top of page


కోనేరు విస్తీర్ణమెంత.. కొట్టేసిందెంత?
వరద గట్టు భూమి నిగ్గు తేల్చాలని స్థానికుల డిమాండ్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు ఆక్రమణదారులకే కొమ్ముకాస్టున్న రెవెన్యూ సిబ్బంది రోడ్డు విస్తరణ బాధితులకు అక్కడ స్థలాలు ఇవ్వాలని వినతి (సత్యంన్యూస్, శ్రీకాకుళం) నగరంలో బలగ రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 1/5లో ఉన్న చెరువు అసలు విస్తీర్ణం ఎంత? అది ఎవరికి చెందుతుంది?? దాన్ని 74 సెంట్లగా ఎలా గుర్తించారన్నది??? తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున

BAGADI NARAYANARAO
Dec 5, 20252 min read


ఊరిస్తున్న విరాట్ హ్యాట్రిక్.. భారత్ మ్యాజిక్!
విశాఖను ఆవహించిన క్రికెట్ ఫీవర్ కోహ్లి మరో రికార్డు గురించే అంతటా చర్చ ఈ మ్యాచ్ గెలిస్తేనే భారత్‌కు వన్డే సిరీస్ హాట్‌కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) వరుసగా మూడో సెంచరీ చేసి విరాట్ కోహ్లి మరో హ్యాట్రిక్ ఫీట్ సాధిస్తాడా?.. మూడో మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా సౌత్ ఆఫ్రికాపై భారత్ సిరీస్ విజయాన్ని నమోదు చేస్తుందా??.. ఈ రెండు ఫీట్లకు విశాఖ వేదిక కానుందా??? భారత క్రికెట్ అభిమానుల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. ఈ కారణంగానే వి

DV RAMANA
Dec 5, 20252 min read


కుల వ్యాఖ్యలతో ఐపీఎస్ దుమారం!
కులాల ప్రస్తావన కూడదని.. దాని వల్ల నిమ్న కులాలను కించపర్చినట్లు అవుతుందన్న వాదనలు, అభిప్రాయాలు చాలాకాలం నుంచే ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే గతంలో వార్తాపత్రికలు తాము ప్రచురించే వార్తల్లో కులాల ప్రస్తావన లేకుండా ఒక సామాజికవర్గం అని మాత్రమే రాయాలని స్వీయ లక్ష్మణరేఖ గీసుకున్నాయి. ఆఫ్‌కోర్సు.. నేడు ఆ లక్ష్మణరేఖను అవి చెరిపేసుకున్నాయనుకోండి! మరోవైపు రాజకీయ, సామాజిక, పరిపాలన వ్యవహారాల్లోనూ కుల ప్రస్తావన కామన్ అయిపోయింది. నిమ్న కులాలవారు సైతం తమ కులాన్నే బహిరంగంగా, గర్వంగా

DV RAMANA
Dec 5, 20252 min read


‘అఖండ’ను దెబ్బకొట్టిన ఈరోస్!
దేశవ్యాప్తంగా విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన బాలకృష్ణ తాజా చిత్రం ‘అఖండ`2’ రిలీజ్ వాయిదా పడిరది. ఈ సినిమా విడుదలపై నిన్నంతా కొనసాగిన డ్రామాకి గురువారం రాత్రి తెర పడిరది. బోయపాటి శ్రీను రూపొందిన ఈ చిత్రం వాస్తవానికి శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. ప్లాన్ చేసిన ప్రీమియర్స్‌ను చిత్ర బృందం రద్దు చేసింది. తాజాగా చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటించింది. ఈ మేరకు 14 రీల్స్ ప్లస్ సంస్థ ఎక్స్ వేదికగా పోస్టు చేసింది. ‘‘అనివార్య కారణాల వల్ల
Guest Writer
Dec 5, 20252 min read


మంచి ‘కంచు’ లాంటి ప్రొగ్రాం
శిక్షకులు వారే, ట్రైనర్లూ వారే బయోమెట్రిక్‌ను మేనేజ్ చేస్తున్న వైనం స్కిల్ లేకుండానే శిక్షణ సంస్థగా గుర్తింపు నేర్చుకుంటున్నది ఇద్దరు, హాజరులో 27 మంది బుడితిలో నవ్వులపాలవుతున్న డిజైన్ అండ్ డెవలప్మెంట్ పథకం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) గేదెను కొనగలం గానీ, దానికి కుడితి తాగించడం మన తరం కాదనే మెతక సామెత మన జిల్లాలో ఉంది. అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వల్ల ఉద్యోగాలు కోల్పోతామని భావిస్తున్నా, అంతకు మించిన సంక్షోభం వ్యక్తుల్లో నైపుణ్యత లేకపోవడమే పెద్ద సమస్యని స్

BAGADI NARAYANARAO
Dec 4, 20252 min read


ఇన్ని అవమానాలు మనకొద్దు బాలూ..!
( సత్యంన్యూస్, శ్రీకాకుళం ) మంచి చేశాడని కాటన్ దొరకు కూడా విగ్రహం పెట్టిన రాష్ట్రం మనది. బాలు యూనివర్సల్.. అడ్డు చెప్పుడం అనేది సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం అవుతుంది. అంబేద్కర్, రాజీవ్ గాంధీ వగైరాలు పక్కా తెలంగాణ వాసులు కాబోలు. అందుకే వీళ్ల విగ్రహాలకు ఎలాంటి అడ్డు చెప్పరు శభాష్. ఇప్పుడు కేసీఆరే వచ్చి ఒరే తప్పురా.. బాబు, అలాంటి గొప్ప వారి విషయంలో ఇలా చేస్తే పుట్టగతులు ఉండవు.. అన్నా వినే స్థితి లేదు కొంతమందికి. వాళ్లదేం తప్పు కాదు.. అలా ఒకప్పుడు ఎగదోసిన మీడియా, చూస్తూ ఊ
Prasad Satyam
Dec 4, 20254 min read


టికెట్ ధరల పెంపుతో ‘బ్లాక్ మార్కెట్’ లీగలైజ్ అయ్యిందా?
మాస్ హీరో నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో రాబోతున్న ‘అఖండ 2: తాండవం’ చిత్రంపై రాష్ట్రంలో భారీ అంచనాలు ఉన్న సమయంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి బావమరిది చిత్రం కావడంతో, ఈ జీవో రాజకీయ రంగు పులుముకుంది. ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మంగళవారం జీవోను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, డిసెంబర్ 4న రాత్రి ప్రదర్శించబడే ప్రత్యేక ప్రీమియర్
Guest Writer
Dec 4, 20253 min read


అమెరికా సాంకేతిక ఆధిపత్యానికి సవాళ్లు!
అభివృద్ధి, ఆధిపత్యం ఏ ఒక్కరి సొంతం కాదు. దాన్ని కాపాడుకోగలిగేవారి చెంతనే అవి ఉంటాయి. లేకపోతే కొత్తనీరొచ్చి పాత నీటిని తరిమేసినట్లు, ఆదరించేవారిని వెతుక్కుంటూ వలసపోయినట్లు ఇప్పుడు అగ్రదేశంగా భాసిల్లుతున్న అమెరికా నుంచే మేథో వలసలు మొదలయ్యాయి. ఈ పరిణామాలకు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధానాలే కారణమని చెప్పకతప్పదు. నిన్నటి వరకు అమెరికా వైపు చూసినవారే ఇప్పుడు ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. ఒకప్పడు ఐరోపా దేశాలు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటే.. ఆ దేశాల ప్రగతిని, విజ్ఞానాన్ని

DV RAMANA
Dec 4, 20252 min read


బాబ్బాబూ.. వీటినీ కొద్దిగా లేపేద్దురూ!
నగరంలో మొదలైన సంక్రాంతి బిజీ జీటీ రోడ్డు సెంటర్ పార్కింగ్‌లో స్టాఫ్వే మూడొంతులు ఆర్టీసీ కాంప్లెక్స్ ముందు ప్రైవేటుదే హవా (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ట్రాఫిక్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన రామారావు రోడ్లు ఆక్రమించిన వారిని రఫ్పాడేస్తున్నారు. విధుల్లో చేరిన తర్వాత నగరమంతా పరిశీలించిన ఆయన ఎక్కడెక్కడ రోడ్లు అన్యాక్రాంతమైపోయాయో చూసిన తర్వాత ఇప్పుడు వాటిని తొలగించే పనిలో పడ్డారు. పనిలో పనిగా జీటీ రోడ్డుకు సెంటర్ పార్కింగ్ ఉందికదా.. అని వదిలేయకుండా, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు ఉన

NVS PRASAD
Dec 3, 20253 min read


అడవిలో అన్న.. ఇక పాత నినాదం!
అడవిలో అన్నల తుపాకీ మోత ఆగిపోయిందా? ఐదు దశాబ్దాలకు పైగా భారత అంతర్గత భద్రతకు సవాలుగా నిలిచిన ‘ఎర్ర’ సామ్రాజ్యం కూలిపోయిందా? కేంద్ర హోంశాఖ తాజా నివేదికలు, క్షేత్రస్థాయి పరిస్థితులు ‘అవును’ అనే సమాధానమే ఇస్తున్నాయి. మావోయిస్టు ఉద్యమం ఇప్పుడు తన ‘‘చివరి దశ’’లో కొట్టుమిట్టాడుతోంది. ఒకప్పుడు దేశవ్యాప్తంగా 180 జిల్లాల్లో విస్తరించిన మావోయిస్టుల ప్రాబల్యం, నేడు గణనీయంగా తగ్గి కేవలం 11 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. అందులోనూ చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, నారాయణ్‌పూర్ జిల్లాల్ల
SATYAM DAILY
Dec 3, 20252 min read


సినిమా పిల్లల సినిమాకు రూ.4,600 కోట్ల ఓపెనింగ్!!
- జోశ్యుల సూర్యప్రకాశ్ ‘‘యానిమేషన్ సినిమానే కదా.. ఏమో పెద్దగా కలెక్ట్ చేయకపోవచ్చు’’ అనే పాత నమ్మకాన్ని ‘జూటోపియా`2’ ఒక్క వీకెండ్లోనే ధ్వంసం చేసింది. ప్రపంచం మెల్లిగా యానిమేషన్‌ని కేవలం పిల్లల వినోదంగా చూసే అలవాటు మార్చుకుంటోంది. దాంతో బాక్సాఫీస్ కూడా తన లెక్కలను మార్చి చూసుకోవాల్సిన పరిస్దితికి చేరింది. యానిమేషన్ చిత్రాలకు గ్లోబల్‌గా ఉన్న మార్కెట్ ఇప్పుడు లైవ్-యాక్షన్ బ్లాక్బస్టర్లను కూడా మింగేస్తోంది, దానికి తాజా ఉదాహరణగా డిస్నీ భారీ సీక్వెల్ ‘జూటోపియా`2’ నిలిచిం
Guest Writer
Dec 3, 20252 min read


మిథున్‌ను ముంచేసిన రాము వాక్ప్రవాహం!
లోక్‌సభ వేదికగా ఆసక్తికర సన్నివేశం ఏపీలో ప్రభుత్వ వేధింపులపై మిథున్‌రెడ్డి ఆరోపణలు అనర్గళ ప్రసంగంతో గట్టిగా తిప్పికొట్టిన రామ్మోహన్నాయుడు జగన్ ప్రభుత్వ తప్పిదాలను ఉదాహరణలతో ఎండగట్టిన మంత్రి ఐదేళ్లనాడు జరిగిన దానికి ఆ విధంగా బదులు తీర్చుకున్న నేత (డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి) కర్మఫలం ఎప్పటికైనా అనుభవించక తప్పదంటారు. మనం చేసిన కర్మలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మనం ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా.. సమయం దొరికిన వెంటనే గత కర్మ తన ప్రభావం చూపిస్తుంది. ఎంతటివారైనా దీనికి అతీతులు క

DV RAMANA
Dec 2, 20252 min read


నిజంగానే వృద్ధి వెలిగిపోతోంది?
దేశం వెలిగిపోతోంది.. అంటూ నాడు ఏబీ వాజ్‌పేయి అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ఎన్డీయే ప్రభుత్వం నినాదాన్ని ఎత్తుకుంది. అయితే 2004 ఎన్నికల్లో ఆ నినాదం ఎదురుతిరిగి ఎన్డీయేను ఓడగొట్టింది. ఆ తర్వాత ‘దేశం వెలిగిపోతుంది’ అన్న నినాదం మలిగిపోయింది. రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు దేశాన్ని నేరుగా కాకుండా ఆర్థిక గణాంకాలు వెలుగులీనుతూ ఆర్థిక వ్యవస్థపై అవగాహన ఉన్న వారిని విస్మయానికి గురిచేస్తున్నాయి. ఇది పరోక్షంగా దేశం అభివృద్ధి వెలుగులు విరజిమ్ముతున్నాయని చెప్పడమే. అయితే ఇదెలా సాధ్యం.. నమ్మశక్

DV RAMANA
Dec 2, 20253 min read


అభిమానులు మెచ్చుకునేలా బాలయ్యా !
బాలయ్యకి ఆవేశం వచ్చినా, ప్రేమ వచ్చినా ఆపుకోలేడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. క్రమశిక్షణ తప్పి మితిమీరి ప్రవర్తిస్తే అభిమాని అయినా సరే చెంప చెళ్లుమనిపిస్తాడు. ప్రేమ వస్తే అదే అభిమానిని నెత్తిన పెట్టుకుంటాడు. బాలయ్యని దగ్గర్నుంచి చూసినవాళ్ళకి ఆయనలో ఈ రెండు పార్శ్వాలు కనిపిస్తాయి. కాకపోతే కొంతమంది హీరోలతో పోలిస్తే ఈయనలో లౌక్యం తక్కువగా ఉండటంతో అప్పుడప్పుడు వివాదాస్పదుడు అవుతుంటాడు. ఏదేమైనా తాను చెప్పాలనుకున్న విషయాలను పబ్లిక్ గానే చెప్పడం ఆయనకు ముందునుంచి అలవాటు. ఈ మధ్య అసెంబ్
Guest Writer
Dec 2, 20252 min read


ఇక్కడ వర్షానికి మార్గం.. అక్కడ రోడ్డుకు అడ్డం!
అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే శంకర్ విశేష ధోరణి ప్రజలకు మేలు చేసే పనులతో మన్ననలు అదే సమయంలో తనవారి కోసం మరికొన్ని `వాటి వల్ల కొత్త సౌకర్యం సమకూరదన్న అభిప్రాయాలు (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ఫేస్ ఆఫ్.. జాన్ ట్రవోల్టా నటించి 1997లో విడుదలైన ఈ ఆంగ్ల చిత్రాన్ని చాలామంది చూసే ఉంటారు. ఎందుకంటే.. అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనం. అంతకుమించి తెలుగులోకి కూడా డబ్ అయింది. మంచీచెడూ రెండిరటినీ హీరోలోనే చూపించడం ఈ చిత్రంలోని విశేషం. సరిగ్గా ఇదే విశ
Prasad Satyam
Dec 1, 20252 min read


పాపం పండిoది.. వేటు పడిoది!
సీఎంవో ఆదేశాలతో కదిలిన ఐసీడీఎస్ అధికారులు లంచం కేసులో ఎట్టకేలకు స్పందన విధుల నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ తొలగింపు సీడీపీవో తొలగింపు కోరుతూ డైరెక్టర్‌కు ఫైల్ (సత్యంన్యూస్, శ్రీకాకుళం) పాపాలు పండాయి. వాటిని మసిపూసి మాయ చేసే యత్నాలు విఫలమయ్యాయి. బాధితుడిని లొంగదీసుకునే ప్రయత్నాలూ వమ్మయ్యాయి. ఫలితంగా లంచం కేసులో చర్యలు మొదలయ్యాయి. గ్రీవెన్స్‌లో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై ఎట్టకేలకు జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. ఎచ్చెర్ల సీడీపీవో కార్యాలయ డేటా ఎంట్రీ ఆపరేటర్ శ్రీ

BAGADI NARAYANARAO
Dec 1, 20252 min read


‘భూతశుద్ధి వివాహం’ చేసుకున్న సమంత
ప్రముఖ నటి సమంతా రూత్ ప్రభు, నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో ఉన్న లింగభైరవి దేవి సన్నిధిలో భూతశుద్ధి వివాహం ద్వారా ఒకటయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకను అనాదిగా వస్తున్న యోగ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ఆలోచనలు, భావోద్వేగాలు, భౌతికతకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్ఠ ప్రక్రియే ఈ భూతశుద్ధి వివాహం. లింగభైరవి ఆలయాల్లో, లేదా కొన్ని ఎంపిక చేసే ప్రదేశాల్లో ని
SATYAM DAILY
Dec 1, 20251 min read


రాజేంద్రప్రసాద్ మానసిక పరిస్థితి బాలేదా ?
సినీ నటుడు రాజేంద్రప్రసాద్ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . షుమారు నాలుగు దశాబ్దాలకు పైగా కామెడీ హీరోగా , క్యారక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఈ హీరో తెలుగు ప్రజలకు సుపరిచితం. ఆయన హీరోగా నటించిన ఎన్నో సినిమాల్లో వెండితెర మీద హాస్యాన్ని కూడా పండిరచి ఒకానొక టైములో హాస్యానికి బ్రాండ్ అంబాసడర్ గా మారి నట కిరీటి అని బిరుదుతో గౌరవం పొందారు. రాజేంద్రప్రసాద్ మంచి నటుడు , మంచి కమెడియన్ , మంచి క్యారక్టర్ ఆర్టిస్ట్అందులో సందేహం లేదు. ఆయన
Guest Writer
Dec 1, 20252 min read


ఇంటి కోసం ఇంత మంకుపట్టా!
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం అధికార మార్పిడి మరో రాజకీయ వివాదానికి దారి తీసింది. ఓడిపోయిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వ నివాసగృహాలను ఖాళీ చేసే అంశం ఇప్పుడు బీహార్‌లో అధికార ప్రతిపక్షాల మధ్య పోరు రాజేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరోసారి జయకేతనం ఎగురవేసి వరుసగా నాలుగోసారి నితీష్‌కుమార్ నేతృత్వం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది జరిగిన కొద్దిరోజులకే మాజీ ప్రజాప్రతినిధులైన ఆర్జేడీ వ్యవస్థాపకులైన మాజీ సీఎం లాలు`రబ్రీ కుటుంబానికి ప్రభుత్వ ఎస్టేట్స్ విభాగం

DV RAMANA
Dec 1, 20252 min read


బాలలే బలిపశువులు!
బెగ్గింగ్ మాఫియా కోరల్లో బాల్యం నానాటికీ విస్తృతమవుతున్న పిల్లల అక్రమ రవాణా పంజా విసురుతున్న చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలు అమ్మడానికి, ఆవయవాల దోపిడీకి కూడా కిడ్నాపులు సరైన రీతిలో స్పందించలేకపోతున్న ప్రభుత్వాలు ఈ తరహా కేసుల్లో రాష్ట్రంలో శ్రీకాకుళానికి మూడోస్థానం (సత్యంన్యూస్, శ్రీకాకుళం) ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు చంకలో చంటిబిడ్డను పెట్టుకొని పాలకోసం డబ్బులివ్వమని కోరే మహిళలు కనిపిస్తుంటారు. ఎప్పుడు గ్రీన్‌లైట్ పడుతుందా? ఎప్పుడు జంక్షన్ దాటేద్దామా అన్న ఆ

BAGADI NARAYANARAO
Nov 29, 20254 min read
bottom of page






