top of page


విశాఖ రాజకీయం.. వివేకా తిరుగుపయనం!
వెలగపూడి కాదన్నందునే రద్దయిన జీవో విశాఖలో చక్రం తిప్పిన మరో ఏసీపీ సొంత సామాజికవర్గానికి చెందిన అధికారినే నియమించారన్న లీడర్ పత్రిక (సత్యంన్యూస్, శ్రీకాకుళం) శ్రీకాకుళం డీఎస్పీగా విశాఖ హార్బర్‌కు బదిలీపై వెళ్లిన గంటల వ్యవధిలోనే మళ్లీ వెనక్కు వచ్చిన సీహెచ్ వివేకానంద కథలో విశాఖ రాజకీయాలే ప్రధాన కారణమని తెలుస్తుంది. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్, పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, దక్షిణ ఎమ్మెల్యే వంశీకష్ణ శ్రీనివాస్ వివేకానంద రాకను స్వాగత

NVS PRASAD
Feb 142 min read


నందిని తాకిన రోడ్డు విస్తరణ!
సుమారు 15 అడుగులు కోల్పోనున్న నీలకంఠేశ్వరాలయం అదే జరిగితే ప్రవేశద్వారం కూడా పెట్టుకునే పరిస్థితి ఉండదు నందీశ్వరుడిని కదిలిస్తే భక్తుల మనోభావాలకు విఘాతం ఆలయాన్ని మినహాయించాలని వినతులు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) మహాశివరాత్రి పర్వదినం సమీపించింది. మధ్యలో ఒక్కరోజే వ్యవధి ఉంది. దాంతో శైవక్షేత్రాలన్నీ ఉత్సవాల ఏర్పాట్లతో సందడిగా కనిపిస్తున్నాయి. కొత్త రంగులు, విద్యుత్ దీపాల అలంకరణలతో కొత్త కళ సంతరించుకుంటున్నాయి. కానీ ఆ శివాలయం మాత్రం ఉంటానా.. ఊడతానా.. అన్న సందిగ్ధం

DV RAMANA
Feb 132 min read


కలపకు కాళ్లొస్తున్నాయ్!
చిన్న వాహనాల్లో రాత్రివేళల్లో అక్రమ రవాణా మామూళ్ల మత్తులో అ{వీ, పోలీసు అధికారులు ఇటీవలి కాలంలో ఒక్క కేసూ నమోదుకాని వైనం తరలిపోతున్న విలువైన టేకు, ఇరిడి రకాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం/కొత్తూరు) ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇటీవలి కాలంలో కలప అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి వాహనాలను ఆపి తనిఖీలు చేసేవారు. ఒకవేళ కలప ఉంటే.. దాన్ని తరలించడానికి తగిన అనుమతులు ఉన్నాయా లేదా అని పరిశీలించ

BAGADI NARAYANARAO
Feb 122 min read


సనారీ మఠంలో శివరాత్రి ఉత్సవాలు
తెల్లవారుజాము నుంచి పంచామతాభిషేకాలు మధ్యాహ్నం మహా అన్నసమారాధన (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది మహాశివరాత్రి పర్వదినం. ఆరోజే ఈ పరమేశ్వరుడు లింగరూపం దాల్చాడానికి, శివపార్వతుల కల్యాణం జరిగిందని కూడా ప్రతీతి. అందుకే శివరాత్రి రోజు జాగారాం ఉండి అర్ధరాత్రి లింగోద్భవ సమయంలో అన్ని శైవక్షేత్రాల్లో విశేష అర్చనలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. శైవక్షేత్రాలతోపాటు మహాశివుడి ప్రతినిధులుగా భావించే అవధూతలు వెలసిన క్షేత్రాల్లోనూ శివ

DV RAMANA
Feb 112 min read


ఎమర్జెన్సీ ఓపీకి ఒక్కడే దిక్కు
రాత్రివేళ చుక్కలు చూస్తున్న ఎమర్జెన్సీ రోగులు ఓపీలో అందుబాటులో ఉండని ఆ ఒక్కడు అదనపు సిబ్బందిని నియమించాలని డిమాండ్లు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పేరుకు అది జిల్లా ఆస్పత్రి. రాత్రీపగలు తేడా లేకుండా జిల్లా నలుమూలల నుంచి అత్యవసర కేసులన్నీ ఈ పెద్దాస్పత్రికే వస్తుంటాయి. ముఖ్యంగా రాత్రివేళ వచ్చే ఇలాంటి కేసుల్లో బాధితులు, వారి బంధువులు అడిగే దిక్కులేక చుక్కలు చూడాల్సి వస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాకు పెద్ద దిక్కు అయిన రిమ్స్ (ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి)కు రాత్రివే

BAGADI NARAYANARAO
Feb 101 min read


పలాస డిపోలో సమస్యల సంత
ఉద్యోగులకు మంచినీరు కరువు ఊగిపోతున్న బస్సులోని డ్రైవర్ల సీట్లు మహిళా ఉద్యోగులకు ఒకటే మరుగుదొడ్డి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో శ్రీకాకుళం తర్వాత ఆర్టీసీపరంగా అధిక సేవలు అందిస్తున్నది పలాస డిపో మాత్రమే. కానీ ఈ డిపో పరిధిలో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఆరు నెలలుగా మంచినీరు అందుబాటులో లేక డిపో పరిధిలోని సుమారు 400 మంది ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారు. బోరుబావి నీటిని ఫిల్టర్ చేయకుండానే ట్యాంకుల్లో నింపి కుళాయిల ద్వారా అందిస్తున్నారని ఉద్యోగుల

BAGADI NARAYANARAO
Feb 91 min read


గ్రామీణ రోడ్ల అభివృద్ధికి రూ.10.87 కోట్లు
గార, శ్రీకాకుళం మండలాలకు ప్రయోజనం ఫలించిన ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రయత్నాలు త్వరలో మొదలుకానున్న పనులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధిలో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గానికి రూ.10.87 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు జీవోఆర్టీ 64 ద్వారా పంచాయతీరాజ్ శాఖ పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఈ నిధులతో నియోజకవర్గంలోని గ్రామాల్లో ఉన్న పలు రోడ్లను పటిష్టపర్చడం, వెడల్పు చేయడం, పునర్నించడం వంటి పనులు చేపట్టనున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ రూరల్
Prasad Satyam
Feb 91 min read


విశాఖలో వందేభారత్ హబ్
రూ.300 కోట్లతో మర్రిపాలెంలో నిర్మాణం సెమీ హైస్పీడ్ రైళ్ల నిర్వహణ, మరమ్మతులు ఇక్కడే త్వరలో కొత్త స్లీపర్, సీటింగ్ రైళ్లు వచ్చే అవకాశం రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచాలని డిమాండ్లు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రపంచంలోనే శరవేగంగా అభివద్ధి చెందుతున్న నగరంగా పేరొందిన విశాఖపట్నం మరో కీలక ప్రాజెక్టుకు కేంద్రం కానుంది. ప్రస్తుతం తూర్పుకోస్తా(ఈస్ట్‌కోస్ట్) రైల్వే జోన్లో వాల్తేర్ డివిజన్ పేరుతో అత్యధిక అదాయం సంపాదిస్తూ అగ్రస్థానంలో ఉన్న విశాఖ నగరం రైల్వేపరంగా మరో ముందడుగు

DV RAMANA
Feb 72 min read


ఆమెకు ఊతం.. ఉపాధికి విఘాతం!
కొత్తవారిని నియమించకుండా రాజకీయం 9 నెలలుగా నిలిచిన ఉపాధి పనులు క్షేత్రసహాయకురాలి తొలగింపే కారణం ఆమెను విధుల్లోకి తీసుకునేవరకు పనులు జరగడానికి లేదంటున్న నాయకులు? మళ్లీ కూలిపనులకు వలసలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అధికార పార్టీకి మద్దతుదారునిగా మెలిగిన ఉపాధి హమీ పధకం క్షేత్ర సహాయకురాలిని విధుల నుంచి తొలగించినందున ఆ గ్రామ పంచాయతీ పరిధిలో గత ఏడాది మే నెల నుంచి ఉపాధి పనులు జరగనివ్వడం లేదు. అధికారులకు విన్నవించి ఉపాధి పనులు ప్రారంభించాలని కోరినా, ఎవరూ స్పందించడం లేదని స్థానిక

BAGADI NARAYANARAO
Feb 61 min read


అద్దెలు భారం.. వ్యాపారుల హాహాకారం!
మున్సిపల్ షాపుల లీజులపై అసంతప్తి తలకుమించిన రేట్లతో సతమతం హేతుబధ్దీకరించాలని వ్యాపార సంఘాల వినతి ఇతర రాష్ట్రాల్లోనే మేలంటున్న నిర్వాహకులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఈ కామర్స్ ప్లాట్‌ఫారాలు, కార్పొరేట్ సంస్థలు రిటైల్ వ్యాపారంలోకి వచ్చిన తర్వాత ఆన్లైన్లోనే అన్ని రకాల వస్తువులు, సరుకులు.. నేరుగా వినియోగదారుల ఇళ్లకే చేరిపోతున్నాయి. నగరాల్లో కార్పొరేట్ సంస్థలు ఏర్పాటు చేస్తున్న మాల్స్‌లో తక్కువ ధరకే నిత్యావసరాలు లభిస్తుండడంతో సంప్రదాయ చిల్లర వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.

BAGADI NARAYANARAO
Feb 62 min read


మూలపేట.. పరిశ్రమల పూదోట!
తాజాగా గ్రీన్ అమ్మోనియా పరిశ్రమ మంజూరు ప్రైవేట్‌రంగంలో ఏర్పాటు ఒప్పందంపై సంతకాలు మార్చి 18న సీఎం చంద్రబాబు శంకుస్థాపన? ఇప్పటికే అక్కడ తుదిదశలో ఉన్న సీ పోర్టు నిర్మాణం (డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి) ప్రకతి వనరులు ఎన్ని ఉన్నా.. చిన్న చిన్న యూనిట్లు తప్ప ఒకేసారి వేలసంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే భారీ పరిశ్రమలు లేక వలసల జిల్లాగా పేరుపడిన శ్రీకాకుళం జిల్లా దశ మారుతున్నట్లు కనిపిస్తోంది. దశాబ్దాల గ్రహణం తర్వాత జిల్లా రూపురేఖలు మార్చేసేలా ఒక్కొక్క అవకాశం తలుప

DV RAMANA
Feb 52 min read


పిల్లపాస్లకు ‘ఇన్ఫ్లుయన్స’ అయ్యారు!
మణికంఠ జిరాక్స్ యజమానులను విచారిస్తున్న ఎస్పీ జిల్లావ్యాప్తంగా మరికొందరు బయటపడే అవకాశం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రథసప్తమి ఉత్సవానికి ప్రభుత్వం జారీ చేసిన వీఐపీ, వీవీఐపీ పాస్‌ల కంటే వంద శాతం ఎక్కువ పాస్‌లు చేతబట్టుకొని దర్శనానికి వచ్చిన తీరుపై ఎస్పీ మహేశ్వర్ రెడ్డి స్థానిక టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కూర్చుని మరీ గురువారం విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్ వెనుకనున్న మణికంఠ జిరాక్స్ యజమానులైన తండ్రీకొడుకులు కొండ, మణి, సంతోష్‌లను టూటౌన్‌కు తీసుకువెళ్లి విచా
Prasad Satyam
Jan 291 min read


‘పాస్‌లకు పిల్లలు పుట్టడం’పై.. దర్యాప్తు ప్రారంభించిన టాస్క్‌ఫోర్స్
జిరాక్స్, ఫ్లెక్సీ సెంటర్లలో సోదాలు పాస్‌లు కొనుగోలు చేసినవారి నుంచి సమాచార సేకరణ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) రథసప్తమి రాష్ట్రపండుగ ఉత్సవాన్ని విజయవంతం చేశామని అధికార యంత్రాంగం, రాజకీయ గణం బయటకు ప్రకటిస్తున్నా, లోలోన దీన్ని పూర్తిస్థాయి విజయవంతం చేయలేకపోయామన్న ఆందోళన ఎక్కడో కనిపిస్తోంది. జిల్లా చరిత్రలోనే అతి పెద్ద ఈవెంట్ నిర్వహించినందుకు యంత్రాంగాన్ని అభినందిస్తూ ఎమ్మెల్యే విందు భోజనాలు ఏర్పాటుచేసినా, జిల్లాలో వ్యాపార వర్గాలు కలెక్టర్‌తో సహా అందర్నీ సత్కరిస్తున్నా.. లోలోన మాత్

NVS PRASAD
Jan 291 min read


వచ్చే రథసప్తమికి చెప్పులు కూడా వేలం వేయొచ్చు
క్యూలైన్లో ఏం జరిగినా అంతే సంగతి పార్కింగ్ స్థలాల మీదే క్యూలైన్ల మీదా అవగాహన అవసరం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ప్రతీ ఆలయంలో కొబ్బరిచిప్పలకు వేలం జరగడం సాధారణం. తిరుపతి లాంటి ఆలయాల్లో తలనీలాలకు టెండర్లు జరుగుతాయి. ఈసారి రథసప్తమికి పాదరక్షలకు కూడా వేలం వేయొచ్చేమో! ఎందుకంటే.. ఆదివారం జరిగిన రథసప్తమికి వచ్చిన భక్తులు చెప్పులు తో వెళ్లలేక కేవలం ఒక్కచోటే విడిచిపెట్టినవన్నిటినీ కలిపి ప్రొక్లైనర్ బక్కెట్‌తో ఎత్తాల్సి వచ్చింది. ఆ తర్వాత వాటిని కార్పొరేషన్ చెత్తబండిలో వేసి డంపింగ్
Prasad Satyam
Jan 281 min read


దశాబ్దాల దుస్థితికి టాటా.. రాళ్లపేటకు రాచబాట
ఏడున్నర దశాబ్దాల నిరీక్షణకు తెర హామీ నెరవేర్చుకుంటున్న ఎమ్మెల్యే శంకర్ సాంకేతిక, ఆర్థిక అడ్డంకులు అధిగమించి రోడ్డు నిర్మాణం ఉపాధి హామీ నిధులతో శరవేగంగా పనులు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) సాధారణంగా మనం వాడుకలో పిలుస్తున్న ప్రతి ఊరి పేరు వెనుక ఓ కథ ఉంటుంది. చిక్కాకోల్ నుంచి సిక్కోలై.. ఆ తర్వాత శ్రీకాకుళం అయినట్టు ఎలా చెప్ప్పుకున్నామో.. అదేవిధంగా ప్రతి గ్రామం పేరు వెనుక ఓ కథ ఉంటుంది. అందులోనూ ఉత్తరాంధ్ర గ్రామాలకు అక్కడ పరిస్థితుల ఆధారంగా పేర్లు ఏర్పడ్డాయని ప్రముఖ నామశాస్
Prasad Satyam
Jan 273 min read


మందుబాబులకు మద్దెల దరువు!
బాటిల్‌పై రూ.10 చొప్పున పెంచిన ప్రభుత్వం దానికి పోటీగా మరో పది పెంచిన షాపులవారు ఇదేమిటని అడిగే వారిపై గ్రామీణ ప్రాంతాల్లో దౌర్జన్యాలు చేతులు కట్టుకుని చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు (సత్యంన్యూస్, కొత్తూరు/శ్రీకాకుళం) నువ్వు ఒకటేస్తే.. నేను రెండేస్తా.. అన్నట్లుంది మద్యం ధరల తీరు. మద్యాన్నే ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తుంటే.. అదే మద్యం వ్యాపారంతో అధిక లాభాలు దండుకుంటూ వ్యాపారులు ప్రభుత్వంతో పోటీపడుతున్నారు. సాధారణంగా మద్యం అమ్మకాలు, ఆదాయం పెంచుకోవాలంటే

BAGADI NARAYANARAO
Jan 222 min read


కొత్త పాస్‌పుస్తకాలు కొందరికే!
వివాదాలు ఉన్న భూములకు పెండింగ్ స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నా కానరాని పరిష్కారం కొద్దిపాటి 22ఏ సమస్యలకే విముక్తి ఆన్లైన్ చేయకుండానే గడువు పెంపు కాలక్షేపం (సత్యంన్యూస్,శ్రీకాకుళం) గత ప్రభుత్వం నిర్వహించిన భూముల రీసర్వేలో జరిగిన తప్పులను సరిదిద్ది, ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పాస్‌పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం జిల్లాలో మందకొడిగా జరుగుతోంది. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటోతో కూడిన పాస్ పుస్తకాల స్థానంలో జగన్ ఫొటో తొలగించి రాజముద్రతో కూడిన పుస్తకాలు ఇస్తున్నారు తప్ప వా

BAGADI NARAYANARAO
Jan 212 min read


ఆమదాలవలస వైకాపాలో అసమ్మతి
నియోజకవర్గ సమన్వయకర్త మార్పుపై అసంతప్తి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన పప్పల రమేష్ తమ్మినేని ప్రధాన అనుచురుడి నిష్క్రమణపై విస్మయం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) జిల్లాలో స్టార్ నియోజకవర్గాల్లో ఒకటైన ఆమదాలవలస వైకాపాలో అసమ్మతి రాజుకుంటోంది. నియోజకవర్గ క్యాడర్ ప్రమేయం లేకుండా ఏకపక్షంగా పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిని మార్చడంపై కొన్నాళ్లుగా గూడు కట్టుకుని ఉన్న అసంతప్తి అసమ్మతి రూపంలో బయటపడుతోంది. దాని పర్యవసానంగానే పొందూరు మండల వైకాపా అధ్యక్షుడు పప్పల రమేష్ పార్టీకి గుడ్

BAGADI NARAYANARAO
Jan 211 min read


సంబరాల వెనుక శుభ సంకల్పం ఉందిగా!
రథసప్తమి పేరుతో నేల విడిచి సాము చేస్తున్నారన్న చర్చ అందుకు తగినట్లే నిధులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే శంకర్ చొరవతో రూ.2 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటన ఉత్సవాల పేరుతోనైనా అభివద్ధి పనులు చేపట్టాలన్నది ఆయన ఆకాంక్ష (సత్యంన్యూస్, శ్రీకాకుళం) అరసవల్లి రథసప్తమి వేడుకలను గత ఏడాది మూడు రోజులు నిర్వహించి ఏం సాధించారు? ఈసారి ఏడు రోజులకు పెంచి ఏం బావుకుంటారు? ఇస్మామని ప్రకటించిన ప్రభుత్వం నుంచి ఇంతవరకు పైసా నిధులు రాకుండా స్థానికంగా ఉన్నవారిపై ఒత్తిడి తెచ్చి మరీ ఈ ఆర్భాటాల
Prasad Satyam
Jan 203 min read


ఈసారి రథసప్తమి వేడుకలుఏడు రోజులు ఎందుకో తెలుసా?!
ఆయురారోగ్యాలు ప్రసాదించే మహాశక్తులు ఏడు గుర్రాలు ప్రకతికి పర్యాయపదాలని మరో పురాణ కథనం ఈ సప్తాశ్వాలకు ప్రతీకగానే ఏడు రోజుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైన రథసప్తమి వేడుకలు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) సప్తాశ్వ రథమారూఢమ్ ప్రచండం కాశ్యపాత్మజమ్ శ్వేత పద్మధరం దేవమ్ తం సూర్యం ప్రణమామ్యహమ్ సకల లోకాలను ఏలే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామిని ఈ శ్లోకంతోనే ప్రార్థిస్తుంటాం. ఈ శ్లోకంలోని మొదటి లైను సప్తాశ్వ రథమారూఢమ్.. అంటే ఏడు గుర్రాల(అశ్వాలు)తో కూడిన రథం అధిరోహించే వాడని అ

DV RAMANA
Jan 192 min read
bottom of page


