top of page


నవ్విపోదురు గాక.. మాకేటి?!
ఆయన దగ్గితే ఆహా.. తుమ్మితే ఓహో .. అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కీర్తించడం, డబ్బా కొట్టడానికి బీజేపీ పరివారం పుష్కర కాలంగా అలవాటు పడిపోయింది. మోదీ కారణంగానే దేశం సుభిక్షంగా వర్థిల్లుతున్నదని, అంతర్జాతీయంగా అభివద్ధి చెందుతూ నాలుగో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నది కాషాయదళం ఉవాచ. కొందరైతే మరీ ముందుకెళ్లి మోదీ పాలనను నాటి ప్రధాని వాజ్‌పేయి హయంతో పోలుస్తుంటారు. కానీ ఈ వీరభక్తుల ప్రచారంలో ఎంత వాస్తవముంది? ఇంకెంత అతిశయోక్తులు ఉన్నాయన్నది ఈ మధ్యకాలంలో చోటుచేసుకున్న పరిణమా

DV RAMANA
Mar 183 min read


వారి యుద్ధం.. వీరికి అవకాశం!
రెండు దేశాలు యుద్ధానికి దిగితే ఆ రెండింటితోపాటు వాటికి మద్దతుగా నిలిచిన దేశాలు కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితమవుతాయన్నది తెలిసిందే. ఆయా దేశాల్లో వనరులు, మౌలిక వసతులు దెబ్బతినడంతోపాటు జనహననం, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడం వంటి విపరిణామాలకు యుద్ధం దారితీస్తుందన్నది నిర్వివాదాంశం. కానీ ఆ యుద్ధ పరిస్థితుల నుంచి కూడా ప్రయోజనం పొందే పక్షాలు కూడా ఉంటాయని ప్రస్తుత పశ్చిమాసియా యుద్ధం ద్వారా తేటతెల్లం అవుతున్నది. దీనికి రష్యా, ఉక్రెయిన్లను ఉదాహరణలుగా చూపవచ్చు. వాస్తవానికి ఈ ర

DV RAMANA
Mar 172 min read


వామపక్షం.. ఎప్పుడూ ఒక పక్షమేనా?!
మనది సెక్యూలర్ దేశం.. అంతకుమించి సంక్షేమ రాజ్యం. మన దేశానికి, ఇక్కడికి ప్రజలకు ఏది మేలు చేస్తే అదే చేయాలి. ఏ దేశం వద్ద మన ప్రయోజనాలు నెరవేరుతాయో వాటితోనే స్నేహబంధం పెనువేసుకోవాలి.. అలా అని మిగతా దేశాలతో విరోధాలు పెంచుకోవాలని కాదు గానీ.. మన ప్రయోజనాలకు పెద్దపీట వేయాలన్నది దీని ఉద్దేశం. మనకు ప్రాధాన్యత ఇచ్చి కష్టకలాంలో అండగా నిలిచేవారితోనే మనమూ నడవాలి.. వారికే మద్దతు ఇవ్వాలి. అది అమెరికా కావచ్చు.. రష్యా కావచ్చు.. చైనా కావచ్చు.. ఇంకా చెప్పాలంటే మనసు మార్చుకుని భారత్‌తో సఖ్యంగా

DV RAMANA
Mar 163 min read


పెట్రో వ్యూహవైవిధ్యంలో భారత్ విఫలం
ఇంధన లభ్యతపై భయాందోళనలు వ్యాపించేలా భారత్ వ్యవహరించింది. పశ్చిమ ఆసియాలో జరుగుతున్న పరిణామాలు భారతదేశ శక్తి భద్రతపైనే కాకుండా, సంక్షోభ సమయాల్లో దాని విధానపరమైన సంసిద్ధత, కమ్యూనికేషన్ వ్యూహంపై కూడా దృష్టి సారించాయి. భారత్ తన చమురు అవసరాలలో దాదాపు 90% దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో, సరఫరా గొలుసులో ఏదైనా అంతరాయం ఏర్పడితే అది దేశంపై తీవ్ర ప్రభావం చూపడం సహజం. ముఖ్యంగా ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ’ ఈ సరఫరా గొలుసులో చాలా కీలకం. చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించడానికి ప్రభుత్వం

DV RAMANA
Mar 142 min read


విశ్వగురువుగా ఎదిగే తరుణమిదే..!
గల్ఫ్ దేశాల నుంచి గ్యాస్ రాకపోతే హిందువుల దేవాలయాల దగ్గర అన్న ప్రసాదాలు ఆగిపోతు న్నాయి.. హిందూస్థాన్ నుంచి గల్ఫ్ దేశాలకు ఆహార పదార్థాలు వెళ్లకపోతే వారికి తిండి దొరకట్లేదు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరు మరొకరిపై ఆధారపడి బతుకుతున్నారు. అలాంటప్పుడు ఎందుకు ఈ వైషమ్యాలు.. ఎందుకు ఈ గొడవలు. రంజాన్ అయినా, శ్రీరామ నవమి అయినా సారం ఒక్కటే.. శాంతి, సౌభ్రాతృత్వం, సామరస్య పూర్వక వాతావరణం సృష్టించి, సుఖంగా బతికే ఆలోచన చేయాలి. ఇలాంటప్ప్పుడు మన పాలకులు తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తులో మనల్ని విశ్వగుర

DV RAMANA
Mar 133 min read


నిశ్శబ్ద మార్పు దేనికి సంకేతం?
దేశంలో రెండు ముఖ్యమైన మార్పులు నిశ్శబ్దంగా జరిగిపోయాయి. ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనకై తాను ముఖ్యమంత్రి పీఠం వదిలేసి, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం, బీహార్ గవర్నర్‌గా లెఫ్టినెంట్ జనరల్ అతా హస్నైన్ను నియమించడం.. ఇది కేవలం రాజకీయ నిర్ణయం కాదు.. దేశ భద్రత దృష్ట్యా తీసుకున్న చర్య. అలాగే తమిళనాడు గవర్నర్‌గా ఉన్న ఆర్.ఎన్.రవిని పశ్చిమ బెంగాల్‌కు మార్చారు. ఈయన మాజీ ఐపీఎస్ అధికారి, డిప్యూటీ ఎనఎసఏగా పనిచేసిన అనుభవం ఉంది. బెంగాల్లో పెరుగుతున్న చొరబాట్లు, భద్రతా సవాళ్లను

NVS PRASAD
Mar 113 min read


అనుకున్నదొక్కటి.. అవుతున్నదొక్కటి!
ఒక నాయకుడు పోయాడు. కొత్త నాయకుడు వచ్చాడు. ఇరువైపులా ఆయుధాలు గర్జిస్తున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టాలు నానాటికీ పెరుగుతున్నాయి. కానీ పరిష్కారం మాత్రం కనుచూపు మేర కనిపించ డంలేదు. యుద్ధం మొదలై పది రోజులు గడిచిపోతున్నాయి. యుద్ధం మొదలైన తొలిరోజే ఇరాన్ సుప్రీం లీడర్ జాడ కనుగొని మట్టుబెట్టిన సంయుక్త దళాలు ఆ ఉత్సాహంతో ఇరాన్‌ను లొంగదీసుకో వడం పెద్దకష్టం కాదని భావించాయి. రెండు రోజులు గట్టిగా దాడులు చేస్తే ఇరాన్ పీచమణిచేయ వచ్చని అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహకర్తలు అంచనా వేశారు. కానీ వారి అంచనాలు

DV RAMANA
Mar 103 min read


అసహనంతోనే అమెరికా అక్కసు!
ఒకవైపు ఇరాన్‌పై మిసైళ్లతో విరుచుకుపడుతున్న అగ్రరాజ్యం అమెరికా మరోవైపు భారత్‌లాంటి ప్రజాస్వామ్య దేశాలపై అడ్డగోలు మాటలతోనూ మంటలు రేపుతోంది. తాజాగా అమెరికా అమాత్య వర్యుడొకరు చేసిన ఇదే తరహా వ్యాఖ్యలకు మన విదేశాంగ మంత్రి జైశంకర్ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చి బొమ్మ చూపించినంత పనిచేశారు. విడ్డూరమేమిటంటే అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి క్రిష్టోఫర్ లాండు రైసినా డైలాగ్ అనే వేదికలో పాల్గొనడానికి మన గడ్డపైకి వచ్చి మనల్నే కించపరిచేలా వాచాలత ప్రదర్శించారు. భారత విదేశాంగ శాఖ, అబ్జర్వర్ రీసె

DV RAMANA
Mar 93 min read


మనపక్కనే అమెరికా బల్లెం!
పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలు రేగుతుంటే, వాటి చిటపటలు హిందూ మహాసముద్రంలో కనిపిం చడమేమిటి? యుద్ధంతో ఏమాత్రం సంబంధం లేని హిందూ మహాసముద్ర జలాల్లో పయనిస్తూ తన దేశంవైపు సాగుతున్న ఇరాన్ యుద్ధనౌకను ఎటువంటి నిబంధనలు, అంతర్జాతీయ యుద్ధ ప్రమాణాలు పాటించకుండా.. అంతకుమించి ఎటువంటి హెచ్చరికలు లేకుండానే తన మానాన తను పోతున్న ఇరాన్ యుద్ధనౌకపై అమెరికన్ సబ్‌మెరైన్ దాడి చేసి నౌకతోసహా వందమందిని జలసమాధి చేయ డాన్ని ఏ యుద్ధనీతి, నిబంధనలు కూడా అంగీకరించవు. కానీ నోరున్నోడిదే రాజ్యం అన్నట్లు అమెరికా ఇష్టా

DV RAMANA
Mar 63 min read


రండి.. స్వదేశాన్ని సుసంపన్నం చేద్దాం!
డాలర్ డ్రీమ్స్.. నిన్నటివరకు భారతీయ చదువరులు ఇవే కలలు కనేవారు. ‘అమెరికా వెళ్లాలి.. డాలర్లు సంపాదించి దర్జాగా బతకాలి’.. స్థూలంగా డాలర్ డ్రీమ్స్ సారాంశం ఇదే. కానీ ఇటీవలి కాలం లో ఆ డ్రీమ్స్ కరిగిపోతున్నాయి. అమెరికాలోని వలసదారుల విషయంలో ట్రంప్ సర్కారు తీసుకుం టున్న నిర్ణయాలే అక్కడి ప్రవాస భారతీయులపాలిట శరాఘాతాలుగా మారుతున్నాయి. కాగా ట్రంప్ సర్కారు నిర్ణయాలు మింగుడుపడక అమెరికన్లే స్వదేశాన్ని వీడి ఇతర దేశాల వైపు చూస్తున్నారు. ఇతర దేశాల నుంచి అమెరికాకు వలస వెళ్లేవారి కంటే అమెరికా న

DV RAMANA
Mar 33 min read


మనమూ యుద్ధం చేయాల్సిందే.. ధరలతో!
ప్రపంచం మరో యుద్ధంలో చిక్కుకుంది. అంటే దీనర్ధం ప్రపంచమంతా యుద్ధం జరుగుతున్నట్లు కాదు. దేశాలన్నీ యుద్ధంలో పాల్గొంటున్నట్లు కాదు. ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోయినా దాని ప్రభావానికి గురయినా కూడా యుద్ధబాధితుల కిందే లెక్క. యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనే దేశాలు ఒక రకమైన నష్టాలు చవిచూస్తే.. పాల్గొనని దేశాలు మరో రకమైన ఇబ్బందులకు గురవుతాయి. ప్రస్తుతం ప్రపంచంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా దాడులకు దిగాయి. ఏకంగా సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ సహా ముప

DV RAMANA
Mar 23 min read


కేరళం.. అదో సంప్రదాయ పరిమళం!
దేవుడి సొంత దేశం.. గాడ్స్ ఓన్ కంట్రీ.. అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు కేరళ.. అంతటి భాగ్యం దక్కించుకున్న ఈ రాష్ట్రం దానికి పూర్తి అర్హురాలు.. సార్థక నామదేయురాలు. ఒకవైపు సాగర కెరటాల సవ్వడి.. ఎటు చూసినా కాలువలు.. వాటి మధ్యలో పచ్చని కొబ్బరి చెట్ల సోయగాలతో నిజంగా కేరళ దేవనగరిగానే భాసిల్లుతూ చూసేవారికి అద్భుత: అనిపిస్తుంది. కాన్వాస్‌పై ప్రకతి గీసిన అద్భుత చిత్రం మాదిరిగా కనిపించే కేరళ ఇక మీదట కేరళం కానుంది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పేరు కేరళీయుల జాతీయతకు, సంప్

DV RAMANA
Feb 253 min read


పలుచబడుతున్న సమాఖ్య స్ఫూర్తి
మనది ఫెడరల్ రాజ్యం.. అంటే సమాఖ్య వ్యవస్థ. అంటే భారతదేశం అనేక రాష్ట్రాల కూటమి అని.. రాష్ట్రాలు తమ పరిధిలో పనిచేస్తూనే.. జాతీయస్థాయిలో కేంద్ర, రాష్ట్రాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలన్నది సమాఖ్య వ్యవస్థలో కీలక సూత్రం. కానీ ఈ స్ఫూర్తికి భిన్నంగా కేంద్ర`రాష్ట్ర సంబంధాలు తరచూ వివాదాస్పదం అవుతుండటం కొత్త కాదు. కొన్ని దశాబ్దాలుగా జాతీయస్థాయిలో ఈ అంశం చర్చల్లో నలుగుతూనే ఉంది. సర్కారియా వంటి అనేక కమిషన్లు కొల్లలుగా సిఫార్సులు చేశాయి. సుప్రీంకోర్టు స్థాయిలో ఎన్నో న్యాయ సంవాదాలు జరిగాయి.

DV RAMANA
Feb 242 min read


ఆ ఫండ్.. చిన్న పట్టణాలకు సవాల్!
ప్రజల బాగోగులు గమనిస్తూ వారితోపాటు జనసమూహాలు నివసించే ఆవాస ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించి, వాటిని అభివద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అధికార వికేంద్రీకరణలో భాగంగా జాతీయస్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కిందిస్థాయిలో ఉండే స్థానిక సంస్థలను ఆదుకోవాల్సిన ప్రధాన బాధ్యత మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. ఈ ఉద్దేశంలోనే స్థానిక సంస్థలు తమ పరిధిలో అభివద్ధి పనులు చేపట్టేందుకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని 73, 74 సవరణల ద్వారా రాజ్యాంగంలోనే నిర్దేశించార

DV RAMANA
Feb 233 min read


విద్యా వలసలకు వేయాలి అడ్డుకట్ట
ఉన్నత కోర్సులైనా.. ఉద్యోగమైనా.. వాటిని అందిపుచ్చుకోవడానికి వేరే రాష్ట్రానికో, దేశానికో వెళ్తున్నామంటే.. ఇక్కడ అటువంటి అవకాశాలు లేకపోవడమో లేక ఉన్నా అందకపోవడమో జరగాలి. సరిగ్గా ఇవే కారణాలతో మన యువత అవకాశాలను అన్వేషిస్తూ విదేశాలకు వలస వెళుతోంది. ఉద్యోగాల కంటే ఉన్నత విద్యావకాశాల పేరుతో యువజనం పెద్దసంఖ్యలో ఇతర దేశాలకు వెళుతున్నారు. చదువు పూర్తి అయిన తర్వాత అక్కడే ఉద్యోగావకాలు అందిపుచ్చుకుని స్థిరపడిపోతున్నారు. ఇదేం కొత్తగా ఉత్పన్నమైన సమస్య కాదు. కొన్ని దశాబ్దాలుగా భారత్ వంటి అనేక

DV RAMANA
Feb 212 min read


మనది ఐదు ట్రిలియన్ల బంగారు కొండ!
భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. రెండుమూడేళ్లలో జర్మనీని అధిగమించి మూడో ఆర్థికవ్యవస్థగా ఆవిర్భవిస్తుందని భావిస్తున్నారు. అందుకు తగినట్లే మన దేశీయ జీడీపీ కూడా నానాటికీ పెరుగుతున్నది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)కు చెందిన వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్‌కు చెందిన 2025 అక్టోబర్ రిపోర్టు ప్రకారం.. 2025-26 (మార్చి 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరం) సంవత్సరాంతానికి భారత జీడీపీ విలువ 4.125 ట్రిలియన్లుగా అంచనా వేసింది. జీడీపీ అనేది ఏడాదిలో దేశం ఉత్

DV RAMANA
Feb 203 min read


ఇసై జ్ఞానీ.. మీకు అర్థమవుతోందా!
సినీ సంగీత ప్రపంచంలో ఒక స్రష్ట(ఇసై జ్ఞాని)గా వాసికెక్కిన ఇళయరాజా గురించి గత కొంతకాలంగా వ్యతిరేక ప్రచారం జరుగుతున్నది. తను స్వరపర్చిన పాటలను బయట ఎక్కడ పాడినా తనకు రాయల్టీ(పారితోషికం) ఇవ్వాల్సిందేనంటూ గాయకులను, సంస్థలను హెచ్చరిస్తూ.. వారిని కోర్టులకు లాగుతున్నారన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. అయితే ఇప్పుడు తాజాగా ప్రముఖ మ్యూజిక్ కంపెనీ దాఖలు చేసిన కేసులో ఢిల్లీ హైకోర్టు ఇళయరాజాకే వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం ఈ ప్రచారాన్ని మరోమలుపు తిప్పింది. తాము హక్కుదారులుగా ఉన్న సినిమాల పాటలకు ఇ

DV RAMANA
Feb 193 min read


జెన్ జెడ్ హీరోలు.. అయ్యారు జీరోలు!
ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమం.. సుస్థిర ప్రభుత్వంపై తిరుగుబాటు.. నెలల వ్యవధిలోనే ఆ ప్రభుత్వం కూల్చివేత.. సాక్షాత్తు దేశప్రధానినే కట్టుబట్టలతో దేశం నుంచి పలాయనం చిత్తగించేలా చేసిన జెన్ జడ్ ఉద్యమం బంగ్లాదేశ్ గతినే మార్చేసింది. దేశాన్ని మళ్లీ ఎన్నికల వైపు నడిపించింది. ఎట్టకేలకు ఎన్నికలు జరిగాయి. కానీ ఫలితం ఏమిటి? జెన్ జెడ్‌ను ప్రజావాహిని అధికార పీఠంపై కూర్చోబెట్టిందా అంటే.. వీరికి కూడా పరాభవం తప్పలేదనే చెప్పాలి. నేషనల్ సిటిజన్స్ పార్టీ (ఎన్సీపీ) పేరుతో సొంత పార్టీ పెట్టుకున్న జెన్ జె

DV RAMANA
Feb 183 min read


అది వ్యవస్థ లోపం.. ఇది వ్యక్తి హననం!
నిత్యం తన చుట్టూ జరుగుతున్న పరిణామాలపై స్పందించడం సమాజనైజం. వ్యక్తిగతంగా అనేకమంది చాలా ఘటనలపై మనకెందుకులే అన్నట్లు మౌనంగా ఉండిపోవచ్చేమో గానీ.. మానవ సమూహానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సమాజం మాత్రం ప్రతి ఘటనపైనా ఏదో ఒక రూపంలో స్పందిస్తూనే ఉంటుంది. అయితే సమాజం స్పందించే తీరు ఎప్పుడూ ఒకేలా ఉండదు. సంఘటనను బట్టి.. సందర్భాన్ని బట్టి.. బాధితుడిని బట్టి.. ఆ సమస్య వెనుక ఉన్న వ్యవస్థల పనితీరును బట్టి అది మారుతుంటుంది. అయితే కొన్నిసార్లు ఒకే రకమైన ఉదంతాలపై విభిన్నంగా స్పందించడం చిత్రంగా క

DV RAMANA
Feb 173 min read


తెలంగాణ ‘గులాబీ’ గుబులు!
ఉద్యమ పార్టీ అన్న పేరు.. ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఖ్యాతి.. కొత్త రాష్ట్రంలో పదేళ్ల అప్రతిహత అధికారం.. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ అంటేనే గులాబీ పార్టీ అన్నట్లున్న భారత రాష్ట్ర సమితి (బీఆరఎస్) పరిస్థితి చూస్తే.. ‘ఓడలు బళ్లవుతాయి.. బళ్లు ఓడలవుతాయి’ అన్న నానుడి గుర్తుకు రాకమానదు. రాష్ట్రాంలో అధికారం కోల్పోయి చతికిలపడిన ఆ పార్టీ రెండేళ్ల తర్వాత అయినా పుంజుకుందా అంటే.. లేదు లేదు.. మరింత పతనమైందని తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ పట్టణ

DV RAMANA
Feb 162 min read
bottom of page


