్రస్తుతం పశ్చిమాసియా భగ్గుమంటుండటానికి అసలు సూత్రధారి ఇజ్రాయెల్. అమెరికా అడుగులకు మడుగులొత్తుతూ.. చివరికి ఆ దేశాన్నే సందర్భం వచ్చినప్పుడల్లా రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడంలో ఇజ్రాయెల్ సిద్ధహస్తురాలు. పశ్చిమాసియాలో యూదులు, అరబ్బుల మధ్య గొడవలు ఇప్పటివి కావు. శతాబ్దాలుగా ఇవి యుద్ధజ్వాలలు రగిలిస్తూనే ఉన్నాయి. పెద్దసంఖ్యలో ఉన్న అరబ్బు దేశాలు యూదులకు నిలువనీడ లేకుండా చేశారన్నది చారిత్రక వాస్తవమే కావచ్చు. ఇప్పటికీ ఆ వివాదాలు రావణ కాష్ఠంలా రగులుతూనే ఉన్నాయి. సుదీర్ఘకాలంపాటు ఎన్నో ఆటు

DV RAMANA
Mar 313 min read


క్రూడ్ రవాణాకు ప్రత్యేక ఆపరేషన్!
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం సర్వత్రా గందరగోళం, అయోమయ పరిస్థితులకు కారణమవుతోంది. ముఖ్యంగా యుద్ధానికి కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రదర్శిస్తున్న చపలచిత్త ధోరణి పరిస్థితిని సంక్షిష్టంగా మారుతున్నది. ప్రతి అంశంలోనూ అతిశయం, ఆర్భాటాలు ప్రదర్శించే ట్రంప్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తున్న యుద్ధం విషయంలోనూ అదే ధోరణి కనబరుస్తున్నారు. ఒకసారి చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయంటారు.. ఇంకోసారి ఇరాన్ ఆయువుపట్లను నాశనం

DV RAMANA
Mar 302 min read


E20 పెట్రోల్‌కు సిద్ధం కండి!
వాహన చోదకులకు మరో పెద్ద అలర్ట్.. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బంకుల్లో సాధారణ పెట్రోల్ లభించదు. ఏంటీ.. ఏప్రిల్ ఒకటి అన్నామని ముందుగానే ఏప్రిల్ ఫూల్ చేయడానికి ప్రయత్నిస్తున్నామనుకోకండి. ఎందుకంటే.. సాధారణ పెట్రోల్.. ఇక లభించదన్నది ముమ్మాటికీ వాస్తవం. అందే దానర్థం పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో పెట్రోల్‌కు కొరత ఏర్పడిందేమో.. అందుకే లభించదని చెబుతున్నామని అనుకోవడం కూడా పొరపాటే. ఆ ప్రమాదం ప్రస్తుతానికి లేకపోయినా.. వచ్చే నెల నుంచి సాధారణ పెట్రోల్ బదులు ఇథనాల్ కలిపిన పెట్రోల్ విక్రయాలు దేశ

DV RAMANA
Mar 283 min read


ఆ జలసంధి కూడా మూతపడితే.. ఇక అంతే!
చర్చల ప్రతిపాదనలకు షరతులు అడ్డుగోడలుగా మారడంతో పశ్చిమాసియా యుద్ధం కొనసాగుతూనే ఉంది. అమెరికాపై దేశీయంగా, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడిని గమనించిన ఇరాన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ మరింత పట్టుబిగిస్తున్నది. ఇప్పటికే ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు ముఖద్వారంలాంటి హర్మూజ్ జలసంధిని తన గుప్పిట్లో పెట్టుకున్న ఇరాన్ తమ దేశ ఆయువుపట్లపై అమెరికా`ఇజ్రాయెల్ దాడులు చేయడానికి తెగబడితే మరో పర్షియన్ గల్ప్ ప్రాంతంలోని మరో కీలక జలసంధిని మూసివేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తోంది. ఇప్పటికే హర

DV RAMANA
Mar 273 min read


టంప్ గాలి పోతోంది!
ఒక స్పష్టమైన లక్ష్యం లేకుండా ఇరాన్‌పై అమెరికా`ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్ధం అంతే అగమ్యంగా సాగుతోంది. దీనికి అంతం ఎప్పుడన్నది అంతుచిక్కడంలేదు. ఒకవైపు చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు చెబుతుండగానే మరోవైపు సంయుక్త దళాలు ఇరాన్‌పై విరుచుకుపడుతునే దాడులు ఆపడానికి 15 షరతులు అంటూ ప్రకటనలు చేస్తున్నాయి. ఇంకోవైపు చర్చలు జరగడంలేదని ఇరాన్వర్గాలు కొట్టిపారేస్తూ ఈ దశలో యుద్ధాన్ని ఆపడం ట్రంప్ చేతుల్లో లేదని.. మొదలుపెట్టింది ఆయనే కాబట్టి ముగింపు ఎప్పుడన్నది తాము నిర్ణయిస్తామని, దాని

DV RAMANA
Mar 263 min read


ఇంధన ఎమర్జెన్సీ దిశగా ప్రపంచం
రెండు దేశాల అభిజాత్యం.. మధ్యలో ఒక అగ్రదేశపు అహంకారం.. వీటి మధ్యలో ప్రపంచంలోని దేశాలు నలిగిపోతున్నాయి. యుద్ధంతో తమకు ఏమాత్రం సంబంధం లేకపోయినా శిక్ష అనుభవిస్తున్నాయి. ఇరాన్, అమెరికా`ఇజ్రాయెల్ మధ్య దాడులు ఆగినట్లే ఆగి.. అంతలోనే పెచ్చరిల్లడంతో ఇప్పట్లో దీనికి పరిష్కారం.. ప్రపంచ దేశాలకు ఉపశమనం లభించదేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ యుద్ధం నేపథ్యంలో ఒక్క హర్మూజ్ జలసంధే చాలా దేశాల ఎకానమీని తల్లకిందులు చేసేస్తోంది. ఇప్పటికే పలు దేశాలు ఇంధన ఎమర్జెన్సీని ప్రకటించాయి. తన చమురు అవసరాల్లో

DV RAMANA
Mar 252 min read


వైవిధ్య ఒప్పందాలతో సంక్షోభాలకు చెక్!
యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న కల్లోల పరిస్థితుల్లో అక్కడి నుంచి సరఫరా కావాల్సిన క్రూడ్, గ్యాస్‌కు అంతరాయాలు వాటిల్లుతున్నాయి. ఫలితంగా ప్రపంచ దేశాలతోపాటు భారత్‌లోనూ పెట్రోల్, గ్యాస్ సంక్షోభం నెలకొంది. పెట్రోల్ కంటే గ్యాస్ కొరత ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ సంక్షోభ సమయంలో భారత ప్రభుత్వం ముందుచూపుతో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు అక్కరకు వస్తున్నాయి. భారత్ తన ఇంధన, గ్యాస్ అవసరాలకు అధికశాతం గల్ప్ దేశాలపైనే ఇన్నాళ్లుగా ఆధారపడుతోంది. ఈ ప్రాంతంలో తరచూ చెలరేగుతున్న యుద్ధాలు, ఘర్షణలు

DV RAMANA
Mar 243 min read


ఇజ్రాయెల్ ‘అణు’ రహస్యం!
యుద్ధం ప్రారంభమై మూడు వారాలకుపైగా గడిచినా తొణకని, బెణగని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదివారం మాత్రం హుటాహుటిన డిమోనా అనే ప్రాంతానికి పరుగులు తీశారు. ఇరాన్ ఆ ప్రాంతంపై క్షిపణి దాడి చేసినా అక్కడ పెద్దగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లిన దాఖలాల్లేవు. అయినా ప్రధాని స్థాయి నేత ఎందకు అక్కడికి పరుగులు తీశారు. దీనికి కారణం.. డిమోనా అనేది దశాబ్దాలుగా ఇజ్రాయెల్ కాపాడుకుంటూ వస్తున్న ఒక రహస్యం. ఆ రహస్యం ఏమిటన్నది ఇజ్రాయెల్ పెద్దన్న అమెరికాతో సహా ప్రపంచ దేశాలన్నింటికీ తెలిసినా అద

DV RAMANA
Mar 232 min read


గెరిల్లా యుద్ధతంత్రం వైపు ఇరాన్!
పశ్చిమాసియా యుద్ధాన్ని త్వరగానే ముగించేస్తామని అటు అమెరికా రక్షణ మంత్రి, ఇటు ఇజ్రా యెల్ ప్రధానమంత్రి ప్రకటించారు. 90వ దశకంలోని గల్ఫ్ యుద్ధం మాదిరిగా ఇది సుదీర్ఘకాలం కొనసాగే పరిస్థితి లేదని.. ఇరాన్ ఆయుధాగారం ఇప్పటికే దాదాపు ఖాళీ అయిపోవడం, ఆ దేశ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నం కావడమే దీనికి కారణమన్నది ఆ నేత అభిప్రాయం. కానీ ఇరాన్ నాయకత్వం దీనికి భిన్నమైన వాదన వినిపిస్తోంది. తమ దేశంలోని జనావాసాలు, ఆర్థిక ఆయువుపట్లు అయిన చమురు, గ్యాస్ క్షేత్రాలపై అమెరికా`ఇజ్రాయెల్ దాడులు చేయడాన్ని త

NVS PRASAD
Mar 203 min read
bottom of page


