top of page


జిల్లా పేకాట.. సుంకి బాట!
దాడులకు గురవుతున్నా వెరవని జూదరులు అలమండ డెన్‌లో గొడవలు, దాడులు, హత్యతో కలకలం పర్లాకిమిడి, రాయగడ సరిహద్దుల నుంచి షిఫ్ట్ అద్దె కార్లు పెట్టి మరీ జిల్లా నుంచి తరలింపు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పేకాడకుండా వీరు ఉండలేరో లేక పేకాట శిబిరం నిర్వహించకుండా వారు ఉండలేకపోతున్నారో తెలియదుగానీ రాయగడ దగ్గర రౌడీషీటర్లు రావడం, దోచుకోవడం, ఆ తర్వాత పంచాయితీ, మర్డర్ వంటి విపరిణామాలు జరిగిన తర్వాత కూడా శ్రీకాకుళం జిల్లా జూదగాళ్లు ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఒడిశా బోర్డర్‌కు వెళ్లి చతుర్ముఖ

BAGADI NARAYANARAO
May 122 min read


పేకాట.. పంచాయితీ.. హత్య
సిక్కోలువాసుల దోపిడీ కేసులో రౌడీషీటర్ కొడుకు హతం పోలీసుల అదుపులో అలమండ శిబిరం నిర్వాహకులు జూదం పేరు చెబితే వణికిపోతున్న జిల్లా జూదరులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఒడిశాలోని అలమండలో పేకాటకు వెళ్లి నిలువుదోపిడీకి గురైన జిల్లావాసుల కథలో ఇప్ప్పుడు కొత్తగా కోణం కూడా చేరింది. పేకాడటానికి వెళ్లినవారిని తుపాకితో బెదిరించి నగదు, బంగారం ఎత్తుకుపోయిన ముఠాతో పంచాయితీ నిర్వహించిన తర్వాత ఈ తుపాకీ గ్యాంగ్‌కు లీడర్‌గా ఉన్న శివ తనయుడ్ని హత్య చేశారు. అయితే ఎవరు చేశారు? ఎందుకు చేశారనేది ఒడి

BAGADI NARAYANARAO
May 112 min read


కట్నం కాష్టంలో కరిగిన కలలు
మూడుముళ్లు వేసిన చేతులతోనే ఉరితాడు బిగించారు పెళ్లయిన రెండు నెలలకే వందేళ్ల జీవితాన్ని ఆర్పేశారు కాపురం పెట్టిన ఇంట్లోనే విగతజీవిగా తేజశ్రీ భర్త, అత్తింటివారిదే ఈ దుష్కృత్యమని కన్నవారి ఆరోపణ విశాఖ త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు.. కేసు నమోదు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రెండు నెలల క్రితం బంధుమిత్రుల హర్షాతిరేకాలు, బాజాభజంత్రీల కోలాహలం మధ్య పెళ్లిపల్లకీ ఎక్కిన ఆమె.. శుక్రవారం సన్నిహితుల రోదనల మధ్య పాడె ఎక్కింది. అక్షింతలు వేసి దీవించిన చేతులే ఆమె మృతదేహంపై చివరిసారి

BAGADI NARAYANARAO
May 92 min read


పోలీసులకు చిక్కిన దోపిడీ ముఠా
కొలిక్కి వచ్చిన పలాస బంగారు ఆభరణాల కేసు పోలీసులు అదుపులో ఒడిశాకు చెందిన ఐదుగురు నిందితులు 243 గ్రాముల అభరణాలు రికవరీ 2 పిస్టల్స్, నాలుగు కార్లు, 12 సెల్ఫోన్లు స్వాధీనం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో పరిధిలోని నిత్యానందనగర్ శ్రీ వేంకటేశ్వర జువెలరీ షాప్‌లో జరిగిన బంగారు ఆభరణాల దోపిడీ కేసులో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి సొత్తును రికవరీ చేశారు. నిందితుల్లో ఒడిశాకు చెందిన రామంద్ర సాహు, కున బారిక్, బానోజ్ బెహరా పట్నాయక్, తపన్ మహా

BAGADI NARAYANARAO
May 23 min read


గండరి ‘గంగడు’
రాణిపేట శిబిరానికి అండదండ ఏజెంట్ల నియామకంలో కీలకం పోలీసులు రాణిపేటకు రాలేరన్న భరోసాతో వాటాలు జూదరుల వీక్నెస్తో కోట్లు సంపాదన (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ‘సిక్కోలు పేకాట.. కేరాఫ్ రాణిపేట’లో కీలక సూత్రధారులు మీసాల లక్ష్మీనారాయణతో పాటు పోలీసు వ్యవస్థలను మేనేజ్ చేసే మరో వ్యక్తి గంగడు. ఈయనది పర్లాకిమిడి స్థిర నివాసం. చికెన్, మటన్ వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపార రీత్యా గంగడుగా అందరికీ పరిచయమయ్యారు. ఆ పరిచయాలతో పేకాట శిబిరాన్ని నిర్వహిస్తూ కోట్లకు పడగెత్తాడు. చికెన్, మటన్ వ్యాప

BAGADI NARAYANARAO
Apr 302 min read


సిక్కోలు పేకాట.. కేరాఫ్ రాణిపేట
ఏడాదిన్నరగా పర్లాకిమిడిలో శిబిరం నిర్వహణ శ్రీకాకుళం ప్రాంతాల నుంచి జూదరుల తరలింపు ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే డెన్ ఎట్టకేలకు ఒడిశా పోలీసుల దాడి.. నిర్వాహకుడి అరెస్టు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పోలీసు దాడులు, నిఘా పుణ్యాన జిల్లాలో ఏడాదిన్నరగా పేకాట శిబిరాలు గల్లంతయ్యాయి. పేకముక్కలు పట్టుకోవడానికి అýవాటు పడిన చేతులు చాలారోజులుగా ఆటలేక చిమచిమలాడుతున్న తరుణంలో రా.. రామ్మని ఆహ్వానించింది.. ఒడిశా పరిధిలోని పర్లాకిమిడి రాణిపేట తోట. జిల్లాకు చెందిన పేకాటరాయుళ్లను ఆహ్వానించి స

BAGADI NARAYANARAO
Apr 292 min read


నకిలీ పాస్‌ల కేసులో ఆరుగురిపై FIR
శుక్రవారం వన్‌టౌన్‌లో మొదలైన ప్రాథమిక విచారణ ప్రింటింగ్‌కు వాడిన పరికరాలు సీజ్ చేసే అవకాశం ‘పాస్‌లకు పిల్లలు పుట్టాయి’ కేసులో కదలిక మొదలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ ఏడాది రథసప్తమి సందర్భంగా వీఐపీలు, వీవీఐపీలు, డోనార్లకు సంబంధించిన నకిలీ పాస్‌లు సష్టించి వేలకు వేలు మార్కెట్లోకి విడుదల చేసిన కేసులో ఆరుగురిపై శ్రీకాకుళం వన్‌టౌన్ పోలీసులు ఎఫఐఆర్ నమోదు చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయాన్నే వీరిని స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించారు. నకిలీ పాస్‌లు ఎన్ని ముద్రించారు? ఎం
Prasad Satyam
Apr 171 min read


రక్తనిధిలో ధనదాహం
సేవ ముసుగులో వ్యాపారం చేస్తున్న న్యూ శ్రీకాకుళం u్లడ్బ్యాంక్ ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక వసూళ్లు కాగితాలకే పరిమితమైపోయిన సిబ్బంది వైద్యులకు కమీషన్లు.. ప్లేట్లెట్లలో కల్తీలు పర్యవేక్షించాల్సిన శాఖలకు నెలకు రూ.50వేలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మీ రక్తం మరొకరికి ప్రాణదానం.. ఇది రక్తదానం మీద అవగాహన కల్పించడానికి, ఆపదలో ఉన్నవారిని బతికించడానికి ఎవరో మహానుభావుడు రాసిన నినాదం. అయితే ఏ నినాదం వెనుక ఎవరి స్వప్రయోజనాలు దాగివున్నాయో తెలియవంటూ కమ్యూనిస్టు మిత్రులు నిరం
Prasad Satyam
Apr 144 min read


భూమి మీదే.. డాక్యుమెంట్లే మావి!
చనిపోయినవారి పేరుతో పాస్బుక్ల సృ ష్టి నాయకులకే దిక్కులేదు.. సామాన్యుల పరిస్థితేమిటినే ప్రశ్న నకిలీ పత్రాలతో మాయాజాలం విలువైన స్థలంపై కన్ను కటకటాల్లోకి కిలాడీ గ్యాంగ్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) తెలుగు సతీష్‌కుమార్.. వత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం. మామిడి జగన్నాధరావు.. వత్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం. బొత్స గోవిందరాజు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం. కోడూరు విజయ్‌కుమార్.. రియల్ ఎస్టేట్ వ్యాపారం. దాట్ల గోపాలకష్ణంరాజు.. రియల్ ఎస్టేట్ వ్యాపారం. అర్జి అప్పలరాజు.. రియల్ ఎస్టేట్ వ్యాప
Prasad Satyam
Apr 103 min read


పలాసలో సినీఫక్కీలో దోపిడీ
జీఎస్టీ అధికారులమంటూ చొరబడిని ఎనిమిదిమంది యజమానికి బేడీలు వేసి 750 గ్రామలు బంగారం అపహరణ వెంకటేశ్వర జ్యూయలరీలో చోరీ రంగంలోకి దిగిన పోలీసులు, క్లూస్‌టీమ్ (సత్యంన్యూస్, పలాస) పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే భగవతి థియేటర్ రోడ్డులోని నిత్యానందనగర్ శ్రీ వెంకటేశ్వర జ్యూయలర్స్‌లో పట్టపగలు గుర్తు తెలియని వ్యక్తులు సినీ ఫక్కీలో బంగారం దోపిడీకి పాల్పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో కారులో వచ్చిన నలుగురు జీఎస్టీ అధికారులమంటూ యజమాని కిల్లంశెట్టి రామ కృష్ణ కు పరిచయం చేసు

BAGADI NARAYANARAO
Apr 71 min read


హ్యాట్సాఫ్ రేవతి..!
హెడ్ కానిస్టేబుల్ రేవతి.. సాత్తాన్‌కుళం లాకప్ డెత్ కేసులో తొమ్మిది మంది తోటి పోలీసులకు ఉరిశిక్ష పడటానికి కారణమైన కీలక సాక్షి. ఒక సందర్భంలో మనస్సాక్షి ఎలా వ్యవస్థ కంటే పెద్దదవుతుందో చూపించిన ఒక అద్భుతమైన ఉదాహరణ. తమిళనాడులో జరిగిన ఆ లాకప్ మరణాలు దేశాన్ని కుదిపేసిన ఘటన. కానీ ఆ దారుణం బయటకు రావడానికి కారణం రేవతి. సంఘటన జరిగిన తర్వాత స్టేషన్లో పరిస్థితి ఎలా ఉందంటే.. జరిగినది బయటికి రాకూడదనే ఒక ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. సాక్ష్యాలను తుడిచేయాలి, కథను మార్చాలి.. ఇవే ప్రధాన లక్ష్
Guest Writer
Apr 71 min read


మంత్రి పేరుతో చిల్లర పనులు
హైదరాబాద్ యువతి నుంచి సొమ్ములు వేయించుకున్న నకిలీ నాయకుడు టెక్కలికి చెందిన తరుణ్‌గా గుర్తించిన టీడీపీ వర్గాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) కేంద్ర పౌరవిమాన యాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేరుతో ఒక ఫేక్ ఐడీని ఫేస్బుక్లో క్రియేట్ చేసి, హైదరాబాద్‌కు చెందిన ఒక యువతిని ఆర్థికంగా మోసం చేసిన కేసును ప్రాథమికంగా టీడీపీ శ్రేణులు, ముఖ్యంగా కేంద్రమంత్రి కార్యాలయం గుర్తించింది. శ్రీకాకుళానికి చెందిన మహిళ హైదరాబాద్‌లో స్థిరపడి, ఒక పని కోసం రామ్మోహన్ నాయుడుకు సోషల్ మీడియాలో ఫిర
Prasad Satyam
Mar 241 min read


కలెక్షన్ సీట్ల కోసం జిల్లా ట్రెజరీలో గలాట
పోలీస్ స్టేషన్లో డీడీ, ఉద్యోగులు పరస్పరం ఫిర్యాదులు కౌన్సిలింగ్‌తో పంచాయితీని చక్కదిద్దిన సీఐ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లా ఖజానా శాఖలో ఎస్టాబ్లిష్మెంట్ విభాగంగా దండిగా సొమ్ములు వచ్చే ఏ1, ఏ2 పోస్టుల కోసం ఆ శాఖ డీడీ రవికుమార్, కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు పోలీస్‌స్టేషన్ మెట్లెక్కారు. గత కొన్ని రోజులుగా కార్యాలయంలో ఈ రెండు పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సీట్ల మార్పుల విషయంలో డీడీ, కార్యాలయ ఉద్యోగుల మధ్య వివాదం నడుస్తుంది. డీడీ తనకు నిచ్చిన ఇద్దరిని ఆ

BAGADI NARAYANARAO
Mar 232 min read


స్వల్ప వివాదం.. తీసింది ప్రాణం!
మేనల్లుడిని మందలించిన యువకుడు తమనెందుకు నిందించావని మరొకడి నిలదీత ఇద్దరి మధ్య వాదులాట, తోపులాట కిందపడి మరణించిన టీడీపీ కార్యాలయ ఉద్యోగి గంజాయి, మద్యం బానిసల ఆగడాలేనని ఆరోపణలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) స్వల్ప వివాదం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పరిచయమే లేని ఇద్దరు యువకుల మధ్య అనవసరం మొదలైన గొడవ తోపులా{కు దారితీసి ఒకరి మరణానికి కారణమైంది. ఉగాది రోజు అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న మండలవీధికి చెందిన గొర్లె మోహనరావ

BAGADI NARAYANARAO
Mar 202 min read


గాయత్రీ... హతవిధీ!
నెలల క్రితమే బయటపడ్డ మార్ఫింగ్ జాడ విద్యార్థినులను భయపెట్టి తొక్కిపెట్టే కుట్ర ‘సత్యం’ కథనం, పేరెంట్స్ ఒత్తిడితో ఫిర్యాదు నాటి స్ఫూర్తికి భిన్నంగా నడుస్తుందన్న అనుమానాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) “స్వామినాయుడు, అంబటి రంగారావు, పులఖండం శ్రీనివాసరావు, విష్ణుమూర్తి వంటి విద్యావేత్తలు, ఉన్నత ఆలోచనాపరుల కనుసన్నల్లో నడిచిన విద్యాసంస్థ అది. మాలాంటి వారికి వారంతా ఒక దిక్సూచి లాంటివారు. గురజాడ సంస్థ జిల్లాకు ఒక బ్రాండ్. గాయత్రీ హÃమాలకు, యువజనోత్సవాలకు అదో వేదిక. కానీ ఈరోజు ఆ స

BAGADI NARAYANARAO
Mar 133 min read


‘గురజాడ’లో అశ్లీల మార్ఫింగ్ జాడ
మహిళా అధ్యాపకులే ప్రథమ బాధితులు డిగ్రీ విద్యార్థినుల ఫొటోలకూ అదే గతి నిందితులకు టీసీ ఇచ్చామంటున్న మేనేజ్మెంట్ అసభ్య డేటా అమ్మేశారంటున్న తల్లిదండ్రులు మార్ఫింగ్‌కు సహకరించిన తోటి విద్యార్థిని ఎస్పీకి ఫిర్యాదు వెళ్లకుండా బంధిఖానా (సత్యంన్యూస్, శ్రీకాకుళం) మహాకవి గురజాడ అడుగుజాడల్లో చదువు చెబుతామంటూ నెలకొల్పిన సొసైటీ అది.. చదువుల తల్లి గాయత్రీదేవి పేరుతో నడుస్తున్న కార్పొరేట్ కాని కార్పొరేట్ సంస్థ అది.. ఊరికి దూరంగా మునసబుపేటలో ప్రత్యేక

BAGADI NARAYANARAO
Mar 122 min read


నకిలీ బీమా!
చావుకు చేరవైనవారే వారి పెట్టుబడి వారి పేరుతో తప్పుడు పత్రాలు సృ ష్టించి పాలసీలు చనిపోయాక కుటుంబ సభ్యులతో క్లెయిమ్స్ దాఖలు పరిహారం అందాక వారికి కొంత ఇచ్చి.. మిగతాది స్వాహా ఇందులో తొమ్మిది బీమా సంస్థల సిబ్బంది ప్రమేయం జిల్లా ఎస్పీతోపాటు ఐఆర్‌డీఏఐకి ఫిర్యాదులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) వంజంగి గ్రామానికి చెందిన బెండి మహాలక్ష్మి తొమ్మిది బీమా సంస్థల్లో పాలసీలు తీసుకుంది. తీసుకున్న ఏడాదిలోనే మతి చెందింది. దాంతో ఆ పాలసీలకు సంబంధించి రూ.1.40 కోట్ల బీమా పరిహారం చెల్లి

BAGADI NARAYANARAO
Feb 193 min read


యాసిడ్ దాడికి యత్నించినా నో కేస్
ఇంటిని తగులబెట్టడానికి వచ్చినా స్పందించలేదు తాళాలు బద్దలుగొట్టినా 112 దిక్కు సీసీ ఫుటేజ్ ఇచ్చినా ఎఫఐఆర్ పడలేదు 2024 నుంచి పోలీసుల చుట్టూ తిరుగుతున్న బాధితుడు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నక్కలు, తోడేళ్లకు అడవుల్లో జీవనం కష్టమై నగరానికి వలసలు వచ్చాయి. బాధితుడ్ని సొమ్ములు తెచ్చే వనరుగా చేసుకోవడం బాగా అర్థం చేసుకుంటున్నాయి. పసిరిక పాములు పచ్చని తీగలుగా కనిపించే కాలమిది. విషం ఇప్ప్పుడు కోరల్లో లేదు.. నిందితుడికి అమ్ముడుపోయే సమాచారంలో ఉంది. తనకు న్యాయం దక్కదని తెలిసినా పోలీస
Prasad Satyam
Feb 93 min read


15 రోజుల్లోనే.. 807 మంది మిస్సింగ్!
దేశ రాజధాని ఢిల్లీని కలవరపెడుతున్న కేసులు అదశ్యమైనవారిలో మహిళలు, యువతులే అధికం 235 మంది ఆచూకీ మాత్రమే లభ్యం మానవ అక్రమ రవాణా ముఠాలపై అనుమానాలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మీకు గుర్తుందా! సుమారు రెండేళ్ల క్రితం 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో 30వేల మంది యువతులు అదశ్యమయ్యారన్న ఆరోపణ రాష్ట్ర రాజకీయాల్లో బాంబులా పేలింది. ఈ ఆరోపణ చేసింది సాక్షాత్తు జనసేన అధ్యక్షుడు, ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్‌కల్యాణ్. పైగా కేంద్ర ప్రభుత్వ నిఘా వ

DV RAMANA
Feb 62 min read


ఖజానాకు మద్యం కిక్!
జిల్లాలో రూ.11.10 కోట్ల విలువైన అమ్మకాలు గత ఏడాది కంటే ఎక్కువ వ్యాపారం చివరి నాలుగు రోజుల్లోనే రికార్డు టర్నోవర్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నూతన ఏడాదిని జిల్లా ప్రజలు మద్యం పొంగించి మరీ ఘనంగా జరుపుకొన్నారు. కొత్త సంవత్సరం 2026కు స్వాగతం పలుకుతూ జనవరి ఒకటో తేదీకి ముందు నాలుగు రోజులు, ఆ రోజు కూడా జిల్లాలో మద్యం ఏరులైపారింది. ఈ నాలుగైదు రోజుల్లోనే రూ.11.10 కోట్ల మద్యాన్ని తాగేశారని ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో ఉన్న మొత్తం 176 మద్యం షాపులు, 9 బార్లకు బే

BAGADI NARAYANARAO
Jan 22 min read
bottom of page


