top of page


కాబా కిస్వానే కించపర్చిన ఎప్స్టీన్!
ఇటీవల వెలుగు చూసిన ఎప్స్టీన్ ఫైల్స్ ఎంత కలకలం సష్టిస్తున్నాయో.. ఎంతమంది ప్రపంచ నాయకులు, ప్రముఖుల చీకటి జీవితాలను బయటపెడుతున్నాయో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ కొత్త కొత్త అంశాలను బయటకొస్తూ సంచలనం రేపుతున్నాయి. ఇప్పటికే వందల మంది ప్రముఖుల జీవితాలను రచ్చకీడ్చిన ఎప్స్టీన్ ఫైల్స్‌కు సంబంధించి కొత్తగా లీకైన ఒక అంశం ఇప్పుడు మతపరంగానూ ఉద్రిక్తతలు రేపుతోంది. ముస్లింలు పవిత్రంగా భావించే కాబా కిస్వాను జెఫ్రీ ఎప్స్టీన్ నేలపై పరిచే కార్పెట్ మాదిరిగా వాడుకున్నట్లు ఆయనకు సంబంధ

DV RAMANA
Feb 143 min read


ప్రపంచంపై ఇస్లాం బాంబు!
‘తాము డల్లాస్‌లో నివసిస్తున్నట్లు లేదు.. పాకిస్తాన్లో ఉన్నట్లుగా ఉంది’ అని ఇటీవల అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు బ్రాండన్ గిల్ ఒక వీడియో ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అమెరికాలో ముస్లిం జనాభా పెరుగుదల తీవ్రతను సూచిస్తున్నాయి. ఈ మార్పు ఒక్క అమెరికాకే పరిమితం కాలేదు.. అనేక ప్రపంచ దేశాల్లోనూ ఇది కనిపిస్తోంది. వాస్తవానికి ఆయన ఆందోళన కూడా అదే. అమెరికాలో భాగంగా ఉన్న టెక్సాస్ రాష్ట్రంలో ఇస్లామీకరణ శరవేగంగా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి డల్లాస్‌లో ఈ తరహా వాతావరణం ఉందన్నారు.

DV RAMANA
Feb 132 min read


అమ్మో.. కర్ణాటకలో 149 మంది మంత్రులా!
మన రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారన్న ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వెల్లువెత్తిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. సలహాదారుల పేరుతో తమ పార్టీకి చెందినవారికి పప్పుబెల్లాల్లా నామినేటెడ్ పదవులు కట్టబెట్టారని నాడు ఆరోపణలు వినిపించాయి. వీరికి సలహాదారులు అనే ముద్దుపేరు పెట్టి దాదాపు అన్ని శాఖల నెత్తిన కూర్చోబెట్టడమే కాకుండా కేబినెట్ హో దాలు, ప్రొటోకాల్ మర్యాదలు కల్పించి ఊరేగించారు. అంటే కేబినెట్లో ఉండే మంత్రులు కాకుండా వీరంతా

DV RAMANA
Feb 123 min read


తోక ముడిచిన పాక్!
స్నేహసౌభ్రా తృ త్వాలను పెంపొందించే క్రీడలను వైషమ్యాలకు వేదికలుగా మార్చుకునేందుకు.. బంగ్లాదేశ్ భుజంపై తుపాకీ పెట్టి భారత్‌కు గురిపెట్టడం ద్వారా ఇన్నాళ్లూ దాయాదిపై పెంచుకున్న కక్షను కాస్తయినా తీర్చుకోవడంతోపాటు స్వప్రయోజనాలు సాధించుకోవాలనుకున్న పాకిస్తాన్ చివరికి ఏదీ సాధించలేక బొక్కబోర్లాపడింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ద్వారా భారత్‌ను శాసించాలన్న దుస్సాహసానికి తెగబడి చివరికి తనే క్రికెట్ దేశాల ముందు బొక్కబోర్లాపడింది. తమ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకలోని వేదికలకు మార్చ

DV RAMANA
Feb 113 min read


బ్రిటన్ నుంచి మన సంపద తెచ్చుకోలేమా?
బ్రిటీష్ వలసపాలన గురించి ఈ తరంవారికి పెద్దగా తెలియదు. చరిత్ర పుస్తకాý ద్వారా, వారూ వీరు చెప్పగా వినడమే తప్ప. ఒకనాటి బ్రిటీష్ ప్రభుత్వ ఆధిపత్య విధానాలకు బలి కాని దేశం లేదని చెప్పడం అతిశయోక్తి కాబోదేమో! అంతెందుకు ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా విలసిల్లుతున్న అమెరికా కూడా ఒకప్పుడు బ్రిటీష్ వలసవాద పాలనలో మగ్గిపోయిన దేశమే. ఇక మనదేశం సంగతి చెప్పనక్క ర్లేదు. సుమారు 200 ఏళ్లపాటు బ్రిటీష్ దాస్యశంఖలాల్లో చిక్కుకుని సర్వం కోల్పోయింది. రాచరికంలో ఉండే బ్రిటీష్ ప్రభుత్వం విస్తరణ కాంక్షతో దాదాపు

DV RAMANA
Feb 93 min read


‘సుప్రీం’నే మెప్పించిన లాయర్ ‘మమత’
దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిత్యం కేసుల విచారణ, వందలాది కక్షిదారులు, న్యాయవాదులు, సిబ్బందితో నిత్యం రద్దీగా ఉంటుంది. కాకలుతీరిన న్యాయవాదులు నల్లకోటులను సర్దుకుని తమ ప్రతిభను చాటుకునేలా తమ వాదనలు వినిపిస్తుంటారు. వీటిలో కొన్ని అరుదైన, చిత్రమైన కేసులు కూడా ఉంటాయి. తీర్పులు వెలువరించే సందర్భాల్లో భావోద్వేగ సన్నివేశాలు చోటుచేసుకుంటాయి. కానీ వీటన్నింటికీ భిన్నమైన ఒక చరిత్రాత్మక ఘట్టానికి మొన్న బుధవారం సుప్రీంకోర్టు వేదికైంది. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ధర్మాసనం కోర్టు

DV RAMANA
Feb 73 min read


చట్టసభలోనే ప్రధానికి భద్రత లేదా?
మన చట్టసభల కార్యకలాపాలకు సంబంధించి రాజ్యాంగ నిబంధనలు చాలానే ఉన్నాయి. వాటికి అదనంగా చట్టసభలు తమకుతాముగా ఏర్పాటు చేసుకున్న సంప్రదాయాలు కూడా ఉన్నాయి. సంప్రదాయాల సంగతెలా ఉన్నా సభల నిర్వహణలో నిబంధనలను మాత్రం కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. కానీ గురువారం లోక్‌సభలో దీనికి భిన్నమైన, అరుదైన ఘటనలు చోటు చేసుకోవడంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధానమంత్రి సమాధానం చెప్పకుండానే దాన్ని ఆమోదించడం ఒక చిత్రమైతే.. ప్రధానమంత్రిపై సభలోనే దాడిక

DV RAMANA
Feb 62 min read


చిన్నబోనున్న పెద్దన్న డాలర్!
ఒకవైపు బంగారం, వెండి ధరలు పరుగులు తీస్తుంటే మరోవైపు బ్రిక్స్ దేశాలు సొంత చెల్లింపు వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం వంటి పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయన్న సంకేతాలు ఇస్తున్నాయి. ఇప్పటివరకు అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్ హవా నడుస్తోంది. దానికితోడు రెండోసారి అమెరికా అధ్యక్షపగ్గాలు చేపట్టిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ ‘అమెరికా ఫస్ట’ అన్న నినాదాన్ని అందుకుని తన నిర్ణయాలతో ప్రపంచ వాణిజ్య రంగాన్ని కకావికలం చేస్తున్నారు. అనేక దేశాలపై సుంకాల భారం మోపుతూ ఇబ

DV RAMANA
Feb 53 min read


అంతర్జాతీయ క్రికెట్‌ను కబళిస్తున్న రాజకీయం
ప్రపంచస్థాయి క్రికెట్ సంబరం మరో మూడురోజుల్లో ప్రారంభం కానుంది. టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఈ నెల ఏడో తేదీన తెరలేవనుంది. వాస్తవంగా చూస్తే క్రికెట్‌ను అభిమానించే, ఈ టోర్నీలో ప్రత్యక్షంగా పాల్గొనే దేశాల్లో క్రికెట్ ఫీవర్ మొదలైపోవాలి.. ఆ జోష్ అంబరాన్ని తాకాలి. కానీ వాటి స్థానంలో ఇప్పుడు అయోమయం, గందరగోళం కనిపిస్తోంది. అసలు అది పూర్తిస్థాయిలో జరుగుతుందా? అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ టోర్నీలో ఆడాల్సిన బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల వైఖరే. స్నేహవారధిగా ఉండాల

DV RAMANA
Feb 43 min read


భారత్ కేవలం జనసమూహం కారాదు!
‘ఇండియా అంటే దేశం కాదు.. అది కేవలం జనసమూహం మాత్రమే’.. ఈ వ్యాఖ్యలు 1931లో అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ చేసినవి. మనదేశం బ్రిటీషర్ల పాలనలో మగ్గిపోతూ.. వారి దాస్యశంఖలాల నుంచి విముక్తి కోసం స్వాతంత్య్ర పోరాటం చేస్తున్న రోజులవి. ఆ క్రమంలో జాత్యాహంకార ధోరణితో, భారత్ పట్ల చిన్నచూపుతో చర్చిల్ చేసిన ఆ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. భారతీయుల్లో స్వాతంత్య్ర పిపాసను మరింత రగిలించి తీవ్రంగా ఉద్యమించేందుకు దోహదం చేశాయి. కట్ చేస్తే.. దాదాపు శతాబ్దం క్రితంనాటి

DV RAMANA
Feb 33 min read


రాజకీయానికే కొవ్వు పట్టింది!
దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలవారు ఇష్టపడే, వినియోగించే స్వీట్ లడ్డూ. ఇక లడ్డూ ప్రసాదమంటే పడిచచ్చిపోతారు. ప్రత్యేకించి కలియుగ దైవం తిరుమల వెంకన్న లడ్డూ ప్రసాదమంటే ఇక చెప్పనక్కర్లేదు. ఆ వేంకటేశ్వరస్వామికి ఎంత ప్రీతిపాత్రమో.. అంతకుమించి అన్నట్లు భక్తులు లడ్డూ ప్రసాదం ప్రస్తావన వస్తే చాలు.. నాలుక చప్పరించేస్తారు. తిరుపతి వెళ్లేవారు ఇచ్చి కాసింత ప్రసాదమైనా భక్తితో రుచి చూడాల్సిందేనని తపించిపోతారు. ఆ దేవదేవుడి ప్రసాదం అనే భక్తిభావంతోపాటు అమోఘమైన రుచి వెంకన్న లడ్డూకు అత్యంత విశిష్ట

DV RAMANA
Feb 22 min read


గోల్డ్, సిల్వర్ పతనం.. రాగి ఉత్థానం
ఆకాశమే హద్దుగా కొన్నాళ్లుగా దూసుకుపోతున్న బంగారం, వెండి ధరలు కొత్త శిఖరాలను తాకిన తర్వాత శుక్రవారం అకస్మాత్తుగా నేలచూపులు చూడటం సాధారణ వినియోగదారులను ఉపశమనం కలిగించినా.. బడా పెట్టుబడిదారులు, అమెరికా సహా పలు దేశాల సెంట్రల్ బ్యాంకులకు ఝలక్ ఇచ్చినట్లయ్యింది. ధరల దూకుడుకు శుక్రవారం ఉదయం నుంచే బ్రేకులు పడుతూ మార్కెట్ తీవ్ర ఊగిసలాటతో కొట్టుమిట్టాడింది. ఫలితంగా పెట్టుబడిదారులు, వ్యాపారులు బేర్మన్నారు. ఉదయం వ్యాపార కార్యకలాపాలు ప్రారంభం కాగానే గురువారం సాయంత్రం ధరతో పోలిస్తే బాగా తక

DV RAMANA
Jan 313 min read


మళ్లీ నిఫా భయాలు!
వాతావరణ మార్పులు మనదేశాన్ని, ప్రపంచాన్ని వ్యాధులమయం చేస్తున్నాయి. మనుషుల్లో రోగనిరోధక శక్తి రోజురోజుకు తరిగిపోతున్నది. ఫలితంగా సాధారణ జలుబు, జ్వరం వంటి రుగ్మతలు కూడా నెలల తరబడి తగ్గకుండా పీడిస్తున్నాయి. మరోవైపు రకరకాల వ్యాధులు ప్రబలుతూ మరణాలకు కారణమవుతున్నాయి. అదే క్రమంలో ఇప్పుడు దేశంలో నిఫా వైరస్ విజంభిస్తోంది. పశ్చిమ బెంగాల్ మరికొన్ని రాష్ట్రాల్లో నిఫా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. దాంతో వైరస్ సోకిన వారితో కలిసి లేదా సమీపంగా ఉంటున్న వారిని, కుటుంబ సభ్యులను కలిపి మొత్తం 100

DV RAMANA
Jan 303 min read


పెట్టుబడులే వెండిని పరిగెత్తిస్తున్నాయ్!
స్థానికం నుంచి గ్లోబల్ మార్కెట్ల వరకు ప్రస్తుతం బంగారం, వెండి ధరల ధగధగలే హాట్ టాపిక్‌గా మారాయి. బంగారం కంటే వెండి ధరలు మరింత మంట పుట్టిస్తున్నాయి. గత ఏడాది జనవరిలో కేవలం 30 డాలర్లు ఉన్న ఔన్సు వెండి ధర ఈ ఏడాది జనవరిలో 115 డాలర్లు దాటేసి ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేస్తోంది. కేవలం 12 నెలý వ్యవధిలోనే 270 శాతానికి పైగా పెరగటం సామాన్యమైన విషయం కాదు. అయితే ఈ పెరుగుదల వెనుక ఉన్న కారణాలపై మార్కెట్ నిపుణులు రÁకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. ఇది నిజమైన డిమాండా లేక కేవలం తాత్కాలిక నీట

DV RAMANA
Jan 293 min read


చైనాపై జనాభా బాంబు!
కొత్త కొత్త సమస్యలను సష్టించి ప్రపంచంపైకి వదిలి చోద్యం చూడటంలో చైనా పొందే శునకానందం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కరోనా వంటి మహమ్మారులకు పుట్టినిల్లుగా నిలిచినా, ఇరుగుపొరుగు దేశాలతో కయ్యాలకు దిగినా, తన సొంత ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగించే జగమొండిగా చైనా ట్రాక్ రికార్డును బహుశా మరే దేశమూ బీట్ చేయలేదేమో. తన ఆవిష్కరణలు, సైనిక శక్తి, ఆర్థిక విజయాలతో అగ్రరాజ్యమైన అమెరికాను సైతం సవాల్ చేసే స్థితిలో ఉన్న చైనా ఇప్పుడు స్వయంగా కొత్త సంక్షోభంలో చిక్కుకుంది. ఇది కక్షతో వేరే ఏ దేశ

DV RAMANA
Jan 283 min read


ఐక్యరాజ్య సమితికి ట్రంప్ ఎసరు!
ప్రపంచంలో దేశాల మధ్య వివాదాలు పరిష్కరించడానికి, శాంతి సౌభ్రాతత్వాలు నెలకొల్పడానికి ఐక్యరాజ్యసమితి కొన్ని దశాబ్దాల నుంచి వారధిగా నిలుస్తోంది. దానికి అనుబంధంగా విద్య, వైద్య తదితర రంగాల్లో దేశాల మధ్య సమన్వయం కుదర్చడానికి సహాయ సహకారాలు అందించడానికి అనేక సంస్థలు కూడా పని చేస్తున్నాయి. వీటికి అదనంగా అత్యున్నత విధాన నిర్ణాయక శక్తి కలిగిన భద్రతామండలి ఉండనే ఉంది. కానీ వీ{న్నింటికి ఇప్పుడు మూడిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు కొత్తగా ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీ

DV RAMANA
Jan 273 min read


ఖర్చులకు అతీతం.. మన గణతంత్రం
జనవరి 26.. ఇది మన దేశానికి అతిముఖ్యమైన రోజు. 1947 ఆగస్టు 15న బ్రిటీష్ పాలన నుంచి మనకు స్వాతంత్య్రం లభించినా.. మనకు రాష్ట్రపతి లేరు. దేశాన్ని నడిపేందుకు సొంత రాజ్యాంగమూ లేదు. పండిట్ నెహ్రూ నేతత్వంలో మంత్రిమండలి ఏర్పడినా బ్రిటీష్ గవర్నర్ జనరల్ మౌంట్‌బ్యాటన్ గవర్నర్ జనరల్‌గా ఆధిపత్యం వహిస్తూ బ్రిటీష్ రాచరిక పాలనకు భారత ప్రతినిధిగా వ్యవహరించారు. మన సొంత రాజ్యాంగాన్ని రచించుకోవడానికి, బ్రిటీష్ ప్రమేయం ఏమాత్రం లేని సర్వసత్తాక గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి మరో రెండున్నరేళ్ల

DV RAMANA
Jan 263 min read


క్రికెట్ టోర్నీల్లో దేశాల నిష్క్రమణ కొత్త కాదు!
టీ20 ప్రపంచ కప్ టోర్నీ నుంచి బంగ్లాదేశ్ నిష్క్రమించింది. ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నుంచి అందాల్సిన సుమారు 350 కోట్ల టాకాల(బంగ్లా రూపాయలు)ను స్థూలంగా ఆ దేశ క్రికెట్ బోర్డు కోల్పోతుంది. రాజకీయ కారణాలతో శాంతిభద్రతల ముసుగులో బంగ్లా తీసుకున్న ఈ నిర్ణయం క్రీడా ప్రపంచంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ప్రపంచ స్థాయి పోటీల నుంచి ఒక దేశం తప్పుకోవడం అరుదైనదే అయినా కొత్తది మాత్రం కాదు. గతంలో కూడా మిగతా క్రీడల సంగతెలా ఉన్నా క్రికెట్‌కు సంబంధించి గతంలో జరిగిన అత్యున్నత ట

DV RAMANA
Jan 243 min read


పాపం.. మన రూపాయి!
అగ్రరాజ్య అధినేత డోనాల్డ్ ట్రంప్ భీకరంగా వాయిస్తున్న సుంకాలు అనే ట్రెంపెట్ మోతలు.. దేశాలను స్వాధీనం చేసుకుంటామనే బాజాల వాయింపుల రీసౌండ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ప్రతిధ్వనిస్తోంది. గూబలు గుయ్యిమనేలా చేస్తోంది. అనేక దేశాల స్టాక్‌మార్కెట్లు తీవ్ర ఒడుదిడుకులకు గురవుతున్నాయి. మన దేశ స్టాక్ మార్కెట్లు సైతం ట్రంప్ ప్రభావంతో నేలచూపులు చూస్తున్నాయి. గురువారం దేశీయ స్టాక్ సూచీలు కొద్దిగా కోలుకున్నా.. అంతకుముందు నాలుగు రోజుల నుంచీ కిందికి జారిపోతూనే ఉన్నాయి. ఫలితంగా రిటైల్ మదుపరులు(ఇన్

DV RAMANA
Jan 233 min read


పసిడి దూకుడు.. ఆగదిప్పుడు!
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బంగారం ధర పరుగులు పెడుతోంది. బుధవారం ఒకేరోజు ఏకంగా రూ. 10వేలు పెరగడం ఆల్ టైం రికార్డ్. ఫలితంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,60,821కి ఎగబాకింది. మరోవైపు వెండి ధర కూడా పసిడితో పోటీ పడుతూ కేజీ రూ. 3,28,329 పలుకుతోంది. ఈ ధరల పరుగు పోటీకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ట్రేడ్ వార్ కారణమంటున్నారు. ఇప్పుడు తాజాగా యూరప్ దేశాలపైనా సుంకాలు(టారిఫ్‌లు) విధిస్తామని బెదిరిస్తుండటంతో కొన్నాళ్లుగా పెరుగుతున్న పసిడి ధరలు మరింత వేగం పుంజుకున

DV RAMANA
Jan 223 min read
bottom of page


