top of page


బీజేపీ అఖండ స్వరూపం
సువిశాల ప్రజాస్వామ్య దేశంలో భిన్న జాతులు, మతాలు, సంస్కృతులు కలిగిన కోట్లాది ఓటర్ల మనసులను చురగొని.. దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా ఎదగడం ఎంతమాత్రం చిన్న విషయం కాదు. అధికారంలోకి రావడానికి అవసరమైన భారీ ఓటు బ్యాంకు సాధించడం చాలా కష్టం. ఆ ఓటుబ్యాంకు చేజారకుండా ఏళ్ల తరబడి కాపాడుకోవడం అంతకంటే కష్టం. అది కూడా ఒక మతానికి ప్రాతినిధ్యం వహిస్తుందని ముద్ర పడిన పార్టీ ఈ ఫీట్ సాధించడం నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఆ అద్భుతాన్నే భారతీయ జనతా పార్టీ సాధించింది. ఒకప్పుడు జనసంఫ్‌ుగా కార్యకలాపాలు

DV RAMANA
Nov 22, 20252 min read


సమాచార హక్కుకు ముకుతాడు!
వ్యక్తిగత గోప్యత పరిరక్షణ కోసమంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యక్తిగత డిజిటల్ సమాచార రక్షణ చట్టంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గతవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ చట్టం నిబంధనలు సమాచార హక్కు చట్టాన్ని తూట్లు పొడిచేలా ఉన్నాయని ఎడిటర్స్ గిల్ద్, డిజిపబ్ న్యూస్ ఫౌండేషన్ వంటి సమాచార రంగ వ్యవస్థలు అభిప్రాయపడ్డాయి. తాజా నిబంధనలు సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేయటమే కాక పత్రికా స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగిస్తాయంటున్నారు. ఈ నిబంధనలు విలేకరులపై అనేక పరిమితులు విధిస్తూ వ

DV RAMANA
Nov 21, 20252 min read


భారత్‌పై యూనస్ కోపం.. బంగ్లాకు శాపం
మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు అక్కడి అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఉరిశిక్ష విధించడంపై ఒకవైపు బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగి దేశం అగ్నికాష్ఠంలా రగులుతుంటే.. అదేమీ పట్టని ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ తన సొంత అజెండాను అమలు చేస్తున్నారు. దేశం అవతరించినప్పటినుంచీ భారత్‌తో పటిష్టంగా కొనసాగిస్తున్న స్నూహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలకు తూట్లు పొడిచి చైనా అనుకూల విధానాలు అవలంభిస్తున్నారు. 2024లో యువజనుల రిజర్వేషన్ ఉద్యమం కాస్త ప్రభుత్వంపై తిరుగుబాటుగా మారడంతో అప్పటి

DV RAMANA
Nov 20, 20252 min read


మన నిఘా కన్నుకు ఏమైంది?
రాష్ట్రంలో మళ్లీ మావోయిస్టుల కలకలం. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు కార్యకలాపాలు గానీ, వారి ఉనికి గానీ దాదాపు కనిపించలేదు. అల్లూరి జిల్లాలో అడపాదడపా సానుభూతిపరులు, మిలీషియా సభ్యుల లొంగుబాట్లు, అరెస్టులు వంటివి జరిగాయే తప్ప.. పోలీసు కాల్పులు, పేలుళ్లు వంటి విధ్వంసక ఘటనలు చోటుచేసుకోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో గుండెల మీద చేతులు వేసుకుని నిశ్చింతగా ఉంటూ వచ్చాయి. మావోయిస్టు కార్యకలాపాల ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో స్తంభించిన ప్

DV RAMANA
Nov 19, 20252 min read


పల్టీ రాజకీయం ఇక సాగదు!
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీహార్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు తీసుకొచ్చే సూచనలు కనిపి స్తున్నాయి. ఆయారాం.. గయారాం.. రాజకీయాలకు బీహార్ పెట్టింది పేరు. అధికారం ఎక్కడుంటే అక్కడ వాలిపోయే ఫిరాయింపు రాజకీయాలనే ఆయారాం..గయారాం రాజకీయం అంటారు. అయితే ఏ సాధారణ నాయకుడో, ఎమ్మెల్యేనో ఇలాంటి ఫిరాయింపులకు పాల్పడితే పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. దేశమంతటా.. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఈ కుసంస్కృతి పాతుకుపో యింది. అయితే బీహార్‌లో అంతకుమించి అన్నట్లు సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయ

DV RAMANA
Nov 18, 20252 min read


క్రైమ్ రికార్డుల డొల్లతనం!
ప్రజల్లో చైతన్యం గతం కంటే పెరిగిందని ప్రభుత్వాలు చెబుతున్నాయి. నేరాలు కూడా అదుపులోకి వస్తున్నాయని ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ అవన్నీ ఉత్తుత్తి ప్రచారాలేనని కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) నివేదిక కొట్టిపారేస్తోంది. జాతీయస్థాయిలో 2023 ఏడాదిలో జరిగిన నేరాలు, కేసులతో కూడిన నివేదికను ఆ సంస్థ ఇటీవలే విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో గృహహింస, దళితులపై దాడులు, కస్టోడియల్ మరణాలు అధికంగా సంభవించినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. కానీ వ

DV RAMANA
Nov 17, 20252 min read


మార్పు అంత ఈజీ కాదు!
బీహార్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. అధికార ఎన్డీయే కూటమి గతం కంటే ఎక్కువ సీట్లు సాధించి అధికారాన్ని పటిష్టపర్చుకోవడం, కాంగ్రెస్`ఆర్జేడీల నేతృత్వంలోని మహాఘట్బంధన్ కనీస సీట్లకే పరిమితం కావడం వంటి పరిణామాలపై రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. రాజకీయ పార్టీలు, కూటములు, ప్రజలు.. ఇలా ఎవరికి వారు తమ కోణం నుంచే ఎన్నికల ఫలితాలను, తాజా రాజకీయ పరిణామాలను పరిశీలించి తోచిన విధంగా విశ్లేషణలు చేస్తున్నారు. వాటికి సొంత వ్యాఖ్యానాలు జోడిస్తున్నారు. ఈ ధోరణి సహజమే కానీ.. వీటిలో ఏకత్వం ఆశించడం

DV RAMANA
Nov 15, 20252 min read


అగ్రరాజ్యంలో ఆర్థిక పతనం!
ఆధునిక ప్రపంచంలో అమెరికాయే ఏకైక అగ్రరాజ్యంగా కొనసాగుతోంది. ఆర్థికంగా, సాంకేతికంగా, అభివృద్ధిపరంగా ప్రపంచానికి పెద్దన్న అన్నట్లు వ్యవహరిస్తోంది. అనేక చిన్నదేశాలకు అప్పులు, గ్రాంట్లు ఇస్తూ మన గ్రామాల్లోని మోతుబరి పాత్ర పోషిస్తోంది. అదే సాకుతో తరచూ పెత్తనాలు సాగిస్తూ ఇతర దేశాలపై రుబాబు చేస్తోంది. మరోవైపు చాలా దేశాలు తమ బంగారం, ఇతర కరెన్సీని సైతం అమెరికా వద్ద దాచుకుంటున్నాయి. అవసరానికి అక్కరకు వస్తాయన్నది దాని వెనుక ఉద్దేశం. కానీ ప్రస్తుతం అమెరికాకు అంత సీన్ లేదని స్పష్టమవుతోంది

DV RAMANA
Nov 14, 20252 min read


కట్టుతెంచి చేటు చేస్తున్న ఎమ్మెల్యేలు!
పార్టీల్లో అసంతృప్తి ఉండటం.. కొందరు బాగా పని చేయడం.. ఇంకొందరు అంటీముట్టనట్లు ఉండటం సహజం. ఇటువంటి లోపాలను అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా పార్టీలు ట్రీట్ చేస్తుంటాయి. ప్రతిపక్షంతో పోలిస్తే అధికార పార్టీల్లో ఇలాంటి సమస్యలు పెద్దగా కనిపించవు. ఒకవేళ కొద్దోగొప్పో ఉన్నా అవి పెద్దగా బయటపడవు. కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి సారధ్యం వహిస్తున్న ఎన్డీయే కూటమి ప్రధాన భాగస్వామి అయిన టీడీపీలో దాదాపు మూడోవంతు ఎమ్మెల్యేల పార్టీని పట్టించుకోవడంలేదని సాక్షాత్తు ఆ పార

DV RAMANA
Nov 12, 20252 min read


జైళ్లలో మగ్గుతున్న సత్వర న్యాయం!
ఎంత కరడుగట్టిన నేరస్తుడినైనా విచారణ జరిపి, ఆధారాలు పరిశీలించి, అతడు నేరం చూసినట్లు నిర్ద్వంద్వంగా నిర్థారణ అయిన తర్వాతే అతన్ని నేరస్తుడిగా గుర్తించి, తగిన శిక్ష విధించాల్సి ఉంటుంది. ఈ సహజ న్యాయప్రక్రియ పూర్తి కానంతవరకు అతన్ని కేవలం నిందితుడిగానో అనుమానితుడిగానో పరిగణించాల్సి ఉంటుంది. ఇదే సహజ మానవహక్కు. మనదేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా ఈ హక్కునకు గుర్తింపు, గౌరవం ఉన్నాయి. అలాగే సత్వర న్యాయం పొందడం కూడా పౌరుల హక్కే. ఈ క్రమంలో తమ కేసుల విచారణకు సొంతంగా న్యాయవాదిని నియమి

DV RAMANA
Nov 11, 20252 min read


మాంసాహారంలో మనది వెనుకంజే!
‘ముక్క లేనిదే ముద్ద దిగదు’.. మాంసాహార ప్రియుల విషయంలో ఈ నానుడి మనదేశంలో బాగా వాడుకలో ఉంది. కొందరికి రోజులో మూడుపూటలూ, మరికొందరికి రోజుకొక్కసారైనా ముక్క లేకపోతే తిండి సహించదు. ఈ ట్రెండ్ చూసి ప్రపంచంలో మనదేశంలోనే మాంసాహార వినియోగం అధికంగా ఉందని అనుకోవచ్చు. కానీ వాస్తవం కాదు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో మాంసం సంప్రదాయ ఆహారంలో ఓ ప్రధాన భాగంగా ఉంటూ వస్తోంది. ఇదే విషయాన్ని ‘స్టాటిస్టా రీసెర్చ్ డిపార్ట్మెంట్’ అనే సంస్థ రూపొందించిన సర్వే నివేదికలో పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమి

DV RAMANA
Nov 10, 20252 min read


బీహార్ మార్పు కోరుతోందా?
మొదటిదశ పోలింగ్ పూర్తి చేసుకున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ పోలింగుపై రాజకీయ పార్టీలు దృష్టి కేంద్రీకరిస్తే.. మొదటి దశ పోలింగ్ జరిగిన తీరు ఎవరికి అనుకూలమన్నదానిపై రకరకాలు విశ్లేషణలు జరుగుతున్నాయి. ఇప్పటికే తొలిదశ పోలింగ్ సరళిని లోటుపాట్లను గుర్తించి పార్టీలు తదనుగుణంగా రెండో దశకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. అయితే తొలిదశలో బీహర్ చరిత్రలోనే రికార్డుస్థాయి పోలింగ్ నమోదు కావడం కొత్త చర్చలకు తావిస్తోంది. 73 ఏళ్ల బీహార్ చరిత్రలో 64.66 శాతం పోలింగ్ నమోదవడం ఇదే తొలిసా

DV RAMANA
Nov 8, 20252 min read


ఓట్ల చోరీపై ఎందుకంత గుంభనం!
బీహార్ ఎన్నికల ముంగిట కాంగ్రెస్ అగ్రనేత మరోసారి ఓట్ల చౌర్యం వివాదాన్ని తెరపైకి తెచ్చారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగుకు ఒక్కరోజు ముందు గత ఏడాది సార్వత్రిక ఎన్నికలనాటి నుంచి నలుగుతున్న ఓట్లచోరీపై రాహుల్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీస్తోంది. అందులో భాగంగా రెండు రోజుల క్రితం హెచ్ ఫైల్స్ పేరుతో హర్యానా రాష్ట్రంలో మొత్తం రెండు కోట్ల ఓటర్లు ఉండగా అందువలో 25 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని రాహుల్ ఆరోపించారు. ఎన్నికలు జరుగు

DV RAMANA
Nov 7, 20252 min read


లైంగిక దాడుల కేసుల్లో వివక్ష!
విశాఖ నగరంలో ఒక డిగ్రీ విద్యార్థి తన కళశాలకే చెందిన ఇద్దరు మహిళా లెక్చరర్ల లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంజాబ్‌లోని జలంధర్ నగరంలో ఓ యువకుడు రాత్రిపూట వెళ్తుండగా కారులో వచ్చిన కొందరు అమ్మాయిలు ఏదో అడ్రస్ అడిగారు. కారులో తమతో వచ్చి చూపించమని అడిగారు. కారు ఎక్కిన ఆ యువకుడిపై అత్యాచారం చేశారు. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్‌కు చెందిన 32 ఏళ్ల నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించిన ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ తాను చెప్పినట్లు చేయాలని బలవంతం చేశాడు. ఆరు నెలల

DV RAMANA
Nov 6, 20253 min read


ట్రంప్ దొర ‘అణు’రాగం!
ఇప్పుడు యావత్తు ప్రపంచాన్ని వణికిస్తున్న పేరు.. డోనాల్డ్ ట్రంప్! ఈయనగారు అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టింది లగాయితు ఆమెరికా పౌరులతోనే కాకుండా ప్రపంచంతోనే తన మాటలు, చేతలతో ఇష్టారాజ్యంగా ఆడుకుంటున్నారు. తన మాట వినని దేశాలపై కక్షగట్టి టారిఫ్‌ల మోత మోగిస్తూ ప్రత్యక్షంగా ఆయా దేశాలను.. పరోక్షంగా తన దేశాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతున్న ట్రంప్ మహాశయుడు ఒకవైపు యుద్ధోన్మాదంతో రెచ్చిపోతూ మరోవైపు ప్రపంచంలో ఎనిమిది యుద్ధాలు ఆపినందున తనకే నోబెల్ శాంతి బహుమతి దక్కాలని

DV RAMANA
Nov 5, 20252 min read


విదేశీ బంగారు నిల్వలు వెనక్కి!
సుదీర్ఘకాలంగా సాగుతున్న రష్యా`ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ రెండు దేశాలకు వాటిల్లుతున్న ప్రాణ, ఆస్తి, ఇతర నష్టాల సంగతి పక్కనపెడితే ఆ యుద్ధం వల్ల భారత్‌తోపాటు మరికొన్ని దేశాలు పరోక్షంగా ప్రభావితమవుతున్నాయి.. ఒకవిధంగా నష్టపోతున్నాయి. ఆ జాబితాలో భారత్ కూడా చేరింది. ప్రపంచంలో యుద్ధాలను ఆపించానన్న ఖ్యాతిని కొట్టేసేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న రకరకాల విన్యాసాలే దీనికి కారణమన్నది సుస్పష్టం. ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యం, బలమైన దేశమన్న దర్పంతో ఒకవిధమైన బలప్రయోగానికి

DV RAMANA
Nov 3, 20252 min read


జెమీమాపై ఎందుకంత విద్వేషం?
మనది ప్రజాస్వామ్య దేశం.. అందులోనూ లౌకికవాద (సెక్యూలర్) దేశంగా పేద్ద పేరు. లౌకికవాదం అంటే పౌరులకు మత స్వేచ్ఛనివ్వడం, మత సహనం పాటించడం, కులమతాలకు అతీతంగా దేశాన్ని పరిపాలించడం. లౌకికవాదాన్ని అనుసరిస్తున్నప్పుడు ఏ అంశాలు, రంగాల్లోనూ మత ప్రమేయం ఉండకూడదు. కానీ దురదృష్టవశాత్తు రాజకీయాల నుంచి మొదలుకొని చాలా రంగాల్లో మత ప్రమేయం కనిపిస్తోంది. ఇప్పుడు అది క్రికెట్రంగానికి కూడా పాకినట్లు రెండుమూడు రోజులుగా జరుగుతున్న పరిణామాల ద్వారా తెలుస్తోంది. దీనికి కేంద్ర బిందువు మహిళా క్రికెటర్

DV RAMANA
Nov 2, 20252 min read


దుందుడుకు రాజకీయానికి చెంపదెబ్బ!
దుందుడుకుతనం, పెత్తందారీ ధోరణులు ఎన్నాళ్లో సాగవు. ఫ్యాక్షనిజానికి పెట్టింటి పేరైన రాయలసీమలో ఇప్పుడు ఆ దుస్సంస్కృతి తగ్గినా.. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాత్రం ఇప్పటికీ జేసీ బ్రదర్స్ రాజ్యం నడుస్తోంది. వీరిలో పెద్దవాడైన దివాకర్‌రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకున్నా.. అతని సోదరుడు ప్రభాకర్‌రెడ్డి అన్నను మించిన పెత్తందారుగా మారిపోయాడు. ఎంతవారైనా ఒక పార్టీలో ఉన్నప్పుడు కష్టమో నష్టమో ఆ పార్టీ సిద్ధాంతాలను, మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సిదే. కానీ ‘తాడిపత్రి మా సొంత జాగీరు.. ఇక్క

DV RAMANA
Oct 30, 20252 min read


రాజకీయ పోరాటమా.. ఆరాటమా!
మళ్లీ సేమ్ ఆరోపణలు.. వాటికి ఖండన మండనలు.. వాటికి ఆధారం ఏమిటంటే.. ఒకానొక పత్రికలో వచ్చిన వార్తాకథనం. అంతేతప్ప కొత్తగా కనుగొన్నదేమీ లేదు. ఇదీ దేశంలో ప్రముఖ పారిశ్రామిక గ్రూప్‌గా ఉన్న అదానీ విషయంలో గత దశాబ్దకాలంగా రేగుతున్న రాజకీయ దుమారం. అదే క్రమంలో ఇప్పుడు మరోసారి ఆ గ్రూప్‌పైనా, తద్వారా కేంద్ర పెద్దలపైనా ఆరోపణల రాళ్లు రువ్వే కార్యక్రమం జరుగుతోంది. ఈ చర్యలకు ప్రధాన హేతువు ఏమిటంటే.. అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్టు ప్రచురించిన ఒక కథనం. రాజకీయ ఒత్తిడితో దేశంలోని అగ్రశ్రేణి

DV RAMANA
Oct 29, 20252 min read


మానవత్వమే మరణించింది!
సాఫీగా గమ్యస్థానానికి చేరుకుంటామన్న ధీమాతో ఆదమరిచి నిద్రపోతున్నవారిని నిద్రలోనే దహించేసిన ఘోర బస్సు దుర్ఘటనకు సంబంధించి దర్యాప్తులో వెలుగుచూస్తున్న పలు అంశాలు విస్మయం, భయం కలిగిస్తున్నాయి. రెండు ప్రధాన అంశాలు మనుషుల్లో మానవత్వం మాయమవుతోందని, పక్కా వాణిజ్య పంథా పాతుకుపోతోందని వెల్లడిస్తున్నాయి. కర్నూలు బస్సు దుర్ఘటనపై దర్యాప్తులో బస్సు డ్రైవర్ లక్ష్మయ్య, బైక్‌పై ప్రయాణిస్తున్న వారిలో ఒకడైన ఎర్రిస్వామి చెప్పిన వివరాల ప్రకారం.. బైక్ బస్సును గుద్దలేదు. వర్షం కురుస్తున్న ఆ అ

DV RAMANA
Oct 28, 20252 min read
bottom of page


